మదనపల్లె : సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణికి రెండో ఏడీఎం కోర్టు న్యాయమూర్తి ర్యెగులర్ బెయిల్ మంజూరు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సుధారాణిపై కేసు నమోదైంది. నరసరావుపేట జైలులో ఉన్న ఆమెను ఈ నెల 12న మదనపల్లె పోలీసులు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసు విచారణ తర్వాత 13న న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆమెను పోలీసులు తిరిగి నరసారావుపేటకు తీసుకెళ్లారు. బెయిల్ పిటిషన్ విచారణలో సుధారాణి తరపున లాయర్ ప్రసాదరెడ్డి న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. దీంతో ర్యెగులర్ బెయిల్ మంజూరైంది. సుధారాణికి ర్యెగులర్ బెయిల్ మంజూరైంది.
Comments
Please login to add a commentAdd a comment