నెర్రవాడలో ఘర్షణ
చాపాడు : మండల పరిధిలోని నెర్రవాడ గ్రామంలో ఆదివారం రాత్రి పిట్టి లక్ష్మీనారాయణ, చల్లా గంగయ్య వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 18 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. పిట్టి లక్ష్మీనారాయణ వర్గానికి చెందిన పాపయ్య పొలంలో వరి గడ్డిలో చల్లా గంగయ్య వర్గానికి చెందిన ప్రతాప్ నీరు వేశాడనే కారణంతో ఇరువర్గీయులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారికి గాయాలు కాగా ఒక వర్గం వారు ప్రొద్దుటూరులో, మరో వర్గం వారు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆమె నేత్రాలు సజీవం
సింహాద్రిపురం : మనిషి మరణించాక.. దేహంతో పాటు నేత్రాలను మట్టిలో కలిపేయడం కంటే వాటిని దానం చేస్తే మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించొచ్చు. సింహాద్రిపురం మండలంలోని సుంకేసుల గ్రామానికి చెందిన ఒంటెద్దు భారతి(54) సోమవారం మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు నేత్రాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. భర్త సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరిస్తూ నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో నేత్ర సేకరణ కేంద్ర టెక్నీషియన్ హరీష్ మృతురాలి ఇంటికి వెళ్లి మృతదేహం నుంచి కార్నియాలను సేకరించి హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్ర నిధికి పంపించారు.
18 మందిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment