Market
-
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: సార్వత్రిక ఎన్నికలు, కార్పొరేట్ మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకోవడంతో స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల సరళి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మే డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులకు అవకాశం ఉంది. ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ సోమవారం ముగిస్తుంది. ఎక్సే్చంజీల్లో షేర్లు గురువారం లిస్టవుతాయి. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1,404 పాయింట్లు, నిఫ్టీ 455 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ ఇన్వెస్టర్ల సిర్థమైన కొనుగోళ్లు, ఆర్బీఐ కేంద్రానికి రూ.2.1 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, ఆయా కంపెనీల మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర పరిణామాలు కలిసొచ్చాయి. చివరి దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దలాల్ స్ట్రీట్ ముందుగా దివీస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మాలతో పాటు గతవారాంతపు రోజుల్లో విడుదలైన ఇతర కార్పొరేట్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్ చివరి దశ(ఎనిమిదో వారం)కు చేరుకుంది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఈ వారంలో దాదాపు 2,100 కి పైగా కంపెనీలు తమ మార్చి క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి. టాటా స్టీల్, ఎల్ఐసీ, ఐఆర్టీసీ, ఆ్రస్టాజెనికా, నాట్కో ఫార్మా, ఎన్ఎండీసీ, జీఐసీలు కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఎన్నికల ఓటింగ్ శాతంపై దృష్టి దేశంలో లోక్ సభ ఆరో విడత ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 61.20 శాతంగా నమోదైంది. ఇది ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల కంటే అత్యల్పం. చివరి (ఏడో) విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఇదే రోజున రాత్రి ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్ నమోదు శాతం, సంబంధిత వార్తల పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం జపాన్ మే కన్జూమర్ కన్ఫిడెన్స్ డేటా బుధవారం, అమెరికా క్యూ1 జీడీపీ వృద్ధి, ఉద్యోగ గణాంకాల గురువారం వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోజోన్ ఏప్రిల్ నిరుద్యోగ రేటు, పారిశ్రామిక సరీ్వసుల సెంటిమెంట్, మే వినియోగదారుల విశ్వాస గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. ఇక శుక్రవారం(మే 31న) చైనా ఏప్రిల్ నిరుద్యోగ రేటు, రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్ల డేటా, యూరోజోన్ మే ద్రవ్యల్బోణ గణాంకాలతో భారత నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. కొనసాగుతున్న ఎఫ్ఐఐల అమ్మకాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడడంతో భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ నెలలో (మే 24 వరకు) దాదాపు రూ.22,000 కోట్లు ఉపసంహరించుకున్నట్లు ఎన్ఎస్డీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, సమీక్షా కాలంలో ఎఫ్‌పీఐలు రూ.178 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్‌లో రూ.2,009 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే ఈ నెల ఎక్కువగా ఉంది. అంతకుముందు ఎఫ్‌పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టడం విశేషం.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(మే 30న) నిఫ్టీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 22,800 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 23,250–23,350 శ్రేణిని పరీక్షిస్తుంది’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది. -
జీ-సోనీ డీల్ రద్దు.. రూ.748 కోట్లు కట్టాల్సిందే!
విలీన ఒప్పందాన్ని రద్దు చేసినందుకుగాను సోనీ పిక్చర్స్ నుంచి జీ ఎంటర్టైన్మెంట్ రూ.748 కోట్లు కోరుతుంది. ఈమేరకు జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.2021 డిసెంబర్ 22న జీ, సోనీ విలీనానికి ఒప్పందం కుదిరింది. 2023 ఆగస్టు 10న ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం సోనీ గ్రూప్ సంస్థలైన కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్, బంగ్లా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్‌ఈఈఎల్)తో విలీనానికి ఆమోదం కూడా తెలిపింది. ఇది 10 బిలియన్ డాలర్ల విలువైన మీడియా సంస్థ ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే డీల్ కుదిరిన రెండేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 22న విలీన ఒప్పందాన్ని సోనీ కార్పొరేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. జెడ్‌ఈఈఎల్ విలీన షరతులను పాటించడం లేదని తెలిపింది.ఇన్వెస్టర్లను నమ్మించి చివరకు ఇలా డీల్‌కు రద్దు చేసుకోవడం పట్ల సోనీ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ) నుంచి 90 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.748.7 కోట్లు) టర్మినేషన్ ఫీజును జెడ్‌ఈఈఎల్ డిమాండ్ చేస్తుంది. -
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలోకి అదానీ స్టాక్
అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో నమోదుకానుంది. ఐటీ సంస్థ విప్రో ఈ జాబితా నుంచి బయటకువెళ్లనుంది. సెన్సెక్స్ 50 సూచీలో టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్ లిమిటెడ్ చేరింది. ఈ సూచీలో నుంచి దివీస్ బయటకు వెళ్లింది. ఈ మేరకు ఎస్అండ్పీ డౌజోన్స్ సూచీ, బీఎస్ఈ జాయింట్ వెంచర్ ఆసియా ఇండెక్స్ ప్రకటిన విడుదల చేశాయి. ఈ మార్పులు జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయి.అదానీ గ్రూప్ కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ సెన్సెక్స్ 30 సూచీలోకి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కానీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు ఆ అవకాశం దక్కింది. ఏడాది కాలంగా ఈ కంపెనీ షేర్లు స్థిరంగా రాణిస్తుండడంతో ఈ అవకాశం దక్కినట్లు తెలిసింది. అదానీ కంపెనీల్లో సెన్సెక్స్ 30 సూచీలో చోటు దక్కించుకున్న తొలి కంపెనీ అదానీ పోర్ట్స్ కావడం విశేషం.అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్‌ను 1998లో స్థాపించారు. అహ్మదాబాద్ కేంద్రంగా దేశంలోని వివిధ పోర్ట్‌లను ఆపరేట్ చేసే లాజిస్టిక్స్ కంపెనీగా ఎదిగింది. దేశవ్యాప్తంగా 12 పోర్ట్‌లు, టెర్మినల్స్ ఈ సంస్థ పరిధిలో పనిచేస్తున్నాయి. ఇందులో దేశంలోనే మొట్టమొదటి డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ తిరువనంతపురం, ముంద్రాలోని పోర్ట్ సెజ్ ప్రధానమైనవి. ఈ కింది పోర్ట్‌లు అదానీ పోర్ట్ అండ్ సెజ్‌లో భాగంగా ఉన్నాయి.విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం తిరువనంతపురంముంద్రా పోర్టు కృష్ణపట్నం ఓడరేవుకారైకాల్ పోర్టు హజీరా పోర్టుధమ్రా పోర్టుదహేజ్ పోర్టు గంగవరం ఓడరేవు వైజాగ్ టెర్మినల్ మోర్ముగో టెర్మినల్ కట్టుపల్లి ఓడరేవు కామరాజర్ పోర్టు ట్యూనా టెర్మినల్ అగర్దానా షిప్‌యార్డ్ & టెర్మినల్స్ డిఘి పోర్టు -
సెబీ కొత్త నిబంధనలు..రియల్ టైం షేర్ వ్యాల్యూ షేరింగ్‌పై
స్టాక్ మార్కెట్ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థర్డ్ పార్టీ యాప్‌లకు రియల్ టైమ్ షేర్ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ఈ సందర్భంగా నిర్దిష్ట ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు, వెబ్సైట్లు మొదలైనవి రియల్ టైం షేర్ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్ కరెన్సీ), పలు ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సెబీ ప్రకారం, అనుమతులు లేకుండా రియల్ ట్రైం ట్రేడింగ్ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లు (ఎంఐఐఎస్)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది -
జువెలర్ల ఆదాయమూ ‘బంగారమే’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారు ఆభరణాల రంగంలో ఉన్న వ్యవస్థీకృత రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17–10 శాతం ఆదాయ వృద్ధి సాధించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. పుత్తడి ధర పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆభరణాల అమ్మకాల పరిమాణం 2023–24 మాదిరిగానే స్థిరంగా ఉంటుందని అంచనా. బంగారం ధరలు గణనీయంగా పెరగడం, నూతన ఔట్లెట్స్ జోడింపులు.. వెరశి అధిక సరుకు నిల్వల స్థాయిల కారణంగా రిటైలర్ల మూలధన అవసరాలు పెరగవచ్చు. సురక్షిత పెట్టుబడి.. ఆభరణాల మార్కెట్లో వ్యవస్థీకృత రంగం వాటా మూడింట ఒక వంతు కంటే కొంచెం ఎక్కువగా ఉంది. మిగిలిన వాటా అవ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. దేశీయంగా బంగారం ధర 2023–24లో 15 శాతం పెరిగి 2024 మార్చి చివరి నాటికి 10 గ్రాములకు రూ.67,000కి చేరుకుంది. ఏప్రిల్‌లో ధర రూ.73,000 స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్ బ్యాంకులు, అలాగే భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య వినియోగదారులు చూసే సురక్షిత పెట్టుబడి ఎంపికలలో బంగారం ఒకటిగా నిలవడమే ధర పెరుగుదలకు కారణం. అధిక తగ్గింపులు.. బ్రాండింగ్, మార్కెటింగ్ వ్యయాన్ని పెంచడమే కాకుండా, అధిక బంగారం ధరల మధ్య వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో ఉత్పత్తి డిజైన్స్, ఆఫర్లను విస్తరించడం కొనసాగించినప్పటికీ, రిటైలర్లు కొనుగోలుదారులకు అధిక తగ్గింపులను అందించే అవకాశం ఉంది. అమ్మకాలు దూసుకెళ్లేందుకు గోల్డ్ ఎక్సే్ఛంజ్ ఆఫర్లను ప్రమోట్ చేయవచ్చు. ఫలితంగా మూడింట ఒకవంతు ఉన్న గోల్డ్ ఎక్సే్చంజ్ పథకాల వాటా గణనీయంగా పెరగనుంది. కస్టమర్ల ప్రాధాన్యతల్లో మార్పు రావడం, విక్రయ సంస్థలు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంతో వ్యవస్థీకృత రంగం వాటా వృద్ధి చెందనుంది. కాగా, పసిడి ధర దూసుకెళ్లిన నేపథ్యంలో తక్కువ క్యారట్ కలిగిన ఆభరణాలకు కస్టమర్లు మళ్లే అవకాశం ఉందని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు.స్థిరంగా క్రెడిట్ ప్రొఫైల్స్..ఆరోగ్యకర బ్యాలెన్స్ షీట్స్ మద్దతుతో స్టోర్ విస్తరణలు మహమ్మారి తర్వాత బలమైన రెండంకెల వృద్ధిని సాధించాయి. స్థిర పరిమాణం కారణంగా 2024–25లో స్టోర్ల జోడింపు వేగం 10–12 శాతానికి తగ్గవచ్చు. పెరిగిన బంగారం ధరల ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ధరతో బంగారం నిల్వలు భర్తీ అవుతాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలలో ఆశించిన పెరుగుదల ఉన్నప్పటికీ.. ఆరోగ్యకర రాబడి పెరుగుదల, తగిన లాభదాయకత కారణంగా బలంగా నగదు రాకతో వ్యవస్థీకృత బంగారు ఆభరణాల రిటైలర్ల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతున్నట్టు క్రిసిల్ వెల్లడించింది. -
హిండెన్‌బర్గ్‌ను ఎదురొడ్డి.. నష్టాల నుంచి బయటపడ్డ అదానీ
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు గతేడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది.ఇప్పుడు అదానీ సంస్థ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడింది. అప్పులు తగ్గించడం, కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టడంతో ఇది సాధ్యమైందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.హిండెన్‌బర్గ్ సృష్టించిన పెనుతుపానుకు ఎదురొడ్డి నిలిచిన అదానీ ఎంటర్ ప్రైజెస్ విభిన్నమైన వ్యూహాన్ని ఎన్నుకొంది. దానిని పక్కాగా అమలు చేసి సఫలమైంది. అదానీ స్టాక్స్ వ్యాల్యూ పెరిగింది.అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఈ రోజు (మే 24) 1.7% పెరిగి 3,445.05కి చేరుకుంది. ఫిబ్రవరి 2023లో పడిపోయినప్పటి నుండి దాదాపు మూడు రెట్లు పెరిగింది.ఈ తాజా పరిణామాలతో అదానీ గ్రూప్ తన సిమెంట్, కాపర్ వ్యాపారాలను మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అదానీ రుణాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
డివిడెండ్ జోష్.. సూచీలు ఖుష్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)బోర్డు కేంద్ర ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడంతో గురువారం స్టాక్ సూచీలు సరికొత్త రికార్డు్డలు నెలకొల్పాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో విశ్వాస్వాన్ని నింపాయి. అలాగే దేశంలో ఎగుమతులు పెరగడంతో పాటు మే నెలలో ఉద్యోగ కల్పన 18 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు వెల్లడైన గణాంకాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి ఈ జనవరి 29 తర్వాత అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,197 పాయింట్లు పెరిగి 75,418 ముగిసింది. నిఫ్టీ 370 పాయింట్లు బలపడి 22,968 వద్ద నిలిచింది.కొనుగోళ్ల జోరు – రికార్డు హోరు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం ఫ్లాటుగా మొదలయ్యాయి. మెటల్, ఫార్మా మినహా అన్ని రంగాల్లో కొనుగోళ్ల వెల్లువెత్తడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదలాడాయి. మిడ్‌సెషన్ నుంచి ఆర్బీఐ డివిడెండ్ ప్రకటనల బలపడటంతో ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దశలో సెన్సెక్స్ 1,279 పాయింట్లు దూసుకెళ్లి 75వేల స్థాయిపైన 75,500 వద్ద, నిఫ్టీ 396 పాయింట్లు బలపడి 22,968 వద్ద జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆర్బీఐ భారీ డివిడెండ్ మరోసారి స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడొచ్చన్న అంచనాలు సూచీల పరుగుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.→ జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.4.28 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.420 లక్షల కోట్లకు చేరింది. → అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ అదానీ గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో చోటు దక్కనుండడంతో ఈ గ్రూప్‌లోని తక్కిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మొత్తం గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17.23 లక్షల కోట్లకు చేరింది. → మెప్పించిన గో డిజిట్ ఆన్లైన్ వేదికగా బీమా సేవలు అందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేరు లిస్టింగ్ మెప్పించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.272)తో పోలిస్తే 3% లాభంతో ప్రీమియంతో రూ.281 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.314 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 12% లాభంతో రూ.306 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.28,043 కోట్లుగా నమోదైంది. → ఎన్ఎస్ఈ రికార్డ్ఎన్ఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. గతేడాది డిసెంబర్లో 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని అందుకుంది. -
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
టీమిండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలివుడ్ నటి అనుష్క శర్మలకు షేర్ మార్కెట్లో లాభాల పంట పండింది. వారు పెట్టుబడి పెట్టిన షేర్లు భారీ లాభాలను తీసుకొచ్చాయి.స్టాక్ మార్కెట్లో మే 23న అరంగేట్రం చేసిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. 2020 ఫిబ్రవరిలో ఈ బీమా సంస్థలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ షేరు ధర రూ.300 మార్కును దాటడంతో, కంపెనీలో తమ వాటాలను కొనసాగిస్తూనే దంపతుల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగింది.బీమా కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. విరాట్ కోహ్లీ గో డిజిట్లో ఒక్కొక్కటి రూ. 75 చొప్పున 2,66,667 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అనుష్క శర్మ 66,667 షేర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ జంట మొత్తం పెట్టుబడి రూ.2.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర రూ.300 దాటడంతో విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల పెట్టుబడి రూ.8 కోట్లకు చేరుకోగా, అనుష్క శర్మ పెట్టుబడి రూ.2 కోట్లకు చేరుకుంది. వీళ్ల షేర్ల విలువ ఇప్పుడు రూ.10 కోట్లు. -
చాన్నాళ్లకు.. బంగారం కొనుగోలుదారులకు బిగ్ న్యూస్!
బంగారం కొనుగోలుదారులకు చాలా రోజుల తర్వాత భారీ శుభవార్త ఇది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మే 23) భారీగా తగ్గాయి. తులం (10 గ్రాములు) బంగారం రూ.1200 మేర తగ్గి పసిడి ప్రియులకు భారీ ఉపశమనం కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.1000 తగ్గి రూ.67,300 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 క్షీణించి రూ. 73,420 వద్దకు తగ్గింది.ఇతర నగరాల్లో..» ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.67,450 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 తగ్గి రూ.73,570 వద్దకు క్షీణించింది. » ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.1090 క్షీణించి రూ. 73,420 వద్దకు దిగొచ్చింది.» చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1100 తగ్గి రూ.67,500 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.1200 దిగొచ్చి రూ.73,640 వద్దకు చేరింది. » బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.1090 క్షీణించి రూ. 73,420 వద్దకు దిగొచ్చింది.రూ.లక్ష దిగువకు వెండిదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. హైదరాబాద్‌లో రూ. లక్ష దాటిన కేజీ వెండి ధర ఈరోజు భారీ స్థాయిలో రూ.3300 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్‌మార్కెట్లు.. కారణం..
సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి ముందు స్టాక్‌మార్కెట్లు రికార్డు గరిష్ఠాలను చేరాయి. కానీ క్రమంగా సెన్సెక్స్ అస్థిరంగా మారింది. ప్రస్తుత కాలంలో సూచీలు నిత్యం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో కేంద్రంలో అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీల గెలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను సర్దుబాటు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో ఏం జరుగుబోతుందో పరిశీలిస్తున్నారు.ఎన్నికల అనిశ్చితి వల్ల గత రెండు వారాలుగా స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ స్టాక్‌లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో మరింత అనిశ్చితులు ఏర్పడతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేముందు 3-4 ట్రేడింగ్ సెషన్లు, ఫలితాలు వచ్చాక 3-4 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానంస్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటారు. కొందరికైతే స్టాక్‌మార్కెట్ గ్యాంబ్లింగ్ అనే అభిప్రాయం ఉంది. స్పష్టమైన వైఖరి, భవిష్యత్తు ప్రణాళిక లేకుండా మార్కెట్లో తాత్కాలికంగా డబ్బు సంపాదించే వారికి ఇది గ్యాంబ్లింగ్‌గానే కనిపిస్తోంది. ఈజీ మనీకి అలవాటుపడి మార్కెట్లో కాకుండా బయట ఇతర అవకాశాలు ఉంటే వెంటనే ఆయా మార్గాల్లోకి డబ్బు మళ్లిస్తుంటారు. ఇటీవల జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గెలుపోటములపై ఇప్పటికే బెట్టింగ్‌ల పర్వం మొదలైంది. దాంతో మార్కెట్లో ఉన్న చాలామంది బెట్టింగ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే ఎవరుగెలుస్తారనే అంచానాలతో షాడో బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను పరిశీలిస్తున్నారు. -
బీఎస్ఈ కంపెనీల సరికొత్త రికార్డ్ 5 లక్షల కోట్ల డాలర్లు
దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను సాధించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 633 బిలియన్ డాలర్లకుపైగా జమ చేసుకుంది. నిజానికి మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 1.7 శాతం దూరంలో ఉన్నప్పటికీ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం!ముంబై: బీఎస్ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డ్ నెలకొల్పింది. వెరసి బీఎస్ఈ విలువ తొలిసారి రూ. 415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్ఈ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.ఆపై ఆరు నెలల్లోనే 5 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకూ ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్లో యూఎస్ఏ, చైనా, జపాన్, హాంకాంగ్ మాత్రమే ఉన్నాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ భారీగా సహకరించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవల మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ.. 2024 జనవరి మొదలు సెన్సెక్స్ 2.3 శాతం బలపడగా.. మిడ్ క్యాప్ 16.3 శాతం, స్మాల్ క్యాప్ 11.5 శాతం ఎగశాయి. జర్నీ తీరిలా 2007 మే నెలలో ట్రిలియన్ డాలర్ల విలువను సాధించిన బీఎస్ఈ ఆపై దశాబ్దం తదుపరి అంటే 2017 జులైలో 2 ట్రిలియన్ డాలర్లను చేరింది. ఈ బాటలో 2021 మే నెలకల్లా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 5 లక్షల కోట్ల డాలర్ల జాబితాలో 55.65 ట్రిలియన్ డాలర్లతో యూఎస్ఏ టాప్ ర్యాంకులో ఉంది. 9.4 ట్రిలియన్లతో చైనా, 6.4 ట్రిలియన్లతో జపాన్, 5.47 ట్రిలియన్లతో హాంకాంగ్ తదుపరి నిలుస్తున్నాయి.మార్కెట్ విలువ మదింపులో మార్పులు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను మదింపు చేయడంలో సెబీ తాజాగా నిబంధనలను పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఇకపై రోజువారీ మార్కెట్ విలువ మదింపునకు బదులుగా ఆరు నెలల సగటును ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని వలన సరైన విలువ మదింపునకు వీలుంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్వల్ప నష్టాలతో సరి.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,529 వద్ద నిలిచింది. మెటల్, ఇంధన షేర్లు రాణించగా, బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి.ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.., మిడ్ సెషన్లో కాసేపు లాభాల్లో ట్రేడయ్యా యి. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు వెల్లడికి ముందు(బుధవారం రాత్రి) అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో (జూన్ 4న) ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ సూచీ 7% పెరిగి 23 నెలల గరిష్టస్థాయి 22.3 స్థాయిని తాకింది. -
సానుకూల సంకేతాలు
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ ఎన్నికల అప్రమత్తత కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చివరి దశ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలూ ట్రేడింగ్ ప్రభావితం చూపొచ్చంటున్నారు. ఇక ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ బుధవారం ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ‘‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’’ అని నిపుణులు తెలిపారు. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. అమెరికా ఆర్థిక పరిణామాలు భారత్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. -
హడలెత్తించిన బంగారం, వెండి ధరలు నేడు ఇలా..
దేశవ్యాప్తంగా హడలెత్తించిన బంగారం, వెండి ధరలు ఈరోజు (మే 19) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున తులం బంగారం రూ.880, వెండి కేజీకి ఏకంగా రూ.4000 పెరిగి కొనుగోలుదారులను హడలెత్తించాయి. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగడంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 74,620 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,550, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.74,770 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,400లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.74,620 లుగా ఉన్నాయి.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,500 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.74,730 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.74,620 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో క్రితం రోజున వెండి ధర కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారాన్ని మించి.. వెండి హడల్..
దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 18) ఆకాశాన్ని అంటాయి. నిన్నటి రోజున కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించిన బంగారం ధరలు ఈరోజు భారీగా ఎగిశాయి. తులం బంగారం రూ.880 మేర పెరిగింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.800 పెరిగి రూ.68,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.870 పెరిగి రూ. 74,620 లను తాకింది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 ఎగిసి రూ.74,770 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.870 పెరిగి రూ.74,620 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,500లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.880 ఎగిసి రూ.74,730 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.870 పెరిగి రూ.74,620 లకు ఎగిసింది.రికార్డ్ స్థాయిలో వెండి ధరలుబంగారాన్ని మించి వెండి ధరలు హడలెత్తించాయి. దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్‌తో
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోదా తన కస్టమర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తన జెరోధా కైట్‌లో ట్రేడర్ల కోసం నోట్స్ అనే ఫీచర్‌ను డెవలప్ చేసింది.జెరోధా కైట్‌లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్విరామంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అదే సమయంలో ట్రేడర్లు ఆయా స్టాక్స్‌పై ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నామో తెలుసుకునేందుకు ఈ నోట్స్ ఫీచర్స్‌తో ట్రాక్ చేసుకోవచ్చని జెరోధా ప్రతినిధులు చెబుతున్నారు. Introducing notes on Kite web.At any given point in time, you may be tracking multiple stocks for different reasons. Even if you add the stocks on your marketwatch, it's hard to remember all the reasons why you added them. Now, you can easily add a quick note about why you are… pic.twitter.com/Su7AKm34Ip— Zerodha (@zerodhaonline) May 14, 2024 ప్రస్తుతం ఈ ఫీచర్ కౌట్ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలోయాపల్లో సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జెరోధా ట్వీట్ చేసింది. ‘ఏ సమయంలోనైనా, మీరు వివిధ కారణాల వల్ల పలు స్టాక్స్‌ను ట్రాక్ చేయొచ్చు. కొన్ని సార్లు మీరు ఆయా స్టాక్స్ ఎందుకు ఎంచుకున్నారో గుర్తించుకోవడం కష్టం. ఆ సమస్యను అధిగమించేలా నోట్ అనే టూల్‌ను అందిస్తున్నట్లు జెరోధా తన ట్వీట్లో పేర్కొంది. -
రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
బంగారం ధరల మోతకు బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 17) కాస్త దిగొచ్చాయి. రెండు రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారం రూ.280 మేర తగ్గి ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి కాస్త ఉపశమనం కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.250 తగ్గి రూ.67,600 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ. 73,750 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,750 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 దిగొచ్చి రూ.73,900 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,600లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు క్షీణించింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,950 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.280 తగ్గి రూ.73,850 లకు దిగొచ్చింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 క్షీణించి రూ.67,600 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు దిగొచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు (మే 17) స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,500లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు పెరిగి 73,664 వద్ద నిలిచింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 వద్ద స్థిరపడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది. ఒక దశలో సెన్సెక్స్ 762 పాయింట్లు బలపడి 73,749 వద్ద, నిఫ్టీ 231 పాయింట్లు పెరిగి 22,432 ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 1.07%, 0.85% లాభపడ్డాయి. → ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ.3.1 లక్షల కోట్లు పెరిగి బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 407.35 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం 30కి గానూ 25 షేర్లు లాభపడ్డాయి. → అమెరికాలో పారిశ్రామిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే డోజోన్స్ సూచీ తొలిసారి 40వేల పాయింట్ల పైకి చేరింది. -
కొత్త ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సినవి..
స్టాక్మార్కెట్లో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మార్కెట్లో నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని పదాలకు సరైన అర్థం తెలుసుకోకపోతే డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. కంపెనీలు తమ వ్యాపారాలు నిర్వహించాలంటే ఉబ్బు అవసరం అవుతుంది. ప్రమోటర్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బు సంస్థ అవసరాలకు సరిపోదు. దాంతో సంస్థలో కొంత షేర్‌ను ఇన్వెస్టర్లకు ఇచ్చి దానివల్ల సమకూరే డబ్బుతో వ్యాపారం చేస్తాయి. కంపెనీలు సంపాదించే లాభంలో వారికి వాటా ఇస్తుంటాయి. ఈ క్రమంలో కొత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినవారు, ఇకపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.సెబీసెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) భారతీయ స్టాక్ మార్కెట్‌ను పర్యవేక్షిస్తోంది. కంపెనీలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, బ్రోకర్లు చేసే లావాదేవీలు, కార్యకలాపాలపై నిఘా వేయడానికి ఈ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేశారు.డీమ్యాట్ అకౌంట్డీమ్యాట్ లేదా డీమెటీరియలైజ్డ్ ఖాతా, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కస్టమర్ షేర్లు, ఇతర సెక్యూరిటీలను కలిగి ఉండే సాధనం. డీమ్యాట్ ఖాతా ద్వారా కంపెనీ షేర్లను కొనడం లేదా విక్రయించడం లాంటివి చేయొచ్చు. భారత్‌లో షేర్ మార్కెట్ లావాదేవీల కోసం డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.స్టాక్ స్ప్లిట్కంపెనీ షేరు ధర భారీగా పెరిగినా, ప్రైస్ టు ఎర్నింగ్ నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్లు భావించినా ప్రస్తుత షేరును బహుళ షేర్లుగా విభజిస్తారు. ఉదాహరణకు ఒక కంపెనీ 1:2 స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటిస్తే ప్రతి 1 షేరుకు పెట్టుబడిదారులు 2 అదనపు షేర్లు డీమ్యాట్‌లో చేరుతాయి.బుల్/బేర్ మార్కెట్బుల్ మార్కెట్లో కంపెనీల షేర్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. దాంతో ఆ మార్కెట్లో షేర్ ధర పెరుగుతోంది. అయితే ఈ ట్రెండ్ చాలాకాలంపాటు కొనసాగుతుంటూ దాన్ని బుల్ మార్కెట్ అంటారు. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరత వల్ల మార్కెట్లు కుప్పకూలాయి. ఆ ట్రెండ్ కొంతకాలంపాటు సాగింది. దాన్ని బేర్ మార్కెట్ అంటాం.స్టాక్ బ్రోకర్కంపెనీలను సంప్రదించి నేరుగా షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియ లేదు. కాబట్టి దీని కోసం స్టాక్ బ్రోకర్ అనే వ్యవస్థ ఉంది. ఈ స్టాక్‌బ్రోకర్లు తమ క్లయింట్స్ కోసం షేర్లను కొనుగోలు చేయడం, అమ్మడం చేస్తారు. ఉదాహరణకు జెరోధా, అప్‌స్టాక్స్, ఫయ్యర్స్.. వంటివి స్టాక్‌బ్రోకర్లుగా ఉన్నాయి.డివిడెండ్కంపెనీ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసినపుడు లాభానష్టాలు ప్రకటిస్తాయి. లాభాలు ఆర్జించినప్పుడు దానిలో కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్‌కు పంచుతాయి. కంపెనీలు పెట్టుబడిదారులకు స్వల్ప మొత్తంలో డివిడెండ్‌ను పంపిణీ చేస్తాయి. ఇది దీర్ఘకాలిక వాటాదారులకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. డివిడెంట్ చెల్లింపులు నగదుగా, స్టాక్స్ లేదా వివిధ రూపాల్లో జారీ చేయొచ్చు.ప్రైమరీ మార్కెట్/ఐపీఓఒక కంపెనీ మొదటిసారి షేర్లను జారీచేసి మూలధనం సమకూర్చాలంటే ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ షేర్ల జారీని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) అంటారు. కంపెనీలకు ఇది ఒక ముఖ్యమైన దశ. ఐపీఓ ద్వారా ఒక సంస్థకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులు నేరుగా కంపెనీకి వెళ్తాయి. కంపెనీ పెరుగుదలకు, విస్తరణకు ఉపయోగపడతాయి. -
SEBI: కేవైసీ నిబంధనలు సరళతరం
న్యూఢిల్లీ: కేఆర్‌ఏల (కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు) ద్వారా కేవైసీ రికార్డుల ధృవీకరణ ప్రక్రియకు సంబంధించి రిస్కుల నిర్వహణ విధానాన్ని సరళతరం చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం కేఆర్ఏలు అధికారిక డేటాబేస్‌ల ఆధారంగా పాన్, పేరు, చిరునామా, ఈమెయిల్, మొబైల్ నంబరును ధృవీకరించవచ్చు. ఇవన్నీ సక్రమంగా ఉంటే రికార్డులను ధృవీకరించినట్లుగా పరిగణిస్తారని సైన్జీ సహ వ్యవస్థాపకుడు అంకిత్ రతన్ తెలిపారు. పెట్టుబడుల కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఎంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో డిజిటల్ గుర్తింపును ధృవీకరించడం చాలా కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామం ఇన్వెస్టర్లకు లావాదేవీలను సులభతరం చేసేందుకు తోడ్పడగలదని వివరించారు. కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడానికి వీలుగా ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు, సంబంధిత మధ్యవర్తిత్వ సంస్థలు మే నెలాఖరు నాటికి తగిన సాంకేతిక మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. క్యామ్స్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మొదలైనవి కేఆర్‌ఏలుగా వ్యవహరిస్తున్నాయి. ఇవి సాధారణంగా బ్రోకింగ్ సంస్థలు, ఎక్సే్చంజీలు, ఇంటర్మీడియరీల నుంచి సేకరించిన ఇన్వెస్టర్ల కేవైసీ వివరాలను నిర్వహిస్తున్నాయి. -
కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
బంగారం ధరల మోత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 16) ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. నాలుగు రోజుల తగ్గుదలకు బ్రేకిచ్చి క్రితం రోజున ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మరింత ఎగిశాయి. తులం బంగారం రూ.700 పైగా పెరిగి రూ. 74,000 మార్కును దాటేసింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.700 పెరిగి ప్రస్తుతం రూ.67,850 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.770 పెరిగి రూ. 74,020 లను తాకింది.ఇతర నగరాల్లో ధరలుఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.68,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,170 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.770 పెరిగి రూ.74,020 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,950లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,130 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.770 పెరిగి రూ.74,020 లకు ఎగిసింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి ఏకంగా రూ.1500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.92,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం, లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాల కారణంగా ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు క్షీణించాయి. మార్చితో పోలిస్తే 16 శాతం తగ్గి రూ. 18,917 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రవాహం కొంత తగ్గినప్పటికీ 2021 మార్చి నుంచి చూస్తే వరుసగా 38వ నెల కూడా ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగినట్లు మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల్లో వెల్లడైంది. మరోవైపు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) రూపంలో పెట్టుబడులు ఏప్రిల్‌లో కీలకమైన రూ. 20,000 కోట్ల మార్కును దాటి ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 20,371 కోట్లకు చేరాయి. అంతక్రితం నెలలో ఇవి రూ. 19,271 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, ఏప్రిల్‌లో రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. డెట్ స్కీముల్లోకి అత్యధికంగా రూ. 1.9 లక్షల కోట్లు వచ్చాయి. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → ఈక్విటీ, డెట్ కేటగిరీల్లోకి పెట్టుబడులు ప్రవా హం పటిష్టంగా ఉండటంతో నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 57.26 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 53.54 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి ఏప్రిల్‌లో రూ. 18,917 కోట్లు వచ్చాయి. మార్చిలో ఇది రూ. 22,633 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్లుగా నమోదైంది. → గత నెల ఓపెన్ ఎండెడ్ స్కీముల విభాగంలో తొమ్మిది స్కీముల ద్వారా ఫండ్ సంస్థలు రూ. 1,532 కోట్లు సమీకరించాయి. → లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మార్చిలో రూ. 2,128 కోట్లు రాగా ఏప్రిల్‌లో ఏకంగా రూ. 357 కోట్లకు పడిపోయాయి. స్మాల్ క్యాప్ కేటగిరీలోకి రూ. 2,208 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 94 కోట్ల ఇన్వెస్ట్మెంట్లను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్‌లోకి రూ. 5,166 కోట్లు, మలీ్ట–క్యాప్ కేటగిరీలోకి రూ. 2,724 కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి రూ. 144 కోట్ల ఉపసంహరణ జరిగింది. → హైబ్రిడ్ ఫండ్స్‌లోకి చెప్పకోతగ్గ స్థాయిలోకి రూ. 19,863 కోట్లు రాగా, డెట్ ఆధారిత స్కీముల విషయానికొస్తే లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ. 1.02 లక్షల కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ. 34,000 కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ. 21,000 కోట్లు వచ్చాయి. → మ్యుచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 18.14 కోట్లకు చేరింది. -
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అక్షయ తృతీయ తర్వాత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ మోత మోగించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 15) గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.430 పెరిగి రూ. 73,250 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.430 పెరిగి రూ.73,250 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి రూ.73,250 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.67,250లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 ఎగిసి రూ.73,360 లను తాకింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఎఫ్‌అండ్‌వోతో జర జాగ్రత్త
ముంబై: రిస్క్ లతో కూడుకున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో దీనిపై తగిన విధంగా పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో భవిష్యత్తులో మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్ల సెంటిమెంటు, కుటుంబాల పొదుపునకు సవాళ్లు తలెత్తగలవని ఆమె హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఆ నిధులకు రక్షణ కల్పించడం తమ లక్ష్యమని బీఎస్ఈ నిర్వహించిన వికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్ కారణంగా ప్రతి పది మంది రిటైల్ ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారన్న సెబీ అధ్యయనం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
శుభవార్త.. మళ్ళీ తగ్గిన పసిడి ధరలు
అక్షయ తృతీయ సందర్భంగా భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మే 14) కూడా పసిడి ధరలు గరిష్టంగా రూ. 430 తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ. 72820 వద్ద నిలిచింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66750 (22 క్యారెట్స్), రూ.72820 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 400, రూ. 430 తగ్గింది.చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 380 రూపాయలు తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 66900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 72980 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66900 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72970 రూపాయలకు చేరింది. నిన్న రూ. 100 నుంచి రూ. 130 వరకు తగ్గిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 400 , రూ. 410 వరకు తగ్గింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (మే 14) వెండి ధర రూ. 700 పెరిగి రూ. 87200 (కేజీ) వద్ద నిలిచింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలు పెరిగాయి. -
భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: భారీ నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 798 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 112 పాయింట్లు పెరిగి 72,776 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 234 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఆఖరికి 49 పాయింట్లు బలపడి 22,104 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.., మిడ్ సెషన్ తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీవీఎస్ షేర్లు ఒక శాతానికి పైగా రాణించడంతో పాటు సూచీల రికవరీకి తోడ్పాటు అందాయి. సరీ్వసెస్, రియలీ్ట, ఫార్మా, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీస్, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి ట్రేడవుతున్నాయి. ⇒ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో టాటా మోటార్స్ షేరు ఎనిమిది శాతానికి పైగా నష్టపోయి రూ.960 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 9.44% క్షీణించి రూ.948 వద్ద నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,016 కోట్లు కోల్పోయి రూ.3.19 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. హెల్త్‌కేర్ టెక్ సంస్థ ఇండిజెన్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.452)తో పోలిస్తే 45% ప్రీమియంతో 660 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను కోల్పోయి 26% లాభంతో రూ.571 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,614 కోట్లుగా నమోదైంది.