కిటకిట
ప్రయాణికులతో రద్దీగా మారిన కడప ఆర్టీసీ బస్టాండ్
ప్రయాణికులతో బస్సులు.. బస్టాండులు రద్దీగా మారాయి. పండక్కు సొంతూళ్లకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర వర్గాలు తిరుగు ప్రయాణాలతో కడప ఆర్టీసీ బస్టాండు గురువారం కిటకిటలాడింది. ఆర్టీసీ అధికారులు తిరుగు ప్రయాణానికి మొత్తం 270 సర్వీసులు నడుపుతున్నారు. ప్రధానంగా హైదరాబాదుకు 100 బస్సు లు, బెంగుళూరు 70, విజయవాడ 25, చైన్నె 15 బస్సులతోపాటు తిరుపతి, నెల్లూరు, కర్నూలు, అనంతపురానికి 60 బస్సులను అధికారులు నడుపుతున్నారు. బస్సులన్నీ రద్దీగా ఉండడంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయా ణికులకు అవసరమైన మేర బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని రూట్లలో రద్దీ అధికంగా ఉండడంతో ఇబ్బందులు తప్పలేదు. –కడప కోటిరెడ్డిసర్కిల్
Comments
Please login to add a commentAdd a comment