ఉద్యోగాలకు ఎంపిక
వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ‘ఈ4’ విద్యార్థులు ఉద్యోగా లకు ఎంపికయ్యారని డైరెక్టర్ ఏవీఎస్. కుమారస్వామి గుప్తా తెలిపారు. బుధవారం స్థానిక ట్రిపుల్ ఐటీలో వివిధ ప్రతిష్టాత్మకమైన కంపెనీలు నిర్వహించిన ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూలలో తమ విద్యార్థులు అత్యంత ప్రతిభను కనబరిచి 30 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికై న వారికి వార్షిక వేతనం రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఉందని వెల్లడించారు. ప్రముఖ కంపెనీలకు ఎంపిక కావడంపై డైరెక్టర్‌తోపాటు పరిపాలన అధికారి రవికుమార్, ప్లేస్‌మెంట్ కో–ఆర్డినేటర్ వినోద్, ఆఫీసర్ సుందర్ విద్యార్థులను అభినందించారు.
‘సౌత్ ఇండియా’
సైన్సు ఫేర్‌కు ఎంపిక
కడప ఎడ్యుకేషన్ : పులివెందుల గవర్నమెంట్ హైస్కూల్ మెయిన్‌కు చెందిన విద్యార్థి గౌరీశంకర్, గైడ్ టీచర్ సీవీ ప్రసాద్‌లకు చెందిన సీఓటూ (కార్బన్ డైయాకై ్సడ్) కలెక్టర్ అట్ ట్రాఫిక్ జోన్ ప్రాజెక్టు సౌత్ ఇండియా సైన్సుఫేర్ పోటీలకు ఎంపికైంది. బుధవారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్సుఫేర్ పోటీలలో వ్యక్తిగత విభాగం కింద ఈ ప్రాజెక్టు ఎంపికై ంది. ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పాండిచ్చేరిలో నిర్వహించనున్న సౌత్ ఇండియా స్థాయి సైన్సుఫేర్ పోటీలలో ఈ ప్రాజెక్టును ప్రదర్శించనున్నారు. స్టూడెంట్ గౌరీశంకర్, గైడ్ టీచర్ సీవీ ప్రసాద్‌లను డీఈఓ మీనాక్షి, డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, జిల్లా సైన్సు ఆఫీసర్ వేపరాల ఎబినైజర్ ఇమ్మానియేలు అభినందించారు. సౌత్ ఇండియా స్థాయి సైన్సుఫేర్ పోటీలలో కూడా విజ యం సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment