మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణం బీటీ కాలేజీ హాకీ మైదానంలో శుక్రవారం నుంచి 14వ ఏపీ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ది అన్నమయ్య జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు పి.వి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభమయ్యే పోటీలకు ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, మున్సిపల్ చైర్మన్ మనూజరెడ్డి, ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలు 19వతేదీ వరకు జరుగుతాయన్నారు. 21 జట్లు పాల్గొంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment