వైభవంగా పీరయ్య స్వామి ఆరాధనోత్సవాలు
చిన్నమండెం: మండలపరిధిలోని చిన్నర్సుపల్లె గ్రామం పీరయ్యమఠంలో 219 సంవత్సరాల క్రితం సజీవ సమాధి అయిన పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు నాలుగో పీఠాధిపతి మఠం నాగలింగమయ్య ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే చెక్కభజన, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గురువారం మౌలాలి జెండా ఊరేగింపు వైభవంగా సాగింది. ఆరాధనోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పీరయ్య స్వామిని దర్శించుకున్నారు.
ప్రత్యేక అలంకరణలో పీరయ్యస్వామి సమాధి
Comments
Please login to add a commentAdd a comment