యోగివేమన జయంతిని ప్రభుత్వం విస్మరించడం విచారకరం
పులివెందుల టౌన్ : యోగివేమన తన నీతి పద్యాలతో సమాజాన్ని జాగృతం చేశారని, అలాంటి ప్రజాకవి జయంతిని ప్రభుత్వం విస్మరించడం విచారకరమని రెడ్డి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యరప్రురెడ్డి సురేంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పులివెందుల పట్టణంలో వారు మాట్లాడుతూ 2023లో గత ప్రభుత్వం 164 జీఓ ద్వారా యోగి వేమన జయంతిని అధికారికంగా ప్రకటించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం యోగి వేమన జయంతిని విస్మరించడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి యోగివేమన జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు.
సూర్యనారాయణ మాటలు నమ్మొద్దు
కడప రూరల్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా చెప్పుకునే సూర్యనారాయణ కల్లబొల్లి మాటలను ఉద్యోగులు నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి.విన్సెంట్ కుమార్, రామాంజనేయులు అన్నారు. సోమవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సూర్యనారాయణను ఇదివరకే సంఘం నుంచి బహిష్కరించినా ఆయన వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. ఆయన ఉద్యోగుల ప్రయోజనాలను పక్కన పెట్టి పాలకులకు తొత్తుగా మారాడని విమర్శించారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు
కలసపాడు : మండలంలోని పాత రామాపురం, కలసపాడు మధ్యలోని తెలుగుగంగ ఎడమ కాలువ వద్ద సోమవారం ఓ సాధువు కంపచెట్లలో పడి ఉన్నాడు. అటుగా వెళుతున్న కలసపాడు పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు జగదీష్, మొయినుద్దీన్‌లు గమనించి కంపచెట్లలో పడి ఉన్న సాధువును బయటికి తీశారు. వివరాలు అడుగగా నెల్లూరు జిల్లాకు చెందిన పశుపతి అని తెలుసుకుని సాధువును 108 వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న కానిస్టేబుళ్లను ప్రజలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment