‘పల్లె పండుగ’ పనుల్లో జాప్యం తగదు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన పనులు నిర్దిష్ట కాలవ్యవఽధిలో పూర్తి చేయాలని, పనుల్లో జాప్యం తగదని జెడ్పీ చైర్ పర్సన్ జేష్ఠాది శారద అన్నారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. రహదారి పనుల గురించి ఆరా తీశా రు. ఇందుకు పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు జీవీ శ్రీనివాసులురెడ్డి బదులిస్తూ ఉపాధి హామీ కింద జిల్లాలో సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 15 నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఇప్పటికి రూ. 11 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. కో ఆప్షన్ సభ్యులు కరీముల్లా మాట్లాడుతూ ఖాజీపేట నుంచి సుంకేసుల గ్రామం మీదుగా బైపాస్‌రోడ్డు నిర్మించాలని కోరారు. జల జీవన్ మిషన్ కింద జరుగుతున్న పనుల గురించి జెడ్పీ చైర్మన్ అడిగారు. పనులు పురోగతిలో ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి బదులిచ్చారు. గండికోట రిజర్వాయర్ నుంచి కమలాపురం నియోజకవర్గానికి, బ్రహ్మంసాగర్ నుంచి కాశినాయన, కలసపాడు, బి.కోడూరు, పోరుమామిళ్ల, బి.మఠం, మైదుకూరు, ఖాజీ పేట మండలాలకు తాగునీరు అందించాలన్నది లక్ష్యమన్నారు. అలాగే సోమశిల రిజర్వాయర్ నుంచి బద్వేలు, గోపవరం, అట్లూరు, ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలకు నీరందించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకోసం రూ. 2 వేల కోట్లు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. సెంట్రల్ రోడ్డు ఫండ్‌కింద జిల్లాలో ఆరు పనులు చేపట్టగా నాలుగు పూర్తయ్యాయని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ తెలిపారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ రూ. 25 కోట్లతో తమ మండలంలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నించారు. ఇందుకు ఎస్‌ఈ సమాధానమిస్తూ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశామని, స్పందన లేకపోతే పనులు కొత్త వారికి అప్పగిస్తామని తెలిపారు. వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాయచోటి–వేంపల్లె ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులు నిలిపి వేయడం అన్యాయమన్నారు.
హెచ్‌ఎంపీవీపై అప్రమత్తత
హెచ్‌ఎంపీవీ వైరస్ విజృంభణపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఈ అంశంపై అవగాహన కల్పించాలని కో ఆప్షన్ సభ్యుడు కరీముల్లా కోరారు. ఇందుకు డీఎంహెచ్‌ఓ నాగరాజు బదులిస్తూ దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేస్తే సరిపోతుందన్నారు.
జెడ్పీ చైర్ పర్సన్ జేష్ఠాది శారద
Comments
Please login to add a commentAdd a comment