![బరిలో నిలిచి.. పతకం గెలిచి..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04mdpl12-400010_mr-1738701559-0.jpg.webp?itok=Cxwfcx_h)
బరిలో నిలిచి.. పతకం గెలిచి..
మదనపల్లె సిటీ: మన దేశంలో ఇప్పుడిప్పుడు షూటింగ్‌బాల్ క్రీడకు ఆదరణ లభిస్తోంది. నేపాల్ దేశంలోఈ నెల 1 నుంచి 3 వరకు పోటీలు జరిగాయి. 3వతేదీ జరిగిన రెండవ ఆసియన్ షూటింగ్‌బాల్ ఛాంపియన్ షిప్ –2025 ఫైనల్స్ పోటీల్లో పాకిస్తాన్ జట్టుపై ఇండియా జట్టు విజేతగా నిలిచి ట్రోఫీ దక్కించుకుంది. అందులో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కుర్రాడు యూసఫ్ విశేష ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడల్ సాధించాడు. భవిష్యత్తులో షూటింగ్‌బాల్ క్రీడలో రాణించి దేశ కీర్తి ప్రతిష్టలు నిలుపుతానని చెబుతున్నాడు.
● తంబళ్లపల్లెకు చెందిన స్టాంప్‌రైటర్ మస్తాన్‌వలీ, షాహినాబేగం కుమారుడు మహమ్మద్ యూసుఫ్. ప్రాథమిక విద్య తంబళ్లపల్లెలో, కాలేజీ విద్య మదనపల్లె బీటీ కాలేజీలో చదివాడు. ప్రస్తుతం ప్రొద్దుటూరులో బీపీఈడీ కోర్సు చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి షూటింగ్‌బాల్ క్రీడ అంటే ఇష్టం. గత నాలుగేళ్లుగా కోచ్‌లు నరేష్, మురళి, ఖాదర్‌బాషా, రెడ్డిశ్రీనివాస్‌ల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. జిల్లా స్థాయి నుంచి రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగాడు. 2017 నుంచి షూటింగ్‌బాల్ రాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు కర్నూలు, తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఆటల్లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు.
దాతల సహకారం
పేదరికం నుంచి వచ్చిన యూసుఫ్‌కు జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్‌తో పాటు పలువురు దాతలు ముందుకు వచ్చి పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందించారు. దాతల ఆశీస్సులతో ఫైనల్స్ మ్యాచ్‌లో రాణించి అందరి మన్నలు పొందాడు. ఈ సందర్భంగా జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి గౌతమి నరేష్‌బాబు, ఉపాధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, సాగర్, కోశాధికారి సాయిశేఖర్‌రెడ్డి తదితరులు అభినందించారు.
షూటింగ్‌బాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన యూసుఫ్
ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం
పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి
Comments
Please login to add a commentAdd a comment