కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, ప్రొద్దుటూరు మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎస్‌జీటీ, తత్సమాన కేటగిరీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించిన తాత్కాలిక సీనియారిటీ జాబితాను www.kadapadeo.in వెబ్‌సైట్‌నందు పొందుపరిచామని డీఈఓ మీనాక్షి తెలిపారు. జాబి తాపై ఏవైనా అభ్యంతరాలుంటే 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ఆధారాలు, సర్వీసు రిజిస్టర్‌తో స్వయంగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని ఆమె తెలిపారు.
విద్యార్థులకు పోటీలు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవం–2024ను పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను పోరం సభ్యులు, ప్రధానోపాధ్యాయులు నిర్వ హించాలని డీఈఓ మీనాక్షి తెలిపారు. ఇందులో భాగంగా ‘వినియోగదారు న్యాయపాలనకు వర్చువల్ విచారణలు–డిజిటల్ సౌలభ్యం’ అనే అంశం మీద తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించాలన్నారు. ఇందుకు సంబంధించి 19వ తేదీ పాఠశాల స్థాయిలో, 20న మండలస్థాయిలో నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీన కడప డీసీఈసీ హాల్ సిఎస్‌ఐ హైస్కూల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని అన్నా రు. మండలస్థాయిలో గెలుపొందిన విద్యార్థుల వివరాలను 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తెలపాలని డీఈఓ ఆదేశించారు.
నేడు 35 గ్రామాల్లో సదస్సులు
కడప సెవెన్‌రోడ్స్: భూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం బుధవారం జిల్లాలోని 35 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. బద్వేలు రెవెన్యూ డివిజన్‌లోని పాపన్నపల్లి, డి.లింగంపల్లి, అనంతరాజుపేట, గోపవరం, గంగాయపల్లి, మిట్టమానిపల్లి, ముసల్‌రెడ్డిపల్లి, కత్తెరగండ్ల(చెన్నంవరం)లో సదస్సులు ఉంటా యని పేర్కొన్నారు. పులివెందుల రెవెన్యూ డివిజన్‌లోని చిలేకాంపల్లి, కామసముద్రం, పులివెందుల, చవ్వారిపల్లె, యాదవకుంట, అలవలపాడు, వేముల, ఎన్.పాలగిరి గ్రామాల్లో, , జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో మొర్య్రపల్లి, దాసరిపల్లి, గూడెంచెరువు, ఓబన్నపేట, ఉప్పలూరు, దొడియం, గుండ్లకుంట, కల్లూరు, వెంగలాయపల్లె, చిన్నదండ్లూరు గ్రామాల్లో, కడప రెవెన్యూ డివిజన్ లో నందిమండలం, దుగ్గనపల్లి, కొప్పర్తి, పాత కడప, నల్లింగాయపల్లి, అపనపల్లి, నేకనాపురం, చిన్నపుత్త, మంటపంపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగనున్నాయని డీఆర్వో వివరించారు.
మరో రెండు ప్రత్యేక రైళ్లు
కడప కోటిరెడ్డిసర్కిల్: అయ్యప్ప భక్తుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. విజయవాడ– కొల్లంల మధ్య డిసెంబర్ నెలంతా ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. 07177 నెంబర్ గల రైలు డిసెంబర్ 21, 28 తేదీల్లో శనివారం రాత్రి 10.15 గంటలకు విజయవాడలో బయలుదేరి కడపకు మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు చేరుకుని సోమవారం ఉదయం 6.20 గంటలకు కొల్లాంకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో (రైలు నెంబర్ 07178) డిసెంబర్ 23, 30 తేదీల్లో సోమవారం ఉదయం 10.45 గంటలకు బయలు దేరి కడపకు మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు చేరుకుని కాకినాడకు ఆరోజు రాత్రి 9 గంటలకు రైలు చేరుతుందన్నారు. అలాగే మరో రైలు నరసాపూర్ –కొల్లంల మధ్య నడుస్తుందన్నారు. 07183 నెంబర్ గల ఈ రైలు నర్సాపూర్ నుంచి జనవరి 15, 22వ తేదీల్లో బుధవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం కడపకి 9.45 గంటలకు చేరుకుని శుక్రవారం ఉదయం 5.30 గంటలకు కొల్లాంకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో (07184) కొల్లంలో జనవరి 17, 24 తేదీల్లో శుక్రవారం ఉదయం 8.40 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 5:40 గంటలకు కడపకు చేరుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment