విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో సమావేశం
ఆర్ట్స్ కళాశాలను
పరిశీలించిన న్యాక్ బృందం
వైవీయూ : నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్(న్యాక్) పీర్ కమిటీ బృందం బుధవారం కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)ను సందర్శించింది. కళాశాలకు వచ్చిన న్యాక్ పీర్ కమిటీ చైర్ పర్సన్ ఆచార్య రాజీవ్ జైన్, మెంబర్ కో ఆర్డినేటర్ డాక్టర్ మధురేంద్రకుమార్, సభ్యుడు డా.రమేష్ కుంభార్ బృందానికి ముందుగా ఎన్‌సీసీ కేడెట్స్ గౌరవ వందనం సమర్పించారు. కళాశాల ప్రిన్సిపల్ డా.జి. రవీంద్రనాథ్ కళాశాల సమగ్ర ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆపై న్యాక్ బృందం కళాశాలలోని పలు విభాగాలను పరిశీలించింది. డిపార్ట్‌మెంట్‌లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలు, పూర్వ విద్యార్థుల ప్రగతి, పరిశోధనలు, పరిశోధక పత్రాలు, సైటేషన్స్, హెచ్–ఇండెక్స్ తదితర అంశాలన్నింటినీ క్షుణ్ణంగా బృందం సభ్యులు అడిగి తెలుసుకుని రికార్డు చేశారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో జరిగిన సమావేశంలో కళాశాల ప్రగతిలో వారి భాగస్వామ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. భౌతిక శాస్త్రం వంటి విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరచడంపై న్యాక్ బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్య ఆర్‌జేడీ డాక్టర్ ఆర్.డేవిడ్ కుమారస్వామి, న్యాక్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.రమేష్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా.బి.రామచంద్ర, ఎన్‌సీసీ అధికారులు డాక్టర్ ఆర్.నీలయ్య, డా.మహేష్, అధ్యాపకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment