Market
-
భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: భారీ నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 798 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 112 పాయింట్లు పెరిగి 72,776 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 234 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఆఖరికి 49 పాయింట్లు బలపడి 22,104 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.., మిడ్ సెషన్ తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీవీఎస్ షేర్లు ఒక శాతానికి పైగా రాణించడంతో పాటు సూచీల రికవరీకి తోడ్పాటు అందాయి. సరీ్వసెస్, రియలీ్ట, ఫార్మా, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీస్, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి ట్రేడవుతున్నాయి. ⇒ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో టాటా మోటార్స్ షేరు ఎనిమిది శాతానికి పైగా నష్టపోయి రూ.960 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 9.44% క్షీణించి రూ.948 వద్ద నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,016 కోట్లు కోల్పోయి రూ.3.19 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. హెల్త్‌కేర్ టెక్ సంస్థ ఇండిజెన్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.452)తో పోలిస్తే 45% ప్రీమియంతో 660 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను కోల్పోయి 26% లాభంతో రూ.571 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,614 కోట్లుగా నమోదైంది. -
అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్ మార్కెట్లపై అమిత్‌షా
షేర్ మార్కెట్‌పై హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత షేర్లు అమాంతం దూసుకెళ్తాయని (షూట్ అప్) జోస్యం చెప్పారు. ఆలోపే షేర్లు కొనేసుకోవాలని సూచించారు.అయితే ఇటీవలి మార్కెట్ పతనం గురించి హోంమంత్రి పెద్దగా ఆందోళన చెందడం లేదు. గత ఆరు నెలల వ్యవధిలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 12 శాతం పెరిగింది. అలాగే ఏడాది వ్యవధిలో దాదాపు 20 శాతం పెరిగింది. ‘‘గతంలో కూడా మార్కెట్ చాలా సార్లు పడిపోయింది. కాబట్టి మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలతో ముడిపెట్టడం సరి కాదు. మార్కెట్ల పతనానికి బహుశా కొన్ని పుకార్లు కారణం కావచ్చు. నా అభిప్రాయం ప్రకారం.. జూన్ 4 లోపు కొనండి (షేర్లు). తర్వాత మార్కెట్ షూట్-అప్ కానుంది’’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు.భారత స్టాక్ మార్కెట్ల పయనంపై తాను ఎందుకు ఆశాజనకంగా ఉన్నది అమిత్‌షా వివరించారు. “స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు, మార్కెట్లు బాగానే ఉంటాయి. మోదీజీ మళ్లీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. కాబట్టి, ఇది నా అంచనా" అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు మూడు దశలు ఎలా సాగాయని అడిగినప్పుడు తమ పార్టీ 190 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మొదటి మూడు దశల్లో 283 స్థానాలకు పోలింగ్ జరగింది. -
పాక్షిక పెట్టుబడుల్లో మిలీనియల్స్
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పెట్టుబడులు యువ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రిప్ ఇన్వెస్ట్ తెలిపింది. పాక్షిక పెట్టుబడుల్లో (ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్) మిలీనియల్స్ ఇన్వెస్టర్ల సంఖ్య 60 శాతం ఉందని వెల్లడించింది. గ్రిప్ ఇన్వెస్ట్ వేదికగా 26,000 పైచిలుకు ఇన్వెస్టర్లు ఉన్నారు. ‘మిలీనియల్స్ తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరిచే ప్రయత్నంలో భాగంగా ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొత్తం ఆర్డర్లలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారుల నుండి వచి్చనవి 60 శాతం ఉన్నాయి. జెన్ ఎక్స్ కస్టమర్లు 20 శాతం మంది ఉన్నారు. 21 ఏళ్లున్న పెట్టుబడిదారులు పాక్షిక అధిక–దిగుబడి ఆస్తులను ఎంచుకుంటున్నారు. గ్రిప్ ఇన్వెస్ట్ ప్లాట్‌ఫామ్‌లోని 77 శాతం మంది కస్టమర్లు డూ–ఇట్–యువర్సెల్ఫ్ విధానాన్ని ఇష్టపడుతున్నారు. ఇన్వెస్టర్లు వ్యక్తిగత పరిశోధన ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో భారత్‌లోని మిలీనియల్స్ ఉత్సుకత చూపిస్తూనే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు’ అని గ్రిప్ ఇన్వెస్ట్ వివరించింది. 1981–1996 మధ్య జని్మంచినవారిని మిలీనియల్స్‌గా, 1960 మధ్య కాలం నుంచి 1980 ప్రారంభంలో పుట్టినవారిని జెన్ ఎక్స్‌గా పరిగణిస్తారు. -
సూచీల స్థిరీకరణ కొనసాగొచ్చు
ముంబై: ద్రవ్యోల్బణ డేటా, క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రపంచ పరిణామాలు, ఎన్నికల సరళిపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తీరుతెన్నులపైనా దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి దృష్ట్యా దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రస్తుత ట్రెండ్ స్వల్పకాలికానికి పరిమితమైంది. కావున సూచీలు స్థిరీకరణ కొంతకాలం కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా 22,300 స్థాయిని చేధించి, కొంతకాలం ఈ స్థాయిని నిలుపుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి 21,900 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా కన్జూమర్ ద్రవ్యోల్బణ అంచనాలు (సోమవారం), జపాన్ మెషనరీ టూల్ ఆర్డర్ల డేటా, భారత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్ ఏప్రిల్ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ ఫలితాల సీజన్ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. జొమాటో, ఐనాక్స్ ఇండెక్స్, వరుణ్ బేవరేజెస్, భారతీ ఎయిర్టెల్, పీవీఆర్ ఐనాక్స్, రాడికో ఖైతాన్, ఎడెలీ్వజ్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఆంధ్రా సిమెంట్, పీఎఫ్సీ, ఆర్వీఎన్ఎల్, టిటాఘర్ వికాస్ నిగమ్ కంపెనీలు ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. పది రోజుల్లో రూ.17వేల కోట్లు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల తొలి 10 రోజుల్లో రూ.17వేల కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏప్రిల్‌లో మొత్తం ఉపసంహరణ రూ.8,700 కోట్ల పోలిస్తే ఇది ఎక్కువ. ‘‘ఎన్నికల ఫలితాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తారు’’ అని ట్రేడ్జిని సీఓఓ త్రివేష్ డీ పేర్కొన్నారు. -
గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు..
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో గత నెల (ఏప్రిల్) ఇన్వెస్టర్లు నికరంగా రూ. 396 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే, గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) మార్చి నెలాఖరున ఉన్న రూ. 31,224 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ. 32,789 కోట్లకు చేరింది. రూపాయి మారకంలో చూస్తే పసిడి గత ఏడాది వ్యవధిలో మెరుగైన పనితీరే కనపర్చినప్పటికీ ఈక్విటీలతో పోలిస్తే తక్కువేనని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారీటా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటీఎఫ్‌లలో మదుపరులు కొంత లాభాలు స్వీకరించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో ధర పెరిగినా ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు నికరంగా తరలిపోయి ఉంటాయని వివరించారు. 2023 మార్చి తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం ఇదే ప్రథమం. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) డేటా ప్రకారం గతేడాది మార్చిలో నికరంగా రూ. 266 కోట్లు తరలిపోయాయి. తాజాగా మార్చిలో రూ. 373 కోట్లు వచ్చాయి. ఇక, గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోల సంఖ్య మార్చిలో 50.61 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో సుమారు 1 లక్ష పెరిగి రూ. 51.94 లక్షలకు చేరింది. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 459 కోట్లు రాగా, 2023లో దానికి అనేక రెట్లు అధికంగా రూ. 2,920 కోట్లు వచ్చాయి. గతేడాది నెలకొన్న పరిస్థితుల కారణంగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా, ద్రవ్యోల్బణానికి తగిన హెడ్జింగ్ సాధనంగా పసిడికి ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారడం తదితర అంశాల వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. -
పెట్టుబడి మొత్తం ఈక్విటీలకేనా?
సంపాదనను సంపదగా మార్చుకోవాలంటే అనుకూలమైన వేదికల్లో ఈక్విటీ ముందుంటుంది. రియల్ ఎస్టేట్ సైతం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి మార్గమవుతుంది. కానీ, ఈక్విటీ మాదిరి సులభమైన లిక్విడిటీ సాధనం రియల్ ఎస్టేట్ కాబోదు. మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు రోజుల్లోనే వెనక్కి తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ వీలు కలి్పస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ విభాగం వైపు అడుగులు వేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. అయితే, ఒకరి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎంత మేర ఉండాలి..? రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది దీనికి సూటిగా బదులు ఇవ్వలేరు. ఈక్విటీల జిగేల్ రాబడులు చూసి చాలా మంది తమ పెట్టుబడులు మొత్తాన్ని స్టాక్స్‌లోనే పెట్టేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకు సబబు? అసలు ఈ విధంగా చేయవచ్చా? ఒకరి పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉండాలి? ఈ విషయాలపై స్పష్టత కోసం కొన్ని కీలక అంశాలను ఒకసారి మననం చేసుకోవాల్సిందే. మీరు ఎలాంటి వారు? బుల్ మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడకపోవడం.. బేర్ మార్కెట్లో రిస్‌్కకు దూరంగా ఉండడం రిటైల్ ఇన్వెస్టర్లలో కనిపించే సాధారణ లక్షణం. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ‘‘ఇతరులు అత్యాశ చూపుతున్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయపడుతున్నప్పడు అత్యాశ చూపాలి’’ అన్నది బఫెట్ స్వీయ అనుభవ సారం. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పైగా తమ రిస్క్ స్థాయి ఎంతన్నది కూడా పరిశీలించుకోరు. పెట్టుబడిపై భారీ రాబడుల అంచనాలే వారి నిర్ణయాలను నడిపిస్తుంటాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఇలాంటి ప్రతికూల ధోరణలు అస్సలు పనికిరావు. అత్యవసర నిధి ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయి ఏడాది, రెండేళ్ల పాటు ఎలాంటి ఆదాయం రాకపోయినా జీవించగలరా? ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ప్రశ్నించుకోవాలి. లేదంటే ఏడాది, రెండేళ్ల జీవన అవసరాలు తీర్చే దిశగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీర్ఘకాలం కోసమేనా?దీర్ఘకాలం అంటే ఎంత? అనే దానిపై ఇన్వెస్టర్లలో భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు 2–3 ఏళ్లు, కొందరు 5–10 ఏళ్లను దీర్ఘకాలంగా భావిస్తుంటారు. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాలాన్ని మరిచి.. అవసరమైతే దశాబ్దాల పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే మైండ్‌సెట్‌తో ఉండాలి. బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. నూరు శాతం కాదు..? ఎన్ని చెప్పుకున్నా.. మధ్యమధ్యలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. కనుక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకుకోవడం సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారు ఒకటి కంటే ఎక్కువ సాధనాల మధ్య పెట్టుబడులు వర్గీకరించుకోవాలి (అస్సెట్ అలోకేషన్). ఏ సాధనంలో ఎంతమేర అన్నది నిర్ణయించుకోవాలంటే.. విడిగా ఒక్కొక్కరి ఆరి్ధక అవసరాలు, లక్ష్యాలు, ఆశించే రాబడులు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న కాల వ్యవధి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ అంటే? ఒకరు రూ.100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇందులో ఈక్విటీకి ఎంత, డెట్‌కు ఎంత అన్నది నిర్ణయించుకోవడం. ఈ రెండు సాధనాలే కాదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరికైనా ఈ నాలుగు సాధనాలు సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డెట్‌లో రిస్క్ డెట్‌లో రిస్క్ లేదా? అంటే లేదని చెప్పలేం. ఇందులో వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్ ఉంటాయి. అందుకే ఏఏఏ రేటెడ్ సాధనాల ద్వారా క్రెడిట్ రిస్‌్కను దాదాపు తగ్గించుకోవచ్చు. డెట్‌కు సింహ భాగం, కొంత శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ‘ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్’ను సైతం అరుణ్ కుమార్ సూచించారు.బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. రాబడులు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే కచి్చతంగా రాబడులే వస్తాయా? నిఫ్టీ 50 టీఆర్ఐ (రోలింగ్ రాబడులు) ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే ఒక్కో ఏడాది 47 శాతం పెరగ్గా, ఒక ఏడాది మైనస్ 1 శాతం క్షీణించింది. 2007 నుంచి 2023 మధ్య ఒక ఏడాది 52 శాతం, మరొక ఏడాది 25 శాతం వరకు నిఫ్టీ సూచీ నష్టపోయింది. కానీ, 55 శాతం, 76 శాతం రాబడులు ఇచి్చన సంవత్సరాలూ ఉన్నాయి.ఏ సాధనానికి ఎంత? సాధారణంగా ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కనుక 20–30 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 70–80 శాతం వరకు కేటాయించుకున్నా పెద్ద రిస్క్ ఉండబోదు. ఎందుకంటే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటుతో ఉంటారు. అదే 30–40 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 50–70 శాతం మధ్య కేటాయించుకోవచ్చు. అంతకుపైన వయసున్న వారు 50 శాతం మించకుండా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. 70 శాతం ఈక్విటీ కేటాయింపులు చేసుకునే వారు 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 50 శాతం ఈక్విటీలకు కేటాయించే వారు 30–40 శాతం డేట్‌కు, బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు. ఈ గణాంకాలన్నీ సాధారణీకరించి చెప్పినవి. విడిగా చూస్తే, 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకుందాం. అటువంటప్పుడు పిల్లల ఉన్నత విద్యకు 10–15 ఏళ్ల కాలంలో నిరీ్ణత మొత్తం కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు పెట్టుబడులకు 10–15 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక ఈక్విటీలకు 70 శాతం వరకు, మిగిలినది డెట్, గోల్డ్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. పిల్లల వివాహం కోసం అయితే 20 ఏళ్లు, రిటైర్మెంట్ కోసం అయితే 30 ఏళ్ల కాలం ఉంటుంది. వీటి కోసం కూడా ఈక్విటీలకు గణనీయమైన కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్లలోపు లక్ష్యాలు అయితే 80 శాతం డెట్‌కు, 20 శాతం ఈక్విటీలకు (ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్) కేటాయించుకోవచ్చు. మూడేళ్ల లక్ష్యాల కోసం అయితే పూర్తిగా డెట్‌కే పరిమితం కావడం శ్రేయస్కరం.3టీ కార్యాచరణ అస్సెట్ అలోకేషన్ విషయంలో మూడు ‘టీ’ల కార్యాచరణను ఫండ్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్ కుమార్ తెలియజేశారు. మొదటిది కాలం (టైమ్). ‘‘చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో డెట్ (ఫిక్స్డ్ ఇన్కమ్)తో పోలి్చనప్పుడు ఈక్విటీలే మెరుగైన పనితీరు చూపించాయి. కానీ స్వల్పకాలంలో 10–20 శాతం వరకు పతనాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏడు–పదేళ్లకోసారి 30–60 శాతం వరకు పతనాలు కూడా సంభవిస్తుంటాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే తెలుస్తుంది. కానీ, ఈ 10–20 శాతం దిద్దుబాట్లు 30–60 శాతం పతనాలుగా ఎప్పుడు మారతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఇలాంటి పతనాలను ఎక్కువ మంది తట్టుకోలేరు. అందుకే పోర్ట్‌ఫోలియోలో డెట్‌ను చేర్చుకోవాలి. ఇది నిలకడైనది. దీర్ఘకాలంలో రాబడి 5–7 శాతం మధ్యే ఉంటుంది. కనుక ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్న విషయంలో కాలాన్ని చూడాలి. ఎంత ఎక్కువ కాలం ఉంటే, ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. రెండోది టోలరెన్స్(టీ). అంటే నష్టాలను భరించే సామర్థ్యం. స్వల్పకాలంలో 10–20 శాతం పతనాలను తట్టుకునే సామర్థ్యం లేని వారు డెట్ కేటాయింపులు మరికాస్త పెంచుకోవచ్చు. ఈక్విటీలకు 50 శాతమే కేటాయించుకుంటే తరచూ వచ్చే పతనాల ప్రభావం తమ పోర్ట్‌ఫోలియోపై 10 శాతం, ఏడు–పదేళ్లకోసారి వచ్చే భారీ పతన ప్రభావాన్ని 25 శాతానికి తగ్గించుకోవచ్చు. మూడోది. ట్రేడాఫ్ (టీ). పెట్టుబడికి దీర్ఘకాలం ఉన్నప్పటికీ నష్టాల భయంతో రాబడుల్లో రాజీపడడం. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీల్లో దీర్ఘకాలం సగటు వార్షిక రాబడి) సంపాదిస్తే 20 ఏళ్లలో పెట్టుబడి 10 రెట్లు అవుతుంది. రాబడి ఏటా 10 శాతమే ఉంటే 20 ఏళ్లలో పెట్టుబడి ఏడు రెట్లే పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడే వస్తే 20 ఏళ్లలో పెట్టుబడి ఐదు రేట్లే వృద్ధి చెందుతుంది. డెట్‌కు కేటాయింపులు పెంచుకున్నకొద్దీ అంతిమంగా నికర రాబడులు తగ్గుతుంటాయి’’ అని అరుణ్ కుమార్ వివరించారు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారు 70–80 శాతం లార్జ్‌క్యాప్‌నకు, మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు 10–15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు 5–10 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచించారు. ఫండ్స్ ద్వారా అయినా సరే ఇంతే మేర ఆయా విభాగాల ఫండ్స్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. -
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
సార్వత్రిక ఎన్నికలు, దాని ఫలితం చుట్టూ ఉన్న అనిశ్చితి, ఖరీదైన వాల్యుయేషన్లు, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల నుంచి భారీగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. మే నెల మొదటి 10 రోజుల్లో రూ. 17,000 కోట్లను ఉపసంహరించుకున్నారు.మారిషస్‌తో భారత్ పన్ను ఒప్పందం సర్దుబాటు, యూఎస్ బాండ్ ఈల్డ్‌లలో నిరంతర పెరుగుదలపై ఆందోళనల కారణంగా ఏప్రిల్‌లో నమోదైన రూ. 8,700 కోట్ల నికర ఉపసంహరణ కంటే ఇది చాలా ఎక్కువ. అంతకు ముందు ఎఫ్‌పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. సాధారణ ఎన్నికల తర్వాత నాలుగో త్రైమాసికంలో దేశ కార్పొరేట్ ఆర్థిక పనితీరు బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు స్పష్టంగా వెలువడేంత వరకు ఎఫ్‌పీఐలు జాగ్రత్త వైఖరి అవలంబించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎఫ్‌పీఐల ఈ దూకుడు అమ్మకాల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు, దాని ఫలితాల చుట్టూ ఉన్న అనిశ్చితి కారణంగా, ఎన్నికల ఫలితాలకు ముందే మార్కెట్లోకి ప్రవేశించడంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ - రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
ప్రపంచంలో నారింజ పండ్ల దిగుబడి తగ్గుతుంది. ఆరెంజ్ జ్యూస్‌లో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న బ్రెజిల్లో ఈ ఏడాది భారీగా పంటనష్టం జరిగింది. గత 36 ఏళ్లలో ఎప్పుడూలేని విధంగా ఈసారి ఏర్పడిన వేడిగాలులతో తీవ్రంగా పంటనష్టం వాటిల్లినట్లు పరిశోదనా బృందం ఫండెసిట్రస్ తెలిపింది.ఏటా ఏప్రిల్ ప్రారంభం నుంచి ఆరెంజ్ పండ్ల సీజన్ మొదలవుతుంది. బ్రెజిల్లో ఈ సీజన్లో ఇప్పటివరకు 232.4 మిలియన్ బాక్సుల ఆరెంజ్ పండ్ల ఉత్పత్తి జరిగినట్లు ఫండెసిట్రస్ నివేదిక తెలిపింది. ఇందులో ఒక్కో బాక్స్ బరువు 90 పౌండ్లు(40.8 కిలోలు) ఉంటుంది. ఈసారి నమోదైన ఉత్పత్తి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 24 శాతం క్షీణించింది.ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు రిజస్టరైన ఐసీఈ ఫ్యూచర్స్ యూఎస్‌లో ఈ ఏడాది 26 శాతం లాభపడింది. గడిచిన మూడు నెలల వ్యవధిలో ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లు అత్యధికంగా 5 శాతం పెరిగాయి. హీట్‌వేవ్ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో భవిష్యత్తులో ఆశించిన ఫలితాలు రావని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది సెప్టెంబరు-నవంబర్ మధ్య ఆరెంజ్ పంట సాగుకు సిద్ధమైతే ఈ సమయం వరకు సమృద్ధిగా పంట చేతికి వచ్చేది. కానీ వేడిగాలుల వల్ల పంటకాలం ఆలస్యమైంది. దాంతో సరైన దిగుబడి రాదని నివేదిక చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నారింజ రసం సరఫరాలో బ్రెజిల్ మొదటిస్థానంలో ఉంది. దేశం మొత్తం పానీయాల ఎగుమతుల్లో 70 శాతం వాటా ఆరెంజ్ జ్యూస్దే అవ్వడం గమనార్హం. -
అలా ముగిసిందో లేదో.. ఇలా తగ్గింది!
దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ సందడి ముగిసింది. పండుగ రోజున భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర ఈరోజు (మే 11) 10 గ్రాములకు రూ.330 మేర తగ్గింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గింది. ప్రస్తుతం రూ.67,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.330 తగ్గి రూ. 73,360 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.330 దిగొచ్చి రూ.73,510 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.330 క్షీణించి రూ.73,360 వద్దకు తగ్గింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.330 తగ్గి రూ.73,360లకు దిగొచ్చింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.67,500 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.210 తగ్గి రూ.73,640 లకు దిగొచ్చింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు రూ.700 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.87,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడికి అక్షయ తృతీయ శోభ
ముంబై: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ముంబైలో పసిడి రూ.1,506 పెరిగి రూ.73,008 చేరింది. కిలో వెండి ధర రూ. 1873 ఎగసి రూ.84,215 కి చేరింది.పసిడి దిగుమతులు 30 శాతం అప్ కాగా భారత్ పసిడి దిగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరిగాయి. విలువలో 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ పటిష్ట డిమాండ్ దీనికి కారణం. భారత్‌కు దిగుమతుల విషయంలో స్విట్జర్లాండ్ (40%) మొదటి స్థానంలో నిలుస్తుండగా, తరువాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా దాదాపు 5 శాతం. పసిడిపై ప్రస్తుతం 15శాతం దిగుమతుల సుంకం అమలవుతోంది. చైనా తర్వాత భారత్ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉంది. కాగా, 2023–24లో వెండి దిగుమతుల విలువ 2.72 శాతం పెరిగి 5.4 బిలియన్ డాల ర్లుగా నమోదైంది. -
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!
నేడు అక్షయ తృతీయ. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్ల కోలాహలం నెలకొంది. ఈ తరుణంలో బంగారం ధరలు ఈరోజు (మే 10) కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. రెండు తగ్గుముఖం పట్టి ఊరట కలిగించిన పసిడి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.930 పెరిగి రూ. 73,090 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.930 ఎగసి రూ.73,240 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.850 పెరిగి రూ.67,000 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.930 పెరిగి రూ.73,090 వద్దకు చేరింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.67,050 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.990 పెరిగి రూ.73,150 లకు చేరుకుంది. ➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 ఎగిసి రూ.67,000 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.930 పెరిగి రూ.73,090 లకు ఎగిసింది.వెండి కూడా భారీగా..అక్షయ తృతీయ వేళ దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు ఏకంగా రూ.1300 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.86,500లుగా ఉంది. -
మార్కెట్‌కు ఎన్నికల కలవరం
ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు పతనమైన ఏప్రిల్ 19 తర్వాత తొలిసారి 22,000 దిగువున 21,957 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఒకటిన్నర శాతం పతనంతో బీఎస్ఈలో రూ.7.34 లక్షల కోట్లు ఆవిరియ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.393 లక్షల కోట్లకు దిగివచి్చంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పాలసీ నిర్ణయాలు, అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.ఆద్యంతం అమ్మకాలే ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. చిన్న, మధ్య, పెద్ద షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,132 పాయింట్లు క్షీణించి 72,404 వద్ద, నిఫ్టీ 370 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ట్రేడింగ్ ముగిసే వరకు అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 2.41%, రెండు శాతం క్షీణించాయి. → సూచీల వారీగా ఆయిల్‌అండ్‌గ్యాస్ 3.50%, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామికోత్పత్తి ఇండెక్సులు 3%, యుటిలిటీ, కమోడిటీ సూచీలు 2.50%, బ్యాంకులు, ఫైనాన్స్, సరీ్వసెస్ సూచీలు 2% పతనమయ్యాయి. → మార్చి క్వార్టర్లో నికర లాభం 15% వృద్ధి చెందడంతో టీవీఎస్ మోటార్స్ షేరు 3% పెరిగి రూ.2,061 వద్ద నిలిచింది. ట్రేడింగ్ 6% దూసుకెళ్లి రూ.2,121 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. → క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్బీఐ షేరు ఒకశాతం పెరిగి రూ.820 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో మూడున్నర శాతం బలపడి రూ.840 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం!
పసిడి ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అక్షయ తృతీయ వచ్చేస్తోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా బంగారం కొనుగోలు జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈరోజు (మే 8) కూడా కాస్త దిగొచ్చాయి.క్రితం రోజున కాస్తంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించిన బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో అక్షయ తృతీయ పర్వదినం వేళ బంగారం కొనాలనుకుంటున్నవారికి కాస్త ఉపశమనం కలిగించాయి. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేనా విలువైన వస్తువులు కొంటే అక్షయం అవుతుందని భారతీయుల నమ్మకం.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 తగ్గి రూ. 72,160 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.110 దిగొచ్చి రూ.72,310 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.110 క్షీణించి రూ.72,160 వద్దకు తగ్గింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.170 తగ్గి రూ.72,160 లకు దిగొచ్చింది.వెండి రివర్స్!దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు రూ.200 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.85,200లుగా ఉంది. -
బంగారం స్పీడ్‌కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. మూడు రోజులుగా వరసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 8) బంగారం ధరలు స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం కలిగించాయి.హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 తగ్గి రూ. 72,270 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 దిగొచ్చి రూ.72,420 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 క్షీణించి రూ.72,270 వద్దకు తగ్గింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,270 లకు దిగొచ్చింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,330 లకు దిగొచ్చింది. -
ఎన్ఎస్ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్ఎస్ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్!ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. తదుపరి స్టాక్ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు. -
బ్లూచిప్స్‌కు అమ్మకాల షాక్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.25%) ఐసీఐసీఐ బ్యాంక్(1.50%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు పతనమై 73,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు క్షీణించి 22,303 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.అయితే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండటం, మార్కెట్లలో ప్రీమియం వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల పలు కీలక రంగాల రంగాల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 636 పాయింట్లు క్షీణించి 73,259, నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 22,232 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.65% చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సూచీల వారీగా రియల్టీ 3.50%, యుటిలిటీస్ 3%, కమోడిటీస్, వినిమయ, టెలికం, ప్రభుత్వరంగ బ్యాంకులు 2.50% క్షీణించాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఆటో, మెటల్, ఇంధన ఇండెక్సులు రెండుశాతం చొప్పున నష్టపోయాయి. శనివారం (మే18న) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ప్రాథమిక సైట్లో ఏమైనా లోపాలు లేదా అంతరాయాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం(మే 18న) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్ ప్రధాన ప్రాథమిక సైట్లో.., ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్ డిజార్టర్ రికవరీ సైట్లో ట్రేడింగ్ జరగనుంది. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్ ఉత్పత్తులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గరిష్ట పరిమితిని 5 శాతంగా నిర్ణయించాయి. ఎక్సే్చంజీలు ఈ తరహా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ఈ మార్చి 2న నిర్వహించాయి. -
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన టైటన్ కంపెనీ షేర్లు సోమవారం భారీగా క్షీణించడంతో రూ.800 కోట్లకు పైగా సంపద నష్టపోయారు.టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటన్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి భారీగా సంపద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందుకోకపోవడంతో మదుపరులు సోమవారం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రేఖా మార్చి 31, 2024 నాటికి టైటన్‌లో 5.35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం ముగింపు నాటికి ఆమె వద్ద ఉన్న షేర్ల విలువ రూ.16,792 కోట్లుగా ఉంది.త్రైమాసిక ఆదాయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సోమవారం షేరు ధర 7 శాతం పడిపోయింది. షేర్ రూ.3,352.25 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో రూ.3,281.65 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ నికర విలువ రూ.3 లక్షల కోట్ల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.2,91,340.35 కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే కంపెనీ విలువలో దాదాపు రూ.22,000 కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది.ఇదీ చదవండి: గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీటైటన్ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.771 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.736 కోట్ల కంటే ఇది 5% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9419 కోట్ల నుంచి రూ.11,472 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.3496 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.3274 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం కూడా రూ.38,675 కోట్ల నుంచి రూ.47,501 కోట్లకు పెరిగింది. -
సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ సూచీలు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్లు లాభపడి 73,896 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,443 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, సరీ్వసెస్, యుటిలిటీ, విద్యుత్, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీ షేర్లూ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. -
ఫండ్స్ పెట్టుబడుల జోరు..
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు చరిత్రాత్మక గరిష్టానికి చేరాయి. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) చివరి త్రైమాసికంలో లిస్టెడ్ కంపెనీలలో ఎంఎఫ్‌ల వాటా 9 శాతానికి ఎగసింది. ఇందుకు ఈ కాలంలో తరలివచి్చన రూ. 81,539 కోట్ల నికర పెట్టుబడులు దోహదపడ్డాయి. ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వివరాల ప్రకారం 2023 డిసెంబర్ చివరికల్లా ఈ వాటా 8.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో దేశీయంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ వాటా 3.64 శాతం నుంచి 3.75 శాతానికి బలపడింది. ఎల్ఐసీకి 280 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటా ఉంది. వెరసి ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, పెన్షన్ ఫండ్స్‌తోకూడిన దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా మొత్తంగా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి మెరుగుపడింది. ఇందుకు భారీగా తరలివచి్చన రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులు తోడ్పాటునిచ్చాయి.విదేశీ ఇన్వెస్ట్మెంట్.. 11ఏళ్ల కనిష్టం 2024 మార్చికల్లా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల వాటా 17.68 శాతానికి నీరసించింది. ఇది గత 11ఏళ్లలోనే కనిష్టంకాగా.. 2023 డిసెంబర్‌కల్లా 18.19 శాతంగా నమోదైంది. ఫలితంగా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐలు, ఎఫ్‌పీఐల హోల్డింగ్(వాటాలు) మధ్య అంతరం చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఎఫ్‌పీఐలు డీఐఐల మధ్య వాటాల అంతరం 9.23 శాతానికి తగ్గింది. గతంలో 2015 మార్చిలో ఎఫ్‌పీఐలు, డీఐఐల మధ్య వాటాల అంతరం అత్యధికంగా 49.82 శాతంగా నమోదైంది. ఇది ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,989 కంపెనీలలో 1,956 కంపెనీలను లెక్కలోకి తీసుకుని చేసిన మదింపు. -
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
గత వారంలో పడుతూ.. లేస్తూ కొనసాగిన బంగారం ధరలు, ఈ వారం ప్రారంభంలో కొంత పెరుగుదల వైపు అడుగులు వేసాయి. దీంతో తులం పసిడి ధర సోమవారం రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. ధరలు పెరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66050 (22 క్యారెట్స్), రూ.72050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు రూ. 200 నుంచి రూ. 220 వరకు పెరిగాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66200 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72200 రూపాయల వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్లు ఈ రోజు కొంత పెరుగుదల దిశగా అడుగులు వేసాయి.తెలుగు రాష్ట్రాల్లో, ఢిల్లీలలో రూ. 200 నుంచి రూ. 220 పెరిగిన ధరలు చెన్నైలో మాత్రం రూ. 100 నుంచి రూ. 110 వరకు మాత్రమే పెరిగింది. దీంతో సోమవారం చెన్నైలో బంగారం ధరలు రూ. 66100 (10 గ్రాముల 22 క్యారెట్స్) రూ. 72110 (10 గ్రాముల 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా రూ. 1000 (ఒక కేజీ వెండి) పెరిగింది. కాబట్టి ఒక కేజీ వెండి ధర ఈ రోజు (మే 6) రూ. 84000 వద్ద ఉంది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరలు కొంత పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్..
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత ఎకానమీ పటిష్టంగా ముందుకు సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు సుమారు 7.6 శాతంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంటుందనే సానుకూల అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి గతి (మూమెంటమ్) భారత్‌కు సానుకూలంగా ఉందనడానికి ఇవి నిదర్శనాలు. దీన్ని భారతీయ స్టాక్ మార్కెట్లకు కూడా అన్వయించుకోవచ్చు. గత కొన్నాళ్లుగా పలు స్టాక్స్ ధరలు పెరుగుతూనే ఉండగా, మరికొన్ని అదే గతిని ఇకపైనా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మూమెంటమ్‌ను కీలక ఫిల్టరుగా ఉపయోగించి స్టాక్స్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉండగలదు. మూమెంటమ్ ఇన్వెస్టింగ్ సూత్రం ప్రకారం లాభాల బాటలో ఉన్న కొన్ని స్టాక్స్ సమీప భవిష్యత్తులోనూ అదే గతిని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. సమయానుగుణంగా ఇలాంటి స్టాక్స్ సమూహం మారవచ్చు గానీ సరైన మూమెంటమ్ స్టాక్స్‌లో కనుక ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్‌ఫోలియో మొత్తానికి లబ్ధిని చేకూర్చగలవు. ఇలాంటి వాటిలో సులభంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడే పలు మార్గాల్లో నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ కూడా ఒకటి. ఈ సూచీ ప్రాతిపదికన ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ .. ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. పెరిగే ధరతో ప్రయోజనంపెరగడమైనా, తగ్గడమైనా ధరల్లో కదలికలు ఒకసారి మొదలైతే కొన్నాళ్ల పాటు స్థిరంగా అవే ధోరణులు కొనసాగుతాయనే ప్రాతిపదికన మూమెంటమ్ విధానం ఉంటుంది. మూమెంటమ్ ధోరణిని నిర్ణయించేందుకు 6 నెలలు, 12 నెలల ధరల కదలికలను పరిగణనలోకి తీసుకుంటారు. మూమెంటమ్ ఇన్వెస్టింగ్ విధానంలో ధర పెరుగుతున్న స్టాక్స్‌లో స్వల్పకాలిక పొజిషన్లు తీసుకుని, ట్రెండ్ బలహీనపడుతున్నప్పుడు వాటి నుంచి నిష్క్రమించడం ద్వారా మార్కెట్లో హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతుంది.ఆ తర్వాత పరుగు అందుకుంటున్న వేరే స్టాక్స్‌పై దృష్టి పెడతారు. నిఫ్టీ 200 మూమెంటమ్ 30 సూచీలో నిఫ్టీ 200 స్టాక్స్ నుంచి ఎంపిక చేసిన 30 షేర్లు ఉంటాయి. కనీసం సంవత్సర కాలం పాటు లిస్టింగ్ చరిత్ర ఉండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లలో ట్రేడింగ్‌కి అందుబాటులో ఉన్న స్టాక్స్‌కు ఇందులో చోటు లభించే అవకాశం ఉంటుంది. మూమెంటమ్ స్కోరు ప్రాతిపదికన స్టాక్స్‌ను ఎంపిక చేస్తారు. 2024 మార్చి 31 నాటి డేటా ప్రకారం ప్రస్తుతం ఈ సూచీలోని టాప్ 5 రంగాల్లో ఆటో–ఆటో విడిభాగాల రంగానికి అత్యధికంగా 22.9%, హెల్త్‌కేర్‌కి 18 శాతం, క్యాపిటల్ గూడ్స్‌కి 15.5 శాతం, ఆర్థిక సేవలకు 12.2 శాతం, కన్జూమర్ సర్వీసెస్ షేర్లకు 5.8 శాతం వాటా ఉంది. సూచీలోని స్టాక్స్‌ను ఏటా జూన్, డిసెంబర్లో సమీక్షిస్తారు.సాధారణ బెంచ్‌మార్క్‌కు మించి రాబడులుధరలు పెరిగే అవకాశమున్న వాటినే ఎంపిక చేయడం వల్ల ఈ సూచీలోని స్టాక్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి సాధారణ బెంచ్‌మార్క్ సూచీతో పోలిస్తే అధిక రాబడులు పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు 2020 ఆఖర్లో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న ఐటీ, హెల్త్‌కేర్ స్టాక్స్‌కు అధిక వెయిటేజీ లభించింది. ఇక 2022 చివర్లో ఆర్థిక సేవల రంగం రాణిస్తుండటంతో దానికి ప్రాధాన్యం పెరిగింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా చూసినప్పుడు నిఫ్టీ 200 సూచీతో పోలిస్తే నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ చాలా మెరుగ్గా రాణించింది. ఈ పట్టికను బట్టి చూస్తే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో మూమెంటమ్ ఇండెక్స్.. నిఫ్టీ 200 కన్నా 7–10 పర్సంటేజీ పాయింట్ల మేర అధిక రాబడులే అందించిన సంగతి స్పష్టమవుతోంది. నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ మార్గాన్ని ఎంచుకోవచ్చు. డీమ్యాట్ అకౌంటు లేని వారు ఇండెక్స్ ఫండ్ మార్గం ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 ఏడాది 3 ఏళ్లు 5 ఏళ్లు నిఫ్టీ 200 మూమెంటమ్ 30 టీఆర్ఐ 70.0% 28.6% 23.6% నిఫ్టీ 200 టీఆర్ఐ 38.3% 18.4% 16.5% -
దేశమంతా నిరాశ.. అక్కడ మాత్రం ఊరట!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను నిరాశకు గురి చేశాయి. క్రితం రోజున భారీగా తగ్గి ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 4) మళ్లీ స్వల్పంగా ఎగిశాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 పెరిగి రూ. 71,830 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ఇలా..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 ఎగిసి రూ.66,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 పెరిగి రూ.71,980 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 పెరిగి రూ.71,830 వద్దకు ఎగిసింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.65,850 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.100 ఎగిసి రూ.71,830 లకు చేరుకుంది.చెన్నైలో తగ్గింపుదేశమంతా ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరుగుదలను చూడగా చెన్నైలో మాత్రం కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.66,000 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.72,000 లకు దిగొచ్చింది. -
రూ.194 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
రికార్డు గరిష్టం నుంచి నిఫ్టీ వెనక్కి..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్( –1%), భారతీ ఎయిర్టెల్(–2%), ఎల్అండ్టీ (–3%) క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. వారాంతాపు రోజున సెన్సెక్స్ 733 పాయింట్లు పతనమై 73,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 484 పాయింట్లు పెరిగి 75,095 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 147 పాయింట్లు బలపడి 22,795 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(75,095) నుంచి 1630 పాయింట్లు కోల్పోయి 73,465 వద్ద, నిఫ్టీ ఆల్‌టైం హై స్థాయి (22,795) నుంచి 447 పాయింట్లు క్షీణించి 22,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచి్చంది. ∗ సెన్సెక్స్ ఒకశాతం పతనంతో బీఎస్ఈలో రూ.2.25 లక్షల కోట్లు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొ త్తం విలువ రూ.406 లక్షల కోట్లకు దిగివచి్చంది.