గండికోటలో పెరిగిన పర్యాటకులు
జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. గండికోట అభివృద్ధి కోసం పర్యాటకశాఖ అధికారులు టోల్‌గేట్‌లను ఏర్పాటు చేసి వచ్చిన పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే వాహనాలకు రుసుం వసూలు చేస్తున్నారు. అయితే గండికోట వెలుపల వాహనాలు నిలుపుకునేందుకు పార్కింగ్ సౌకర్యం ఉన్నా వాహనాలు మాత్రం గండికోట లోపలికి ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. దీంతో గండికోటలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోట లోపల ఎలాంటి రోడ్డు నిర్మాణం చేయలేదు. కొంత వరకు మాత్రమే సీసీ రోడ్లు ఉన్నా మిగిలిన రోడ్డు గుండు రాళ్లతో ఉన్నాయి. ఒక్క వాహనం వెళ్లేందుకు మాత్రమే వీలుంటుంది. ఎదురెదురుగా వాహనాలు వస్తే ట్రాఫిక్ స్తంభించిపోతుంది. వచ్చిన పర్యాటకులకు ఎలాంటి తాగునీటి వసతులు లేకపోవడంతో వాటర్‌బాటిళ్లు, ప్యాకెట్లు కొని తాగుతున్నారు. గండికోటలో కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
పర్యాటక ఫీజులు వసూలు చేస్తున్నా
సౌకర్యాలు కరువు
ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment