జంప్ రోప్లో ఆశాకిరణం ప్రసన్న
వేంపల్లె: వేంపల్లె మండలానికి చెందిన రామిరెడ్డి ప్రసన్న జంప్ రోప్లో విశేష ప్రతిభతో ఆకట్టుకుంటోంది. ముతుకూరు గ్రామానికి చెందిన రామిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి, రామలక్షుమ్మల కుమార్తె రామిరెడ్డి ప్రసన్న విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తిని కనబరిచేది. ప్రసన్న క్రీడా ప్రతిభను గుర్తించిన సింహాద్రిపురం మండలం కస్తూర్భా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించి క్రీడల్లో ప్రతిభ చూపే విధంగా తీర్చిదిద్దారు. అప్పటినుంచి జంప్ రోప్లో రాణిస్తూ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు గుర్తింపు పొందింది. ఇటీవల నేపాల్లో జరిగిన ప్రపంచస్థాయి ఆటగాళ్లతో పోటీపడి తన సత్తా చాటి మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ సాధించింది. పేద రైతు కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. దాతలు చేయూతనందిస్తే జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తెస్తుందని పలువురు క్రీడాకారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment