కడప కోటిరెడ్డిసర్కిల్: ఆర్టీసీలోని సమస్యలు, సలహాల కోసం శుక్రవారం సాయంత్రం 4–5 గంటల మధ్య డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలతో పాటు, సూచనలు, సలహాలను 99592 25848 నెంబరుకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చని వివరించారు.
ప్రీమియం చెల్లింపు
గడువు పొడిగింపు
కడప అగ్రికల్చర్: మామిడి పంటకు వాతావరణ ఆధారిత బీమా పథకంలో ప్రీమియం చెల్లింపునకు ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి తెలిపారు. ఈ నెల 15వ తేదీతో ముగిసిన గడువును ఈ నెల 31వ తేదీ వరకు పెంచారని ఆమె తెలిపారు. ప్రీమియం చెల్లించని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నేడు పలు గ్రామాల్లో
రెవెన్యూ సదస్సులు
కడప సెవెన్‌రోడ్స్: భూ సమస్యల పరిష్కారానికి గురువారం 36 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్‌లో మాదాపూర్, మరతిపల్లి, డి. అగ్రహారం, చింతలచెరువు, పుల్లారెడ్డిపల్లి, మిట్టమానిపల్లి, అక్కలరెడ్డిపల్లె, కత్తెరగండ్ల (కొడిగుడ్లపాడు), పులివెందుల రెవిన్యూ డివిజన్‌లో చిలెకంపల్లి, మురారిచింతల, బ్రాహ్మ ణపల్లె, నంద్యాలంపల్లి, గోటూరు, వేంపల్లె–1, వి.కొత్తపల్లి, పిల్లివారిపల్లిలో సదస్సు లు ఉంటాయన్నారు. జమ్మలమడుగు రెవె న్యూ డివిజన్‌లోని పిచపాడు, దువ్వూరు, పి.బొమ్మేపల్లి, ఓబన్నపేట, గండ్లూరు, నల్ల బల్లి, రామచంద్రాయపల్లి, పెద్దపసుపుల, సర్విరెడ్డిపల్లె, అయ్యవారిపల్లె (హాబిటేషన్), కల మల్లలో.. కడప రెవెన్యూ డివిజన్‌లోని చిన్నమాచుపల్లి , ఇప్పపెంట, గొల్లపల్లి, నాగసానిపల్లి, నందిమండలం, ఏవీ కాలువ, పెద్దపల్లి, జంగమపల్లి, పెన్నపేరూరు గ్రామాల్లో సదస్సులు జరుగనున్నాయని వివరించారు.
22న ‘సన్నపురెడ్డి’కి
‘కేతు’ పురస్కారం
కడప కల్చరల్: ప్రముఖ కథా రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి పేరిట స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని జిల్లాకు చెందిన కవి, ‘కొండపొలం’ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డికి అందజేయనున్నారు. ఈనెల 22న స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో కవిత విద్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు అలపర్తి పిచ్చయ్యచౌదరి, కోశాధికారి బోయపాటి దుర్గాకుమారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ పురస్కారాన్ని సన్నపురెడ్డికి అందజేస్తారు. సభకు సీనియర్ కథా రచయిత దాదా హయాత్ అధ్యక్షత వహిస్తుండగా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వనాయుడు , అడిషనల్ ఎస్పీ కె.ప్రకాశ్‌బాబు అతిథులుగా రానున్నారు. ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి సాహిత్యంపై, ప్రముఖ రచయిత్రి ఆర్.శశికళ కేతు విశ్వనాథరెడ్డి సాహిత్యంపై ప్రసంగించనున్నారు.
సీఐ రవిశంకర్‌రెడ్డికి అవార్డు
రాయచోటి: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ రాష్ట్ర ఉత్తమ నేర పరిశోధన కేసులకు గాను ఇచ్చే ప్రతిష్టాత్మక ఏబీసీడీ అవార్డు అన్నమయ్య జిల్లా దిశ పోలీసు స్టేషన్ సీఐ రవిశంకర్‌రెడ్డికి దక్కింది. బుధవారం విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో చిత్తూరు జిల్లా ఎస్పీ వీన్ మణికంఠ చందోలుతో కలిసి డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది జులై 7వ తేదీన చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో కరడుగట్టిన అంతర్‌రాష్ట్ర నేరస్తుడిని అరెస్టు చేసినందుకు ప్రతిష్టాత్మక ఏబీసీడీ అవార్డులో మొదటి స్థానంలో ఎంపికయ్యారు.
దరఖాస్తుల ఆహ్వానం
రాజంపేట టౌన్: ఈనెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గూగుల్ షీట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లా క్రీడాకారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు కోసం రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి సాంకేతిక సహాయం కోసం టెక్నికల్ అఫిషియల్ ఏ.రామాంజనేయులును సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేవారు 18 సంవత్సరాలలోపు వారు అయితే ఎఫ్‌ఏఐ గుర్తింపు కార్డు, 18 సంవత్సరాలు పైబడిన వారైతే ఎఫ్‌ఏఐ గుర్తింపు కార్డుతో పాటు గతంలో పాల్గొన్న ఫె న్సింగ్ క్రీడ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తీసుకురావా లన్నారు. వివరాలకు 6301979079 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment