కడప అర్బన్ : జిల్లాలో ప్రజలు పోలీసుశాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు కడపలోని స్థానిక పోలీసు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అదనపు ఎస్పీ ఫిర్యాదుదారులతో స్వయంగా ముఖాముఖి మాట్లా డి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో
జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment