అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం
మైలవరం : మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన గోరంట్ల లక్ష్మీకళావతి(20) అనే మహిళ కనిపించడంలేదని ఆమె భర్త మోదుకూరి రామాంజనేయులు ఫిర్యాదు చేసి 24 గంటలు గడవక ముందే ఆమె మైలవరం జలాశయంలో శవమై కనిపించింది. ఈనెల 18వతేదీ ఉదయం ఇంటినుంచి వెళ్లిన లక్ష్మీ కళావతి తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త బంధువుల ఇళ్ల వద్ద గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. సోమవారం కేసు నమోదు చేశారు. అంతలోనే ఆమె మైలవరం జలాశయంలో శవమై కనిపించింది. మైలవరం ఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
వృద్ధుడి అదృశ్యం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని పార్నపల్లె రోడ్డు సమీపంలో ఉన్న దర్గా వీధిలో నివాసం ఉన్న పక్కీరప్ప రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆయన భార్య, బంధువులు తెలిపారు. పలు ప్రాంతాల్లో గాలించినా ఎక్కడా ఆయన ఆచూకీ లభించలేదన్నారు. సోమవారం ఆయన మనవడు గంగాధర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
సింహాద్రిపురం : అగ్రహారం గ్రామానికి చెందిన ప్రభావతమ్మ (55) కడుపునొప్పి తాళలేక ఈనెల 17వ తేదీన పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న బంధువులు మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తులసీ నాగ ప్రసాద్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment