Market
-
రూ.194 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
రికార్డు గరిష్టం నుంచి నిఫ్టీ వెనక్కి..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్( –1%), భారతీ ఎయిర్టెల్(–2%), ఎల్అండ్టీ (–3%) క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. వారాంతాపు రోజున సెన్సెక్స్ 733 పాయింట్లు పతనమై 73,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 484 పాయింట్లు పెరిగి 75,095 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 147 పాయింట్లు బలపడి 22,795 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(75,095) నుంచి 1630 పాయింట్లు కోల్పోయి 73,465 వద్ద, నిఫ్టీ ఆల్‌టైం హై స్థాయి (22,795) నుంచి 447 పాయింట్లు క్షీణించి 22,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచి్చంది. ∗ సెన్సెక్స్ ఒకశాతం పతనంతో బీఎస్ఈలో రూ.2.25 లక్షల కోట్లు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొ త్తం విలువ రూ.406 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
కరుణించిన కనకమహాలక్ష్మి! దిగొచ్చిన బంగారం
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. క్రితం రోజున భారీ పెరుగుదలను చూసిన బంగారం నేడు (మే 3) గణనీయంగా తగ్గింది. ఏకంగా రూ.1090 మేర తగ్గడంతో ఈరోజు కొనుగోలు చేస్తున్నవారికి పెద్ద ఊరట కలిగింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 తగ్గి రూ.65,750 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా ధర రూ.540 తగ్గి రూ. 71,730 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ.65,900 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 తగ్గి రూ.71,880 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 వద్దకు క్షీణించింది.చెన్నైలో భారీగా..చెన్నైలో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1000 తగ్గి రూ.66,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1090 తగ్గి రూ.72,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 లకు తగ్గింది. -
పరిమిత శ్రేణి ట్రేడింగ్
ముంబై: పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఏప్రిల్‌లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు, ప్రోత్సాహకర తయారీ రంగ పీఎంఐ డేటా, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో 415 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 128 పాయింట్లు లాభపడి 74,611 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 74,361 వద్ద కనిష్టాన్ని 74,812 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ రోజంతా 22,568 – 22,711 పాయింట్ల మధ్య ట్రేడైంది. ఆఖరికి 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద నిలిచింది. యుటిలిటి, విద్యుత్ సరీ్వసెస్, ఆటో, మెటల్, కన్జూమర్, ఇంధన, ఫార్మా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
పుంజుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 43.35 పాయింట్లు లాభపడి 22648.20 వద్దకు చేరింది. సెన్సెక్స్ పాయింట్లు 128.33 పాయింట్ల లాభంతో 74611.11 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, టీసీఎస్, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, నెస్లే, ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గి పసిడి ప్రియులకు ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 2) భారీ స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.870 మేర ఎగిశాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ. 72,270 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లోి ఇలా..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 ఎగిసి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.760 పెరిగి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.72,270 వద్దకు ఎగిసింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.67,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.870 పెరిగి రూ.73,250 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 ఎగిసి రూ.72,270 లకు చేరుకుంది. -
త్వరలో అక్షయ తృతీయ.. బంగారంపై భారీ శుభవార్త!
త్వరలో అక్షయ తృతీయ రాబోతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఆనందం కలిగించే వార్త ఇది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధరలు ఈరోజు (మే 1) ఏకంగా రూ.1260 మేర తగ్గాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ. 71,510 లకు తగ్గింది.ఇతర నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 తగ్గి రూ.71,660 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 వద్దకు దిగొచ్చింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1150 తగ్గి రూ.71,510 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1260 తగ్గి రూ.72,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 లకు తగ్గింది. -
ధర పెరిగినా బంగారమే
న్యూఢిల్లీ: భారత్ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో పోలి్చతే భారత్ పసిడి డిమాండ్ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్ నెలకొనడం గమనార్హం. సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర (దిగుమతి సుంకం, జీఎస్టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది. ఇక భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్ ఇయర్ మొత్తంలో ఆర్బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్ మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా 5 % ఎక్కువ. సెంట్రల్ బ్యాంకులు తమ హోల్డింగ్స్‌ను ఈ కాలంలో 290 టన్నులు పెంచుకున్నాయి. ∗ మార్చి త్రైమాసికంలో భారత్ పసిడి డిమాండ్ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్‌లో ఆభరణాల డిమాండ్ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది. ∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి. ∗గోల్డ్ రీసైక్లింగ్ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా. -
బేర్ పంజా.. రెడ్‌లో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 22,588 వద్దకు చేరింది. సెన్సెక్స్ 188 పాయింట్లు దిగజారి 74,482 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టెక్‌మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టాటా స్టీల్, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, టైటాన్ నెస్లే కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66550 (22 క్యారెట్స్), రూ.72600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 300 నుంచి రూ. 330 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66700 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72750 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.300, రూ.330 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67400 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 73530 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం రూ. 100 తగ్గింది. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 30) ఒక కేజీ వెండి ధర 83900 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు. -
గ్రీన్‌లో ఓపెన్ అయిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 22,670కు చేరింది. సెన్సెక్స్ 57 పాయింట్లు దిగజారి 74,751 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.32 శాతం లాభపడింది. నాస్డాక్ 0.35 శాతం ఎగబాకింది.అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Sensex : జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద
ముంబై: స్టాక్ సూచీల నష్టాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఇరాన్– ఇజ్రాయెల్ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 వద్ద నిలిచింది. నిఫ్టీ 223 పాయింట్లు బలపడి 22,643 వద్ద నిలిచింది. సెన్సెక్స్ పరుగుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.48 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.406 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని 30 షేర్లలో హెచ్‌సీఎల్ టెక్(– 6%), ఐటీసీ (–0.44%), విప్రో(–0.37%), బజాజ్‌ఫిన్‌సర్వ్(–0.10%) మాత్రమే నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 941 పాయింట్లు ఎగసి 74,671 వద్ద, నిఫ్టీ బలపడి 236 పాయింట్లు దూసుకెళ్లి 22,656 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఐటీ, ఆటో, రియల్టీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.79%, 0.07% చొప్పున రాణించాయి. ఆల్‌టైం హైకి బ్యాంక్ నిఫ్టీ: ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, పీఎస్బీ షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో ట్రేడింగ్‌లో బ్యాంక్ నిఫ్టీ సైతం 49,474 వద్ద ఆల్ టైం హైని నమోదు చేసింది. చివరికి 1,223 పాయింట్ల లాభంతో 49,424 వద్ద ముగిసింది. మొత్తం ఈ సూచీలో 12 షేర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(3.30%), బంధన్ బ్యాంక్(0.20%) మాత్రమే నష్టపోయాయి.ఐసీఐసీఐ బ్యాంక్ఃరూ.8 లక్షల కోట్లు క్యూ4లో నికర లాభం 18% వృద్ధితో ఐసీఐసీఐ బ్యాంకు షేరుకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో 4.5%పెరిగి రూ.1,159 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% ఎగిసి రూ.1,163 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.36,555 కోట్లు పెరిగి రూ.8 లక్షల కోట్లపైన రూ.8.14 లక్షల కోట్లకు చేరింది క్యాపిటలైజేషన్ పరంగా రూ.8 లక్షల కోట్లు దాటిన అయిదో కంపెనీగా నిలిచింది. -
భారీగా పుంజుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 215 పాయింట్లు లాభపడి 22,635 వద్దకు చేరింది. సెన్సెక్స్ 941 పాయింట్లు ఎగబాకి 74,671 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీసుజుకీ కంపెనీ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.3,408.88 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.4,356.83 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈక్విటీల్లో మహిళల భాగస్వామ్యం ఎలా ఉందంటే..
ఈక్విటీ మార్కెట్లో మహిళా పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుతోంది. వారి సగటు పోర్ట్‌ఫోలియో పరిమాణం రూ.55,454గా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇది ఈక్విటీ పెట్టుబడిదారుల జాతీయ సగటు కంటే ఎక్కువ. ఈక్విటీలో పెట్టుబడిపెట్టే మొత్తం మహిళల్లో మెజారిటీ (68%) రూ.1 లక్షలోపు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారని ఆన్లైన్ బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ ఫైయర్స్ డేటా ద్వారా తెలిసింది.ఈ నివేదిక ప్రకారం 21% మహిళలు రూ.1 లక్ష-రూ.5 లక్షల వరకు పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నారు. 11% మంది రూ.5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. మహారాష్ట్రలోని మొత్తం ఇన్వెస్టర్లలో దాదాపు మహిళలు సగం మంది ఉన్నారు. మొత్తం మహిళా పెట్టుబడిదారుల్లో 22.38% మంది మహారాష్ట్ర వారే. ఆంధ్రప్రదేశ్‌లో 10.68%, కర్ణాటక 7.65%, కేరళ 5.78% మంది మహిళలు ఈక్వీటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థమహిళా వ్యాపారులు ఉన్న మొదటి ఐదు నగరాల్లో ముంబై (4.16%), బెంగళూరు (4.19%), పుణె (3.93%), థానే (2.66%), హైదరాబాద్ (2.62%) ఉన్నాయి. 26-55 ఏళ్ల వయసు ఉన్న మహిళలు 58% మంది ఉన్నారు. ఫైయర్స్ ప్లాట్‌ఫారమ్‌లో మహిళా పెట్టుబడిదారులు నెలకు 5% స్థిరమైన వృద్ధితో పెరుగుతున్నారని డేటా ద్వారా తెలిసింది. -
హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 29) మోస్తరుగా తగ్గాయి. నిన్నటి రోజున స్థిరంగా బంగారం ధరలు ఈరోజు తగ్గి ఉపశమనం కలిగించాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ. 72,600 లకు తగ్గింది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.72,750 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 వద్దకు దిగొచ్చింది.అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.320 తగ్గి రూ.73,530గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 లకు తగ్గింది.ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.87,500గా ఉంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 22,497కు చేరింది. సెన్సెక్స్ 298 పాయింట్లు దిగజారి 74,021 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 88.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.67 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.02 శాతం లాభపడింది. నాస్డాక్ 2 శాతం ఎగబాకింది.ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలు ఉండనున్నాయి. దాంతోపాటు బుధవారం వడ్డీరేట్లపై వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా బంగారం, వెండి.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?
ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 200 నుంచి రూ. 200 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.200, రూ.220 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72760 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా ఈ రోజు ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 28) ఒక కేజీ వెండి ధర 84000 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 22,452 వద్దకు చేరింది. సెన్సెక్స్ 443 పాయింట్లు దిగజారి 73,896 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో టెక్‌మహీంద్రా, విప్రో, ఐటీసీ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి.బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, టీసీఎస్, సన్‌ఫార్మా, టాటీ స్టీల్, ఎన్టీపీసీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 22,326కు చేరింది. సెన్సెక్స్ 236 పాయింట్లు దిగజారి 73,618 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 88.04 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.64 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం లాభపడింది. నాస్డాక్ 0.10 శాతం ఎగబాకింది.నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను ఎన్ఎస్ఈ బుధవారం తీసుకొచ్చింది. మార్కెట్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, దేశవ్యాప్తంగా సూచీ డెరివేటివ్స్‌లో 375 మందికి పైగా ట్రేడింగ్ సభ్యులు పాల్గొన్నట్లు ఎన్ఎస్ఈ తెలిపింది. ఫ్యూచర్స్‌లో రూ.78.16 కోట్ల విలువైన 1,223 కాంట్రాక్టులు, ఆప్షన్స్‌లో రూ.1.55 కోట్ల విలువైన 1,724 కాంట్రాక్టులు ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,597కు చేరింది. సెన్సెక్స్ 85 పాయింట్లు దిగజారి 74,423 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.7 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.46 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.64 శాతం దిగజారింది. త్రైమాసిక ఫలితాలు విడుదల తర్వాత మైక్రోసాఫ్ట్ స్టాక్ 4 శాతం, గూగుల్ స్టాక్ 12 శాతం పెరిగింది.కొత్త వినియోగదారులను ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేర్చుకోకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు నిన్న 10.85% కుదేలై రూ.1643 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.1620 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. సంస్థ మార్కెట్ విలువ రూ.39,768.36 కోట్లు పతనమై రూ.3.26 లక్షల కోట్లకు పరిమితమైంది. దీంతో మార్కెట్ విలువ పరంగా అత్యంత విలువైన బ్యాంక్‌ల్లో 5వ స్థానానికి పడిపోయింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 22,413 వద్దకు చేరింది. సెన్సెక్స్ 130 పాయింట్లు ఎగబాకి 73,869 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, కోటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, మారుతీ సుజుకీ, హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం నిన్న కొన్నవాళ్లు అదృష్టవంతులు!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 24) గణనీయంగా పెరిగింది. నిన్నటి రోజున భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ ఎగిశాయి. దీంతో నిన్ననే బంగారం కొన్నవారు అదృష్టవంతులని కొనుగోలుదారులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 పెరిగి రూ.66,600 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.490 పెరిగి రూ. 72,650 లకు ఎగిసింది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 పెరిగి రూ.66,750 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.490 పెరిగి రూ.72,800 లకు చేరాయి. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.450 ఎగిసి రూ.66,600 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.490 పెరిగి రూ.73,690 వద్దకు చేరాయి.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.67,300 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.320 పెరిగి రూ.73,420గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 ఎగిసి రూ.66,600 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.490 పెరిగి రూ.72,650 లను తాకాయి.వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.100 తగ్గింది. ఇక్కడ ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.86,400గా ఉంది. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 22,558 వద్దకు చేరింది. సెన్సెక్స్ 486 పాయింట్లు ఎగబాకి 74,339 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీ షేర్లు లాభాల్లోకి వెళ్లాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్‌లో ఓపెన్ అయిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 22,412కు చేరింది. సెన్సెక్స్ 180 పాయింట్లు ఎగబాకి 73,916 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.68 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 88.39 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.2 శాతం లాభపడింది. నాస్డాక్ 1.59 శాతం ఎగబాకింది.నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్ట్‌లపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం కొనుగోలుదారులకు ఊరట
దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 25) కాస్త తగ్గాయి. నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు దిగొచ్చాయి.హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ. 72,270 లకు తగ్గింది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.66,400 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 తగ్గి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.350 క్షీణించి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.72,270 వద్దకు దిగొచ్చింది.అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.67,100 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.220 తగ్గి రూ.73,200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 క్షీణించి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.72,270 లకు తగ్గింది.ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.400 తగ్గింది. ఇక్కడ ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.86,000గా ఉంది.