TS Special
-
అసైన్డ్ భూములకు హక్కులిస్తాం
సిరిసిల్ల: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దళితులు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తే.. వాటిని అమ్ముకోవచ్చని, పిల్లలకు ఇచ్చుకోవచ్చని, బ్యాంకుల్లో కుదువపెట్టుకోవచ్చని చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ‘‘దరిద్రానికి నేస్తం కాంగ్రెస్ హస్తం. వారిని నమ్ముకుంటే నష్టపోయేది తెలంగాణ సమాజమే. గ్యారంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తుంది. రేవంత్‌రెడ్డి ఎప్పుడు జైలుకు పోతాడో ఆయనకే తెలియదు. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా.. మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలి. ఎన్నికలప్పుడు ఆగం కావొద్దు. ఆలోచించి ఓటేయాలి’’అని కేటీఆర్ కోరారు. ఆరున్నరేళ్ల పాలనలో ఎంతో చేశాం.. రాష్ట్రాన్ని కేసీఆర్ దేశానికే ఆదర్శవంతంగా చేశారని కేటీఆర్ చెప్పారు. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాతో, మరో ఏడాది సమయం లోక్‌సభ, ఇతర ఎన్నికల కోడ్‌తో వృధా అయిందన్నారు. పక్కాగా పాలన సాగినది ఆరున్నరేళ్లేనని, ఇంత తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. రేషన్‌కార్డులు ఇస్తామని, పెన్షన్లు పెంపు, 93 లక్షల కుటుంబాలకు బీమా, రేషన్‌కార్డులపై సన్నబియ్యం వంటివి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని, వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.400కే అందిస్తామని ప్రకటించారు. సిరిసిల్ల ప్రాంతంలో 370 ఎకరాల్లో ఆక్వా హబ్ వస్తుందని, దీంతో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. బాధ్యతలు పెరిగాయి ‘‘ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరిని కలవాలని నాకు ఉంటుంది. కానీ బాధ్యతలు పెరిగాయి. మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రమంతటా తిరగాల్సి వస్తుంది. మీరే చూస్తున్నారు. నేను రోజూ ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని సభల్లో పాల్గొంటున్నానో. మిమ్మల్ని కలవలేక పోతున్నందుకు బాధగా ఉంది..’’అని తంగళ్లపల్లి రోడ్‌షోలో కేటీఆర్ పేర్కొన్నారు. మీ ఆశీర్వాదంతో గెలిచాక ఎలాంటి తలవంపులు తేలేదని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడేలా పనిచేశానని చెప్పారు. ఈ రోడ్‌షోలలో వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనర్సింహరావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
మోటార్ వైరే మంట పెట్టింది!
సాక్షి, హైదరాబాద్: వాటర్ మోటార్ వైరులో ఏర్పడిన షాట్‌సర్క్యూట్ కారణంగానే బజార్‌ఘాట్‌లోని బాలాజీ రెసిడెన్సీలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రా థమికంగా నిర్థారించారు. ఉదంతం చోటు చేసుకున్న భవ నం గ్రౌండ్ ఫ్లోర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను విశ్లేషించిన నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చారు. సోమ వారం జరిగిన ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృతిచెందిన విషయం విదితమే. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని మొదట్లోనే భావించినా... ఎప్పుడు? ఎక్కడ నుంచి జరిగిందనేది తాజాగా క్లూస్ టీమ్ అధికారులు గుర్తించారు. కేసింగ్ దెబ్బతిని వైర్లు బయటకు... ఈ అపార్ట్‌మెంట్‌ను జీ+4 విధానంలో నిర్మించారు. మధ్యలో లిఫ్ట్, మెట్లు ఉండగా... వీటికి కుడి వైపున నాలుగు, ఎడమ వైపున నాలుగు చొప్పున ఫ్లాట్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మెన్ గదితో పాటు యజమాని రమేష్ జైశ్వాల్‌కు సంబంధించిన అక్రమ గోదాములు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కుడి వైపు వాచ్మెన్ రూమ్ పక్కన పాలిమర్ షీట్లు నిల్వ ఉంచగా.. ఎడమ వైపు రసాయనాల డబ్బాలు ఉంచారు. దీనికి సమీపంలోనే కొన్ని కార్టన్ బాక్సుల్నీ నిల్వ చేశారు. వీటి వెనుక ఉన్న గోడకు స్టార్టర్ నుంచి మీటర్ వరకు వెళ్ళిన వైరు కేసింగ్‌తో ఉంది. కార్టన్ బాక్సుల్ని పదేపదే కదిపిన కారణంగా కేసింగ్ దెబ్బతినడంతో వైర్లు బయటకు వచ్చి ఉంటాయని, ఇవి రాపిడికి గురికావడంతో పైన ఉండే పొర దెబ్బతిని లోహపు వైరు బయటకు వచ్చి ఉంటుందని క్లూస్ టీమ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మోటార్ ఆన్ చేసిన కొన్ని నిమిషాలకే... అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్య సోమవారం ఉదయం 8.15 గంటలకు మోటార్ ఆన్ చేశారు. దాదాపు అర్ధగంట తర్వాత 8.45 నిమిషాల ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయడం మానేశాయి. దీన్ని బట్టి అప్పుడే షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాచ్మెన్ దంపతులను ప్రశ్నించిన పోలీసులు మరికొన్ని వివరాలు సేకరించారు. షార్ట్‌సర్క్యూట్ ప్రభావంతో వచ్చిన నిప్పురవ్వల కారణంగా కార్టన్ బాక్సులకు నిప్పు అంటుకుంది. గమనించిన వాచ్మెన్ దంపతులు నీళ్లతో ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ లోపే ఆ బాక్సుల్లో ఉన్న మెటీరియల్ అంటుకుని మంటలు విస్తరించడం మొదలయ్యాయి. వాచ్మెన్ కాలికి గాయం కావడంతో వేగంగా స్పందించలేకపోయాడు. దాంతో మంటలు రసాయనాలకు అంటుకోవడంతో ఊహించని నష్టం జరిగిపోయింది. ఉస్మానియా ఆస్పత్రిలోని బర్న్స్ వార్డులో చికిత్స పొందుతున్న మరో బాధితుడు తల్హా (17) పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. -
‘హంగ్’ ప్రసక్తే లేదు..!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పూర్తి మెజారిటీ సాధించి మూడోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి సందిగ్ధత లేదని, ఎటువంటి అనుమానాలు అక్కరలేదని వ్యాఖ్యానించారు. ఎవరిని ఎన్నుకోవాలో క్షేత్ర స్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ‘హంగ్’కు అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ ఆధిక్యత లభించదనేది కాంగ్రెస్ ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టి పారేశారు. హైదరాబాద్ దేశోద్ధారక భవన్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే– ఐజేయూ) ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. కాంగ్రెస్‌ది అంతా గోబెల్స్ ప్రచారం ‘గతంలో ప్రత్యక్షంగా మహాకూటమి పేరిట బీఆర్ఎస్ గొంతు నులమాలని చూసినా విజు్ఞలైన ఓటర్లు కేసీఆర్‌కు మద్దతు పలికారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు, వ్యక్తులతో అంటకాగుతున్న వ్యక్తి రేవంత్. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ రాహుల్ గాంధీ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ఇక్కడ ఉద్యోగాల కల్పన విషయంలో గోబెల్స్ ప్రచారం చేస్తోంది. మా మేనిఫెస్టోను కాపీ కొట్టి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటోంది. మేనిఫెస్టో హామీల అమలులో కాంగ్రెస్‌ది ఎగవేసిన చరిత్ర అయితే బీఆర్ఎస్ది నెరవేర్చిన చరిత్ర’ అందరినీ సంతృప్తిపరచలేము ‘‘వరుసగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు అందరినీ సంతృప్తి పరచలేరు. నాణేనికి రెండువైపులా అన్నట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయి. మేనిఫెస్టోను అమలు చేయగలిగే వారికే మెజారిటీ ఓట్లు పడతాయి. కేసీఆర్‌కు సరితూగే నాయకులు రాష్ట్రంలో లేరు. ఓటమి ఎరుగని నాయకుడు కేసీఆర్ మీద పోటీ చేయడం ద్వారా రేవంత్, ఈటల పెద్దవాళ్లు కావాలనుకుంటున్నారు. బీజేపీ గుజరాత్, కాంగ్రెస్ కర్ణాటక మోడల్ అంటున్నా తెలంగాణ మోడల్‌కు ఏదీ సాటిరాదు. కర్ణాటక మోడల్ అట్టర్ ఫెయిల్. నెత్తీ కత్తీ లేని బీజేపీ ఇచ్చే హామీలకు విలువ లేదు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాతో పనిచేయడం లేదు. కాంగ్రెస్ చెప్తున్నంతగా క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి కేడర్ బలం లేదు. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని బదనాం చేసి ప్రయోజనం పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోంది.’’ సోషల్ మీడియాలో నాపై విష ప్రచారం తెలంగాణ ఉద్యమంలో రెండు వందలకు పైగా కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన నాపై విమర్శించేందుకు ఏమీ లేకనే సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులను తృణప్రాయంగా వదిలేశా. తెలంగాణ ప్రజలపై రైఫిల్ ఎక్కు పెట్టిన రేవంత్‌కు విమర్శించే హక్కు లేదు. ఎన్నో బ్యారేజీలు, రిజర్వాయర్లు, టన్నెళ్లు, కాలువల సముదాయం కాళేశ్వరంపై విమర్శలు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిదే. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల కూటమి దేశంలో గణనీయ పాత్ర పోషిస్తుంది. మళ్లీ అవకాశం వస్తే ఆరోగ్య శాఖ మంత్రిగానే.. ‘తెలంగాణలో గంగా జమునా తహజీబ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతాం. రాబోయే రోజుల్లో విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేస్తాం. హైదరాబాద్‌లో మౌలిక వసతుల మీద ఫోకస్ పెంచుతాం. కరోనా, పెద్దనోట్ల రద్దు మూలంగా ఉద్యోగుల వేతనాల చెల్లింపులో కొంత ఆలస్యం జరిగినా చెల్లింపులు ఆగలేదు. మాకు ఏ పార్టీతోనూ అవగాహన లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. నేను కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే కార్యకర్తను. పార్టీ అప్పగించే బాధ్యతను నెరవేర్చే వ్యక్తిని మాత్రమే. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం కత్తిమీద సాము అయినా ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం అనే సంతృప్తి ఉంటుంది. అందుకే మళ్లీ అవకాశం వస్తే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయాలనుకుంటా. -
లాజిక్ పసిగట్టు.. జేఈఈ ర్యాంక్ కొట్టు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ అత్యంత కీలకమైంది. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. ఇందులో అర్హత కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తారు. మెయిన్స్‌లో మంచి ర్యాంకు వ చ్చి, అడ్వాన్స్‌డ్‌లో రాకపోయినా ఆనందించే వాళ్లూ ఉంటారు. అయితే, జేఈఈలో విజయం సాధించడానికి కృషితో పాటు కొన్ని లాజికల్ అంశాలు తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఏ ర్యాంకుతో ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే అవగాహన ఉండదు. మెయిన్స్ ర్యాంకుతో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఈసారి మారిన సిలబస్ కొంత ఒత్తిడిని తగ్గించే వీలుంది. కాబట్టి మెయిన్స్ ర్యాంకుల పట్ల ఉన్న అపోహలు దూరం చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు 10,000 లోపు ర్యాంకు ఉంటేనే ఎన్ఐటీల్లో సీట్లు వస్తాయని భావిస్తారు. దీంతో తుది దశ కౌన్సెలింగ్ వరకూ ఉండకుండా ఎంసెట్‌పై దృష్టి పెడతారు. ర్యాంకర్లు కూడా రాష్ట్ర కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లకు ప్రయత్నిస్తారు. కౌన్సెలింగ్ జిమ్మిక్కు పూర్తిగా అర్థమైతే తప్ప దీని నుంచి బయటపడటం కష్టం. అందుకే మెయిన్స్‌కు వెళ్లే విద్యార్థులు గత కొన్నేళ్ల ర్యాంకులు, సీట్ల వివరాలపై ముందే కొంత కసరత్తు చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీ కూడా లక్ష్యం కావాలి..: మెయిన్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ముందస్తు సన్నద్ధతను బట్టి ఓ అంచనాకు రావాలి. మూడేళ్ల కటాఫ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ ర్యాంకు వస్తుందో గుర్తించాలి. దీని ఆధారంగానే ఏయే కాలేజీల్లో ఎంత వరకూ సీట్లు వచ్చాయనేది తెలుసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్ఐటీల్లో 23,056 సీట్లు, ఐఐఐటీల్లో 5,643 సీట్లు, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్‌తో భర్తీ చేసే 16,050 ఐఐటీ సీట్లను పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లను జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. కొన్నేళ్లుగా సీట్ల కేటాయింపును పరిశీలిస్తే, వరంగల్ నిట్‌లో సీఎస్ఈకి అబ్బాయిలకు 3,089 ర్యాంకు, అమ్మాయిలకు 3,971 వరకూ సీటు వస్తుంటే, ఏపీలో అబ్బాయిలకు 14,000 ర్యాంకు, అమ్మాయిలకు 28,000 ర్యాంకు వరకు సీటు వస్తోంది. ఒబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13,000 వరకూ, ఏపీలో 33,000 ర్యాంకు వరకూ సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకి గరిష్టంగా 97,139 వరకూ, ఎస్టీలకు 48,000 ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. సిలబస్ మారడంతో ఈసారి కొంత పోటీ ఉండొచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ర్యాంకు, కాలేజీని టార్గెట్‌గా పెట్టుకోవాలన్నది జేఈఈ అధ్యాపకుల సూచన. బ్రాంచే టార్గెట్ అనుకుంటే... చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీ కోసం ఎదురు చూస్తారు. అందుకే ఓపెన్ కేటగిరీలో ఈ బ్రాంచీ సీట్లకు పోటీ ఉంటుంది. ఒకవేళ బ్రాంచీనే లక్ష్యమైతే ఫలానా కాలేజీలో కావాలనే టార్గెట్ పెట్టుకోకూడదు. కొన్ని ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీకి కూడా 40,000 ర్యాంకు వ చ్చినా సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇవేంటో విద్యార్థులు తెలుసుకోవాలి. మెకానికల్ డివిజన్లో ఓపెన్ కేటగిరీలోనే వరంగల్ నిట్‌లో 17,000 వరకూ, ఏపీలో 75,000 వరకూ ర్యాంకులకు సీటొచ్చే వీలుంది. రిజర్వేషన్ విభాగంలో ఏకంగా 2,96,201 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరు చ్చి, సూరత్కల్, క్యాలికట్, నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఐటీల్లో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా జేఈఈ ర్యాంకు గరిష్టంగా 50,000 దాటినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి. కాబట్టి కోరుకున్న బ్రాంచీ, ఏ కాలేజీలో వస్తుందనే కసరత్తు చేయడం ముఖ్యం. ఈ లాజిక్ తెలిస్తే ప్రిపరేషన్ అందుకు తగ్గట్టుగా ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. -
ఓట్.. ఆల్ఔట్..
ముందుగా నాయకుల హామీలపై.. రెండు మాటలు సరదాగా.. అసలే చలికాలం.. ఆపై ఎన్నిక లు.. ఇంకేం గొర్రెల నాయకుడు దండోరా వేయించాడు. మా పాలనలో అన్ని గొర్రెలకు ఉచితంగా కోటు పంపిణీ చేస్తానని. అన్ని గొర్రెలు ఖుషీగా పండుగ చేసుకున్నాయి. ఇలాంటి నాయకుడు దొ రకడం తమ అదృష్టమని పాలాభిషేకాలూ గట్రాలూ చేశాయి. అందులో కాసింత అమాయకంగా, అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న గొర్రెకు రాకూడని డౌట్ వచ్చింది..అడగకూడని ప్రశ్న ఆ నాయకుడిని అడిగింది. ‘మేం ఇంతమందిమి ఉన్నాం కదా.. అందరికీ అంత ఉన్ని ఎక్కడనుంచి తెస్తారూ ’.. అని. ‘‘ ఇంకెక్కడనుంచి గొర్రెల నుంచే తీస్తాం కదా..’’ నాయకుడి సమాధానం. మగదోమ – నీకోసం సింహాన్ని వేటాడి తేనా డియర్ ఆడదోమ – వద్దులే ముందు పడుకో మగదోమ – పోనీ ఐరావతాన్ని కుట్టి నీకు బ్లడ్ బాత్ చేయించనా ఆడదోమ– వద్దు..వద్దు ముందు నిద్రపో, నాకూ నిద్ర వస్తోంది మగదోమ – పోనీ ఇంకా ఏదైనా.... ఆడదోమ– అసలే ఓట్ల టైమ్.. రాజకీయ నా యకులను కుట్టి వచ్చావా ఏంటి... నోరుమూసుకు ని పడుకోకపోతే ఆల్ ఔట్ పెట్టి బయటకు పోతా.. ఇదో సైకాలజీ.. ఇలాంటి జోకులు, కథలు ఎన్నికల టైమ్‌లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇదంతా రాజకీయ నాయకులపై. ఎన్నికలపై, పోలింగ్‌పై వారి అభిప్రాయాన్ని ప్రతిఫలిస్తుంటాయి. చాలామంది ఓటర్లు ఎన్నికల పట్ల నిరాసక్తంగా, పోలింగ్‌కు దూరంగా ఉంటుంటారు. వీలుంటే పోలింగ్ తేదీని హాలిడేగా కూడా పరిగణిస్తుంటారు. పొలిటీషియన్లపై , ఎన్నికలపై మంచి అభిప్రాయం క్రమక్రమంగా కనుమరుగవుతోందని పై జోకులు చెబుతూనే ఉంటాయి. ఇలాంటి కథల వెనుక, ఓటు పట్ల నిరాసక్తత వెనుక సైకాలజీ కూడా ఉందట..అమెరికాలోని స్టోనీబ్రూక్, మిన్నెసోటా యూనివర్సిటీల పొలిటికల్ సైన్స్–ఎలక్షన్ సైకాలజీ ప్రొఫెసర్లు అధ్యయనం చేసి ఇలా చెబుతున్నారు.. నిరాసక్త జీవులు.. ♦ జీవితంలో కష్టానష్టాలు ఎదుర్కొని ప్రభుత్వం నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి సాయం దక్కనివారు ఓటేసేందుకు విముఖతతో ఉంటారు. తమకు లాభం లేదనుకున్నప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమిటన్న అభిప్రాయం వారిది. ♦ తోటివారిని పెద్దగా నమ్మనివారు, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడతారనే అభిప్రాయంతో ఉన్నవారు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉంటారట. ♦ పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోవడంతోనూ ఓటు వేయకుండా ఉండేవారూ ఎక్కువే. తమకు న చ్చిన అభ్యర్థి ఉన్నప్పుడే ఓటు వేయాలనిపిస్తుందని కొందరు ఓటర్లు ఓ సర్వేలో వెల్లడించారు. ♦ అభ్యర్థుల్లో ఎవరూ మంచివారు లేరని.. చెడ్డవారిలో ఎక్కువ, తక్కువ అంటూ ఎవరూ ఉండరనే అభిప్రాయంతో ఓటేయడం లేదని చెప్పినవారూ ఎందరో. ♦ కొందరైతే నిత్యం రాజకీయ వార్తలను చూస్తుంటారు. పార్టీలు, అభ్యర్థులపై చర్చలూ చేస్తారు. కానీ ఎన్నికల వ్యవస్థ రిగ్గింగ్‌కు గురైందనే, ఎవరు గెలుస్తారో ముందే తేలిపోయినట్టేననే భావనతో ఓటు వేయరు. ♦ గెలిచినవారు హామీలు నిలబెట్టుకోకపోవడం, డబ్బులున్నవారే గెలుస్తుండటం వంటివి కూడా జనం ఓటింగ్‌పై అనాసక్తికి కారణాలు ♦ ‘రాజకీయాలతో, నేతలతో మనకేం పని, నా పనేదో నాకుంది..’ అనుకునేవారు ఓటేసేందు కు వెళ్లరు. ముఖ్యంగా యువతలో ఇలాంటి భా వన కనిపిస్తుందని.. కెరీర్, చదువు, ఇతర వ్యా పకాల్లో మునిగి ఉండటంతో వారు నిత్యవార్తలకు, రాజకీయాలకు దూరంగా ఉంటుండట మే దీనికి కారణమని అధ్యయనం పేర్కొంది. రాజకీయ జీవులు.. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, రాజకీయాలు–ఎన్నికలు తమ నిత్యజీవితంపై ప్రభావం చూపుతాయన్న అవగాహన ఉన్నవారు క చ్చితంగా ఓటు వేస్తారని.. కొత్త అంశాలు, సంగతులపై ఆసక్తి ఉండేవారు ఓటు వేసే అవకాశాలు ఎక్కువని, దీనికి భిన్నంగా ఉండేవారు దూరంగా ఉంటారని తేల్చింది. నిస్వార్థజీవులు.. ఎప్పుడో అరుదుగా తప్ప మామూలుగా అయితే ఒక ఓటు పడకపోతే, లేక అటూ ఇటూ అయితే వచ్చే తేడా ఏమీ ఉండదనే భావనలో కొందరు ఉండగా, గంటల తరబడి క్యూలో నిలుచుని మరీ ఓటు వేసేవారు కొందరు. మనుషుల్లో ఉండే నిస్వార్థమైన తత్వమే ఇలా ఓటు వేయడానికి కారణమని న్యూయార్క్ యూనివర్సిటీ సైకాలజీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారతీయుల బాధ.. ♦ మేం ప్రభుత్వంపై, పథకాలపై ఆధారపడటం లేదనే భావనతో ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలు ఓటు వేయడానికి దూరంగా ఉంటున్నాయి. తమకు ఏమైనా అవసరమైతే డబ్బుతోనో, పలుకుబడితోనో చేసుకోగలమనేది వారి భావన. ♦ సొంత ప్రాంతాలను వదిలి వలస వెళ్లినవారు.. కొత్త ప్రాంతాల్లో నేతలు, అభ్యర్థులపై ఆసక్తి లేకుండా ఉండటం, వారాంతాల్లో పోలింగ్ వల్ల ఓటేయడం కంటే వినోదంపై దృష్టిపెట్టడం వల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గుతోంది. ♦ భూస్వాములో, నేర చరిత్ర ఉన్నవారో, రాజకీయాలు తెలియని ప్రముఖులో ఎన్నికల బరిలోకి దిగినచోట మధ్యతరగతి, యువత వారిపట్ల ఏహ్యభావంతో ఓటేయడం లేదు. వేరేవారికి వేసినా గెలవరని భావిస్తున్నారు. ♦ రోతగా మారిన రాజకీయాలకు, నేతల అవినీతికి నిరసన అంటూ కొందరు ఓటు వేయకుండా ఉంటున్నారు. ♦ ఓటు ప్రాధాన్యత చాటి చెప్తూ సెలబ్రిటీలతో ఎన్నికల సంఘం చేస్తున్న ప్రచారం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదని.. యువత పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేయడం లేదని పరిశీలకులు చెప్తున్నారు. అమెరికాలోనూ అంతే.. పెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికాలో జనం ఓటేయడంలో బద్ధకస్తులే. అక్కడ పేదలు, యువత, విదేశాల నుంచి వచ్చి స్థిరపడినవారు పెద్దగా ఓటేసేందుకు ముందుకు రావడం లేదని అధ్యయనాల్లో తేలింది. -సరికొండ చలపతి -
లీడర్‌కు కే‘డర్’
అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి రాజకీయ వలసలు అన్ని పార్టీల్లోనూ నిత్యకృత్యంగా మారాయి. దిగ్గజ నేతలు మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పార్టీని వీడటం అన్ని పార్టీల్లోనూ రివాజుగా మారింది. టికెట్ల కేటాయింపుపర్వం అన్ని రాజకీయ పక్షాల్లోనూ ప్రకంపనలు సృష్టించగా, భంగపడిన ఆశావహులు సొంతపార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలోకి చేరిపోయారు. తమ టికెట్ ఎగురేసుకు వెళ్లిన అభ్యర్థులను ఓడిస్తామంటూ శపథం చేస్తూ ఎదుటి పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక టికెట్ దక్కించుకున్న నేతలు ఎదుటి శిబిరాలపై కన్నేసి క్షేత్రస్థాయి కేడర్‌ను లాక్కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా తాయిలాలు ఎర వేస్తూ తమవైపు లాక్కునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇక మరోవైపు ఉన్న సొంతకేడర్ను కాపాడుకునేందుకూ తంటాలు పడుతున్నారు. స్థానికంగా జనంలో కాస్త పలుకుబడి ఉన్న నేతలకు సైతం పార్టీ మారాల్సిందిగా వివిధ పక్షాల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఎటూ తేల్చుకోలేని కిందిస్థాయి నేతలు కొందరు ఫోన్లు బంద్ పెట్టుకొని అందుబాటులో లేకుండా పోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. స్థానిక సంస్థల ప్రతినిధులకు గిరాకీ... ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు క్షేత్రస్థాయి కేడర్ చేరికలపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. వలసలను ప్రోత్సహించే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్లు మొదలు ఉప సర్పంచ్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, చైర్మన్లు, స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులకు గిరాకీ ఏర్పడింది. పార్టీ నిర్ణయానికి కంకణబద్ధులైన స్థానిక సంస్థల ప్రతినిధులు కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు. మరికొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ బేరసారాలు సాగిస్తున్నారు. వలసలను అరికట్టే క్రమంలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే అడ్వాన్సు రూపంలో కొంత మేర చెల్లింపులు పూర్తి చేశారు. అయినా సంతృప్తి చెందని కొందరు క్షేత్ర స్థాయి నేతలు, కేడర్ ఎదుటి పార్టీ అభ్యర్థులతో మంతనాలు జరుపుతుండటం సొంత పార్టీ అభ్యర్థులకు తలనొప్పులు తెచ్చి పెడుతోంది. కొందరు కిందిస్థాయి నాయకులు అడ్వాన్సులు పుచ్చుకుని కూడా పార్టీలు మారుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కొత్త కేడర్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్లో కింది స్థాయిలో వీరిదే ప్రధాన పాత్ర కావడంతో తమకు విధేయతతో పనిచేసే కేడర్ కోసం నేతలు వెతుకులాట ముమ్మరం చేస్తున్నారు. సొంత సైన్యం మోహరింపు క్షేత్రస్థాయిలో కేడర్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందు కు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ సొంత సైన్యాన్ని మండలాల వారీగా మోహరింపజేశారు. ఓవైపు పార్టీ నేతలకు మండలాలు, కీలక గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగిస్తూనే తమ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నారు. బీఆర్ఎస్ లాంటి పార్టీలు కీలక నియోజకవర్గాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాయి. వారు తమ అనుచరగణంతో కేటాయించిన మండలాల్లో మకాం వేసి కేడర్ సమన్వయం, ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ తదితరాల్లో అభ్యర్థులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్లో అత్యంత కీలకమైన డబ్బు, మద్యం పంపిణీ బాధ్యతలను అభ్యర్థులు తమ సొంత సైన్యానికే అప్పగిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమకు నమ్మకస్తులైన వారి ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో మద్యం డంప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు తరలింపులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కీలక స్థావరాలకు చేర్చినట్లు సమాచారం. అయితే కొన్ని చోట్ల పార్టీ ఇన్‌చార్జ్‌లు, అభ్యర్థుల నడుమ కూడా సమన్వయ లోపం తలెత్తుతోంది. -కల్వల మల్లికార్జున్ రెడ్డి -
గన్స్ & కార్స్
సాక్షి, హైదరాబాద్: సొంతకారు కూడా లేని సీఎం కేసీఆర్, మంత్రులు మల్లారెడ్డి, సబిత, ఎమ్మెల్యేదానం నాగేందర్ వంటి వారు ఒకవైపు... లగ్జరీ కార్లు, అత్యాధునిక ఆయుధాలున్న హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అక్బరుద్దీన్, శ్రీలతారెడ్డి వంటి అభ్యర్థులు మరోవైపు. ఆత్మరక్షణ కోసమో, ఫ్యాషనో, వారసత్వమో కారణమేదైనా పలువురు రాజకీయ నాయకుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు .22 పిస్టల్ వారసత్వంగా రాగా.. యాకుత్‌పుర బరిలో ఉన్న జాఫర్ అమెరికా కంపెనీ నుంచి తుపాకులు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ కారులో చక్కర్లు కొడుతుండగా.. హుజూర్నగర్ బరిలో ఉన్న శ్రీలతారెడ్డికి 1.38 కోట్ల ఖరీదైన ఐదు లగ్జరీ కార్లున్నాయి. ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి టెక్సాస్ నుంచి టెస్లా, ల్యాండ్ రోవర్ కార్లు దిగుమతి చేసుకున్నారు. వీరంతా ఆయా వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచారు. విదేశాల నుంచి గన్స్ దిగుమతి.. యాకుత్‌పుర నుంచి పోటీ చేస్తున్న జాఫర్ హుస్సేన్ మిరాజ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఆయుధాల తయారీ సంస్థ స్మిత్, వెస్సన్ బ్రాండ్ తుపాకులు కొనుగోలు చేశారు. రూ.2 లక్షలు ఖరీదైన 32 బోర్ రివాల్వర్, .32 పిస్టల్ రాఫ్టర్ ఈయన వద్ద ఉన్నాయి. రూ.19.50 లక్షల విలువైన ఆడి క్యూ3 కార్ కూడా ఉంది. మలక్‌పేట అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల వద్ద రూ.లక్ష విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన 12 బోర్ గన్లు ఉన్నాయి. బలాలకు రూ.26.69 లక్షలు ఖరీదైన ఇన్నోవా, అర్బన్ క్రూయిజర్ వాహనాలున్నాయి. బలాలకు షహనాజ్ సుల్తానా, తాహేరా ఫర్హా, సనా సుమేరా ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరి పేర్ల మీద రూ.59 లక్షలు విలువ చేసే హోండా బీఆర్వీ, టొయోటా ఫార్చ్యూనర్ కార్లున్నాయి. హరీశ్ వర్సెస్ రేవంత్.. రాజకీయ క్షేత్రంలోనే కాదు ఆయు« దాల విషయంలోనూ హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశరావుకు రూ.1.30 లక్షలు విలువ చేసే .32 ఎన్పీ బోర్ పిస్టల్ ఉండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వద్ద రూ.2 లక్షలు విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన రైఫిల్ ఉన్నాయి. రేవంత్ పేరు మీద సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజ్‌తో పాటు హోండా సిటీ కార్లు కూడా ఉన్నాయి. ఎస్బీబీఎల్ పంప్ యాక్షన్ గన్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వద్ద రూ.లక్ష విలువ చేసే రివాల్వర్, రూ.60 వేలు విలువ చేసే 12 బోర్ సింగిల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (ఎస్బీబీఎల్) పంప్ యాక్షన్ గన్ ఉంది. ఆయన భార్య శారద పేరు మీద వోల్వో ఎక్స్‌సీ 90 కారు ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ కారు విలువ రూ.71.82 లక్షలు. ఉప్పల్ అభ్యర్థి లక్ష్మారెడ్డి వద్ద రూ.1.50 లక్షలు విలువ చేసే రివాల్వర్‌తోపాటు రూ.70.82 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ 530డీ స్పోర్ట్ లగ్జరీ కారు, రూ.34.92 లక్షల ఖరీదైన ఫార్చ్యూనర్ ఉన్నాయి. సలావుద్దీన్ ఒవైసీ నుంచి.. గతంలో హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వద్ద వారసత్వంగా వచ్చిన ఆయుధాలు, కార్లున్నాయి. ప్రధానంగా కుటుంబ సెంటిమెంట్‌గా భావించే .22 పిస్టల్ ఉంది. దీని విలువ రూ.20 వేలు. దీంతో పాటు వేట కోసం వినియోగించే 30–06 స్ప్రింగ్ ఫీల్డ్ రైఫిల్ ఉంది. దీన్ని 1996లో రూ.20 వేలతో కొనుగోలు చేశారు. 2016లో రూ.11,450తో కొనుగోలు చేసిన 12 బోర్ డబుల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (డీబీబీఎల్) గన్ కూడా ఉంది. తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నుంచి బహుమతిగా వచ్చిన జీపు కారు కూడా ఉంది. దీంతో పాటు 2007లో జిప్సీ కారు, 2005లో రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన డ్యుకాటీ 900 ఎస్ఎస్ మోటార్ సైకిల్స్ కూడా అక్బరుద్దీన్ పేరు మీద ఉన్నాయి. ఈయన భార్య సాబీనా ఫర్జానా పేరు మీద మహీంద్రా స్కార్పియో వీఎల్ఎక్స్ వాహనం ఉంది. దీని విలువ రూ.12.95 లక్షలు. స్పోర్ట్స్ కారులో అజార్, టెస్లాలో శ్రీలత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వద్ద రూ.71.89 లక్షలు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ.28 లక్షలు విలువైన హోండా సీఆర్–వీ కార్లున్నాయి. హుజూర్నగర్ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.1.38 కోట్ల విలువ చేసే ఐదు లగ్జరీ కార్లున్నాయి. రూ.62.63 లక్షల విలువ చేసే టెస్లా కారుతో సహా రూ.29.15 లక్షల హ్యుందాయ్ టక్సన్, రూ.36 లక్షల ఖరీదైన ఇన్నోవా క్రిస్టా, వెంటోతో పాటు రూ.11 లక్షల విలువైన మారుతీ బాలెనో కార్లున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి వద్ద 2021 మోడల్ టెస్లా కారు ఉంది. దీని విలువ రూ.51.75 లక్షలు. రూ.18.16 లక్షల విలువైన 2016 మోడల్ ల్యాండ్ రోవర్ వాహనం కూడా ఉంది. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. -
గజ్వేల్, కామారెడ్డిలో బీజేపీదే గెలుపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలో ఆయన ఓడిపోతారని, ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈసారి ఎన్నికల్లో తండ్రీకొడుకులిద్దరూ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ రెండుచోట్ల పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈటల బరిలో ఉంటున్నాడని తెలిసినప్పటి నుంచి కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని, కామారెడ్డిలోనూ వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోతారన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీలో ఉందని తెలిపారు. బీజేపీ తరపున నామినేషన్ వేసిన రెబల్స్ దాదాపు ఉపసంహరించుకున్నారని చెప్పారు. బీజేపీ నుంచి 36 మంది, జనసేన నుంచి ముగ్గురు బీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, కాంగ్రెస్ 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందని, బీఆర్ఎస్ 23 మంది బీసీలకు టికెట్ ఇచ్చిందని చెప్పారు. రెండు జనరల్ స్థానాలను కూడా దళితులకే ఇచ్చామన్నారు. బీజేపీ 14 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా, బీఆర్ఎస్ 8 మంది మహిళలకే టికెట్ కేటాయించిందన్నారు. 17న రాష్ట్రానికి అమిత్‌షా... ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే నష్టమే తప్ప ఎలాంటి మార్పూ రాదని, కుటుంబ, అవినీతి పాలనలో ఈ రెండు పార్టీలూ మునిగిపోయాయన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, కొందరు దొంగ కంపెనీల పేరిట తప్పుడు సర్వేలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 17న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని, 18న నాలుగు జిల్లాల్లో సభలు ఉంటాయని, వరంగల్, నల్లగొండ, రాజేంద్రనగర్ అసెంబ్లీల వారీగా బీసీ సంఘాలతో సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు బానిస బతుకు మాత్రమే మిగిలిందని, అందుకే గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా చాలామంది నామినేషన్లు వేశారన్నారు. నెలరోజుల్లో పదవి దిగిపోయే కేసీఆర్ ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారని, సరైన సమయంలో భూములు చూపకుంటే అందుకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత టెక్స్టైల్ పార్క్, సైన్స్ సిటీ, కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పాతబస్తీలో నిరుపేద ముస్లింల భూములు లాక్కుని షాదీఖానాలు ఏర్పాటు చేస్తున్నారని, బీజేపీ వారికి రక్షణగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్, కుమారస్వామి తదితర ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారని, వారికి ప్రత్యేక విమానాలు పంపించి మరీ దావత్ ఇచ్చారని, వారిలో ఒక్కరైనా ఇప్పుడు మద్దతిచ్చారా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేస్తారని చెప్పారు. -
మేడిగడ్డను ముంచిన మామా అల్లుళ్లు
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్/జనగామ: ‘సాగునీటి శాఖ మంత్రులుగా ఐదేళ్లు మామ ఉన్నడు.. మరో ఐదేళ్లు అల్లుడున్నడు. మామా అల్లుళ్ల చేతిలో చిక్కి ప్రాణహిత–చేవెళ్ల అన్యాయానికి గురైంది. ఉమ్మడి ఆదిలాబాద్ మళ్లీ ఎడారైంది. మనకు నీళ్లు రాకపోవడానికి, నిర్మల్‌లో చెరువులు కబ్జాలు కావడానికి ఈ కేసీఆర్ సర్కారు కారణం కాదా.. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బోథ్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తాం..’అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పా రు. బుధవారం నిర్మల్, బోథ్, జనగామలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి, ఈ ప్రాంతంలో 1.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రయత్నం చేశామని రేవంత్‌రెడ్డి అన్నారు. దాదాపు రూ.12వేల కోట్లు ఖర్చు చేశామని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తుమ్మిడిహట్టిని మార్చి, కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టారని విమర్శించారు. రూ. 38 వేల కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరిట అంచనాలు పెంచి రూ.1.51 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన తమ్ముడు కలిసి కబ్జాలు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక కూటమిగా వ్యవహరిస్తున్నాయని, సీపీఐ, జనసమితితో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొడంగల్ ఎలా అభివృద్ధి చేస్తానో అదే స్థాయిలో నిర్మల్‌నూ అభివృద్ధి చేస్తామన్నారు. గడీల రాజ్యాన్ని కూల్చకుంటే మళ్లీ నిజాం పాలన ‘సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా సిద్ధించిన తెలంగాణలోని పరిపాలన భవన్ అయిన ప్రగతి భవన్‌లోకి ప్రజల ఎంట్రీ లేనప్పుడు ఆ ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చినా తప్పులేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన గద్దరన్న ప్రగతి భవన్‌కు వెళ్తే గేటువద్ద నిలిపేశారని చెప్పారు. రాష్ట్రం కోసం పాటుపడిన ప్రొఫెసర్ కోదండరాం, ప్రజా ప్రతినిధులు, కామ్రేడ్లు, విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలకు స్థానంలేని దొర గడి (ప్రగతి భవన్)లోకి ఆంధ్ర పెట్టుబడి దారులకు ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతున్నారన్నారు. గడీల రాజ్యాన్ని కూల్చకుంటే మరోసారి నిజాం పాలన చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కామారెడ్డి తీర్పుతో దేశ రాజకీయాల్లో కీలకమార్పులు సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పుతో దేశ రాజకీయ చరిత్రలో కీలక మార్పులు జరుగుతాయని, తీర్పు కోసం తెలంగాణ ప్రజలతోపాటు 140 కోట్ల మంది దేశ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ మాట్లాడుతూ... తెలంగాణకు పట్టిన కల్వకుంట్ల కుటుంబ చీడను వదిలించుకునే అవకాశం కామారెడ్డి ప్రజలకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కరెంటు 24 గంటలు ఇస్తున్నట్లు రుజువు చేస్తే తాను రెండు చోట్లా పోటీ నుంచి తప్పుకుంటానని, లేదంటే సీఎం ముక్కునేలకు రాయాలన్నారు. నాడు కేసీఆర్‌కు కారులో డీజిల్ పోసే పరిస్థితి లేదని, ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. గజ్వేల్‌లో రూ.వెయ్యి కోట్లతో కేసీఆర్ ఫామ్‌హౌస్ నిర్మించుకుంటే, తనయుడు కేటీఆర్ రూ.2వేల కోట్లతో జన్వాడ, పంజగుట్టలో విలాసవంతమైన భవనాలను నిర్మించుకుని పేదల గూడును విస్మరించారని మండిపడ్డారు. అలాగే స్లిప్పర్ల మీద తిరిగిన హరీశ్‌రావుకు ఆస్తులు ఎట్ల వచ్చాయో చెప్పాలని డిమాండ్‌చేశారు. కవితకు బెంజి కార్లు, పెద్ద పెద్ద భవంతులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. మైనారిటీ నాయకుడు షబ్బీర్‌ను ఓడించేందుకు కేసీఆర్ కామారెడ్డికి వచ్చాడన్నారు. అందుకే కేసీఆర్‌ను బొందపెట్టాలని తాను పోటీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. తనను ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా చిత్రీకరించేందుకు కేసీఆర్ మామ, ఒవైసీ అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ వ్యవస్థను తెస్తాం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వలంటీర్ వ్యవస్థను తెస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వలంటీర్ల ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు. ఏ బూత్‌లో ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ బూత్ వాళ్లతో కలసి భోజనం చేస్తానని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు యూసుఫ్ అలీ, ఈరవత్రి అనిల్, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పాలనలో యువత భవిష్యత్తు నాశనం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతోందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. సీఎం కేసీఆర్ అసమర్థ పాలనలో యువకులు మద్యానికి బానిసలవుతున్నారని, విద్యారంగానికి కేటాయింపులు తగ్గించి, సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయక, ఉద్యోగ పరీక్షల నిర్వహణ కూడా సరిగా చేయలేకపోవడంతో రాష్ట్ర యువత నిర్వి ర్యం అయిపోతోందని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బుధవారం పది అంశాలతో కూడిన యూత్ చార్జిషీట్‌ను విడుదల చేసింది. యూత్ చార్జిషీట్లోని అంశాలివే.. ♦ దేశంలోనే విద్యారంగానికి తెలంగాణలో కేటాయింపులు తక్కువ. 2014–15లో రాష్ట్ర బడ్జెట్లో 10.98 శాతం నిధులు విద్యకు కేటాయించగా, 2023–24లో 7.6 శాతానికి తగ్గించారు. ♦ కేజీ టు పీజీ విద్యను 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఈ తొమ్మిదేళ్లలో ఒక్క కొత్త తరగతి గదిని కూడా నిర్మించలేదు. ఒక్క గంభీరావుపేటలో మాత్రమే కేజీ టు పీజీ క్యాంపస్‌ను నిర్మించారు. ♦ సీఎస్ఆర్ నిధులతో ఒక్క తరగతి గదినయినా కట్టించాలని కార్పొరేట్ కంపెనీలను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ♦ ప్రతి ఇంటికీ ఉద్యోగం అని కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. కేవలం 60 శాతం ఉద్యోగులతో ఈ 60 శాతం సర్కార్ నడుస్తోంది. ♦ ఉద్యోగ పరీక్షలు రాసే లక్షలాది మంది యువత విశ్వాసాన్ని టీఎస్పీఎస్సీ కోల్పోయింది. ♦ పదో తరగతి నుంచి టీఎస్పీఎస్సీ పరీక్షల వరకు నిర్వహణ వైఫల్యంతో 2014–21 మధ్య కాలంలో తెలంగాణలో 3,600 మందికి పైగా యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ♦జాబ్ కేలండర్ లేకపోవడంతో ఒకే సమయంలో వివిధ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు. ♦ రూ.4,592 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుండటంతో వేలాది మంది విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు సరి్టఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదు. ♦యూనివర్సిటీల్లో 2/3వ వంతు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వర్సిటీలను నాశనం చేస్తున్నారు. ♦కేసీఆర్ అసమర్థ పాలనతో యువత మద్యానికి, డ్రగ్స్‌కు, జూదానికి బానిసలవుతున్నారు. వారి భవిష్యత్తు నాశనమవుతోంది. -
మొత్తం ఓటర్లు 3.26 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. గతనెల 5న ప్రకటించిన జాబితాతో పోలిస్తే.. ఐదో తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు కొత్తగా 8,70,072 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విడుదల చేసిన జాబితా ప్రకారం అందులో 3,26,02,799 ఓటర్లు ఉన్నారు. వయసు వారీగా కూడా ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. కొత్తగా చేరిన ఓటర్ల జాబితాను అక్టోబర్‌లో ప్రకటించిన ఓటర్ల జాబితాకు అనుబంధంగా జత చేయనున్నారు. 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య కోటీ 67 లక్షల 394 మంది ఉండగా, 40 ఏళ్ల పైబడిన వారు 1,58,73,405 మంది ఉన్నట్లు తేలింది. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేలా రాజకీయ పార్టీలతోపాటు ఎన్నికల సంఘం కూడా ఓటు విలువను తెలియ చెప్పేలా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. -
ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. జస్టిస్ సుధీర్‌కుమార్‌ను మద్రా స్ హైకోర్టుకు, జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వీరితోపాటు ఇతర రాష్ట్రాల కు చెందిన మరో ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకికూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తు ల సంఖ్య (సీజేతో కలిపి) 42 కాగా, ప్రస్తుతం 28 మంది ఉన్నారు. జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ సుధీర్‌కుమార్ బదిలీతో ఆ సంఖ్య 26కు చేరగా.. ఖాళీల సంఖ్య 16కు పెరిగింది. చదవండి: కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్ -
మందకృష్ణ మాదిగ 25 కోట్లు అడిగారు: కేఏ పాల్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే తమ పార్టీకి సింబల్ ఇవ్వలేదని, దీని పై హైకోర్టుకు వెళ్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పా డాలన్నారు. ‘మా పార్టీలో చేరాలని మందకృష్ణ మాదిగను కోరితే, రూ. 25 కోట్లు అడిగారని, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన అమ్ముడుపోయారు’అని ఆరోపించారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన మాదిగల బహిరంగసభ నిమిత్తం మందకృష్ణకు రూ.72 కోట్లు ముట్టాయని, ఎంపీ పదవి ఇస్తారని ఆశతోనే ఆయన అమ్ముడుపోయారని విమర్శించారు. మాదిగలకు మోదీ ఇన్నిరోజుల్లో చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా అని కేఏ పాల్ నిలదీశారు. చదవండి: కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్ -
కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అ భ్యరి్థగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్.. సీఎం కేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చినట్టుగా తన అఫిడవిట్లో పేర్కొన్నా రు. అదేవిధంగా రామలింగారెడ్డికి రూ.10లక్షలు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.1.50కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. మొత్తంగా రూ.23.99 కోట్లను వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లుగా పేర్కొన్న వివేక్ ఆయనకు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో ఈ మాజీ ఎంపీ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో రూ.377కోట్లు ఉండగా, విశాఖ కంపెనీతో సహా పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు. రెండో స్థానంలో పొంగులేటి: ఆ తర్వాత పాలేరు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.460కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎ కేసీఆర్ తన అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తులు రూ.59కోట్లు ఉన్నట్లు, సొంత కారు కూడా లేదని పేర్కొనడం తెలిసిందే. అయితే తాను మాజీ ఎంపీ వివేక్‌కు రూ.1.06కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్‌కు మ«ధ్య లావాదేవీలు జరిగినట్లు, గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఈ డబ్బులు ఇచి్చనట్లు పార్టీ నాయకులు అనుకుంటున్నారు. చదవండి: తెలంగాణకు మోదీ గ్యారంటీలు -
చట్టం చేసైనా సరే ఎస్సీ వర్గీకరణ: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, వర్గీకరణను అమలు చేసే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టుకుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సానుకూలంగా ఉందని సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో పాటు దీనిపై ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, వేగవంతంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఒకవేళ కోర్టు ద్వారా ఇది సాధ్యం కాకపోతే చట్ట పరంగా చేసేందుకు కూడా బీజేపీ, కేంద్రం కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. తాజాగా కేంద్రం ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్ కమిటీ వర్గీకరణ చేయాలా..? వద్దా..? అన్న అంశంపై కాదని, వర్గీకరణపై కోర్టు కేసులు, ఇతర ప్రాధాన్యతాంశాలను రోజువారీ పర్యవేక్షించేందుకేనని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్సే మొదటి ముద్దాయి సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని న్యాయం, ధర్మం గురించి మాట్లాడిన తీరు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఒక సమస్యపై చొరవ తీసుకుని చర్చిస్తే దానిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డుమీద ఈకలు పీకినట్టుగా ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చాక 75 ఏళ్లలో ఎస్సీ వర్గీకరణపై వివిధ కమిటీలు వేయగా, అనేక పోరాటాలు జరిగాయని చెప్పారు. దీనికి అనుకూలమంటూ కంటి తుడుపు చర్యలు చేపట్టడమే తప్ప ఎవరూ దీని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ విషయంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్సే మొదటి ముద్దాయి అని పేర్కొన్నారు. ఉషా మెహ్రా కమిషన్ సమర్పించిన నివేదికను కనీసం చదవకుండా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని ధ్వజమెత్తారు. తీర్మానంతో చేతులు దులుపుకున్న బీఆర్ఎస్ పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి దీని సాధనకు ఎలాంటి కృషి చేయలేదని, పార్లమెంట్లో సైతం బీఆర్ఎస్ ఎంపీలు ఏనాడూ ఈ అంశాన్ని లేవనెత్తలేదని ధ్వజమెత్తారు. ఈ సమస్యపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించిందని, ప్రధాని మోదీ సూచనలతో గతనెల 2న ఢిల్లీలో ఎమ్మారీ్పఎస్ నేతలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులతో అమిత్‌షా భేటీ అయ్యాక ఈ అంశంపై కదలిక వచ్చిందని చెప్పారు. కేంద్రం వర్గీకరణకు సానుకూలంగా ఉందని గతనెల 2న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారని, ఏడుగురు జడ్జీల బెంచ్‌ను వేయాలని కోరగా గతనెల 10న సీజే రాజ్యాంగ ధర్మాసనాన్ని వేశారని తెలిపారు. మోదీ ఉంటే ఏదైనా సాధ్యమనే దానికి ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్, రామజన్మభూమి ఆలయ నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ నుంచి భారతీయుల సురక్షిత తరలింపు వంటివి నిదర్శనమని కిషన్‌రెడ్డి చెప్పారు. -
772 సెట్ల నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేసన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 4,798 మంది అభ్యర్థులు మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. పరిశీలన అనంతరం 3,307 సెట్ల నామినేషన్లను స్వీకరించగా, మరో 772 సెట్ల నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన సెట్ల పరిశీలకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి వరకు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఈ నెల 15తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. – ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 73 నామినేషన్లను తిరస్కరించారు. నాగార్జునసాగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి.. ప్రపోజర్స్ సంతకాలు సరిపడా చేయించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలుచేసిన మోత్కుపల్లి నర్సింహులు అఫిడవిట్ అందజేయకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. – ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలుచేసిన పలువురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. -
తెలంగాణకు మోదీ గ్యారంటీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ‘మోదీ గ్యారంటీలు’పేరిట భరోసా కల్పించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా ఎన్నికల మేనిఫెస్టోను పకడ్బందీగా రూపొందిస్తోంది. అధికార బీఆర్ఎస్ మేనిఫెస్టో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలకు భిన్నంగా బీజేపీ మేనిఫెస్టో ఉండబోతోందని పార్టీనేతలు చెబుతున్నా రు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ లు, యువత, రైతులు.. ఇలా విభిన్నవర్గాలకు ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. అదనంగా సెంటిమెంట్‌ను జోడించి మరింత ఆకర్షణీయంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముసాయిదాను నాయకత్వం సమగ్రంగా పరి శీలించిన తర్వాత ఈ నెల 17న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు పార్టీవర్గాల సమాచా రం. రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తర పున ఎన్నికల ప్రచారంకోసం అమిత్ షా వస్తున్న సందర్భంగా హైదరాబాద్ లోని మీడియా సెంటర్లో బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తారని చెపుతున్నారు. ఈ పర్య టన సందర్భంగా నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో నిర్వహించే బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారని పార్టీ నాయకులు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక, అన్ని సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చాక బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని కొనసాగించడంలో భాగంగా ఈ నెల 17న ప్రకటన ఉంటుందని పార్టీ నాయకులు చెపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు ఇలా.. – అర్హులైన అందరికీ ఉచితంగా విద్య, వైద్యం అమలుకు చర్యలు – యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్పీఎస్సీ పరీక్షలకు జాబ్ కేలెండర్ – ప్రతి వ్యక్తికి జీవిత బీమా వర్తింపు – ఆయుష్మాన్ భారత్ కింద రూ. 10 లక్షల దాకా ఉచిత వైద్యం – వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,100 – వివాహిత మహిళలకు ఏడాదికి రూ.12 వేల భృతి – వంట గ్యాస్ సిలిండర్ రూ.500 కే అందించేలా చర్యలు – తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు – రాష్ట్రవ్యాప్తంగా జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ చౌకగా మందులు అందుబాటులోకి తేవడం – వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ. 20వేలు చెల్లింపు – దేవస్థానాలు, తీర్థస్థానాల పర్యాటకానికి ఊతం (రెలీజియస్ టూరిజం) – ఐఐటీ, ఎయిమ్స్ తరహాలో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల ఏర్పాటు – ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి పేద వ్యక్తికి ఇల్లు – ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు –మహిళా సంఘాలు, రైతులకు వడ్డీలేని రుణాలు – రెండు పెన్షన్లు (ఇంట్లో వృద్ధులైన భార్యా, భర్తలు ఇద్దరికీ వర్తింపు) – ప్రమాదవశాత్తు చనిపోతే రైతులకే కాకుండా కౌలు రైతులు, రిక్షాకార్మికులు, ఇతర వర్గాల పేదలకు ప్రమాదబీమా రూ. 5 లక్షలు చెల్లింపు – జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు ప్రజల్లోకి బీసీ సీఎం నినాదం.. బీసీ సీఎం నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు.. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటిదాకా సీఎం పదవిని బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి చేపట్టకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలని బీజేపీ భావిస్తోంది. అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు బీసీ నాయకుడిని సీఎం చేసే పరిస్థితే ఉత్పన్నం కాదని, అందుకు భిన్నంగా బీజేపీ జాతీయ నాయకత్వం బీసీ నినాదాన్ని తలకెత్తుకోవడంతో పాటు బీసీ నేతను సీఎంగా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అన్ని వర్గాల వారు, ముఖ్యంగా బీసీ వర్గాల వారు మద్దతు తెలపాలని కోరనుంది. బీసీలకు టికెట్లు కేటాయించే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేవలం మొక్కుబడిగా వ్యవహరిస్తే, బీజేపీ 36 సీట్లు బీసీలకు కేటాయించినందున వచ్చేఎన్నికల్లో ఆదరించాలని కోరనుంది. -
మాట్లాడితే పంచ్ పడాలంతే..!
ఎన్నికల ప్రచారంలో వాడీవేడి కొటేషన్లు ‘‘నాకు ఏం మాట్లాడినా పంచ్ ఉండాలంతే.. పంచ్ లేకుంటే కుదరదంతే’ అని ’ఆర్య’ సినిమాలో సునీల్ చేసిన హడావుడి బాగా పేలింది. ఇప్పుడు ప్రచారంలో పంచ్ డైలాగ్‌లు లేకుంటే పస ఉండదని భావిస్తున్న పార్టీల అభ్యర్థ్ధులు మంచి మంచి కొటేషన్లతో పంచ్‌లు విసురుతున్నారు. సోషల్ మీడీయాలో వాటిని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట :ఈ నెల 30న అందరి వేళ్లకు ఇంక్.. రాష్ట్రమంతా పింక్ అంటూ, అప్పుడు ఎట్లుండే తెలంగాణ..ఇప్పుడు ఎట్లయ్యింది తెలంగాణ అని బీఆర్ఎస్ అభ్యర్థుల కొటేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు కాకముందు 2014లో ఎలా ఉండే.. 2023లో ఎలా ఉందని బీఆర్ఎస్ అభ్యర్థులు డైలాగ్ కొటేషన్‌తో ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు కాంగ్రెస్, బీజేపీ కొటేషన్లు కూడా సోషల్ మీడియాలో ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకున్న కొటేషన్లు కొన్ని.. అన్నా... జిల్లాజిల్లాకూ ఐటీ టవర్.. మా గుండెల్లో ఉంటాడు కేటీఆర్ ఫరెవర్ మా అన్నను ప్రేమిస్తారు మహబూబ్‌నగర్ క్రౌడ్.. డెవలప్మెంట్ ఆగొద్దంటే రావాలి మా అన్న శ్రీనివాస్ గౌడ్ మర్చిపోతామా సాయన్న చేసిన సాయమూ.. కంటోన్మెంట్లో లాస్యమ్మ గెలుపు ఖాయమూ.. బాల్కొండలో ఎగురబోతుంది గులాబీ జెండా... ప్రశాంత్ అన్న మన అందరికీ అండా దండా.. ఎవరికి పడితే వాడికి కొట్టం జిందాబాద్... మా గోవర్న రూరల్ నిజాంబాద్ కాంగ్రెస్ బీజేపీ అందరు పక్కకు జరగాలి... మెదక్‌లో భారీ మెజారిటీ రాబోతుంది మా పద్మక్క కాంగ్రెస్ మారుస్తుంది తెలంగాణ భవిష్యత్ ఇప్పుడు ఇస్తుంది 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ బాగుండాలి ఐదేళ్ల జీవితం.... రావాలి ఐదు వేళ్ల హస్తం కాంగ్రెస్ మనకు అండ దండ... ఇస్తుంది రూ. 500కే గ్యాస్ బండ కాంగ్రెస్ వస్తే ఎన్నో ఉపయోగాలు.... యువతకు దొరుకుతాయి లక్షల్లో ఉద్యోగాలు తెలంగాణలో కమలం జెండా ఎగరాలి.. బీజేపీ గెలవాలి... బీసీ సీఎం కావాలి బద్దలు కొడదాం దొరల గడీ సాలు దొర... సెలవు దొర. -
17న రాష్ట్రానికి రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 17న రాష్ట్రానికి రానున్న ఆయన వారంపాటు ఇక్కడే బస చేసే అవకాశముంది. ఈ మేరకు రాహుల్‌గాంధీ షెడ్యూల్‌ను టీపీసీసీ రూపొందిస్తుండగా, ఈనెల 17న ఆయన వరంగల్, పాలకుర్తి, భువనగిరిల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈనెల 16 తర్వాత ఎన్నికల ప్రచారాన్ని హోరె త్తించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్‌తో పాటు ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేలను కూడా రంగంలోకి దించనుంది. రాహుల్ తెలంగాణలో ఉన్నప్పుడే ఏదో ఒక రోజు ఆ ఇద్దరూ కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రెబెల్స్‌కు బుజ్జగింపులు రెబెల్స్‌గా బరిలోకి దిగిన పార్టీ నేతలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ సోమవారం పలువురు రెబెల్స్‌తో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రంలో 15 చోట్ల రెబెల్స్ బరిలో ఉన్నట్లు నాయకత్వం గుర్తించిందని, వారితో సంప్రదింపులు మంగళవారం పూర్త వుతాయని సమాచారం. రెబెల్స్ పోటీలో లేకుండా చూస్తామని పార్టీ వర్గాలంటున్నాయి. -
అందరి దృష్టి కామారెడ్డిపైనే..
ఎస్. వేణుగోపాలచారి: కామారెడ్డిలో ఏం జరుగుతుంది.. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి అదే. తెలంగాణ తెచ్చిన నేతగా, ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని అధిరోహించాలన్న పట్టుదలతో కేసీఆర్‌లో కామారెడ్డిలో బరిలోకి దిగగా, ఆయనపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీకి దిగడమే చర్చకు ప్రధాన కారణం. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు జనం నాడి పట్టేందుకు సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి. కేసీఆర్, రేవంత్‌రెడ్డితోపాటు బీజేపీ నుంచి స్థానికంగా గట్టి పట్టు సంపాదించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. మూడ్ ఎలా ఉంటుందో.. సాధారణంగా వీవీఐపీలు పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రజల నాడి త్వరగా బయటపడుతుంది. కానీ ఇక్కడ రెండు పార్టీల కీలక నేతలు పోటీ చేస్తుండడం, వారికితోడు స్థానికుడైన బలమైన నాయకుడు బరిలో ఉండడంతో పోటీ ఎవరి మధ్యన ఉంటుందన్నదానిపై ఇప్పటికైతే క్లారిటీ రావడం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే అభివృద్ధి పరుగులు పెడుతుందన్న భావన కొన్ని సెక్షన్లలో ఉండడం సహజం. అధికార బీఆర్ఎస్పై ఉన్న ఒకింత వ్యతిరేకత ఓట్లను ప్రతిపక్ష పార్టీలు రెండూ పంచుకుంటే అధికార పార్టీకి లాభం జరుగుతుందనే అంచనాలు ఉంటాయి. పేగుబంధం సెంటిమెంట్‌తో కేసీఆర్ రెండు పర్యాయాలుగా గజ్వేల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తో పాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. తాను పోటీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఐదారు నియోజక వర్గాలపై ప్రభావం చూపవచ్చనే ఉద్దేశంతో రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారు. 44వ నంబరు జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్‌కు కేవలం గంటన్నరలో చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. దీనికి తోడు కేసీఆర్ తల్లి పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఈ ప్రాంతంతో ఆయనకు పేగుబంధం ఉన్నది. ఇక్కడ పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్ఛిన దరిమిలా కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించారు. సర్వేల మీద సర్వేలు... ఇప్పుడు కామారెడ్డి సర్వే రాయుళ్లకు కేరాఫ్ నిలిచిందంటే అతిశయోక్తి కాదు. జనం నాడి పట్టేందుకు ఓ పక్క రాజకీయ పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటుండగా, మరో పక్క నిఘా వర్గాలు, మీడియా సంస్థలు పోటాపోటీగా సర్వేలు చేస్తున్నాయి. కాటిపల్లి ’లోకల్’ బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన జెడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గత నాలుగైదేళ్లుగా నియోజక వర్గంలో నిరంతరం ప్రజా సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, మాస్టర్ ప్లాన్‌తో నష్టం జరుగుతోందని ఆందోళన చెందిన రైతుల కోసం ఈయన అండగా అండగా నిలిచి ఉద్యమానికి నాయకత్వం వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద పోరాటమే చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో జనంతో మమేకమైన వెంకటరమణారెడ్డి తనకు స్థానికులు ఓట్లు వేసి పట్టం కడతారని ఆశిస్తున్నారు. ఆ మేరకు రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టోను అమలు చేస్తానని ప్రకటించాడు. సీఎం పోటీ చేస్తున్నా.. వెరవకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సవాల్ చేసి మరీ బరిలోకి దిగిన రేవంత్... అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన జరిగే మాటల యుద్ధంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎంకు దమ్ముంటే కొడంగల్‌కు వచ్చి నిలబడమని లేదంటే, తానే కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తానంటూ పలుమార్లు సవాళ్లు విసిరారు. సీఎం గానీ, ఆయన పార్టీ నేతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ సవాల్ విసిరిన రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. -
అందుకే మమ్మల్ని కాంగ్రెస్ వదిలేసింది
బొల్లోజు రవి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ మిర్యాలగూడ స్థానం సహా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పింది. మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే మద్దతు ఉంటుందని, లేకుంటే ఉండదని సీపీఎం తేల్చిచెప్పింది. దీంతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం సొంతంగా బరిలోకి దిగింది. కాంగ్రెస్‌తో పొత్తు విచ్ఛిన్నం, కాంగ్రెస్‌తో సీపీఐ వెళ్లిపోవడం, ఒంటరిపోరు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు విఫలమయినట్లేనా? ఇంకా ఏమైనా ఆశలున్నాయా? కాంగ్రెస్‌తో పొత్తు కథ ముగిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక పొత్తు ఉండదు. ఎలాంటి ఆశలు కూడా పెట్టుకోలేదు. మేం ప్రకటించిన 19 స్థానాల్లో అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడుగుతారు. మిర్యాలగూడను ఒకవేళ వాళ్లు మాకిచి్చనా కాంగ్రెస్ పార్టీ తన అభ్యరి్థని ఏదో రకంగా రంగంలోకి దింపేది. అయినా ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు లేకుండా పొత్తు ఎలా ఉంటుంది. కాంగ్రెస్, వామపక్షాలు విడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌కు నష్టమే కదా... అలాంటిది మీతో పొత్తు విషయంలో ఎందుకు ఇలా చేస్తుందని భావిస్తున్నారు? మాతో ప్రయోజనం లేదని కాంగ్రెస్ మమ్మల్ని వదిలేసింది. పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు నష్టమట. మాకు సీట్లు ఇస్తే ఓడిపోతామని, అదే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలుస్తారని వారి నమ్మకం. మేము పోటీ చేయడం వల్లే వారికి లాభమట. మాతో చర్చల సందర్భంగా కూడా కాంగ్రెస్ నాయకులు ఈ విధంగానే మాట్లాడారు. అందుకే పొత్తు విషయంలో ముందుకు రావడంలేదు. సీపీఐకి కొత్తగూడెం స్థానంలో మద్దతు ఇస్తారా? అలాగే మీరు పోటీ చేసే 19 స్థానాల్లో మద్దతు కోరతారా? కొత్తగూడెంలో సీపీఐ తరపున పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావుకు మద్దతు ఇస్తున్నాము. అయితే మేం పోటీ చేసే 19 చోట్ల సీపీఐ మద్దతు ఇస్తుందని నేననుకోను. ఎందుకంటే సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా పొత్తులో భాగంగానే కొత్తగూడెం స్థానం కేటాయించారు. కాబట్టి సీపీఐ మాకు మద్దతు ఇవ్వదు. ఒకవేళ వారి ఓటర్లు ఎక్కడైనా మాకు మద్దతు ఇస్తే అది వారిష్టం. బీఆర్ఎస్ది అవకాశవాదమని మీరు భావిస్తున్నారా..? బీఆర్ఎస్గానీ, ఇతర ప్రాంతీయ పార్టీలుగానీ అవకాశవాదంతోనే వ్యవహరిస్తాయి. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దెదించడమే తమ లక్ష్యమని బీజేపీ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఆ ఊపులో అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న వాతావరణాన్ని సృష్టించాలని భావించింది. ఆ సమయంలో కేసీఆర్‌కు మరో మార్గం లేదు. అందుకే బీజేపీని వ్యతిరేకించారు. ఆ తర్వాత కర్నాటక ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. కేసీఆర్ మూడ్ మారిపోయింది. బీజేపీతో ప్రమాదం లేదని అర్ధమైంది. ఈ ఎన్నికల తర్వాత సీట్లు తక్కువైతే బీజేపీ, ఎంఐఎం మద్దతు తీసుకునే పరిస్థితి ఉంది. అందుకే కమ్యూనిస్టుల అవసరం కేసీఆర్‌కు లేదు. అవకాశవాదంతో రాజకీయాలను మార్చారు. ఈ ఎన్నికల్లో ఒక్క సీటయినా సాధిస్తారా..? గెలుస్తామన్న నమ్మకంతోనే 19 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాం. అన్ని చోట్లా గెలవాలన్నదే మా లక్ష్యం. -
అదే బరి.. వీరులు వారే..
మేకల కళ్యాణ్ చక్రవర్తి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగడమంటే ఆషామాషీ కాదు. పోటీ చేసి గెలవాలంటే అంత ఈజీ కాదు. పదేపదే పోటీ చేస్తుంటే..ఓసారి గెలిచి మరోమారు ఓడిపోతుంటే.. పదే పదే గెలుస్తుంటే.. లేదా పదే పదే ఓడిపోతుంటే.. ఆ ఉత్కంఠ అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. అలా పదేపదే పోటీ చేయడం కత్తిమీద సాము లాంటిదే. పోటీ చేసిన వారే పదేపదే పోటీ చేయడం.. ఒకే నియోజకవర్గంలో నేతలు రెండు నుంచి ఐదు సార్లు తలపడితే వారినే ‘పాతకాపు’లంటారు. నియోజకవర్గం మారినా, పార్టీలు మారినా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ వారి మధ్యనే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు అలా పాతుకుపోతారంతే. ఇలాంటి పాతకాపులు ఈసారి కూడా హోరాహోరీ తలపడుతున్నారు. చిరకాల ప్రత్యర్థులపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతకాపుల పోటాపోటీ ఎలా ఉందంటే..! నిజామాబాద్ బోధన్‌లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి హోరాహోరీ తలపడిన షకీల్ అహ్మద్, సుదర్శన్‌రెడ్డి ఈసారి కూడా అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ రూరల్లోనూ పాతకాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. 2018లో నిల్చున్న బాజిరెడ్డి గోవర్ధ్దన్ (బీఆర్ఎస్), భూపతిరెడ్డి (కాంగ్రెస్)లు ఈసారీ బరిలో ఉన్నారు. బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్)పై గత ఎన్నికల్లో బీఎస్పీ పక్షాన తలపడిన సునీల్‌కుమార్ ఈసారి కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. ఆదిలాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు పాతకాపులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తలపడిన కోనేరు కోనప్ప (బీఆర్ఎస్)పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీశ్ ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్), జి.వినోద్‌లు మళ్లీ పోటీ పడుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గా రంగంలో ఉన్నారు. మంచిర్యాలలో ఎన్.దివాకర్‌రావు (బీఆర్ఎస్), కె.ప్రేమ్‌సాగర్‌రావు (కాంగ్రెస్) మళ్లీ అవే పార్టీల తరఫున రంగంలోకి దిగారు. నిర్మల్‌లో వరుసగా ఏడోసారి ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తుండగా ఆయనపై రెండు వరుస ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన మహేశ్వర్‌రెడ్డి, కూచాడి శ్రీహరిరావులిద్దరూ ఈసారి ఆయనపై బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి పోటీలో నిలిచారు. ఖమ్మం పినపాకలో గత ఎన్నికల్లో రేగా కాంతారావు (కాంగ్రెస్), పాయం వెంకటేశ్వర్లు (బీఆర్ఎస్) నుంచి పోటీ చేయగా, ఇప్పుడు కూడా వీరే తలపడుతున్నా పార్టీలు మారారు. ఇల్లెందులోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన హరిప్రియానాయక్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మధిరలో గత నాలుగో ఎన్నికల్లోనూ మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్రాజ్లే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. భట్టి కాంగ్రెస్ అభ్యర్థి గా నాలుగుసార్లు రంగంలో ఉండగా, కమల్‌రాజ్ మాత్రం రెండుసార్లు సీపీఎం నుంచి, రెండోసారి బీఆర్ఎస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రాచలం నుంచి పొదెం వీరయ్య (కాంగ్రెస్), తెల్లం వెంకట్రావు (బీఆర్ఎస్) వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. మెదక్ అందోల్ నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్), చంటి క్రాంతి కిరణ్ (బీఆర్ఎస్)లు వరుసగా రెండోసారి బరిలో ఉన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి (కాంగ్రెస్), చింత ప్రభాకర్ (బీఆర్ఎస్)లు వరుసగా నాలుగోసారి అమీతుమీ తేల్చుకుంటున్నారు. పటాన్చెరులోనూ 2018 ఎన్నికల్లో తలపడిన మహిపాల్‌రెడ్డి (బీఆర్ఎస్), శ్రీనివాస్‌గౌడ్ (కాంగ్రెస్)లే 2023 ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నారు. వరంగల్ డోర్నకల్‌లో రెడ్యానాయక్ (బీఆర్ఎస్), రామచంద్రునాయక్ (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్), పెద్ది సుదర్శన్‌రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి తలపడుతున్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి (బీఆర్ఎస్), గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్) రెండోసారి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి, సత్యనారాయణరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరిలో వరుసగా రెండోసారి మైనంపల్లి హనుమంతరావు, ఎస్.రాంచందర్‌రావు (బీజేపీ)ల నడుమ పోరు జరుగుతోంది. మైనంపల్లి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దిగగా, ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద (బీఆర్ఎస్), కూన శ్రీశైలం గౌడ్ మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. శ్రీశైలం గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం జనరల్ స్థానంగా మారిన తర్వాత జరుగుతున్న నాలుగు ఎన్నికల్లోనూ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే గతంలో బీఎస్పీ నుంచి, ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మల్రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేయగా, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటున్నారు. పరిగిలో కొప్పుల మహేశ్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి మధ్య బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వరుసగా రెండోసారి పోటీ జరుగుతోంది. వికారాబాద్లోనూ మెతుకు ఆనంద్ (బీఆర్ఎస్), గడ్డం ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్) రెండోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరీంనగర్ జగిత్యాల నుంచి సంజయ్‌కుమార్ (బీఆర్ఎస్), టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) వరుసగా మూడోసారి తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చెరోసారి విజయం సాధించగా, ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)పై అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్) వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఐదు ఎన్నికల్లో ఓటమిపాలైనా గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంథనిలో పుట్టా మధు (బీఆర్ఎస్), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్) వరుసగా నాలుగోసారి ఢీ కొడుతున్నారు. పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్), విజయరమణారావు (కాంగ్రెస్) వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ (బీఆర్ఎస్)పై బండి సంజయ్ (బీజేపీ) వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. చొప్పదండిలోనూ సుంకె రవిశంకర్ (బీఆర్ఎస్), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ నెలకొంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ (బీఆర్ఎస్)పై పాతకాపు కె.కె.మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) మరోమారు పోటీ చేస్తున్నారు. ఒక్కసారి మినహా గత నాలుగు ఎన్నికల్లోనూ ఆ ఇద్దరే ముఖాముఖి తలపడటం గమనార్హం. నల్లగొండ దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గంలో బాలూనాయక్ (కాంగ్రెస్), రవీంద్రకుమార్ (బీఆర్ఎస్) రెండోసారి తలపడుతున్నారు. కోదాడలో పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), బొల్లం మల్లయ్య (బీఆర్ఎస్), సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్ఎస్), దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్)లు వరుసగా రెండుసార్లు తలపడుతున్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి మధ్య మూడోసారి పోటీ జరుగుతోంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), కె. ప్రభాకర్‌రెడ్డి (బీఆర్ఎస్) మధ్య కూడా వరుసగా మూడోసారి పోటీ జరుగుతోంది. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి (బీఆర్ఎస్), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్య కూడా వరుసగా రెండోసారి సమరం జరుగుతోంది. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్యల నడుమ మూడోసారి పోటీ జరుగుతోంది. అయితే, గత ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేసిన పార్టీలు వేర్వేరు కావడం గమనార్హం. మహబూబ్‌నగర్ కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్ఎస్) నడుమ రెండోసారి యుద్ధం జరుగుతోంది. అచ్చంపేటలో గువ్వల బాలరాజు (బీఆర్ఎస్), చిక్కుడు వంశీకృష్ణ (కాంగ్రెస్) కూడా వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కల్వకుర్తి నుంచి జైపాల్‌యాదవ్ (బీఆర్ఎస్), టి.ఆచారి (బీజేపీ) కూడా రెండోసారి పోటీ పడుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), హర్షవర్దన్‌రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీ చేసిన పార్టీల నుంచి కాకుండా మరో పార్టీ నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. -
నేటి రాజకీయాల్లో సామాజిక దృక్పథమేదీ?
పార్టీ టికెట్ సాధన మొదలు, ఎన్నికల ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రలోభాల పర్వం వరకు మొత్తం రూ.కోట్ల డబ్బు ముడిపడటంతో పోటీచేసే వారిలో సామాజిక కోణం, సేవాదృక్పథం లోపిస్తోంది. రియల్ వ్యాపారులు, పెద్దఎత్తున భూములు కబ్జా చేసినవారు, ఇతర వ్యాపారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే వారి వద్ద అడ్డగోలుగా అక్రమ సంపాదన పెరిగి రాజకీయాల్లోకి వస్తుండటంతో ఎన్నికల్లో మామూలు వ్యక్తులు, సేవా దృక్పథం ఉన్నవారు పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది’ అని ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ కె.గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో కె.గోవర్ద్ధన్‌రెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు. 1985 ఎన్నికల్లో రూ.లక్షన్నర ఖర్చుతో పోటీచేశా.. నేను ఓ డాక్టర్‌గా, ఓ సామాజిక కార్యకర్తగా దరఖాస్తు చేసుకుంటే.. 1985లో మలక్‌పేట నుంచి పోటీచేసేందుకు అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మొత్తం అయిన ఖర్చు కేవలం రూ.లక్షన్నర (పార్టీ ఇచ్చిన రూ.50 వేలు కలిపి). అప్పటి సీఎం నాదెండ్ల భాస్కరరావు, బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డితో పోటీపడి ఓటమి చవిచూశాను. ఆంధప్రదేశ్ ఫ్లోరోసిస్ విమోచన సమితి అధ్యక్షుడిగా, వివిధ సామాజిక సంఘాల అధ్యక్షుడిగా పనిచేశాను. సాగర్‌లో అణువిద్యుత్ కేంద్రం వద్దని రాజీవ్‌ని కోరాను.. నాగార్జునసాగర్‌లో అణువిద్యుత్ కేంద్రం పెడతారని ప్రచారం కావడంతో వెంటనే స్పందించాను. అప్పటి నల్లగొండ, ప్రకాశం తదితర జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉన్నందున ఈ కేంద్రం పెడితే పర్యవసానాలు వివరిస్తూ దీనిని విరమించుకోవాలంటూ, నేరుగా ప్రధాని రాజీవ్‌గాంధీ కార్యాలయానికి లేఖ రాశాను. రెండువారాల్లోనే ప్రధాని సెక్రటరీ దూబే నుంచి ఆ లేఖ అందినట్టుగా జవాబు వచ్చింది. మూడునెలల తర్వాత ముంబైలోని అణు విద్యుత్ విభాగం డైరెక్టర్ విజయ మనోరమ నుంచి మరో వివరణ లేఖ (పీఎంఓ నుంచి నా వినతిపత్రం కాపీ వారికి అందాక) వచ్చింది. సమీప భవిష్యత్‌లో ఈ కేంద్రాన్ని పెట్టే ఉద్దేశం లేదని, పెట్టదలిస్తే అందరి అభిప్రాయాలు తీసుకుని, పబ్లిక్ హియరింగ్ నిర్వహించాకే దానిని చేపడతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో తొలి ప్రజాప్రయోజన వ్యాజ్యం నాదే... 1991లో సిరీస్ ఇండస్ట్రీ కారణంగా భూగర్భజలాలు కలుషితం కావడంపై ఉమ్మడి ఏపీ హైకోర్టులో నేను మొట్టమొదటి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాను. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సీజే జస్టిస్ భగవతి సూచనలు జారీచేసిన మూడు నెలల్లోనే సీనియర్ న్యాయవాది, పీయూసీఎల్ నేత ప్రతాపరెడ్డి ద్వారా పిల్ దాఖలు చేశాను. కేసు జస్టిస్ రామాంజనేయులునాయుడు బెంచ్‌కు వెళ్లగా 24 గంటల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలకు మంచినీటిని పంపిణీ చేసేలా సిరీస్ సంస్థ ద్వారా ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టారు. ఎఫ్లూయెంట్స్‌ను ట్రీట్ చేసి బయటకు పంపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటం... రేడియాలజిస్ట్‌గా మొదటి ప్రైవేట్ క్లినిక్ పెట్టాక...నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ దాకా ఎక్స్‌రే యూనిట్లే లేకపోవడంతో కాళ్లు వంకర అని, నడవలేకపోతున్నామని నా దగ్గరకు చాలా మంది వచ్చేవారు. అన్నిఎక్స్‌రేలలో తెల్లటి చారలు కనిపించడంతో దానిపై పరిశోధన జరిపితే ఫ్లోరోసిస్ జబ్బు అని తేలింది. ఎముకల్లో ఫ్లోరిన్ జమ కావడంతో ఈ జబ్బుకు కారణమని స్పష్టమైంది. ఇతరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఫ్లోరోసిస్ విమోచన సమితిని ఏర్పాటు చేసి దాని ద్వారా చైతన్య కార్యక్రమాలు చేపట్టాను. 30 ఏళ్లకే ముసలితనం అనే వీడియోను చిత్రీకరించి ఫ్లోరోసిస్‌పై విస్తృత ప్రచారం చేశాము. సాగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చే కృష్ణా జలాల్లో మార్గ మధ్యలో ఉన్న ఫ్లోరోసిస్ ప్రభావిత దాదాపు 150 గ్రామాలకు (శివన్నగూడెం దాకా) నీరు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించాం. ఏఎంఆర్ ప్రాజెక్ట్ వచ్చాక ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు కట్టి ఇచ్చారు. మిషన్ భగీరథ రావడంతో ఈ సమస్య దాదాపుగా తగ్గిపోయింది. -
కాంగ్రెస్‌ను బద్నాం చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను బద్నాం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై జరిగే దాడులతో కాంగ్రెస్‌కు సంబంధం లేకపోయినా తమకు అంటగట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటనలో కాంగ్రెస్ ప్రమేయం ఉందని కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసిందని, కానీ ఆ దాడిలో కుట్ర కోణం లేదని, సంచలనం కోసమే నిందితుడు దాడి చేశాడని పోలీసులు చెప్పారన్నారు. ఈ కేసులో ఇంతవరకు రిమాండ్ రిపోర్టు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి ఘటనను కూడా రాజకీయం చేస్తున్నారని, పరామర్శ పేరుతో మంత్రి కేటీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని వ్యాఖ్యానించారు. మరో 15 రోజుల్లో ఇలాంటి దాడులు ఇంకా జరుగుతాయని కేటీఆర్ చెప్పడాన్ని, తమ ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం తగదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ (ఈసీ) సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, కొండ్రు పుష్పలీల తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక నుంచి కూలీలను తెచ్చి కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేయాలని చూస్తే ప్రజలు తిప్పికొట్టారని, దీంతో అక్కడ బీజేపీకి మద్దతిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను తెలంగాణలోనూ ప్రసారం చేయాలని హరీశ్‌రావు మీడియాకు ఫోన్లు ఎందుకు చేశారని నిలదీశారు. బీజేపీతో పొత్తులో ఉన్న కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను హరీశ్ సమన్వయం చేయడం దేనికి సంకేతమన్నారు. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం,జేడీఎస్ పార్టీల దుష్టచతుష్టయం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బిల్లు పెడితే మేం మద్దతిస్తాం తాము మైనార్టీలకు మేలు చేస్తామని డిక్లరేషన్ ప్రకటిస్తే మైనార్టీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రయత్నం చేస్తున్నారని, మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టి అపోహలు సృష్టిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఎస్సీల వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన కమిటీలు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయని, డిసెంబర్ 4 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పారు. అలా కాకుండా మాదిగలను మరోసారి మోసం చేసేందుకు బీజేపీ, మోదీ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒవైసీవి అబద్ధాలు మోదీ, కేసీఆర్ లాంటి దొంగలను కాపాడేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అబద్ధాలు ఆడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ‘ఆయనకు షేర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా. కానీ ఖాకీ నిక్కర్ ఉంది. ముస్లింల హక్కుల కోసం పోరాడాలని అసదుద్దీన్‌ను ఆయన తండ్రి బారిష్టర్ చదివించారు. కానీ ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి అసద్ మద్దతిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. రాజాసింగ్‌పై గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు పోటీకి పెట్టలేదని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్‌షాలకు సన్నిహితుడైన ఒక వ్యక్తికి అసదుద్దీన్ ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని ఆరోపించారు. అలా ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఒవైసీ సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మి ఆలయానికైనా, దర్గాకైనా వస్తానని, లేదా మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి రమ్మన్నా వస్తానని చెప్పారు. దీనికి అసదుద్దీన్ వస్తారా అని సవాల్ విసిరారు. -
సాధ్యంకాని హామీలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షి, వరంగల్/నర్సంపేట: ‘సాగుకు సంబంధించి బాగోగులు తెలియని కాంగ్రెస్ నేతలు వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని చెబుతున్నారు. 3 గంటల కరెంటు ఇస్తే ఒక్క మడి కూడా తడవదు. ఒకవేళ కాంగ్రెస్ చెప్పినట్టు చేస్తే రైతులు 10 హెచ్‌పీ మోటార్లు వినియోగించాలి. అది సాధ్యమయ్యే పనేనా? వీటిని రైతులకు ఎవరు కొనుగోలు చేసి ఇస్తారు? మీ అయ్యలు ఇస్తారా? ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ రాష్ట్రంలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నామంటూ సవాల్ చేశారు. కానీ తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. అయితే ప్రధాని మోదీ రాష్ట్రమైన గుజరాత్లో 24 గంటల విద్యుత్ లేదు. ఎలాగైనా గెలవాలనే తపనతో గోల్మాల్ మాటలు చెబుతున్నారు. ఆ మాటలు విని మోసపోవద్దు..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ధరణి పోర్టల్‌తోనే రైతుల భూములకు రక్షణ అని పునరుద్ఘాటించారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారని, బంగాళాఖాతంలో కలపాల్సింది ధరణినా? కాంగ్రెస్ పార్టీనా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, దమ్మపేట మండలాల్లో, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు చేయడం దుబారానా? ‘ప్రభుత్వాల తోడ్పాటు లేనిదే ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యవసాయం ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఆ దృష్టితోనే రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చాం. అయితే పన్నుల రూపంలో వచ్చిన డబ్బులు రైతుబంధు పేరుతో దుబారా చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు అంటున్నారు. రైతులకు మేలు చేయడం దుబారా ఎలా అవుతుంది? రైతు సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే మేం రైతుబంధు, నీటి తీరువా రద్దు, రైతుబీమా అందుబాటులోకి తెచ్చాం. 7,500 కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తున్నాం..’ అని కేసీఆర్ తెలిపారు. ధరణితో అన్ని హక్కులూ రైతులకే.. ‘గతంలో ప్రభుత్వ భూములపై రెవెన్యూ పెత్తనం ఉండేది. ప్రతి పనికీ వీర్వోలు.. ఎమ్మార్వోల మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ధరణి వచ్చిన తర్వాత భూములపై అన్ని రకాల హక్కులు రైతులకే బదలాయించాం. రైతు వేలిముద్ర లేకుండా ఇంచు భూమి కూడా బయటకు పోదు. అంతేకాదు ప్రభుత్వం అందించే ప్రతి ఆర్థిక సాయం నేరుగా రైతు ఖాతాలోకే చేరిపోతుంది. ఈ మేరకు మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తానంటూ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీ అంటున్నారు. అసలు రాహుల్ సహా కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం గురించి, రైతుల కష్టాల గురించి ఏం తెలుసు? ధరణిని రద్దు చేస్తే రైతుబంధు లాంటి పథకాలు ఎలా అమలు చేస్తారంటే వారి వద్ద సమాధానం లేదు. ధరణిని తీసేస్తే మళ్లీ రెవెన్యూ పెత్తనం పెరుగుతుంది. దళారులు, లంచగొండులు, పైరవీకారులు పుట్టుకొస్తారు..’ అని సీఎం హెచ్చరించారు. రూ.2 వేల పింఛను ఇచ్చేది తెలంగాణ, ఏపీ మాత్రమే.. ‘వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛను అందించడం సామాజిక బాధ్యత. రాష్ట్రం వచ్చిన కొత్తలో పెన్షన్ రూ.200 ఉండేది. అప్పుడు పింఛను పెంచాలని అధికారులకు చెబితే, వారు రూ.600 ఇస్తే సరిపోతుందంటూ సిఫారసు చేశారు. కానీ మేం ఆ మొత్తాన్ని రూ.1000కి పెంచాలని నిర్ణయించాం. ఇప్పుడు దేశం మొత్తం మీద రూ.2 వేల పింఛను అందిస్తున్న రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే..’ అని కేసీఆర్ తెలిపారు. ఇంత అహంకారమా? ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నాయకుడు (పొంగులేటి).. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేనూ అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్నాడు. ఇంత అహంకారంతో కూడిన మాటలు మాట్లాడొచ్చా? ధనబలంతో ప్రజాస్వామ్యాన్ని కొంటారా? పక్క రాష్ట్రం నుంచి వచ్చి డబ్బు కట్టలు పంచుతున్నారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలి. గ్రామాలకు వచ్చే టూరిస్టులకు ఓటు వేయొద్దు..’ అని కోరారు. ఆషామాషీగా ఓటేయొద్దు ‘తెలంగాణ రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు డయాలసిస్ సెంటర్లు ఉండేబి. కానీ ఇప్పుడు 103 ఉన్నాయి. ఇంటింటికీ తాగునీరు అందుతోంది. రైతుబంధుతో పాటు దళిత బంధు కూడా వచ్చింది. నా కంటే పొడుగు, దొడ్డు ఉన్నోళ్లు రాష్ట్రాన్ని పరిపాలించినా ఎవరూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. ఇక్కడి ప్రజల సంక్షేమమే మా ధ్యేయం. అందుకే గతంలో ఎన్నడూ లేని పథకాలు అమలు చేశాం. ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు ఆషామాషీగా నిర్ణయం తీసుకోవద్దు. పోటీలో నిలిచే అభ్యర్థులు, వారి వెనక ఉన్న పార్టీ, ఆ పార్టీ వి«ధానాలు, ప్రజల పట్ల ఆ పార్టీకి ఉన్న నిబద్ధత.. అన్నీ పరిశీలించి ఓటు హక్కును వినియోగించుకుంటేనే జీవితాలు బాగుపడతాయి..’ అని కేసీఆర్ అన్నారు. ఆయా సభల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.