8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
మైదుకూరు : మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంతో సోమవారం కూంబింగ్ నిర్వహించి ఎర్రచందనం చెట్లను నరుకుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వనిపెంట అటవీ రేంజ్ అధికారి ప్రణీతరావు తెలిపారు. నల్లమల్ల అడవిలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించినట్లు సమాచారం అందడంతో డీఎఫ్‌ఓ వినీత్ కుమార్, సబ్ డీఎఫ్‌ఓ వి.దివాకర్ ఆదేశాలతో కూంబింగ్ నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. కూంబింగ్‌లో ఎర్రచందనం చెట్లను నరుకుతున్న వారిపై దాడి చేయడగా ఇద్దరు పట్టబడ్డారని, మిగిలిన వారు పారిపోయారని అయన పేర్కొన్నారు. పారిపోయిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన ఎర్రచందనం చెట్లను ఎవరైనా నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూంబింగ్‌లో డీఆర్‌ఓ అన్వర్ హుస్సేన్, ఎఫ్‌బీఓలు, ఏబీఓలు పాల్గొన్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment