ఏడాది పీజీ ప్రవేశాలకు దరఖాస్తులు
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు లెటరల్ ఎంట్రీ విధానంలో ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వైస్ చాన్స్‌లర్ ఆచార్య కె. కృష్ణారెడ్డి వెల్లడించారు. జాతీయ విద్యా విధానం–2020 అమలులో భాగంగా నూతనంగా ఏడాది పీజీ కోర్సు (2024–25 విద్యా సంవత్సరం) నోటిఫికేషన్ సందర్భంగా ఆయన తన ఛాంబర్‌లో ఇంచార్జ్ రిజిస్ట్రార్, ప్రిన్సిపల్ ఆచార్య ఏజీ దాము, డీన్‌లతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోని అఫిలియేషన్ కలిగిన అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులకు అనుమతి ఇచ్చామన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులు కోసం yvu.edu.inను సంప్రదించాలని సూచించారు. వెబ్‌సైట్‌లో విశ్వవిద్యాలయంలో లభించే కోర్సులు, సీట్లు సంబంధిత నిబంధన బ్రోచర్ ఉంటుందన్నారు. 21వ తేదీన విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment