కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి తెలిపారు. కార్గో సేవల్లో భాగంగా డోర్ డెలివరీ సదుపాయం కడప, బద్వేల్, జమ్మల మడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటి పట్టణాలలో 2021 డిసెంబరు, 1వ తేదీ నుంచి ప్రారంభించామన్నారు. ఆరు డిపోల కార్గో సెంటర్ల నుంచి రాష్ట్రంలోని 80 ముఖ్య పట్టణాలకు ఈ డోర్ డెలివరీ సౌకర్యం ఉంటుందన్నారు. ఇందుకోసం కౌంటర్ నుంచి పది కిలోమీటర్ల పరిధి వరకు 50 కిలోల బరువుగల పార్శిళ్లకు ఈ అవకాశాన్ని కల్పించామన్నారు. బుక్ చేసిన ప్రతి పార్శల్‌కు బీమా సౌకర్యం కల్పించామన్నారు. పూర్తి వివరాలకు 99592 25848, 99592 23209, 99492 49717 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment