పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభా భవనంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ‘ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు‘ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు వినియోగించుకోవాలన్నారు. ఇందులో పశువైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణకు మందుల పంపిణీ, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, శాసీ్త్రయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు, పశుసంవర్థక శాఖ జేడీ శారదమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, సీఈఓ ఓబులమ్మ, డీపీఓ స్వరాజ్యలక్ష్మి, వయోజన విద్య డీడీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment