వీరపునాయునిపల్లె : మండలంల2014లో గుమ్మిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 12 మందిపై నేరం రుజువు కావడంతో ప్రొద్దుటూరు కోర్టు ముద్దాయిలకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 35 వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్‌ఐ మంజునాథ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుమ్మిరెడ్డి అరుణ, చంద్రశేఖర్‌రెడ్డి దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో పంచాయితీకి అని పిలిపించి చంద్రశేఖర్‌రెడ్డి అతని బంధువైన రామక్రిష్ణారెడ్డిపై చప్పిడి నారాయణరెడ్డి, రాచమల్లు మధుసూదన్‌రెడ్డి, హరికిషోర్‌రెడ్డి, అరుణ, కోకటం సుధీర్‌కుమార్‌రెడ్డి, రాచమల్లు హరికేశవరెడ్డి, జనార్దన్‌రెడ్డి, పాపిరెడ్డి, బాలమనోహర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, భైరవేశ్వర్‌రెడ్డి, హరిస్వామిరెడ్డి మారణాయుధాలతో దాడి చేశారు. అప్పటి ఎస్‌ఐ రోషన్ కేసు నమోదు చేశారు. వీరిపై నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు ఈమేరకు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment