కడప కోటిరెడ్డిసర్కిల్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నడపనున్న బస్సుల్లో సాధారణ చార్జీలతో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి సంక్రాంతి సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు 111, బెంగళూరు 81, విజయవాడ 30, చైన్నె 12, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురానికి 60 బస్సులు నడుస్తాయన్నారు. ప్రజల రద్దీకి అనుగుణంగా మరిన్నిసర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ప్రజలు కార్గో సేవలను వినియోగించుకుని సంక్రాంతి కానుకలను పంపుకోవచ్చని ఆయన వివరించారు. ప్రయాణికులు తమ టిక్కెట్లను ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
వార్షిక బ్రహ్మోత్సవాల
నిర్వహణకు టెండర్లు
రాయచోటి టౌన్ : రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్ధానంలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 5 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానంలో వివిధ పనులు చేయడానికి ఈ నెల 31న ఆలయంలో టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఈవో డీవీ రమణారెడ్డి బుధవారం తెలిపారు. గురువారం సాయంత్రం 4గంటల లోపు సీల్డు టెండర్ బాక్స్‌లో వేయాలని చెప్పారు. హిందువులు మాత్రమే పాల్గొనాలని, వీరికి ఎటువంటి దుర లవాట్లు ఉండరాదన్నారు.పాన్, ఆధార్‌కార్డు సీల్డు కొటేషన్‌కు జతపరిచాలన్నారు. టెండరు ఓపెన్ చేశాక అన్యమతస్తులు ఎవరైనా సీల్డు కొటేషన్స్ వేసి ఉంటే తిరస్కరించనున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment