అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారినే వెళ్లాలని సూచించారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, పీజీఆర్‌ఎస్ దరఖాస్తులపై ఆయా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర్ నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయశాఖాధికారి నాగేశ్వరరావు, ఎస్డీసీ వెంకటపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment