TS Special
-
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మొత్తం రూ. 200 కోట్ల అక్రమ లావాదేవీలను జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. యాశ్వంత్ రియాలిటీతో పాటు గడ్డం వివేక్ భార్య పేరిట కూడా భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఫెమా చట్టం కింద మాజీ ఎంపీ వివేక్‌పై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ ద్వారా ఎలాంటి వ్యాపారం లేకపోయినా పెద్దఎత్తున లావాదేవీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. నకిలీ పత్రాలతో ఆస్తులను కొనుగోలు.. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటి వరకూ 20 లక్షల ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించినట్లు పేర్కొన్నారు. కాగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణలోని నాలుగు ప్రదేశాలలో ఫారిన్ ఎక్స్ఛెంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని డాక్టర్ గడ్డం వివేకానంద నివాసంతోపాటు హైదరాబాద్‌లోని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. రామగుండంలో లిమిటెడ్. హైటెక్ సిటీ, మంచిర్యాలలో ఆయన నివాసం ఉంటున్న తాత్కాలిక స్థలంలో కూడా సోదాలు నిర్వహించారు. తెలంగాణ పోలీసుల సూచన మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించి రూ. 8 కోట్లు డాక్టర్ జి. వివేక్ బ్యాంక్ ఖాతా నుండి M/s విజిలెన్స్ సెక్యూరిటీకి RTGS చేశారు ఈడీ దర్యాప్తులో విజిలెన్స్ సెక్యూరిటీ బ్యాంక్ ఖాతా నుంచి హేతుబద్ధత లేకుండా డబ్బును సర్క్యుటస్‌గా బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. వివేక్, అతని భార్య వారి సంస్థ విశాఖ ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్ సెక్యూరిటీతో 100 కోట్లు పెట్టబడి పెట్టినట్లు, విజిలెన్స్ సెక్యూరిటీపై వివేక్‌కు పరోక్ష నియంత్రణ ఉన్నట్లు వెల్లడైంది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా FEMA ఉల్లంఘనలు, పన్ను ఎగవేతలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. లెక్కలోని అనేక కోట్ల లావాదేవీలు గుర్తించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. -
కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ రోడ్డు షోలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ఛలోక్తులు విసిరారు. ‘తెలంగాణలో 24 గంటల కరెంటు కనిపిస్తలేదన్న కాంగ్రెస్ నేతలారా.. ముస్తాబాద్ రండి.. ఎప్పుడు వస్తారో చెప్పండి. నేనే బస్సు పెడతా. వచ్చి లైన్లో నిల్చొని మండలంలో కరెంట్ వైర్లు గట్టిగా పట్టుకుని చూడండి. కరెంటుందో, లేదో తెలిసిపోతుంది’ అన్నారు. ‘మీరు దీవిస్తే ఎమ్మెల్యే అయ్యాను. కేసీఆర్ ఆశీర్వదిస్తే మంత్రి అయ్యాను. తెలంగాణలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని నంబర్ వన్ చేశాను. మీరు ఓటు వేస్తే నేను ఎమ్మెల్యే అయి మీరు గౌరవంగా తల ఎత్తుకునేలా పని చేశాను. మీకోసం పని చేస్తున్నా. నన్ను మరొకసారి ఆశీర్వదించండి. ఎలక్షన్ రాగానే వాళ్ళు వీళ్ళు చెప్పేది నమ్మొద్దు. మనస్పూర్తిగా ఆలోచించి నాకు ఓటేయండి’ అని ప్రజలను కేటీఆర్ కోరారు. ‘కేసీఆర్‌కు తెలంగాణ మీద ఉండే ప్రేమ.. రాహుల్ గాంధీ, మోడీకి ఉంటదా..? కాంగ్రెస్సోళ్లు ధరణి ఎత్తేస్తామంటున్నరు. ధరణిపోతే మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తుంది. పట్వారీ వ్యవస్థ వస్తే ఎట్లుంటదో మీకు తెలుసుగా. కాంగ్రెస్సోళ్లు 3 గంటల కరెంటు ఇస్తమంటున్నరు. మళ్లీ రాత్రి బాయికాడికి పోయి పండుకోవాలి. ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లు కట్టాలి’ అని కేటీఆర్ హెచ్చరించాలి. ఇదీచదవండి..కాంగ్రెస్ కార్పొరేటర్ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు -
మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్‌కు మీరు ఓ లెక్కా: రేవంత్‌రెడ్డి
సాక్షి,నర్సాపూర్ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో జరిగిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే మదన్ రెడ్డి , కేసీఆర్ స్నేహితులు అంటారు. మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్‌కు మీరు ఓ లెక్కా. మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే. పార్టీ ఫిరాయించిన సునీతా లక్ష్మా రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల జోన్లో కలిపి నిరుద్యోగులను మోసం చేశారు. మేం అధికారంలోకి వస్తే చార్మినార్ జోన్లో కలిపే అవకాశాన్ని పరిశీలిస్తాం. నర్సాపూర్ గడ్డ..లంబాడీల అడ్డ మేం అధికారంలోకి వస్తే తండాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు బంగారు పళ్లెంలో తింటూ బంగారు తెలంగాణ అంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో, బెల్టు షాపుల్లో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు కేసీఆర్. పార్టీ మారి మోసం చేసిన సునీతా లక్ష్మా రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఆమె కోసం ప్రచారం చేస్తే నాపై కేసులు పెట్టారు. ఆమె మాత్రం కేసీఆర్ పార్టీలో చేరారు. నమ్మక ద్రోహులు ఎవరైనా సరే బండకేసి కొట్టాలి. అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులకు, గిరిజనులకు భూములు పంచి ఇచ్చిన రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం 12 లక్షల పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం నాగార్జున సాగర్, శ్రీ శైలం కట్టింది. ఇందిరమ్మ రాజ్యం ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది. ఇందిరమ్మ రాజ్యం రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర నువు బిచ్చం ఎత్తుకుని బతికేటోడివి’ అని రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఇదీచదవండి..కాంగ్రెస్ తెచ్చేది భూ మాత కాదు..భూ మేత : కేసీఆర్ -
కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు..భూమేత : కేసీఆర్
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ : కాంగ్రెస్ ధరణిని రద్దు చేసి దాని ప్లేస్‌లో భూమాత అనే స్కీమ్ తీసుకొస్తారట కాంగ్రెస్ వాళ్లు తెచ్చేది భూమాత కాదు భూమేత అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఛాన్సిస్తే మళ్లీ ఆగమాగమే అని ప్రజలను హెచ్చరించారు. ఎన్నికలు రాగానే అబద్ధాలు ప్రచారం చేస్తారు. ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలి. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి చూడండి. నీటి, కరెంట్ కష్టాలు తీర్చుకున్నాం. పెన్షన్లు తమాషాకు ఇవ్వడం లేదు. ఎంతో ఆలోచించిన తర్వాత రెండు వేలకు పెంచుకున్నం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణప్రజల కోసం. 15 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు తెచ్చుకున్నాం అధికారంలో ఉన్నపుడు ఏం చేయకుండా కాంగ్రెస్ నేతలు మళ్లీ చాన్సివ్వమని అడుగుతున్నారు. 33 పార్టీలు మద్దతు ఇచ్చాక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో కనీసం తాగునీరు సరిగా ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి చావులే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లే కదా. రైతుబంధు ఉండాలా వద్దా. బీఆర్ఎస్ మళ్లీ వస్తే రైతుబంధు రూ.16 వేలు చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో కంటి వెలుగు ద్వారా 3 కోట్ల మందికి పరీక్షలు చేయించాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాం. స్టేషన్ ఘన్‌పూర్‌లో 1.10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. తాము మోసపోయామని కర్ణాటక రైతులు తెలంగాణలో ఆందోళన చేస్తున్నారు’ అని కేసీఆర్ తెలిపారు. ఇదీచదవండి..మేడ్చల్.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయినట్టే -
బీఆర్ఎస్ను ఆగం చేస్తున్న వర్గపోరు.. ట్రబుల్ షూటర్ మంత్రం పనిచేస్తుందా?
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఓ ఆనవాయితీ కూడా ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్ ఈసారి హాట్ హాట్‌గా మారింది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే అధికార పార్ఠీలో అంతర్గత కలహాలు అక్కడి అభ్యర్థిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం..ఒకప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో.. ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది. రాజకీయాల్లో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలా ఈ నియోజకవర్గంకూ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మారినప్పటి నుంచీ ఈ అనవాయితీ కొనసాగుతూ వస్తోంది. దీంతో జిల్లాలోని అన్ని పార్టీల నేతలంతా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు..టీడీపీ మూడు సార్లు.. గులాబీ పార్టీ ఉప ఎన్నికలతో సహా నాలుగుసార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో తాడికొండ రాజయ్య గులాబీ పార్టీ తరపున విజయం సాధించి.. కేసీఆర్ తొలి క్యాబినెట్లో తొలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2018లో కూడా డాక్టర్ రాజయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకే రెండోసారి అధికారం దక్కింది. ఉపఎన్నికతో కలిపి వరుసగా 4 సార్లు రాజయ్య ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సృష్టించారు. అయితే ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం రాజయ్య చేజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గులాబీ బాస్ ఈసారి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చారు. టికెట్ రాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య అసంతృప్తి రగలిపోతున్నారు. రాజయ్య తీరుతో పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరికి నష్టమని గ్రహించిన కేటీఆర్.. సీఎం కేసీఆర్ స్వయంగా రాజయ్యతో మాట్లాడి బుజ్జగించారు. కడియంతో కలిసి పనిచేయమని రాజయ్యకు సూచించారు. పెద్దల ముందు తలాడించినా గాని...ఆ తర్వాత కూడా ఇద్దరు నేతల మధ్య పెద్దగా సఖ్యత లేకుండా పోయింది. పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజయ్య అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మొదట్లో కడియం నిర్వహించిన అత్మీయ సమ్మేళనాలకు రాజయ్య హాజరుకాలేదు. ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం బలమైన నేతగా భావిస్తున్నా.. వర్గపోరు పార్టీని ఆగం చేస్తోందనే భావన అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఇప్పటికే ఈ అంశాన్ని విపక్షాలు క్యాష్ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయట.. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరగాల్సిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అనూహ్యంగా వర్థనపేటకు మారింది. సభ నియోజకవర్గం మారడానికి ఘన్పూర్ పార్టీలో అంతర్గత కలహాలే కారణమంటూ ప్రచారం సాగింది. అక్కడి నుంచి వస్తున్న సర్వేలు సైతం గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయట. ఒకవైపు ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఘన్పూర్ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారంచాల్సి వస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీద ఎటువంటి అవినీతి మరకా లేదు. అయితే రాజయ్య సీటును లాక్కున్నారనే విమర్శలు స్వపక్షం నుంచే కడియంకు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే..బీఆర్ఎస్లో ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్‌ను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కడియం అభ్యర్థిత్వాన్ని బలమైన మాదిగ సామాజిక వర్గం సైతం వ్యతిరేకిస్తే పార్టీకి ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారట. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ట్రబుల్ షూటర్‌గా ఉన్న మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతోంది. ఉద్యమ సమయంలో 2012 ఉప ఎన్నికల్లో సైతం హరీష్ రావు పూర్తి బాధ్యతలు తీసుకుని అప్పట్లో రాజయ్యను గెలిపించడానికి కృష్టిచేశారు. అప్పుడు ఎవరి ఓటమి కోసం పనిచేశారో అదే కడియం శ్రీహరి విజయం కోసం ఇప్పుడు మళ్లీ హరీష్ రావు రంగంలోకి దిగాల్సి వచ్చిందట. ఆత్మీయ సమ్మేళనం పేరుతో వచ్చిన హరిష్ రావు రాజయ్య ఇంటికి వెళ్లి నచ్చ చెప్పారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు మంత్రాంగం పనిచేస్తుందా? రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న కడియం శ్రీహరి కోసం రాజయ్య మనస్పూర్తిగా పనిచేస్తారా? అనే చర్చ ఘన్పూర్ నియోజకవర్గంలో సాగుతోంది. మరోవైపు ఇక్కడ ఉన్న సెంటిమెంట్ ఈ సారి నిజమవుతుందా? లేదా అనే చర్చ కూడా మొదలైంది. -
ఖమ్మంలో ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే..
ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం 3,11,000 ఓటర్లు ఉన్నారు...ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సామాజిక వర్గాలు ఎటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్-బీఆర్ఎస్లు పోటాపోటీగా బరిలో నిలిచాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ఎన్నికల కోసం సీపీఐ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. సీపీఎం మాత్రం ఒంటరిపోరుకే సై అంది. ఇక ఖమ్మంలో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాల్ని గమనిస్తే.. రాజకీయ పార్టీల వారీగా ఎవరెవరు ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నారు? ఖమ్మం నియోజకవర్గంలో శరవేగంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి...ఖమ్మం సీటు పై కీలక నేతలు గురిపెట్టారు...దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ రసవత్తరమైన ఫైట్ నెలకోనే అవకాశం ఉంది..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ బరిలో నిలవనున్నారు...వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు...ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమంను ప్రారంభించారు...ప్రత్యర్థి బలమైన వ్యక్తి వచ్చిన ఢీకొనడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు . అటు వచ్చే ఎన్నికల్లో పువ్వాడ కు చెక్ పెట్టేందుకు బీజేపీ,కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు ప్రారంభించింది.. కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి పేరు కూడ వినిపిస్తోంది..అటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు .. ఇప్పటికే ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు పొంగులేటి..పొంగులేటి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటి చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న ఆయన అనుచరులు మాత్రం పట్టుపట్టి ఖమ్మం నియోజకవర్గంలోనే పోటి చేయాలని పొంగులేటి పై ఒత్తిడి తెస్తున్నారట. అటు కాంగ్రెస్ నుంచి జావిద్, బీజేపీ నుంచి గల్లా సత్యనారయణ, ఉప్పల శారద ఖమ్మం నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలున్నాయి? ఎన్ని మండలాలున్నాయి? రెండు మండలాలు ఉన్నాయి.. ఖమ్మం అర్బన్, రఘనాథపాలెం మండలాలు.. అతి పెద్ద మండలం ఏది? అత్యంత ప్రభావం చూపే పంచాయతీ ఏది? ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం అర్బన్ పెద్దది.. ఇక్కడే 2,50,000 ఓట్లుపైనే ఉన్నాయి.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? మొత్తం ఓటర్లు- 3,11,693 పురుషులు- 1,50,552 స్త్రీలు- 1,61,095 వృత్తిపరంగా ఓటర్లు? పట్టణ ప్రాంతం కావడంతో ఉద్యోగులు,వ్యాపారులు ఎక్కువగా ఉంటారు.. రఘనాథపాలెం మండలంలో రైతులు ఎక్కువగా ఉంటారు.. ఇక్కడ వ్యవసాయమే జీవానధరంగా చేసుకోని బతుకుతూ ఉంటారు.. కావున ఇక్కడ రైతుల ఓట్లే కీలకంగా ఉంటాయి.. మతం/కులం పరంగా ఓటర్లు? యాదవులు 45,000 ఓట్లు, కమ్మ 48,000 ఓట్లు, మైనార్టీ ఓట్లు 30,000 ఓట్లు.. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు వీరివే ఉంటాయి.. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు..? ఖమ్మం పట్టణంలో ప్రధాన కాలనీల గుండా మున్నేరు వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఖమ్మంలో ప్రముఖంగా శ్రీ స్తంభాధ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు. ఇక్కడికి భక్తులు ఖమ్మం నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి తరలి వస్తూ ఉంటారు. పర్యాటకం పరంగా ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లో ఉన్న లకారం ట్యాంక్ బండ్, చూపరులను ఆకట్టుకునేలా నిర్మించిన తీగల వంతెన ఉన్నది. ఖమ్మం ఖిల్లా ఖమ్మం నియోజకవర్గానికి ప్రాముఖ్యతగా నిలుస్తుంది. నియోజకవర్గం గురించి ఏవైనా ఆసక్తికర అంశాలు ఉంటే? ఖమ్మం నగరం ఒకవైపు అభివృద్ధి చెందుతుండగా మరో వైపు ట్రాఫిక్ సమస్య ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ ఉంది. అంతే కాదు వర్షాకాలంలో ఖమ్మం నగరాన్ని వర్షపు నీరు ముంచేత్తుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నగరవాసులు అంటున్నారు. త్రీ టౌన్ ప్రజలకు ప్రధానమైన సమస్య రైల్వే మధ్య గేట్ నిర్మాణం ఇంతవరకు చేపట్టలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. అర్హులకు అందటం లేదన్న విమర్శలున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో గల ఏకైక మండలం రఘునాథపాలెం. ఈ మండలం విషయానికొస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తన మార్క్ చూపించుకున్నారనే చెప్పాలి. ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్ల రోడ్ తో కూడిన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు . రఘునాధపాలెం మండలం వ్యవసాయ ఆధారిత మండలం కావడంతో వ్యవసాయానికి నీటి సమస్య ఉంది. ఈ సమస్యను తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టును ప్రారంభించారు.కానీ, ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది.. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ ,8 కోట్ల రూపాయలతో తీగల వంతెనను నిర్మించారు. రూ. 21కోట్లతో నూతన బస్టాండ్,రూ. 25కోట్లతో ఐటీ హబ్,రూ.110 కోట్ల రూపాయల తో గొల్లపాడు చానల్ ఆధునికరించారు. ధంసలాపురం ఆర్ఓబి 14 కోట్ల రూపాయలతో నిర్మించారు.నూతన కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు.దీంతో పాటుగా సమీకృత నూతన కలెక్టరేట్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో అజయ్ కుమార్ కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయానికి సంబంధించి ఇతర ఏవైనా అంశాలు 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలుపోందగా.. 2004లో సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసి గెలుపోందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పువ్వాడ అజయ్ గెలుపోందగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో పోటి చేసి గెలుపోందారు. నాలుగు ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం వచ్చే ఎన్నికల్లో హాట్ సీట్ గా మారనుంది. బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు వామపక్షాలు సైతం బలంగా ఉండగా.. బీజేపీ మాత్రం బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో రసవత్తరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల కన్ను ఖమ్మం పైనే పడింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని సామ భేద దండోపాయలను ఉపయోగిస్తున్నాయి. -
'ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారు?'
కరీంనగర్: ఇందిరమ్మ పాలన బాగుంటే.. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీలో ప్రజలను జైళ్లలో పెట్టడమా..? అని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలోనే వలసలు జరిగాయని దుయ్యబట్టారు. 1969 ఉద్యమంలో విద్యార్థులను కాల్చి చంపింది ఎవరో మర్చిపోవద్దని గుర్తుచేశారు. మానుకొండూరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పార్టీల చరిత్ర ఎంటో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటు తలరాతను మారుస్తుందని గుర్తు చేసిన సీఎం.. ఆలోచించి ఓటు వేయకపోతే అదే కాటేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఆటోల ఫిట్నెస్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: మేడ్చల్.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యినట్టే! -
సీఎం కేసీఆర్ ప్రచార వాహనంలో తనిఖీలు.. ఎక్కడంటే?
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అధికార బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు నిర్వహించాయి. వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరవనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్గేట్ వద్ద కేంద్ర బలగాలు నిర్వహించాయి. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఎన్నికల నిబంధనలను అనుసరించి బలగాలకు సిబ్బంది పూర్తిగా సహకరించారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించనున్నారు. -
కాసులు కురిపిస్తున్న నేతలు.. డబ్బుతో పాటు బంగారు బిళ్లలు
అక్కడ ఓట్ల జాతర జరుగుతోంది. ఓటర్లకు పసిడి పండుతోంది. జనం మీద నోట్ల వర్షం కురుస్తోంది. ఖద్దరు చొక్కాకు లక్షలు పలుకుతోంది. ప్రత్యర్థి పార్టీల్లోని ప్రజా ప్రతినిధుల ధర పాతిక లక్షలు పలుకుతోంది. సొంత పార్టీలోని అసమ్మతి నేతలు కొనసాగాలంటే అరకోటి ఇవ్వాల్సి వస్తోంది. మొత్తంగా ఆ నియోజకవర్గంలో కరెన్సీకి విలువ లేకుండా పోతోంది. అక్కడ ఓట్ల జాతర కంటే నోట్ల జాతర జరుగుతోందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం? గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండి.. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న చెన్నూరు అసెంబ్లీ స్థానంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, ప్రలోభాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బరిలో నిలిచారు. ఘనమైన రాజకీయ వారసత్వం ఉన్న వివేక్..ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి రాజకీయాల్లో తత్తరపాటు ప్రదర్శిస్తున్నారు. సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి తొలిసారి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో చేరారు. తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించగానే మళ్ళీ హస్తం గూటికి వెళ్ళారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడంతో..కొన్నాళ్ళ తర్వాత తిరిగి గులాబీ గూటికి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కమలం పార్టీలో చేరారు. ఇటీవలే హఠాత్తుగా మరోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని చెన్నూరు టిక్కెట్ సాధించుకున్నారు వివేక్ వెంకటస్వామి. వివేక్ బరిలో దిగగానే చెన్నూరు ఎన్నికల రూపు ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు బాల్క సుమన్.. మరోవైపు వివేక్ విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. ఆరు నూరైనా విజయం సాధించాలని ఇద్దరూ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. మొత్తంగా ప్రచారం ఒక జాతరలా మారిపోయింది. భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అట్టహసంగా సభలు నిర్వహిస్తున్నారు. వేయి మంది ఓటర్లు కూడా లేని గ్రామాల్లో సైతం వేలమందితో ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ర్యాలీల్లో బతుకమ్మలు, ఒగ్గు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భారీగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మతో వచ్చిన వారికి పదిహేను వందలు, ర్యాలీకి వచ్చిన వాళ్లకు వెయ్యి రుపాయల చొప్పున చెల్లిస్తున్నారు. అదనంగా బిర్యానీ పెడుతున్నారు. రెండు పార్టీలు ఒకరిని మించి మరొకరు పోటీలు పడి ఖర్చు చేస్తున్నారు. నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తల పార్టీల మార్పిళ్ళు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. పార్టీలు మారుతున్న వారికి భారీగా చెల్లింపులు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వంద మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగే నాయకునికి ఐదు లక్షలు, స్థానిక ప్రజాప్రతినిధికి ఇరవై లక్షలు, మండల స్థాయి నాయకునికైతే కోటి రుపాయలు ఆఫర్ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రత్యర్థి పార్టీలు భారీ ఆఫర్లు ఇవ్వడంతో కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు రాత్రికి రాత్రే కండువాలు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ర్యాలీలు నిర్వహించడమే కాదు.. నాయకులను చేర్చుకోవడమే కాదు.. ఓటర్ల కోసం భారీగా నోట్ల వర్షం కురిపించడానికి సైతం అభ్యర్థులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎదుటిపక్షంవారు ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ అభ్యర్థులు బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సుమన్ ల్యాండ్, శ్యాండ్ కబ్జాలతో వేల కోట్లు సంపాదించారని.. అక్రమార్జనతో ఓటుకు వేల రూపాయలు చెల్లిస్తున్నారంటూ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఆరోపిస్తున్నారు. సుమన్ ఎన్ని వేలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయండని ప్రజలకు పిలుపునిస్తున్నారు వివేక్. ఇక, వివేక్ ఆరోపణలకు సుమన్ కూడా ధీటుగా బదులిస్తున్నారు. వివేక్ కుటుంబం అక్రమంగా వేల కోట్లు సంపాదించిదని.. ఓట్ల కోసం బంగారంతో చేసిన లక్ష్మీ బొమ్మలు పంచుతారని.. అవి తీసుకుని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కోరుతున్నారు. మొత్తానికి చెన్నూరు నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలు ఓ ప్రత్యేక కళను తీసుకొచ్చాయి. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మరి ఓటర్లు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి. -
కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు
ధర్మపురి/పెగడపల్లి/కాటారం: కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు. ‘తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండే.. ఇప్పుడెట్ల ఉన్నదో’గమనించాలని సూచించా రు. ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ఆదివారం ఆమె ధర్మపురి, పెగడపల్లి మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మూడు గంటల కరెంటు చాలని, ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, అదే జరిగితే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. తాము మరోసారి అధికారంలోకొస్తే అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇస్తామన్నారు. ప్రస్తుత పథకాలు కొనసాగాలన్నా.. మరిన్ని పథకాలు రావాలన్నా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. అనంతరం ఆమె ధర్మపురి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. తర్వాత స్థానిక బ్రాహ్మణ సంఘం భవనంలో మహిళలతో మాట్లాడారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో కవిత మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో లేదని సాకులు చెబుతూ ఏ పనీ చేయ ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు ఓటు వేయడం వృథా అన్నారు. మంథని అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తానని ఇటీవల సీఎం ప్రకటించారని, మంథనిని కేసీఆర్ దత్తత తీసుకుంటారేమో అనిపిస్తోందన్నారు. -
బండి సంజయ్ వర్సెస్ గంగుల కమలాకర్
ఎన్నికలు ఏవైనా ఒకరు ఓడితేనే మరొకరు గెలుస్తారు. రాష్ట్రం అంతటా ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీ పోరాడుతున్నారు. ఆ నగరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ అనుకూల ఓట్లన్నీ ఒక్క చోటుకు చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక అభ్యర్థి హిందుత్వమే తన నినాదమని ప్రచారం చేస్తున్నారు. మరొకరు సెక్యులర్ విధానమే మా నినాదం అంటున్నారు. రెండు విభిన్న ధృవాల మధ్య జరుగుతున్న పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకీ ఆ సిటీ ఎక్కడో...ఆ ప్రత్యర్థులు ఎవరో చూద్దాం. కరీంనగర్ సిటీలో మరోసారి కమలం గుర్తుపై బండి సంజయ్, కారు గుర్తుపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఇద్దరి మధ్యా కుటుంబాల పరంగా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ... ఎన్నికల గోదాలో దిగాక చావో రేవో అన్న విధంగా పోరాటం చేయక తప్పదు. అందుకే కారు, కమలం పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలు భీకరంగా పేలుతున్నాయి. ఓట్ల పోలరైజేషన్ కోసం ఇరు పక్షాలు హోరా హోరీ తలపడుతున్నాయి. హిందూ ఓట్లు తనను దాటి పోకుండా చూసుకునేందుకు బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా సంప్రదాయంగా గులాబీ పార్టీకి పడుతున్న ఓట్లతో పాటు...మైనారిటీ ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడేలా మంత్రి గంగుల కమలాకర్ తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 55 వేల వరకూ ఉన్న ముస్లిం మైనార్టీల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. కారు, కమలం పార్టీలనుంచి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్, బండి సంజయ్ గెలుపోటములను మైనారిటీల ఓట్లే నిర్ణయిస్తాయి. గత ఎన్నికల్లోనూ మైనారిటీల ఓట్లు గంపగుత్తగా సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ కే పడటంతో..నాడు బండి సంజయ్ పుట్టి మునిగింది. అప్పటివరకూ టగ్ ఆఫ్ వార్ లా నడిచిన పోలింగ్‌లో.. మధ్యాహ్నం తర్వాత ముస్లిం మైనార్టీ ఓటర్లంతా పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఆ ఓట్లన్నీ కారు గుర్తుకే గంపగుత్తగా గుద్దేసి కారును పరుగులు తీయించారు. గంగుల 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ పై విజయం సాధించారు. ఈ క్రమంలో హిందూ, ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఇప్పుడు కరీంనగర్ వేదికైంది. ఈసారి తనకు హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేస్తే..కాంగ్రెస్ పార్టీకి కూడా ముస్లిం మైనార్టీలు మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మైనారిటీ ఓట్లను పంచుకుంటే.. ఇక తన గెలుపు నల్లేరుపైన నడకేనని బండి సంజయ్ ఆశిస్తున్నారు. ఆయన ప్రచారం కూడా దానికి అనుగుణంగానే సాగుతోంది. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై గంగుల కమలాకర్ కూడా అదే రేంజ్లో కౌంటర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని..ఎలాంటి శాంతిభద్రతల సమస్యల్లేకుండా కరీంనగర్ ప్రశాంతంగా ఉందని అంటూ..విధ్వంసకారులు కావాలా...నిర్మాణాత్మక నాయకత్వం కావాలా అన్నది ప్రజలు ఆలోచించాలంటూ గంగుల ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, గురుకులాలు, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్, మిషన్ భగీరథ, తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్, కరీంనగర్ రోడ్లు, స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ సిటీకి ఎంఐఎం మేయరంటూ బండి సంజయ్ ప్రచారం చేశారని.. పాడిందే పాట అన్నట్టుగా బండి ప్రచారం సాగుతోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..సెక్యులర్ విధానమే..తమ నినాదమనీ గంగుల కుండబద్ధలు కొడుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ హిందుగాళ్లు, బొందుగాళ్లంటూ ప్రచారం చేశారంటూ..లోక్‌సభ ఎన్నికల్లో దాన్ని ముమ్మురంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్.. ప్రజల భావోద్వేగాలపై ముద్ర వేసే వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా హిందుత్వ ఓట్ బ్యాంకును పోలరైజ్ చేసి.. గంపగుత్తగా తనవైపు తిప్పుకునే క్రమంలో బండి సంజయ్ మరోసారి ఎత్తుకుంటున్న నినాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సెక్యులర్ నినాదమే తమ విధానమంటూ ముందుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల ప్రచారం ఎలాంటి ప్రభావం చూపుతుందా అన్న ఆసక్తి నెలకొంది. రోజులు గడిచేకొద్దీ..పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఈ నేతల ప్రచార యుద్ధం ఇంకెంత హాట్ హాట్‌గా సాగుతుందోనన్న ఆసక్తికర చర్చ కరీంనగర్ సిటీలో జరుగుతోంది. -
ఇండియా వరల్డ్ కప్.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వరల్డ్ కప్‌లో ఇండియా గెలవడం పక్కా, తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అజారుద్దీన్ వస్తే క్రికెట్ ఆడండి. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు వేయండి. అజారుద్దీన్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ గల్లీ తెలియదు. ఏ మనిషి తెలియడు. అజారుద్దీన్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి తన్ని తరిమేశారు. యూపీలో చెల్లని అజారుద్దీన్ హైదరాబాద్‌లో ఎలా చెల్లుతారు. కాంగ్రెస్ నాయకులకు పదవుల మీద ఉన్న మోజు తెలంగాణ ప్రజల మీద లేదు. కాంగ్రెస్ పార్టీలో 11 మంది సీఎం క్యాండిడేట్లు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం. కాంగ్రెస్ పార్టీ మెట్రో రైలు ఎందుకు పూర్తి చేయలేక పోయింది. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి చూడలేక పోతున్నారు. అధికారంలోకి రాగానే 18 యేళ్లు నిండిన ఆడబిడ్డలకు 3 వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ దివంగత నేత పి.జనార్ధన్‌రెడ్డి కొడుకు విష్ణు బీఆర్ఎస్లో చేరి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. ఇదీచదవండి.. బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్ గాంధీ -
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొలిటికల్ పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియ, ఉప సంహరణ అన్నీ ముగిసిపోయినప్పటికీ జంపింగ్‌లు మాత్రం ఆగడం లేదు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి కొందరు నేతలు క్యూ కట్టగా.. సీనియర్ నేత విజయశాంతి కూడా కాంగ్రెస్‌లోకి చేరారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. చదవండి: కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే -
బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్ గాంధీ
సాక్షి,వరంగల్ : తెలంగాణ ఇస్తే పేదలకు మంచి జరుగుతుందని భావించామని, అయితే వారికి ఎలాంటి మేలు జరగలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ గెలవగానే రాష్ట్రంలో కులగణన చేపడతామన్నారు. కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచిందని విమర్శించారు. ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలనేది బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ బండిలో గాలిని ఆ పార్టీయే తీసుకుందని ఎద్దేవా చేశారు. ‘ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల రూ.2,500 వేస్తాం. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం. విద్యార్థుల చదువు, కోచింగ్ కోసం యువ వికాసం కింద రూ.5 లక్షలు ఇస్తాం. చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల రూ.4 వేలు ఇస్తాం. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే మేలు చేస్తారు. ప్రధాని మోదీ ధనికులైన తన స్నేహితులకు మాత్రమే మేలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పేదలను గుర్తించి ప్రతి ఒక్కరికి మేలు చేస్తుంది’ అని రాహుల్ తెలిపారు. ఇదీచదవండి..కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే -
కాంగ్రెస్ మోసకారి పార్టీ : సీఎం కేసీఆర్
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ మోసకారి పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 60 ఏండ్లు గోస పెట్టిన పార్టీ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఓటువేసేటపుడు ఆలోచించి వేయాలని కోరారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దని సూచించారు. ఓటు వేసేటపుడు ప్రజలు కాంగ్రెస్ చరిత్రను కూడా ఆలోచించి ఓటు వేయాలన్నారు. 24 గంటల కరెంట్ వద్దని, 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ అంటోందని తెలిపారు. 3 గంటల కరెంటుతో పొలం పారుతదా అని సీఎం ప్రజలను ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎన్నో విజయాలకు కరీంనగర్ గడ్డ కేంద్ర బిందువైంది. తెలంగాణ ఉద్యమానికి, వ్యక్తిగతంగా తనకు ఎన్నో విజయాలను అందించిన కరీంనగర్ గడ్డకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2011, మే 17న మొట్టమొదటి సింహగర్జన సభ ఈ కాలేజీ వేదికగానే జరిగింది. తెలంగాణ రాష్ట్రం తేకపోయినా, ఉద్యమాన్ని విరమించినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని అప్పుడు చెప్పిన. ఆ సభకు ఎవరూ ఊహించనంత మంది వచ్చి జయప్రదం చేశారు. దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్ వేదిక నుంచే ప్రారంభించుకున్నాం తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్. 2004లో మనతో పొత్తుపెట్టుకుని కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు మోసం చేశారు. 14 ఏండ్లు పోరాటం చేస్తే తెలంగాణ ఇచ్చారు. తర్వాత మళ్లీ వెనుకకు పోయారు. అంతేగాక టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. దీంతో కేసీఆర్ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను. ఆ దీక్షకు కూడా ఈ కరీంనగరే వేదికైంది. నన్ను అలుగునూరు చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. ఇలాంటి అనేక ఉద్యమ ఘట్టాల్లో ప్రథమ స్థానంలో కరీంనగర్ ఉంటుంది. ఒక దేశమైనా, రాష్ట్రమైనా బాగుందా.. లేదా..? అని చూసేందుకు రెండు కొలమానాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంకు ఎక్కడో ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ 3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నది. కడుపు నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం కాబట్టి ఇయ్యాల ఈ స్థాయికి వచ్చినం. అభివృద్ధికి రెండో గీటురాయి తలసరి విద్యుత్ వినియోగం. 2014లో తెలంగాణ వచ్చినంక తలసరి విద్యుత్ వినియోగం 1,122 యూనిట్లు. ఇప్పుడు 2,040 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం’అని కేసీఆర్ వివరించారు. ఇదీ చదవండి..తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందో నేను చెప్తా కేసీఆర్: రాహుల్ -
కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని, ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. ‘‘కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఎప్పుడూ ఫామ్ హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు. జనాలు బై బై కేసీఆర్ టాటా కేసీఆర్ అంటారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారు’’ అంటూ ఖర్గే మండిపడ్డారు. ప్రాజెక్టులు, పథకాలు ప్రతి దాంట్లోనూ అవినీతి. తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిరోజే వాటిపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఖర్గే పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల -
కాంగ్రెస్ తుపాన్లో కేసీఆర్, బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది: రాహుల్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పదేళ్లు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంతం పలికే రోజు వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎన్ని లక్షల కోట్లను కేసీఆర్ అవినీతి చేశారో.. అంత డబ్బును పేదల అకౌంట్లలో వేస్తామని తెలిపారు. పినపాకలో రాహుల్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తానే స్వయంగా వెళ్లి చూశానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ కేవలం కేసీఆర్ ఇంట్లోమాత్రమే వస్తుందని రాహుల్ విమర్శించారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తాను చెబుతానని అన్నారు. మీరు చదివిన స్కూల్, నడిచే రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీ వేసిందేనని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ 500 కే ఇవ్వబోతున్నామని, ప్రతి నెల మహిళల అకౌంట్లో నెలకు 2.500 వేస్తామని అన్నారు. ‘కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ సీఎం అమలు చేస్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేరుస్తుంది. తెలంగాణలో కులగణనను జరిపిస్తాం. స్థానిక సంస్థల్లోనూ బీసీల రిజర్వేషన్లు పెంచుతాం. కాంగ్రెస్ అంటే కుటుంబ పాలన కాదు ప్రజా ప్రభుత్వం. 20 లక్షల మంది రైతులను ధరణి పేరుతో మోసం చేశారు. ధరణితో మోసపోయిన రైతులకు మీ భూములు మీకు ఇప్పిస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ తుపాన్ మొదలైందని కేసీఆర్‌కు అర్థమైంది. కాంగ్రెస్ తుపాన్లో కేసీఆర్, బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది. తెలంగాణ ఒక కుటుంబం కోసం ఏర్పడలేదు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒక్కటే. ఎక్కడ కాంగ్రెస్, బీజేపీ పోటీ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి ఎంఐఎం ఉంటుంది. ఇక్కడ కేసీఆర్, కేంద్రంలో మోదీని అధికారంలో నుంచి దించేస్తాం’ అని పినపాక సభలో రాహుల్ వ్యాఖ్యానించారు. చదవండి: Tandur: ఓ పార్టీ నుంచి అడ్వాన్స్ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్ -
తెలంగాణ: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీల బుక్లెట్ ‘అభయ హస్తం’ను విడుదల చేశారు. ఆరు గ్యారెంటీల్ని కలిపేసుకుని 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి.. మొత్తం 42 పేజీలతో అభయ హస్తం ఉంది. ఈ విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి,శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ తెలంగాణ ఉదమ్యకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.. గౌరవ భృతి తొలి కేబినెట్లో మెగా డీఎస్సీ మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ ప్రతి ఏటా రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు వరి క్వింటాలుకు రూ.500 బోనస్ వ్యవసాయ కూలీలకు ఏడాది రూ.12,000 ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ చేయూత పింఛన్ రూ. 4,000 ఇల్లు లేని వారికి ఇంటి స్థలానికి రూ.5 లక్షలు విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 ఖాతాలోకి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైద్య రంగం బడ్జెట్ పెంపు ధరణి పోర్టల్ రద్దు.. ఆ స్థానంలో భూమాత పోర్టల్ రేషన్ ద్వారా సన్న బియ్యం ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేయడం రూ. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఎన్నారై సంక్షేమ బోర్డు దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతీ మండలంలోనూ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. చేయూత పెన్షన్ రూ.4వేలు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల ఖాతాలో రూ.2500 రూ.500లకే గ్యాస్ సిలిండర్ నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగం ఖమ్మం, ఆదిలాబాద్ నూతన విశ్వవిద్యాలయాలు కొత్త రేషన్ కార్డులు జారీ ప్రతీ ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేల సాయం పోటీ పరీక్షలకు ఫీజు రద్దు సీఎం కార్యాలయంలో ప్రతీరోజు ప్రజా దర్బార్.. ఇలా ఇంకా ఉన్నాయి.. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే.. 1. మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ మహిళలకు రాష్ట్ర మంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం 2. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం. రైతుకూలీలకు, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం. వరి పంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు రూ 500 బోనస్ అందజేత 3. గృహ జ్యోతి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా 4. ఇందిరమ్మ ఇళ్లు ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ ఇంటిస్థలం. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం అందజేత. 5. యువవికాసం విద్యార్థులకు విద్య భరోసా కార్డు అందజేత. రూ.5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీ రహిత ఆర్థిక సహాయక కార్డు అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు, స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయ కల్పన. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. 6. చేయూత ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్.. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు... పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుపాను రాబోతోంది మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి’’ 👉: కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండి -
TS: ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు చూశారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేశాయి. పోటాపోటీ అంకెలతో.. అంతకు మించి అన్నివర్గాలను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో హామీలను ప్రకటించాయవి. ప్రధాన మూడు పార్టీల మేనిఫెస్టోలను విడుదల వారీగా చూస్తే.. తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థుల ప్రకటనలోనే కాదు.. మేనిఫెస్టోను కూడా ముందుగానే ప్రకటించింది. రైతు బంధు, పెన్షన్ పెంపులను దశలవారీగా అందించడం ప్రధానంగా.. అలాగే మిగతా హామీలను స్వయంగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు.. రైతుబీమా తరహాలో పేదలకు కేసీఆర్ బీమా పథకం తెల్లరేషన్‌కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం అందిస్తాం పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంచుతాం దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు పెంపు రాష్ట్రంలో మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి అర్హులైనవారికి రూ.400కే గ్యాస్ సిలిండర్లు అర్హులైన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేస్తాం అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తాం కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల బీమా పథకం జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు. అక్టోబర్ 15వ తేదీనాడు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. ‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశాం’’ 👉: బీఆర్ఎస్ మేనిఫెస్టో పూర్తి కాపీ కాంగ్రెస్ మేనిఫెస్టో.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ఆరు గ్యారెంటీల అమలును ప్రకటించింది. ఆపై అధికారిక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా నవంబర్ 17వ తేదీన గాంధీభవన్‌లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తెలంగాణ ఎన్నికల కోసం అభయ హస్తం పేరిట మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీల హామీలను రంగరించి.. 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి.. మొత్తం 42 పేజీలతో అభయ హస్తం తెచ్చింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే.. 1. మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ మహిళలకు రాష్ట్ర మంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం 2. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం. రైతుకూలీలకు, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం. వరి పంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు రూ 500 బోనస్ అందజేత 3. గృహ జ్యోతి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా 4. ఇందిరమ్మ ఇళ్లు ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ ఇంటిస్థలం. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం అందజేత. 5. యువవికాసం విద్యార్థులకు విద్య భరోసా కార్డు అందజేత. రూ.5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీ రహిత ఆర్థిక సహాయక కార్డు అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు, స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయ కల్పన. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. 6. చేయూత ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు అభయ హస్తం రిలీజ్ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ‘‘తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్.. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు... పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుపాను రాబోతోంది మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి’’ . 👉: కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తి కాపీ ----------- బీజేపీ మేనిఫెస్టో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత మంత్రి అమిత్ షా నవంబర్ 18న సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియా టవర్స్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 10 అంశాలు కలిగిన... సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు... 1. ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన - అవినీతిని ఉక్కుపాదంతో అణచివేయడం - ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో సుపరిపాలన - బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించి పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు - ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థను తీసుకు వస్తాం - కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు - తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు 2. వెనుకబడిన వర్గాల సాధికారత - అందరికీ సమానంగా చట్టం వర్తింపు 3. కూడు, గుడు - ఆహార భద్రత, నివాసం 4. రైతే రాజు - అన్నదాతలకు అందలం. విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్పుట్ అసిస్టెన్స్ 5. నారీ శక్తి - మహిళల నేతృత్వంలో అభివృద్ధి. మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్. మహిళలకు 10 లక్షల వరకు ఉద్యోగాలు 6. యువ శక్తి - యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, గ్రూప్ 2 నిర్వహణ. ఈడబ్ల్యుఎస్ కోటాతో సహా అన్ని నియామకాలు ఆరు నెలల్లో పూర్తి. 7. విద్యాశ్రీ - నాణ్యమైన విద్య. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు అన్ని ప్రయివేటు స్కూళ్ళలో ఫీజుల విధానంపై పర్యవేక్షణ. 8. వైద్యశ్రీ - నాణ్యమైన వైద్య సంరక్షణ. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రయివేటు ఆసుపత్రిల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం. జిల్లాస్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రోత్సాహం. 9. సమ్మిళిత అభివృద్ధి - పరిశ్రమలు, మౌలికవసతులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రీయింబర్సుమెంట్స్. 10. వారసత్వం - సంస్కృతి, చరిత్ర. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినం. జాతీయస్థాయిలో సమ్మక్క - సారక్క జాతర ఉత్సవాలు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర. ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు. బైరాన్ పల్లి, పరకాల ఊచకోతలను స్మరించుకుంటూ అగస్ట్ 27న రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేయడం ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం అమిత్ షా మాట్లాడుతూ.. సకల జనుల సౌభాగ్య పేరుతో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు బాగా అమలవుతాయన్నారు. గతంలో వాజ్‌పేయి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాలకు మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేటాయించామన్నారు. 👉: బీజేపీ మేనిఫెస్టో పూర్తి కాపీ -
Tandur: ఓ పార్టీ నుంచి అడ్వాన్స్ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ప్రధాన పార్టీ తమ సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు దసరా పండుగ సందర్భంగా రూ.3 లక్షల చొప్పున ఇస్తామని చెప్పింది. పండుగకు ముందుగానే రూ. 50 వేల చొప్పున ముట్టజెప్పింది. మిగిలిన డబ్బులు ఎన్నికలు ముగిసేలోపు రెండు దశల్లో ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అడ్వాన్స్ (రూ. 50వేలు) పుచ్చుకున్న కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు.. తీరా ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీలో చేరారు. అక్కడ కూడా రూ.3 లక్షల ఆఫర్, కొందరికి అంతకంటే ఎక్కువ ఆఫర్ రావడంతో కండువా మార్చేశారు. అయితే ఇప్పుడు మొదట అడ్వాన్స్ డబ్బులిచ్చిన పార్టీ వారు సీన్లోకి వచ్చేశారు. తమ వద్ద డబ్బులు తీసుకొని పార్టీ మారడంతో ఫైరయ్యారు. సదరు సర్పంచ్‌లు, నాయకుల ఇళ్లకు వెళ్లి తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని హెచ్చరించారు. అయితే అవతలి పార్టీ నుంచి తమకు ఇంకా డబ్బులు అందలేదని, రాగానే తిరిగి ఇచ్చేస్తామని సదరు సర్పంచ్‌లు, నేతలు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా స్థానిక ప్రజాప్రతినిధులకు రేటు కట్టి కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అధికారులకు ఈ తతంగం తెలిసినా సరే.. ఫిర్యాదు అందితేనే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. చదవండి: గజ్వేల్ జేజేల కోసం.. -
రెండు లక్షల కొలువులిస్తాం
జవహర్‌నగర్, మేడ్చల్ రూరల్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని, తమ ప్రభుత్వం ఏర్పాటుకాగానే రెండు లక్షల కొలువులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే ఆగమవుతుందని కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఆగమైందని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ను అభివృద్ధి చేయకపోగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్, మేడ్చల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రేశ్ (జంగయ్య) యాదవ్‌ను గెలిపించాలంటూ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఆస్తులున్న కోకాపేట వైపు ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు. జవహర్‌నగర్‌ను అభివృద్ధి చేయకపోగా డంపింగ్ యార్డ్‌ను బహుమతిగా ఇచ్చారు. మేడ్చల్, జవహర్‌నగర్‌లలో ఐటీ కంపెనీలు రాకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. మేడ్చల్‌లో ఐటీ పార్క్ తెస్తామని గొప్పలు చెప్పిన కేటీఆర్ పత్తాలేకుండా పోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం..’’అని తెలిపారు. మల్లారెడ్డి టికెట్ కోసం ఎన్నికోట్లు ఇచ్చారు? రాష్ట్రంలో కేసీఆర్ వందల కోట్లు దండుకుంటుంటే.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి చెరువులను కబ్జాచేస్తూ, కిందిస్ధాయి ప్రజాప్రతినిధులకు సీట్లు అమ్ముకుని వందల కోట్లు వెనకేసుకున్నారు. జవహర్‌నగర్‌లో ప్రభు త్వ స్థలంలో మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి కట్టినా పట్టించుకోవడం లేదుగానీ.. పేదలు 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తున్నారు. ఇంత అవినీతికి పాల్పడ్డ మల్లారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలి..’’అని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక్కడ మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మూడోసారి గెలిపించాలంటూ వస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని.. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, గోదావరి, కృష్ణా జలాల తరలింపు వంటివి వచ్చిది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాదా? అని ప్రశ్నించారు. దొరల ప్రభుత్వాన్ని కూల్చాలి అసలు తెలంగాణ ఇచ్చింది సోనియాగాందీ, కాంగ్రెస్ పార్టీ అని.. రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో. బిర్లామందిర్ మెట్లపైనో బిచ్చమెత్తుకునే వారని రేవంత్ అన్నారు. హరీశ్‌రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని, కేసీఆర్, కేటీఆర్‌లకు వేల ఎకరాల భూములు, ఫామ్‌హౌస్‌లు ఎక్కడివని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు దొరల పాలనకు, పేదలకు మధ్య పోరాటమని.. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా అంటూ రైతులను మోసం చేస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 91వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నివేదికలే వెల్లడించాయని రేవంత్ చెప్పారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా 30లక్షల మంది నిరుద్యోగులను ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. ఇల్లు లేని వారికి 250 గజాల స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని.. ఆడపిల్లలకు పెళ్లినాడే రూ.లక్ష ఆర్థిక సా యంతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, జవహర్‌నగర్ ముదిరాజ్ జిల్లా యువజన అధ్యక్షుడు అనిల్, రజక, కురుమ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
‘అది వదంతి మాత్రమే.. ఆ వార్తలను నమ్మకండి’
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయనే వార్తలను మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఆ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే తనకేంటి సంబంధమని ప్రశ్నించారు. నా బంధువులపై, నా కుమారుల ఇంట్లో సోదాలు జరగట్లేదు.నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను. నాకు పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఐటీ దాడులు అన్నది వదంతి మాత్రమే .నాపైన ఐటీ సోదాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని నమ్మకండి. నేను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను’ అని తెలిపారు. -
ఎన్నికల వేళ ట్విస్ట్.. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐడీ దాడులు రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో, ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో 40 బృందాలు దాడులు చేస్తున్నాయి. దీంతో, పొలిటికల్‌గా ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మిర్యాలగూడతో పాటు నల్గొండ, హైదారాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిన్నారు. మొత్తం 40 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. నల్లమోతు భాస్కర్ రావుకు దేశ వ్యాప్తంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. పవర్ ప్రాజెక్టుల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా డబ్బు నిల్వచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. బంధువుల ఇళ్లలో సోదాలు.. మరోవైపు.. ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భాస్కర రావు బావమరిది రంగా శ్రీధర్‌తో పాటు మరొక నాలుగు చోట్ల మిర్యాలగూడలో సోదాలు జరుగుతున్నాయి. భాస్కర రావు ప్రధాన అనుచరులు, రైస్ మిల్ అసోసియేషన్ నేతల ఇళల్లో సోదాలు కొనసాగుతున్నాయి. విజయం శ్రీధర్, కుశలయ్య ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణలో ఎన్నికల సందర్బంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల ఇళ్లపై కూడా ఇటీవల ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో సబితా అనుచరులుగా ప్రచారం జరుగుతున్న నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా డబ్బును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ నగదును మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు విచారణలో గుర్తించారు. అటు, పొంగులేటి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి. -
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
నాగార్జునసాగర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ధీమావ్యక్తం చేశారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఎమ్మార్పీఎస్ ఉపకులాల రాష్ట్రనాయకుడు విష్ణుమూర్తి బుధవారం జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో టీఎమ్మార్పీస్ చిత్రం శ్యాం ఉండగా కార్యక్రమంలో నాయకులు జంగయ్య, ఉంగరాల శ్రీను, ఆదాసు విక్రం,మందకిషోర్, పగిడి నర్సింహ, శ్రీను తదితరులు ఉన్నారు. -
వీడియో క్లిప్పింగ్ చూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా
నల్గొండ: తన తండ్రి కుందూరు జానారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా అన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు సవాల్ విసిరారు. బుధవారం నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి హాలియా సభలో చెప్పింది నిజమైతే వీడియో క్లిప్పింగ్ చూపించాలన్నారు. ఉచిత విద్యుత్ నాలుగేళ్లు ఇస్తే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని నాడు ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి అన్నారని సీఎం కేసీఆర్ మంగళవారం హాలియా ప్రజా ఆశీర్వాద సభలో వ్యాఖ్యానించడంపై జైవీర్‌రెడ్డి స్పందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయిరెడ్డి, అంకతి సత్యం, కొండా శ్రీనివాసరెడ్డి, శివమారయ్య, నూకల వెంకట్‌రెడ్డి, అంకతి వెంకటరమణ, బొల్లం శ్రీనివాస్ యాదవ్, ప్రభాకరరెడ్డి, వల్లబరెడ్డి, వివేక్ కృష్ణ, మేరెడ్డి వెంకటరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.