ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్, వలంటీర్‌కు బహుమతులు
మైదుకూరు : ఈ నెల 16 నుంచి 22 వరకు మైసూరులో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ పీవీ కృష్ణారెడ్డి, వలంటీర్ నవీన్ ప్రతిభ చూపి బహుమతులు అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.నారాయణరెడ్డి గురువారం తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైసూరు యూనివర్సిటీ, కర్ణాటక యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వంటీర్లు, ఆఫీసర్లు జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్నారు. శిబిరంలో శ్రమదానం, పరిసరాల పరిశుభ్రత, జాతీయ సమైక్యత–యువత పాత్ర, మాదక ద్రవ్యాలు–దుష్ఫలితాలు, సీ్త్ర శక్తి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో యోగివేమన యూనివర్సిటీ విద్యార్థులు గ్రూప్ డాన్స్, సోలో డాన్స్, పాటల పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. మైదుకూరు డిగ్రీ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ పీవీ కృష్ణారెడ్డి ఉత్తమ ప్రోగ్రాం ఆఫీసర్‌గా, నవీన్ వలంటీర్‌గా బహుమతులు అందుకున్నారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సుభాన్ సాహెబ్, అధ్యాపకులు సుబ్బరాయుడు, రాధారం, రామేశ్వరరెడ్డి, అయ్యవారురెడ్డి, నవనీశ్వర్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment