![8న జె](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04plvd251-170089_mr-1738701558-0.jpg.webp?itok=FfR7yTa8)
8న జెడ్పీ సర్వ సభ్య సమావేశం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఈ నెల 8న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న జరగాల్సిన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశామని ఆమె అందులో పేర్కొన్నారు.
జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ
సింహాద్రిపురం: హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో గతనెల 28, 29, 30వ తేదీల్లోజరిగిన జాతీయ స్థాయి సీనియర్ తైక్వాండో పోటీలలో సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లె గ్రామానికి చెందిన రాచమల్లు కళా జ్యోష్ణ బంగారు పతకం సాధించినట్లు స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ నాయబ్ రసూల్ తెలిపారు. మంగళవారం నాయబ్ రసూల్ మాట్లాడుతూ కళా జ్యోష్ణ గుంటూరు విజ్ఞాన యూనివర్సిటీలో బీటె క్ ద్వితీయ సంవత్సరం చదువుతోందన్నారు. విద్యార్థిని కళా జ్యోష్ణ ప్రతిభపై సీనియర్ కోచ్ బాషా, మాస్టర్ సలీం, తదితరులు అభినందనలు తెలిపారు.
కార్మికుడికి రూ.లక్ష విరాళం
కడప కార్పొరేషన్: నగర పాలక సంస్థ కార్మికుడికి మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. మంగళవారం స్థానిక అపూ ర్వ కళ్యాణ మండపం వద్ద మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి దియ్యాల శివకుమార్ కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన కార్పొరేటర్‌లను అభినందించారు. కార్పొరేటర్ రామలక్ష్మణ రెడ్డి, డివిజన్ ఇంచార్జిలు ఐస్ క్రీమ్ రవి, త్యాగరాజు ,రెడ్డి ప్రసాద్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు పాల్గొన్నారు.
క్రీడా ప్రతిభను వెలికితీయాలి
రైల్వేకోడూరు అర్బన్: క్రీడా పోటీల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని డాక్ట ర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ ఆచార్య గోపాల్ పేర్కొన్నారు. స్థానిక అనంతరాజుపేటలోని డాక్టర్ వైస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అంతర్ కళాశాలల రాష్ట్ర స్థాయి క్రీడా, సాస్కృతిక పోటీలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యా యి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా వీసీ గోపాల్, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉద్యాన కళాశాలల్లోని క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకోవాలన్నారు.
బలపనూరులో
చిరుతల సంచారం!
సింహాద్రిపురం: మండలంలోని బలపనూరు – రామాపురం సరిహద్దుల్లో రెండు చిరుత పిల్లలను చూసినట్టు బలపనూరుకు చెందిన నందకిశోర్‌రెడ్డి అనే రైతు పేర్కొన్నాడు. తోటలో పని చేసుకుంటుండగా.., రామాపురం దారిలో బీడు భూముల ముళ్ల పొదల్లో నుంచి ఒక్కసారిగా ఏదో అలజడి రాగా తిరిగి చూశానని.. రెండు చిరుత పులుల పిల్లలు నెమళ్ల గుంపును వెంబడిస్తూ వెళ్లాయన్నారు. ఈ విషయం బహిర్గతం కావడంతో చుట్టుపక్కల వాళ్లు పెద్ద చిరుతలు ఉండొచ్చునేమోనని భయాందోళనతో జంకుతున్నారు. పోలీసు వారికి సమాచారం ఇచ్చానని రైతు పేర్కొన్నారు.
![8న జెడ్పీ సర్వ సభ్య సమావేశం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04kdp255-170064_mr-1738701558-1.jpg)
8న జెడ్పీ సర్వ సభ్య సమావేశం
![8న జెడ్పీ సర్వ సభ్య సమావేశం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04plvd252-170089_mr-1738701558-2.jpg)
8న జెడ్పీ సర్వ సభ్య సమావేశం
Comments
Please login to add a commentAdd a comment