Reliance Retail
-
షీఇన్లో రిలయన్స్ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ వేదిక అయిన షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్‌లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ కంపెనీ నెక్ట్స్‌జెన్ ఫాస్ట్ ఫ్యాషన్ తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. భారత్‌కు చెందిన రెడీమేడ్స్ తయారీ కంపెనీల నుంచి ఈ ఉత్పత్తులను నెక్సŠట్జెన్ కొనుగోలు చేస్తోందని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు వీటిలో ఉన్నాయని చెప్పారు. అయిదేళ్ల నిషేధం తర్వాత రిలయన్స్ రిటైల్ ద్వారా షీఇన్ భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ‘కొత్త షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్ భారత్‌లో రూపుదిద్దుకుంది. దీని యాజమాన్యం, నియంత్రణ ఎల్లప్పుడూ రిలయన్స్ రిటైల్ చేతుల్లోనే ఉంటుంది. భారత కంపెనీలో షీఇన్‌కు వాటా లేదు. భారత్ నుంచి అప్లికేషన్‌ను నడిపిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచి్చన షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్‌తో షీఇన్ గతంలో నిర్వహించిన షీఇన్.ఇన్ వెబ్‌సైట్‌తో సంబంధం లేదు’ అని ఆయన చెప్పారు. అయిదేళ్ల నిషేధం తర్వాత.. రిలయన్స్ రిటైల్ నుండి షీఇన్ ఇండియా ఫాస్ట్ ఫ్యాషన్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో 10,000కి పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. యాపిల్ స్టోర్‌లో ఫ్యాషన్ ఈ–కామర్స్ కంపెనీల్లో టాప్ 10లో స్థానం పొందింది. చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత జూన్ 2020లో ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించిన యాప్‌లలో షీఇన్ ఒకటి. భారత్‌లో దాదాపు మూడు సంవత్సరాల నిషేధం తర్వాత బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌తో షీఇన్‌ను ప్రమోట్ చేస్తున్న రోడ్గెట్ బిజినెస్ 2023లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్వదేశీ ఈ–కామర్స్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి రోడ్గెట్ బిజినెస్‌తో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నుంచి వచి్చన అభ్యర్థన మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించిన అనంతరం ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రతిపాదనపై ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని పరిశ్రమ ప్రతినిధి వివరించారు. -
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో కొరియన్ స్కిన్‌కేర్ & మేకప్ బ్రాండ్ ఎంట్రీ
సౌందర్య ప్రియులు,బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కొరియన్ చర్మ సంరక్షణ మేకప్ సంచలనం టిర్టిర్( TIRTIR) ఇండియాలో లాంచ్ అయింది. రిలయన్స్ రిటైల్‌కు చెందిన టిరాతో కలిసి ఇది ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతీయ బ్యూటి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని రిలయన్స్ ప్రకటించింది. Tira స్టోర్లు, Tira యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్బంగా కొనుగోలుదారులకు ఆఫర్లను కూడా అందిస్తోంది.ముఖ్యంగా మాస్క్ ఫిట్ రెడ్ కుషన్ ఫౌండేషన్,ఆకట్టుకునే 30 షేడ్స్‌తో తీసుకొచ్చింది. మిల్క్ స్కిన్ టోనర్, సిరామిక్ మిల్క్ ఆంపౌల్, మాస్క్ ఫిట్ మేకప్ ఫిక్సర్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.చర్మ సంరక్షణ-జాగ్రత్తలుఏ సీజన్లో అయినా చర్మ ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు సరిపడా నీళ్లు తాగాలి. చర్మ సంరక్షణకు హైడ్రేటింగా ఉండటం, రిఫ్రెషింగ్ చాలా కీలకం. చర్మం కాంతివంతంగా ప్రకాశించేలా ఉండాలంటే ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. కెమికల్స్ వాడని సహజమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగించాలి. నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవాలి.ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ఉండాలి. మ్యాకప్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. బ్యూటీ నిపుణులు, స్కిన కేర్ వైద్య నిపుణుల సలహాల మేరకు ఉత్పత్తులను వాడాలి.ఎప్పటికపుడు మేకప్‌ను రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం -
రిలయన్స్ ‘యూస్టా’ స్టోర్ ప్రారంభం
రిలయన్స్ రిటైల్ తన వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సమీపంలో నాగోల్-అల్కపురి క్రాస్ రోడ్ వద్ద కొత్తగా ‘యూస్టా’ ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ స్టోర్లు ఉన్నాయని కంపెనీ అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.దేశంలోని యువత అధికంగా ఇష్టపడే స్టైల్స్‌లో విభిన్న మోడల్స్‌ను యూస్టా అందిస్తోందన్నారు. ప్రస్తుతం యూస్టా స్టోర్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విస్తరించినట్లు చెప్పారు. ప్రీమియం మోడల్స్‌తోపాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఫ్యాషన్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..యువతను ఆకర్షించేలా చాలా ఫ్యాషన్ రిటైల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అందుబాటు దరల్లోనే తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. గార్మెంట్ పరిశ్రమ కూడా స్థానికంగా ఎంతో వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఇతర దేశాలకు చేసే ఎగుమతులు అధికమవుతున్నాయి. స్థానికంగా మంచి ఉత్పత్తులు అందిస్తే సంస్థల బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. -
రిఫైనింగ్ మార్జిన్లు పెరిగినా.. రిటైల్‌పై అనిశ్చితి
రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు ఇటీవల మందగించడానికి కారణమైన రిఫైనింగ్ మార్జిన్లు పుంజుకున్నా, రిటైల్ విభాగం తీరుతెన్నులను అంచనా వేయడం కష్టతరమేనని బ్రోకరేజి సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. రిటైల్ ఆదాయంపై అనిశ్చితి నెలకొన్నట్లు ఒక నివేదికలో వివరించింది. మార్కెట్లు బలహీనంగా ఉండడంతో జియో/రిటైల్ విభాగాల లిస్టింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.నివేదిక ప్రకారం జూన్ నుంచి గణనీయంగా పడిపోయిన రిఫైనింగ్ మార్జిన్లు క్రమంగా మెరుగుపడ్డాయి. అయితే, రిటైల్ రంగం మందగమనంతో పాటు కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రభావాలు ఉండటంతో రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి సమీప భవిష్యత్తు అంచనాలను వేయలేని పరిస్థితి నెలకొందని నివేదిక వివరించింది. జులై 8 నాటి గరిష్ట స్థాయి నుంచి రిలయన్స్ షేరు 22 శాతం క్షీణించిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా వాటితో పోలిస్తే రిలయన్స్ ఆకర్షణీయమైన ధరలో లభిస్తోందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌కు ఛాతీ నొప్పిరిలయన్స్లో ప్రధానంగా మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. మొదటిది ఆయిల్ రిఫైనింగ్.. పెట్రోకెమికల్, రెండోది టెలికం విభాగం జియో, మూడోది రిటైల్ సెగ్మెంట్. వీటితో పాటు మీడియా, న్యూఎనర్జీ వ్యాపారాలూ ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయంలో సుమారు 50 శాతం వాటా రిటైల్, టెలికం విభాగాలదే కావడం విశేషం. -
రిలయన్స్ రిటైల్ విస్తరణ
రిలయన్స్ రిటైల్ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. యువతకు ఫ్యాషన్ ఉత్పత్తులను అందించే ‘అజార్ట్’ బ్రాండ్ స్టోర్లను పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో 12 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలిపింది. జైపూర్, ఉదయపూర్, రాయ్‌పూర్, దెహ్రాదూన్, గోరఖ్‌పూర్, రాంచీ, బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.ఇప్పటికే బెంగళూరులో అజార్ట్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్ వీటి సంఖ్యను ఐదుకు పెంచింది. ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ సీఈఓ అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ..‘అజార్ట్ బ్రాండ్‌ను 2022లో స్థాపించాం. క్రమంగా బ్రాండ్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాం. యువత నుంచి ఈ బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఈ బ్రాండ్ యువతకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. వినియోగదారుల జీవనశైలిని ప్రతిబింబించేలా, మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించేలా కంపెనీ పనిచేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్పండగ సీజన్లో చాలా కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించాలని యోచిస్తుంటాయి. ఫెస్టివల్ నేపథ్యంలో తమ బ్రాండ్ ఉత్పత్తులకు ఆదరణ ఉంటుందని నమ్ముతాయి. కంపెనీ ఉత్పత్తులు వినియోగదారులకు నచ్చితే తదుపరి గిరాకీ ఏర్పడుతుందని భావిస్తాయి. -
‘స్మార్ట్’ స్టోర్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చమురు నుంచి టెలికామ్ వరకూ అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్... తన రిటైల్ బిజినెస్‌ను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం సుమారు 900 పైచిలుకు ఉన్న బిగ్ బాక్స్ స్టోర్స్ (స్మార్ట్ బజార్, స్మార్ట్ స్టోర్స్) సంఖ్యను వచ్చే ఏడాది ఆరంభానికల్లా వెయ్యికి పెంచుకోనుంది. చిన్న పట్టణాల్లో కూడా స్టోర్స్‌కి ఆదరణ లభిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ గణనీయంగా విస్తరిస్తున్నట్లు సంస్థ రిలయన్స్ రిటైల్ సీఈవో (గ్రోసరీ రిటైల్ బిజినెస్) దామోదర్ మాల్ తెలియజేశారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన... రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలను సమగ్రంగా వివరించారు. ఐఐటీ, ఐఐఎంలో విద్యాభ్యాసం చేసిన దామోదర్, యూనిలీవర్లో తన కెరీర్‌ను ఆరంభించారు. వ్యాపారవేత్తగా సొంతంగా సూపర్‌మార్కెట్ వెంచర్‌ను కూడా నిర్వహించారు. ఫ్యూచర్ గ్రూప్ తర్వాత రిలయన్స్ రిటైల్‌లో వేల్యూ ఫార్మాట్‌కి (స్మార్ట్ బజార్, రిలయన్స్ ఫ్రెష్ మొదలైనవి) సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే భారతీయ వినియోగదారుల పోకడలను, సూపర్ మార్కెట్ల తీరుతెన్నులను గురించి వివరిస్తూ ‘సూపర్మార్కెట్వాలా’, ‘బీ ఎ సూపర్మార్కెట్వాలా’ పుస్తకాలు కూడా రాశారు. రిలయన్స్ రిటైల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది... రిలయన్స్ రిటైల్‌కి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యముంది. ఎందుకంటే తొలి రిటైల్ స్టోర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాం. అలాగే తక్కువ ప్రాంతంలో ఎక్కువ స్టోర్స్ ఉన్నది కూడా ఇక్కడే. పండ్లు, ఎఫ్ఎంసీజీ, దుస్తులు, ఆహారోత్పత్తులు మొదలైనవన్నీ లభించే మా స్మార్ట్ బజార్ స్టోర్స్‌కి కూడా ఇక్కడ ప్రాధాన్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఫార్మాట్లకు సంబంధించి 180 పైచిలుకు స్టోర్స్ ఉండగా వీటిలో 75 పైగా బిగ్ బాక్స్ స్టోర్స్ ఉన్నాయి. తెలంగాణలోనూ వివిధ ఫార్మాట్ల స్టోర్స్ 145 పైచిలుకు ఉండగా వాటిలో సుమారు 45 బిగ్ బాక్స్ ఫార్మాట్లో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 330 పైగా స్టోర్స్ ఉన్నాయి. ఇక చిన్న పట్టణాల విషయానికొస్తే, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు, మదనపల్లె మొదలైనవి... అలాగే తెలంగాణలో బోధన్, సిద్దిపేట్ వంటి టౌన్లలో కూడా మా స్టోర్స్‌ను విస్తరించాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మా బిగ్ బాక్స్ స్టోర్స్ 900 పైచిలుకు ఉండగా వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోబోతున్నాం. పెద్ద నగరాల్లోలాగే చిన్న పట్టణాల్లోనూ వేల్యూ యాడెడ్, ప్రీమియం ఉత్పత్తుల కు మంచి డిమాండ్ ఉంటోంది. ఇక్కడి నుంచే భారీగా కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఆహారోత్పత్తులకు గణనీయమైన డిమాండ్ ఉంది. ఇక్కడ వాటి విక్రయాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించుకునేలా స్థానిక వ్యాపారులకు అవకాశాలు కల్పిస్తున్నాం. పలు లోకల్ బ్రాండ్లకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్లతో కలిసి పని చేస్తున్నాం. ప్రాంతీయంగా వినియోగదారులతో మరింతగా మమేకం అవుతూ ఇటీవల పలు స్టోర్స్‌లో బతుకమ్మ వేడుకలను కూడా నిర్వహించాం.మెరుగ్గా పండుగ సీజన్.. ప్రస్తుతం పండుగ వేడుకలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. వివిధ పండుగలను కలిసి జరుపుకుంటున్నారు. సాధారణంగా కొన్నాళ్ల క్రితం వరకు ఒక ప్రాంతానికి పరిమితమైన నవరాత్రి, దాండియా, పూజో మొదలైన వాటిని ఇపుడు మిగతా ప్రాంతాల వారు కూడా చేసుకునే ధోరణి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి, వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి మొదలైనవి పెద్ద స్థాయిలో జరుపుకుంటారు. ఇలాంటి పండుగ సీజన్లో ఆహారోత్పత్తులు, దుస్తులు, బహుమతులు మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటుంది. కాబట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల నుంచి ఉండే డిమాండ్‌కి అనుగుణంగా మా స్టోర్స్‌ను నిర్వహిస్తున్నాం. పండుగ సీజన్ సందర్భంగా మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాం. మా స్టోర్స్ విషయానికొస్తే పండుగ సీజన్ చాలా సానుకూలంగా ప్రారంభమైంది. వివిధ కేటగిరీలవ్యాప్తంగా విక్రయాలు బాగున్నాయి. పూజాద్రవ్యాలు, దుస్తులు మొదలైన వాటికి డిమాండ్ ఉంటోంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ పోటీపడుతున్నాయని అనుకోవడం కన్నా ఒకదానికి మరొకటి అనుబంధంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. అందుకే వీటన్నింటినీ కలిపి ఆమ్నిచానల్గా వ్యవహరిస్తున్నాం. ఇక, ఆన్లైన్లో ఫేక్ ఆఫర్ల విషయాల్లో వినియోగదారులు జాగ్రత్త వహించక తప్పదు. అపరిచితుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకుండా, విశ్వసనీయమైన చోటే కొనుగోలు చేయడం శ్రేయస్కరం. -
జస్ట్ డయల్ లాభం డబుల్.. ఓనర్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: స్థానిక సెర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 154 కోట్లను తాకింది.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహణలోని కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 72 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 261 కోట్ల నుంచి రూ. 285 కోట్లకు జంప్‌చేసింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. అటు బిజినెస్‌లు, ఇటు కన్జూమర్లకు అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్లు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 226 కోట్ల నుంచి రూ. 217 కోట్లకు పెరిగాయి. -
వరల్డ్ ఫేమస్ లగ్జరీ బ్రాండ్‌ను తీసుకొచ్చిన రిలయన్స్
రిలయన్స్ రిటైల్‌కు చెందిన సౌందర్య ఉత్పత్తుల వేదిక ‘తీరా’ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ స్కిన్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్‌ను భారత్‌లో ప్రారంభించింది. అగస్టినస్ బాడర్ కలెక్షన్ ప్రత్యేకంగా తీరా ఆన్‌లైన్‌తోపాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరులోని ఎంపిక చేసిన తీరా స్టోర్లలో అందుబాటులో ఉందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.దేశంలో తీరా స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండే ఈ అగస్టినస్ బాడర్ బ్రాండ్‌ను ప్రపంచ ప్రఖ్యాత స్టెమ్ సెల్, బయోమెడికల్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అగస్టినస్ బాడర్ స్థాపించారు. ఈ బ్రాండ్ ఉత్పత్తులతోపాటు వ్యక్తిగత స్కిన్‌కేర్ అవసరాలకు ఏ ఉత్పత్తులను ఎంచుకోవాలన్నదానిపై కస్టమర్లకు ఎక్స్పర్ట్ గైడెన్స్ కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.యూరోమానిటర్ ఎస్టిమేట్స్ ప్రకారం.. భారతదేశ బ్యూటీ మార్కెట్ 2025 నాటికి 20 బిలియన్ డాలర్లకు పెరగనుంది. అందులోనూ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ 15% వృద్ధి చెందనుంది. దేశంలో స్కిన్‌కేర్ ఉత్పత్తుల మార్కెట్ విలువ 2022లో 6.53 బిలియన్ డాలర్లు. ఇది 2027 నాటికి 8.84 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని రీసెర్చ్ అండ్ మార్కెట్స్ డేటా చెబుతోంది.బ్యూటీ మార్కెట్ వృద్ధి నేపథ్యంలో నైకా, టాటా క్లిక్ ప్యాలెట్, మింత్రా వంటి సంస్థలతో రిలయన్స్ రిటైల్ కంపెనీ తీరా పోటీ పడుతోంది. ఆన్‌లైన్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఓ డజను ఆఫ్‌లైన్ స్టోర్లను కూడా తీరా ప్రారంభించింది. -
వోగ్ మ్యాగజీన్ కవర్ పేజ్‌పై ఇషా అంబానీ..లుక్ మామూలుగా లేదుగా!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ పిరామిల్ మరోసారి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ అండ్ బ్యూటీ మేగజీన్ వోగ్ కవర్‌పేజీపై మరోసారి మెరిసారు. గార్డెన్ ప్రిన్సెస్‌గా మారిన ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకున్నారు. మేగజీన్ కవర్‌పేజీ కోసం చేసిన ఫోటోషూట్‌ను వోగ్ ఇండియా ఇన్‌స్టాలో ఖాతాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) ప్రత్యేకంగా తయారుచేసిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ డియోర్ గోల్డెన్ ఫ్రాక్‌లో ఇషా అంబానీ లుక్ అదిరిపోయింది. మ్యాచింగ్ రెడ్ అండ్ పింక్ గులీబాలు అమరి, చేతిలో బోకే, యాష్-టోన్ గ్లోవ్స్, కొత్త హెయిర్ స్టయిల్హైలైట్గా నిలిచాయి. ఈ ఫోటో షూట్లో రెండో లుక్‌లో చాలా ఎలిగెంట్‌గా కనిపించారామె. ‘నా ఉంగరాలు జుట్టు అంతగా ఇష్టం ఉండేది కాదు.. అలాగే షూట్ కోసం నా జుట్టును సెట్ చేస్తోంటే... నా స్కూలు కష్టాలు గుర్తొచ్చాయి. ఉంగరాల జుట్టు కంట్రోల్లోఉండాలంటే.. నూనె రాసుకోవడం, కిందికి దువ్వుకోవడం ఇవ్వన్నీ చెప్పేవారు. కానీ ఎపుడూ అలా జరగలేదు. సో... మనం ఎలా ఉన్నామో అలాగే హ్యాపీగా కంఫర్ట్‌గా ఉండాలి’’ అంటూ ఇషా పిరామిల్ తన కర్లీ హెయిర్ కష్టాలను గుర్తు చేసుకున్నారు.కాగా గతంలో కూడా వోగ్ ఇండియా కవర్ స్టోరీపైనా, మెట్‌గాలా ఫ్యాషన్ ఈవెంట్లో కూడా ఇషా కనిపించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ రీటైల్ బాధ్యతల్లో ఇషా దూసుకుపోతోంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలతో సంస్థను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా రిలయన్స్ రీటైల్ తమ కిరాణా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఉత్పత్తులను ముంబైలో గంటలో ఆర్డర్ డెలివరీ చేసేలా కొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ కొత్త బిజినెస్
రిలయన్స్ రిటైల్ క్విక్ కామర్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 30-45 నిమిషాల్లో తమ వినియోగదారులకు వస్తువులు అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఈ సర్వీస్ ప్రాథమికంగా ముంబయి, నవీ ముంబయిలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పింది. సమీప భవిష్యత్తులో క్రమంగా దీన్ని ఇతర నగరాలకు విస్తరిస్తామని పేర్కొంది.ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులను తక్షణమే డెలివరీ చేసేందుకు వీలుగా రిలయన్స్ రిటైల్ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. జియోమార్ట్ మొబైల్ అప్లికేషన్లో ‘హైపర్‌లోకల్ డెలివరీ’ ఎంపిక చేసుకుని వస్తువులు ఆర్డర్ పెట్టవచ్చని కంపెనీ చెప్పింది. వినియోగదారులకు తమ వస్తువులను 30-45 నిమిషాల్లో అందిస్తామని పేర్కొంది. ఇందుకోసం రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్ల చొరవ కీలకమని చెప్పింది.టాటా యాజమాన్యంలోని బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో.. వంటి క్విక్ కామర్స్ కంపెనీలు తమ వినియోగదారులకు 10 నిమిషాల్లోనే వస్తువులు అందిస్తున్నాయి. కానీ రిలయన్స్ రిటైల్ మాత్రం వస్తువుల డెలివరీ సమయాన్ని 30-45 నిమిషాలుగా ప్రతిపాదించింది. ఈ అంశంపై స్పందిస్తూ..‘ప్రస్తుతం మార్కెట్లో క్విక్ కామర్స్ సేవలందిస్తున్న కంపెనీలు డార్క్ స్టోర్ల ద్వారా వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. అందుకోసం కంపెనీ చాలా ఖర్చు చేయాలి. స్టోరేజీ ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. పెద్దసంఖ్యలో డెలివరీ సిబ్బందిని నియమించుకోవాలి. దానికి బదులుగా, రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్లను రిటైల్ డెలివరీకి వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. దాంతో డెలివరీ సమయం కొంత పెరిగినా కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కస్టమర్ల డెలివరీ మార్గాలను ఆప్టిమైజ్ చేయడానికి ఫైండ్(FYND), లోకస్(Locus) వంటి సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నాం’ అని చెప్పింది.గతేడాది రిలయన్స్..జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో నవీ ముంబయిలో క్విక్ కామర్స్ సర్వీస్‌ను ప్రారంభించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సేవలను నిలిపేసింది. తిరిగి తాజాగా తన సర్వీస్‌లను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ కిరాణా వ్యాపారం కోసం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్, జియోమార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ వరగంటితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. -
ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ బంపర్ డీల్ అందుకుంటోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ముకేశ్ అంబానీకి చెందిన జియో లీజింగ్ సర్వీసెస్ ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌తో రూ.35,904 కోట్ల డీల్ కుదుర్చుకోనుంది.టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, జియో లీజింగ్ సర్వీసెస్ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ .35, 904 కోట్ల విలువైన రౌటర్లు, సెల్ ఫోన్లు వంటి టెలికాం పరికరాలు, కస్టమర్ కేంద్రాల ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ డీల్ కు ఆమోదం పొందడానికి కంపెనీ వాటాదారులకు పోస్టల్ బ్యాలెట్ నోటీసును పంపినట్లు సమాచారం.జియో లీజింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎల్ఎస్ఎల్) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు అనుబంధ సేవలతో పాటు టెలికాం పరికరాలను లీజుకు ఇచ్చే వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డీల్ విజయవంతమైతే భారత టెలికాం రంగంలో ఇదే అతిపెద్ద ఎక్విప్మెంట్ లావాదేవీ అవుతుంది. నివేదిక ప్రకారం, జెఎల్ఎస్ఎల్ లీజింగ్ మోడల్ ద్వారా, ముఖేష్ అంబానీ లేటెస్ట్ 5జీ పరికరాలను ప్రజలకు అందుబాటు ధరలో అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మోడల్ ఆకాష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు మరింత మంది చందాదారులను ఆకర్షిస్తుంది. జియో ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. 2025 మార్చి నుంచి 2026 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరాల్లో ఈ లావాదేవీ జరగనుంది. -
ఇషా అంబానీ ప్రయత్నం ఫలిస్తుందా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యంలో ముఖేశ్అంబానీ మూడోతరానికి పాలనా పగ్గాలు ఎప్పుడో అప్పజెప్పారు. తన వ్యాపార బాధ్యతలను చూసుకునే భవిష్యత్ లీడర్లు వీరేనంటూ వారసులు ఆకాశ్, ఈశా, అనంత్ అంబానీల పేర్లను గతంలోనే ప్రకటించారు. రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలు ఇషా అంబానీ చేతికి వచ్చిన తర్వాత కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంబానీ కుమార్తె అనేక విదేశాలకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లను దేశంలోని వినియోగదారులకు పరిచయం చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. రిలయన్స్ రిటైల్ ఇండస్ట్రీస్ బ్రిటీష్ ఫ్యాషన్ లేబుల్ ప్రిమార్క్ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం జరిగితే టాటాకు చెందిన జూడియో, ల్యాండ్ మార్క్ గ్రూప్‌నకు చెందిన మ్యాక్స్, షాపర్స్ స్టాప్.. వంటి ప్రత్యర్థులకు రిలయన్స్ ఫ్యాషన్ పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. వాస్తవానికి బ్రిటీష్ ప్రిమార్క్ బ్రాండ్ ఖరీదైన దుస్తులు, పాదరక్షలకు ప్రసిద్ధి చెందింది. రిలయన్స్-ప్రిమార్క్ మధ్య జాయింట్ వెంచర్ లేదా లైసెన్సింగ్ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం వార్తలు రాకముందు ప్రిమార్క్ ఇండియాలో వ్యాపారాన్ని విస్తరించే దిశగా అడుగులువేసినట్లు తెలిసింది. ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని కంపెనీని మరింత లాభాల్లోకి తీసుకువెళ్లనున్నట్లు రిలయన్స్ రిటైల్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. ప్రిమార్క్ కంపెనీ లండన్ లిస్టెడ్ అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్ యాజమాన్యం పరిధిలో ఉంది. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 స్టోర్లను కలిగి ఉంది. 2026 చివరి నాటికి 530 అవుట్లెట్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ మెజారిటీ దుస్తులను చైనా నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తోంది. కంపెనీ తన ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయిస్తోంది. మహిళా కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ప్రిమార్క్ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. -
మరో వ్యాపారంలోకి అంబానీ!.. రూ.27 కోట్ల డీల్
'రావల్గావ్ షుగర్ ఫామ్' (Ravalgaon Sugar Farm) ఐకానిక్ క్యాండీ బ్రాండ్ త్వరలో 'ముకేశ్ అంబానీ' చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ కంపెనీ కొనుగోలుకు 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్' రూ. 27 కోట్ల డీల్ కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్, టట్టీ ఫ్రూటీ, పాన్ పసంద్, చాకో క్రీమ్, సుప్రీమ్ వంటి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన రావల్గావ్ షుగర్ ఫామ్, తన ట్రేడ్‌మార్క్‌లు, వంటకాలు వంటి అన్ని హక్కులను రిలయన్స్ కన్స్యూమర్‌కు విక్రయించినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. సుమారు రూ. 27 కోట్ల డీల్‌తో కంపెనీని విక్రయించడానికి డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. గత కొంతకాలంగా కంపెనీ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టడం వల్ల వ్యాపారాన్ని కొనసాగించడంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెరిగిన ముడిసరుకుల ధరల వల్ల పెట్టుబడి ఎక్కువవుతోండటంతో.. విక్రయానికి సిద్దమైపోతోంది. రావల్గావ్ షుగర్ ఫామ్ అనేది రావల్గావ్ వాల్చంద్ గ్రూప్‌లో భాగంగా 1933లో ఏర్పాటైంది. ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొని నిలదొక్కుకున్నప్పటికీ క్రమంగా లాభాలు క్షీణించాయి. 2023 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం కేవలం 9.66 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు! కారణం ఇదే.. కరోనా మహమ్మారి దేశంలో విజృంభించిన సమయంలో స్కూల్స్, ఆఫీసులు వంటివన్నీ నెలల తరబడి మూతపడి ఉన్నాయి. ఇది కంపెనీ వ్యాపారాన్ని గట్టిగా దెబ్బతీసింది. కరోనా తగ్గిన తరువాత కూడా కంపెనీ లాభాలు వృద్ధి చెందక పోవడం వల్ల సంస్థను అమ్మడానికి పూనుకుంది. -
రెండక్షరాల పేరు కోసం 254 కోట్లు చెల్లించిన ముఖేష్ అంబానీ!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓ కంపెనీ పేరు వాడుకోనేందుకు సదరు కంపెనీకి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రూ.254 కోట్లు చెల్లించారు. గత ఏడాది డిసెంబర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ‘రిలయన్స్ రీటైల్ వెంచర్స్’ జర్మనీ చెందిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. క్రయ, విక్రయ సమయంలో జరిగిన ఒప్పందంలో భాగంగా మెట్రోకు చెందిన 31 హోల్‌సేల్ స్టోర్లు, 6 స్టోర్లలో ఉన్న స్థలాల్ని సైతం చేజిక్కించుకుంది. అయితే భారత్‌లో కొత్త యజమాని రిలయన్స్ వ్యాపారాన్ని నిర్వహించడానికి వీలుగా మెట్రో లైసెన్స్‌లు ఇచ్చింది. మెట్రో ఇండియా ఆస్తులతో పాటు ఆ పేరును వినియోగించుకునేందుకు రూ.254 కోట్లు చెల్లించింది. ఇకపై తన పేరును రియలన్స్ వాడుకోవచ్చని మెట్రో తన వార్షిక ఫలితాల విడుదల నివేదికలో తెలిపింది. 2003లో అడుగు పెట్టి జర్మనీ రీటైల్ సంస్థ మెట్రో ఇండియా 2003లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 హోల్‌సేల్ పంపిణీ కేంద్రాలున్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న రిటైలర్లు వంటి బిజినెస్ కస్టమర్లతో ఈ సంస్థ వ్యాపారం నిర్వహిస్తోంది. ‘క్యాష్-అండ్-క్యారీ’ వ్యాపార నమూనాతో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. ఈ పద్దతిలో ప్రస్తుత మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఈ మెట్రో స్టోర్‌లో కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. -
ఇషా అంబానీకి చెందిన ఆ కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు!
ఆసియాలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌ను విస్తరిస్తూ మార్కెట్‌ను ఏలుతున్నారు. నెమ్మదిగా ఆయన వ్యాపార బాధ్యతలు తన పిల్లలకు అప్పగిస్తున్నారు. అందులో ఇషాఅంబానీ తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందుతోంది. ఇషా రిలయన్స్ రిటైల్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కంపెనీని దశల వారీగా విస్తరిస్తూ ప్రస్తుతం రూ.8 లక్షల కోట్ల కంపెనీగా మలిచింది. కంపెనీ అనేక ప్రఖ్యాత విదేశీ బ్రాండ్లను దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. దాదాపు 7వేల టౌన్‌ల్లో సుమారు 18వేల స్టోర్లతో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్ అభివృద్ధి వెనుక ఇషా అంబానీతోపాటు కంపెనీలో ఉన్నత స్థానంలోని వ్యక్తుల కృషి ఎంతో ఉందని ఆమె తెలిపారు. ఇప్పటికే బర్బెరీ, స్టీవ్ మాడెన్, అర్మానీ, బాలెన్సియాగా వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లతో రిలయన్స్ జతకట్టడానికి ఇషా అంబానీ ఎంతో కృషి చేసింది. రోజూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కంపెనీకి సారథిగా ఉండడం కొంత కష్టమైన పని. అయితే కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకునే కొందరు విశ్వసనీయ సహాయకులను ఆమె నియమించుకున్నారు. రిలయన్స్ రిటైల్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్, గ్రాసరీ, ఫార్మా రిటైల్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ తన మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించింది. 2020లో అమెరికా పెట్టుబడి సంస్థ సిల్వర్‌లేక్ 1.75 శాతం వాటాను రూ.7500 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీలో కేకేఆర్ సంస్థ 1.28 శాతం వాటా(రూ.5500 కోట్లు) కలిగి ఉంది. 2021లో ఫ్యూచర్గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ బిజినెస్‌ను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ గత సంవత్సరం ఏకంగా 3,300 స్టోర్లను ప్రారంభించింది. 78 కోట్ల మంది ఈ స్టోర్లను కస్టమర్లు సందర్శిస్తుండగా.. 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో కంపెనీ ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు సందర్శిస్తున్న టాప్-10 రిటైల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఇదీ చదవండి: 10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..! రిలయన్స్ రిటైల్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా రూ.82,646 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం దేశంలో 7000 టౌన్‌ల్లో మెుత్తం 18000 రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. కంపెనీలో 2.45 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇషా కంపెనీ పగ్గాలు చేపట్టిన తర్వాత రిలయన్స్ రిటైల్ విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.8.4 లక్షల కోట్లకు చేరుకుంది. -
హైదరాబాద్‌లో రిలయన్స్ ‘స్వదేశ్’.. నీతా అంబానీ చేతుల మీదుగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ ‘స్వదేశ్’ తొలి ఔట్‌లెట్‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్పర్సన్ నీతా అంబానీ చేతుల మీదుగా ఈ స్టోర్ ప్రారంభం కానుంది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది కొలువుదీరింది. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఫర్నిచర్, బొమ్మలు, ఆభర ణాలు, గృహాలంకరణ వస్తువులు, పెయింటింగ్స్, యాక్సెసరీస్‌తోపాటు వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తారు. దేశవ్యాప్తంగా చేతి వృత్తుల కళాకారులకు చెందిన గుర్తింపు ఉన్న సంఘాల నుంచి నేరుగా వీటిని సేకరిస్తారు. రూ.6 లక్షలకుపైగా ధర పలికే వస్తువులనూ విక్రయిస్తారు. -
రిలయన్స్ రిటైల్ చేతికి అరవింద్ బ్యూటీ బ్రాండ్స్
న్యూఢిల్లీ: వేగంగా వృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (బీపీసీ) వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అరవింద్ ఫ్యాషన్‌కి చెందిన అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్‌తో షేర్ల కొనుగోలు ఒప్పందం (ఎస్పీఏ) కుదిరినట్లు అరవింద్ ఫ్యాషన్ వెల్లడించింది. ఈక్విటీ వాటా విక్రయ విలువ రూ. 99.02 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. చెల్లించాల్సిన రుణాలు, ఈక్విటీ అంతా కలిపి సంస్థ మొత్తం విలువను రూ. 216 కోట్లుగా లెక్కగట్టినట్లు వివరించింది. డీల్‌లో భాగంగా అరవింద్ ఫ్యాషన్స్ నిర్వహిస్తున్న ఫ్రాన్స్ బ్యూటీ రిటైల్ బ్రాండ్ సెఫోరాకు భారత్‌లో ఉన్న 26 స్టోర్స్ కూడా ఆర్‌ఆర్‌వీఎల్‌కు దక్కుతాయి. ఇకపై తాము పూర్తిగా ఫ్యాషన్ (యూఎస్ పోలో, యారో మొదలైన 5 బ్రాండ్స్) పైనే దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ ఫ్యాషన్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ టర్నోవరు రూ. 336.70 కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌లోని రిటైల్ కంపెనీలన్నింటికీ ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ సంస్థగా ఉంది. బ్యూటీ రిటైల్ ప్లాట్‌ఫాం ’టిరా’ కొనుగోలుతో సౌందర్య సాధనాల వ్యాపారంలోకి ప్రవేశించింది. నైకా, టాటా, హిందుస్తాన్ యూనిలీవర్‌కి చెందిన లాక్మే మొదలైన దిగ్గజ బ్రాండ్స్‌తో పోటీపడుతోంది. రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్, పీక్ 15 సంయుక్త నివేదిక ప్రకారం 2022లో 19 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ 2027 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
రిలయన్స్-ఎస్బీఐ క్రెడిట్ కార్డు.. రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు!
ముంబై: రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్, ఎస్బీఐ కార్డు చేతులు కలిపాయి. తాజాగా రిలయన్స్ ఎస్బీఐ కార్డు పేరిట కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. దీనితో రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌లో జరిపే కొనుగోళ్లపై రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు పొందవచ్చని సంస్థ డైరెక్టర్ వి. సుబ్రమణియం తెలిపారు. అటు ఎస్బీఐ కార్డు అందించే ప్రత్యేక ఆఫర్లను కూడా అందుకోవచ్చు. వినియోగాన్ని బట్టి రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు, రిలయన్స్ రిటైల్ వోచర్లు మొదలైనవి ఈ ప్రయోజనాల్లో ఉంటాయి. ఈ కార్డు రెండు వేరియంట్లలో (రిలయన్స్ ఎస్బీఐ కార్డు, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్) లభిస్తుంది. వార్షిక రెన్యువల్ ఫీజు విషయానికొస్తే ప్రైమ్ కార్డుకి రూ. 2,999 గాను, రిలయన్స్ ఎస్బీఐ కార్డుకి రూ. 499 (పన్నులు అదనం) వర్తిస్తాయి. ప్రైమ్ కార్డుపై ఏటా రూ. 3,00,000 పైగా, రిలయన్స్ ఎస్బీఐ కార్డుపై రూ. 1,00,000 పైగా ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. -
RIL: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 29.7 శాతం పెరిగింది. దాంతో రూ.19,878 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు జియో, రిటైల్ వ్యాపారం మంచి పనితీరు కారణంగా కంపెనీ లాభాల్లో పయనిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ స్థూల ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.2,55,996 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌లు సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 12 శాతం పెరిగి రూ.5,297 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,729 కోట్లుగా ఉంది. కొత్తగా చేరే సబ్‌స్క్రైబర్ బేస్‌లో 7.5 శాతం పెరుగుదల నమోదైంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఆదాయం 18.8 శాతం పెరిగి రూ.77,148 కోట్లుగా నిలిచింది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.75 శాతం పెరిగి రూ.2,265.25 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా వేగంగా 5జీ సేవలు విస్తరిస్తామన్నారు. రిలయన్స్ రిటైల్ విస్తరణను కొనసాగిస్తామని చెప్పారు. ఇంధన మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ ఆయిల్2కెమికల్ విభాగానికి డిమాండ్ పెరిగిందన్నారు. -
అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం!
అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA).. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో 0.59 శాతం వాటా కోసం రూ. 4,966.80 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది దేశంలోని ఈక్విటీ విలువ ప్రకారం మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఉన్న 'రిలయన్స్ రిటైల్' సంస్థ ఇషా అంబానీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లడం మీద దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ రిటైల్ దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్స్ ద్వారా వేగంగా డెవలప్ అవుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. రిలయన్స్ రిటైల్ కంపెనీ కింద ఏకంగా 18,500 కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నట్లు.. దీని ద్వారా సుమారు 26.7 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో భాగస్వామి అయిన అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA)కి ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందని, ఈ పెట్టుబడి భారత ఆర్థిక వ్యవస్థ, మా వ్యాపార ప్రాథమిక అంశాలు, వ్యూహం, అమలు సామర్థ్యాలపై మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఇషా అంబానీ అన్నారు. రానున్న రోజుల్లో రిటైల్ రంగంలో మార్పులు వేగవంతంగా పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్! ఇక ఏడీఐఏ ప్రైవేట్ ఈక్విటీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హమద్ షాహ్వాన్ అల్ధహేరి మాట్లాడుతూ.. రోజు రోజుకి వేగంగా అభివృద్ధి చెందుతున్న రిలయన్స్ రిటైల్స్‌లో పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందని, ఈ పెట్టుబడి సంస్థలో ప్రత్యేక మార్పును తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ డీల్ కోసం మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. -
సూపర్డ్రైతో రిలయన్స్ జత
న్యూఢిల్లీ: దక్షిణాసియా మేధో హక్కుల(ఐపీ ఆస్తులు) విక్రయానికి రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ఫ్యాషన్ రిటైలర్ సూపర్‌డ్రై తాజాగా పేర్కొంది. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ) ద్వారా రిలయన్స్ రిటైల్ 4 కోట్ల పౌండ్లు(రూ. 402 కోట్లు) వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా స్వెట్‌షర్టులు, హుడీస్, జాకెట్స్ తదితర ఫ్యాషన్ ప్రొడక్టులను రూపొందిస్తున్న సూపర్‌డ్రై.. జేవీలో 24 శాతం వాటాను పొందనుంది. మిగిలిన 76 శాతం వాటా రిలయన్స్ రిటైల్ చేతిలో ఉంటుంది. ఒప్పందం ప్రకారం సూపర్‌డ్రై బ్రాండ్ ఐపీ ఆస్తులు కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీకి శాశ్వతంగా బదిలీకానున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ హోల్డింగ్ యూకేతో ఐపీ జేవీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సూపర్‌డ్రై పీఎల్సీ.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. తద్వారా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో సూపర్‌డ్రై బ్రాండుసహా.. సంబంధిత ట్రేడ్‌మార్క్‌లను జేవీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధుల ఆవశ్యకత: సూపర్‌డ్రై ఇటీవల హోల్‌సేల్ కస్టమర్ల నుంచి బలహీన ఆర్డర్ల కారణంగా స్టాక్ నిల్వలు, లిక్విడిటీ తదితర అంశాలలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీంతో జేవీకి తెరతీసింది. దీంతో స్థూలంగా 3.04 కోట్ల పౌండ్ల నగదు లభించనుందని అంచనా వేస్తోంది. కాగా.. తాజా ఒప్పందంతో రిలయన్స్ దక్షిణాసియాలోని మూడు దేశాలలో కార్యకలాపాలు చేపట్టనున్నట్లు సూపర్‌డ్రై తెలియజేసింది. జేవీలో సూపర్‌డ్రై వాటాను కొనసాగించడంతోపాటు.. తమ నైపుణ్యం ద్వారా బ్రాండ్ డెవలప్మెంట్, డిజైన్, మార్కెటింగ్‌లలో మద్దతిస్తుందని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీ దర్శన్ మెహతా చెప్పారు. భారత్ భారీ అవకాశాల మార్కెట్‌కాగా.. రిలయన్స్‌తో పటిష్ట బంధమున్నట్లు సూపర్‌డ్రై వ్యవస్థాపకుడు, సీఈవో జూలియన్ డంకెర్టన్ పేర్కొన్నారు. -
కష్టాల్లో స్టార్టప్: గుడ్‌బై చెప్పిన కో-ఫౌండర్
బెంగళూరుకు చెందిన ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ డన్జోకు భారీ షాక్ తగిలింది. లిక్విడిటీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి కంపెనీకి గుడ్‌బై చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతున్న స్టార్టప్ భారీ పునర్నిర్మాణ ప్లాన్ ప్రకటించిన తరువాత నలుగురు సహ వ్యవస్థాపకులలో ఒకరైన దల్వీర్ సూరి సంస్థ నుంచి నిష్క్రమించడం చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని డన్జో CEO కబీర్ బిస్వాస్ సోమవారం ఉదయం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. సూరి కొంత కాలంగా విరామం తీసుకోవాలని భావిస్తున్నారని, సరికొత్తగా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ త్రైమాసికం నుండే వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. (కిర్రాక్ కుర్రోడు: రూ. 45 వేలకే ‘రోల్స్ రాయిస్’! వైరల్ వీడియో) 2015 మే నుంచిస్టార్టప్ కంపెనీకి కో-ఫౌండర్‌గా సూరి ఆరేళ్లకు పైగా పనిచేశారు. అలాగే డంజో మర్చంట్ సర్వీసెస్ (DMS)తో సహా కొత్త వ్యాపారాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా గత కొన్ని నెలలుగా నిధుల సమీకరణం కోస కష్టపడుతోంది. ఈ కష్టాల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. నగదు కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థకు నిధులు రాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. వీటన్నింటికి తోడు నష్టాలను చవిచూస్తోంది. జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేదు. జీతాల చెల్లింపులను పలుమార్లు వాయిదా వేసిన సంస్థ గత నెలలో, Dunzo ఆగస్టు నెల జీతాలకుగాను పేరోల్ ఫైనాన్సింగ్ కంపెనీ OneTapతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ రెండో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన గూగుల్ , బకాయిలు చెల్లించమని కోరుతూ కంపెనీకి లీగల్ నోటీసు పంపిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయవచ్చు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ సంస్థ నీలెన్సో , గూగుల్ కలిపి దాదాపు రూ.4 కోట్లు బకాయినోటీసులిచ్చాయి. అయితే ఎపుడు సూరి పదవీకాలం ముగిసేది, అతని స్థానంలో ఎవరు రాబోతున్నారనేది వెల్లడించలేదు. సూరి, బిశ్వాస్‌తోపాటు అంకుర్ అగర్వాల్ , ముకుంద్ ఝా కంపెనీ ఇతర సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో బిస్వాస్‌కు మాత్రమే కంపెనీలో 3.57 శాతం ఈక్విటీ వాటా ఉంది. సూరికి ఈక్విటీ లేదు జీతం కూడా లేని కారణంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు Dunzo ఇప్పటివరకు Reliance, Google, Lightrock, Lightbox, Blume Ventures ఇతర కంపెనీల నుంచి 2015 నుండి దాదాపు 500 మిలియన్ డాలర్లను సేకరించింది. రిలయన్స్ కంపెనీలో 25.8 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. ప్రైవేట్ మార్కెట్ డేటా ప్రొవైడర్ Tracxn ప్రకారం, ప్రస్తుతం Dunzoలో 19 శాతం యాజమాన్యంతో Google రెండో అతిపెద్ద వాటాదారు. డంజో దాదాపు రూ.250 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. -
రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ దాదాపు రూ. 2,070 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇందుకుగాను కేకేఆర్‌కు 1,71,58,752 ఈక్విటీ షేర్లను జారీ చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. దీంతో రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ వాటా 1.17 శాతం నుంచి 1.42 శాతానికి బలపడింది. ఈ నెల మొదట్లో అనుబంధ రిటైల్ సంస్థలో కేకేఆర్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పేర్కొన్న సంగతి తెలిసిందే. 1976లో ఏర్పాటైన కేకేఆర్ 2023 జూన్‌కల్లా 519 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉంది. కాగా.. ఈ నెల మొదట్లోనే ఆర్ఐఎల్ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) నుంచి రూ. 8,278 కోట్ల పెట్టుబడులను అందుకుంది. తద్వారా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో 1 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇక 2020లో వివిధ గ్లోబల్ పీఈ సంస్థలకు 10.09 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 47,265 కోట్లను సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ విషయం! -
రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు
KKR invests Reliance Retail రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ భారీ పెట్టుబడులను సాధించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అమెరికాకు,చెందిన KKR, రిలయన్స్‌రీటైల్ వాటాను1.42 శాతానికి పెంచుకోనుంది. ఇందుకుగాను రిలయన్స్ రీటైల్లో రూ. 2,070 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 8.36 లక్షల కోట్లకు చేరిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. దీంతో ఈక్విటీ విలువ పరంగా దేశంలోని మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గత నెలలో ముఖేష్ అంబానీ రిటైల్ సామ్రాజ్యంలో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడితరువాత ఈ ఒప్పందం జరిగడం విశేషం. న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ KKR రిలయన్స్ రిటైల్‌లో 2020లో ఆర్ఆర్విఎల్లో 1.28 శాతం వాటాల కొనుగోలు ద్వారా రూ. 5,550 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కొనుగోలుతో మొత్తం ఈక్విటీ వాటా పూర్తిగా పలచన ప్రాతిపదికన 1.42శాతానికి పెరిగింది. 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించింది. దీంతో పాటు KKR రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం యూనిట్ అయిన జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్‌లో కూడా పెట్టుబడిదారుగా ఉంది. (జీ20 సమ్మిట్: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన) 1976లో స్థాపించబడిన, KKR జూన్ 30, 2023 నాటికి సుమారు 519 బిలియన్ల డాలర్లు ఆస్తులను కలిగి ఉంది. కేకేర్ ఫాలోఅన్ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ, ఇటు రిలయన్స్‌తో భాగస్వామ్యంపై KKR సహ-CEO జో బే ఈ డీల్‌పై సంతోషం ప్రకటించారు. భారతదేశంలో నిజమైన కార్పొరేట్ లీడర్, ఇన్నోవేటర్. ఈ బృందంతో భాగస్వామ్యాన్ని కొనసాగించే అవకాశం లభించడం సంతోషమని కెకెఆర్లోని ఆసియా పసిఫిక్ ప్రైవేట్ ఈక్విటీ హెడ్ గౌరవ్ ట్రెహాన్ పేర్కొన్నారు. (విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?) -
ఇషా అంబానీతో జతకట్టిన అలియాభట్! ఇక దూకుడే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt), రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ( Isha Ambani) జతకట్టారు. ఎడ్-ఎ-మమ్మా అనే వ్యాపార సంస్థతో బిజినెస్ రంగంలోనూ పేరుగాంచిన అలియాభట్, రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్‌తో చేతులు కలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు అలియాభట్. ఇషా అంబానీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘బూట్స్ట్రాప్డ్ వెంచర్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma), భారతదేశపు అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd) సంస్థలు చేతులు కలిపాయి. ఇక రెండూ కలిసి వ్యాపారం సాగిస్తాయి’ అని అలియాభట్ పేర్కొన్నారు. ఇద్దరు తల్లులమైన తాము ఇలా చేతులు కలపడం మరింత ప్రత్యేకమైందని వివరించారు. (తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!) ఎడ్-ఎ-మమ్మా కంపెనీని 2020లో ఏర్పాటు చేశారు అలియా భట్. ఇది ప్రత్యేకంగా పిల్లలు, టీనేజనర్ల దుస్తులు, ప్రసూతి తల్లులకు సంబంధించిన దస్తులు విక్రయించే ఆన్లైన్ షాపింగ్ సంస్థ. ఇక అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ, జిమ్మీ చూ వంటి ప్రముఖ బ్రాండ్ల సహకారంతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్లలో ఒకటిగా ఉంది. దీనికి డైరెక్టర్‌గా ఉన్న ఇషా అంబానీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!
Isha Ambani రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మరో కీలకమైన పదవికి ఎంపికైనారు. అంబానీ భార్య , రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్య, కళలు, క్రీడలు పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తూ, అనేక సామాజిక కార్యకలాపాలను నిర్వించే నీతా తన ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త వెంచర్ బాధ్యతలను కుమార్తె ఇషాకు అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) నీతా అంబానీ , నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ ద్వారా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇషా అంబానీ నేతృత్వంలో ఈ పాఠశాల భారతీయ ఆత్మతో భవిష్యత్తులో ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దనున్నట్టు కూడా వెల్లడించారు. రిలయన్స్ ఫౌండేషన్ రాబోయే 10 సంవత్సరాలలో రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల ద్వారా 50వేల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వనున్నామని, ఈ సంవత్సరంలోనే, సంస్థ 5000 స్కాలర్షిప్లను ప్రదానం చేశామని కూడా తెలిపారు. రిలయన్స్ రీటైల్ హెడ్‌గా దూసుకుపోతున్న ఇషా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కి వైస్ చైర్పర్సన్ కూడా. ఇపుడిక నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ బాధ్యతలను చేపట్టానున్నారు. అలాగే రిలయన్స్ రీటైల్‌కు సంబంధించి ఇప్పటికే పలు విదేశీ రిటైల్ బ్రాండ్లతో కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. -
తండ్రికి తగ్గ తనయ.. ఆకట్టుకున్న ఇషా అంబానీ మాటలు!
Isha Ambani at Reliance AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వ్యాపారం, పెట్టుబడులు.. ఇలా అన్ని అంశాల్లోనూ దూసుకెళ్తోంది. ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీ నాయకత్వంలో రిటైల్ బిజినెస్ పరుగులు పెడుతోంది. తాజాగా జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ ప్రగతిని ఇషా అంబానీ వివరించారు. రిలయన్స్ రిటైల్ 2023 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల లావాదేవీల మైలురాయిని దాటింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 42 శాతం పెరిగింది. సంస్థ రిజిస్టర్డ్ కస్టమర్ బేస్ 249 మిలియన్లకు చేరుకుంది. 3,300 కొత్త స్టోర్లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 65.6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 18,040 స్టోర్లకు రిటైల్ విస్తరణ చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ వివరించారు. ల్యాండ్‌మార్క్ ఇయర్ కంపెనీ డిజిటల్ కామర్స్, ఇతర కొత్త వ్యాపారాలు దాదాపు రూ.50,000 కోట్ల ఆదాయాన్ని అందించాయి. అంటే మొత్తం రెవెన్యూలో ఇది ఐదో వంతు. "మేము గత రెండు సంవత్సరాలలో 10 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.82 వేల కోట్లు)కుపైగా పెట్టుబడి పెట్టాం. సమ్మిళిత వృద్ధి, అంతర్గత బ్రాండ్లను పెంచుకోవడం, సప్లయి చైన్ నెట్‌వర్క్‌లను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడుతున్నాం" అని ఇషా అంబానీ చెప్పారు. రిటైల్ వ్యాపారానికి 2023 ఆర్థిక సంవత్సరాన్ని ఒక మైలురాయి సంవత్సరంగా ఆమె అభివర్ణించారు. ఇదీ చదవండి: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే.. “మేము గత సంవత్సరం 3,300 కొత్త స్టోర్లను ప్రారంభించాం. మొత్తం స్టోర్లు 18,040లకు చేరుకున్నాయి. 6.56 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని కవర్ చేశాం. ఈ స్టోర్లలో మూడింట రెండొంతులు టైర్ 2, టైర్ 3 నగరాలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయి" అని ఇషా అంబానీ పేర్కొన్నారు. తమ బ్యాకెండ్ వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ ఆస్తులలో కూడా కంపెనీ పెట్టుబడి పెడుతోంది. రిలయన్స్ రిటైల్ బలమైన వృద్ధి భారతదేశంలో ఈ-కామర్స్, ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనం. కంపెనీ తన ఫిజికల్ స్టోర్ నెట్‌వర్క్‌ను టైర్ 2, టైర్3 మార్కెట్లలోకి విస్తరించడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతోంది. భారతదేశంలోని 30 శాతానికి పైగా జనాభాకు తమ ఉత్పత్తులను అందిస్తున్నట్లు ఇషా అంబానీ చెప్పారు. ఇవన్నీ రిలయన్స్ రిటైల్‌ను ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే టాప్-10 రిటైలర్లలో ఒకటిగా నిలిపాయని వివరించారు. నాలుగు ‘సీ’ల సూత్రంపైనే.. రిటైల్ వ్యాపారం కొలాబరేషన్, కన్జ్యూమర్ ఎంగేజ్మెంట్, క్రియేటివిటీ, కేర్ అనే 4 సీ(C)ల సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రిలయన్స్ రిటైల్ భారతీయ కుటుంబాల రోజువారీ అవసరాలను 90 శాతానికి పైగా తీర్చేలా ఉత్పత్తులను అందిస్తోంది. కిరాణా వ్యాపారంలో ఈ సంవత్సరంలో 18 లక్షల మెట్రిక్ టన్నుల కిరాణా సామగ్రిని విక్రయించాం. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్‌లో సంవత్సరంలో దాదాపు 5 లక్షల ల్యాప్‌టాప్‌లు, 23 లక్షలకు పైగా ఉపకరణాలను విక్రయించాం. ఇక ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్ వ్యాపారంలో ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో 50 కోట్ల వస్త్రాలను విక్రయించినట్లు ఇషా అంబానీ చెప్పారు. కంపెనీ ఇటీవల యువత లక్ష్యంగా ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్ యూస్టాను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్లో తన మొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ఇది యువతకు సరసమైన ధరలలో ఫ్యాషన్ ఉత్పత్తులు అందిస్తుంది. ఇదీ చదవండి: అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం.. అయినా తగ్గేదేలే.. -
అంబానీ కంపెనీ దూకుడు! భారీగా పెరిగిన నికర రుణం
దూకుడు మూలధన వ్యయం కారణంగా 2023 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( Reliance Industries Ltd )కు చెందిన రిటైల్ విభాగం నికర రుణం అనేక రెట్లు పెరిగింది. ఏడాది క్రితం రూ.1,600 కోట్లు ఉన్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ( Reliance Retail Ventures Ltd ) నికర రుణం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.37,500 కోట్లకు పెరిగినట్లుగా కంపెనీ ఫైలింగ్స్ ద్వారా తెలుస్తోంది. కంపెనీ మూలధన వ్యయంలో భారీ పెరుగుదలే నికర రుణం ఈ స్థాయిలో పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కంపెనీ క్యాపెక్స్ 70 శాతం పెరిగి రూ.51,400 కోట్లకు చేరింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొత్తం మూలధన వ్యయంలో మూడవ వంతు. రిలయన్స్ మూలధన వ్యయం గత ఏడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా 2023 ఆర్థిక సంవత్సరంలో 85 ఉందని జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఒక పరిశోధనా నోట్లో తెలిపింది. ఇక కంపెనీ రిటైల్ సెగ్మెంట్ మూలధన వ్యయం గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1 లక్ష కోట్లకుపైగా ఉంది. స్థాయితో సంబంధం లేకుండా పోర్ట్‌ఫోలియో స్ప్రెడ్‌లో రిలయన్స్ రిటైల్ దూసుకెళ్తోంది. ఇదీ చదవండి: Yousta: తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే.. -
తక్కువ ధరలతో రిలయన్స్ కొత్త ఫ్యాషన్ బ్రాండ్.. తొలి స్టోర్ హైదరాబాద్‌లోనే..
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ( Reliance Retail Ltd ) వ్యాల్యూ అపరెల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇప్పటికే ప్రసిద్ధి చెందిన టాటా జూడియో ( Tata Zudio ) చైన్, ల్యాండ్‌మార్క్ గ్రూప్ యాజమాన్యంలోని మ్యాక్స్, షాపర్స్ స్టాప్‌కు చెందిన ఇక్ ట్యూన్‌కి పోటీగా కొత్త బ్రాండ్ యూస్టా ( Yousta )ని ప్రారంభించింది. అన్ని ఉత్పత్తులు రూ. 999 లోపే సమకాలీన టెక్-ఎనేబుల్డ్ స్టోర్ లేఅవుట్లతో, యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సరసమైన ధరలకు యూస్టా హై ఫ్యాషన్ ఉత్పత్తులను అందిజేస్తుందని కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్టోర్‌లో అన్ని ఉత్పత్తులు రూ. 999 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అందులోనూ ఎక్కువ భాగం రూ. 499 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం విశేషం. హైదరాబాద్‌లో తొలి స్టోర్ రిలయన్స్ యూస్టా తమ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్లో ప్రారంభించింది. యూస్టా స్టోర్లను అనేక టెక్ టచ్ పాయింట్లను అమర్చారు. క్యూఆర్ స్క్రీన్లు, సెల్ఫ్-చెక్అవుట్ కౌంటర్లు, కాంప్లిమెంటరీ వైఫై, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ యూస్టా ఉత్పత్తులను అజియో ( Ajio ), జియో మార్ట్ ( JioMart ) ద్వారా కూడా ఆన్లైన్లో యాక్సెస్ చేయవచ్చు. -
ఇషా అంబానీ దూకుడు: ఖతార్ నుంచి రూ.8 వేల కోట్ల పెట్టుబడులు
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పెట్టుబడుల విషయంలో దూసుకుపోతోంది. రిలయన్స్‌కు చెందిన రీటైల్ విభాగం భారీ పెట్టుబడులను సాధించింది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (QIA) రిలయన్స్ రీటైల్లో రూ. 8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి నిమిత్తం సంస్థలో దాదాపు ఒక శాతం వాటాను తీసుకుంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా, అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్)లో రూ. 8,278 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ బీఎస్ఈ ఫైలింగ్‌లోతెలిపింది. ఇది రిలయన్స్ రిటైల్‌లో 0.99 శాతం వాటాను కొనుగోలుతో మైనారిటీ ఈక్విటీ వాటాగా మారుతుంది. ఈ పెట్టుబడి ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూ రూ. 8.278 లక్షల కోట్లు అనిఆగస్టు 23న విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది. ఇషా అంబానీ ఏమన్నారంటే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో క్యూఐఏ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థను ప్రపంచ స్థాయి సంస్థగా మరింత అభివృద్ధి చేయడం ద్వారా, భారతీయ రిటైల్ రంగాన్ని మార్చేందుకు, క్యూఐఏ గ్లోబల్ అనుభవం బలమైన ట్రాక్ రికార్డ్ తమకు లబ్ది చేకూరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా రిటైల్ మార్కెట్లో, విభిన్నమైన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో చేరడంపై ఆనందంగా ఉందని క్యూఐఏ సీఈఓ మన్సూర్ ఇబ్రహీం అల్-మహమూద్ అన్నారు. కాగా ఆర్‌ఆర్‌విఎల్ 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి రూ. 4.21 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీ వాటాగా మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించిన సంగతి తెలిసిందే. -
అంబానీ ప్లాన్లు మామూలుగా లేవుగా: రూ.40 వేల కోట్లపై కన్ను
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో భారీ ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఆయిల్ నుంచి టెలికాం దాకా పట్టిందల్లా బంగారంలా దూసుకు పోతున్న అంబానీ తాజాగా వేల కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ప్రపోజల్‌ను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ముందు ఉంచినట్టు సమాచారం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (InvIT) ద్వారా ప్రాథమికంగా రూ.400 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తోంది.దీనికి సంబంధించిన ప్రతిపాదనను సెబీ వద్ద దాఖలు చేసినట్లు ఇండియా రిటైలింగ్ రిపోర్ట్ చేసింది. రిలయన్స్ రిటైల్ ఇన్విట్ రానున్న రెండు నెలల్లో ప్రారంభంలో సుమారు రూ.400 కోట్లను సమీకరించనుంది. మొదటి రౌండ్ నిధులతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అయితే ఈ ఏడాది క్యూ4 నాటికి మొత్తంగా రూ.25,000-40,000 కోట్ల దాకా నిధులను సేకరించాలనేది ప్రణాళిక. అయితే ఈ వార్తలపై రిలయన్స్ అధికారంగా స్పందించాల్సి ఉంది. (అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఎల్ఐసీ భారీ వాటా కొనుగోలు) 2.4-3 బిలియన్ డాలర్ల ట్రస్ట్‌తో రిటైల్ వేర్‌హౌసింగ్ ఆస్తులను మోనటైజ్ చేయడానికి సిద్ధమవుతోందన్న వార్తలు గత ఏప్రిల్ నుంచే హల్‌చల్‌చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ రిటైల్ విభాగం ఇటీవలి కాలంలో ఆఫ్‌లైన్ సెగ్మెంట్లో భారీగా విస్తరిస్తోంది.ఈ క్రమంలో రిలయన్స్ రిటైల్ ఇతర కీలకమైన అంబానీ సంస్థలను అధిగమించి 112 బిలియన్ డాలర్ల విలువగా బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ ఇటీవల నివేదించడం గమనార్హం. దీంతో ఈ వార్తలు మరింత బలం చేకూరుతోంది. కాగా 2022 ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ పగ్గాలను ఇషా అంబానీ చేపట్టారు. ఆమెనేతృత్వంలోని రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడి రూ. 25,000 కోట్లకు పైమాటే.దీనికి అదనంగా రూ. 15000 కోట్లుపెట్టుబడులను రిలయన్స్ అందించనుంది. -
తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ
దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇపుడు కుటుంబ వారసురాలిగా బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంబానీ తనయ ఇషా అంబానీ కూడా సంచలనం సృష్టించారు. రిలయన్స్ రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ లాభాల్లో మాతృ సంస్థనే అధిగమించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన రిలయన్స్‌తో పోలిస్తే దాదాపు రెండింతలు విలువను కలిగి ఉందట. బాధ్యతలను స్వీకరించిన అనతి కాలంలోనే రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు ఇషా. బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ తాజా నివేదిక ప్రకారం ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ విలువను రూ.9,26,055 కోట్లుగా (112 బిలియన్ డాలర్లు) అంచనా వేసింది. ఆయిల్ టు కెమికల్స్ రిలయన్స్ వ్యాపారం రూ.4,71,295 కోట్ల కంటే రెండు రెట్లు ఎక్కువ అని తెలిపింది. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) రిలయన్స్ రిటైల్ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు, భారీ పెట్టుబడులతో సరికొత్త విస్తరణలతో కంపెనీని కొత్త పుంతలు తొక్కిస్తోంది. రిలయన్స్ EBITDA భారీ పెరుగుదలకు డిజిటల్ రిటైల్, న్యూ ఎనర్జీతో సాధ్యమైందని బెర్న్‌స్టెయిన్ వెల్లడించింది. అంతేకాదు 2027 రిలయన్స్ రిటైల్ వ్యయం రూ.18,900 కోట్లకు చేరుకుంటుందని అంచనావేసింది. రిలయన్స్ మొత్తం మూలధన వ్యయంలో 19శాతం వాటాను కలిగి ఉంటుందని కూడా అంచనా వేసింది.రిలయన్స్ రిటైల్ మార్కెట్ నాయకత్వం స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం (గత రెండు సంవత్సరాల్లో 1.5 రెట్లు), కొత్త బ్రాండ్లను (1.2 బిలియన్ డాలర్లుపెట్టుబడులు), ఇ-కామర్స్/న్యూ కామర్స్ (రూ. 18 శాతం మిశ్రమం) కొనుగోళ్లతో 7.7 శాతం ఆరోగ్యకరమైన మార్జిన్లతో ప్రత్యర్థులతో పోలిస్తే వార్షిక ప్రాతిపదిక (రూ. 20 శాతం)బలమైన వృద్ధిసాధిస్తోందని పేర్కొంది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) రిలయన్స్ రిటైల్ దేశంలో అతిపెద్ద ఆర్గనైజ్డ్ రీటైలర్ అని పేర్కొన్న బ్రోకరేజ్ సంస్థ, కంపెనీ ఆదాయం 30 బిలియన్ల డాలర్లతో దేశంలోని మూడు రిటైలర్ల ఉమ్మడి స్కేల్ కంటే 2.5 రెట్లు ఎక్కువఅని వ్యాఖ్యానించింది. 2022, ఆగస్టులో రిలయన్స్ రిటైల్ లీడర్‌గా ఇషా అంబానీ నియమితులైన సంగతి తెలిసిందే. -
ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్
ఆన్లైన్ మిల్క్, గ్రోసరి డెలివరీ సంస్థ మిల్క్‌బాస్కెట్ ఉద్యోగుల్ని తొలగించనుందంటూ వస్తున్న నివేదికలపై ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ స్పందించింది. గ్రోసరీ డెలివరీ సంస్థలో ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది. రియలన్స్ సంస్థ 2021లో మిల్క్ బాస్కెట్‌ను 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ సంస్థ ఈ మిల్క్ బాస్కెట్‌ను తన రీటైల్ సంస్థ జియో మార్ట్‌లో కలపనుందని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటిగ్రేట్లో భాగంగా గ్రోసరీ డెలివరీకి చెందిన ఉద్యోగుల స్థానాల్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు మిల్క్ బిస్కెట్ ప్రతినిధి తెలిపారు. అంతే తప్పా ఉద్యోగుల్ని తొలగించడం లేదని అన్నారు. లేఆఫ్స్‌పై వస్తున్న నివేదికల్ని కొట్టి పారేశారు. ఈ సందర్భంగా ‘మిల్క్ బిస్కెట్ ప్రస్తుతం, 24 నగరాల్లో కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. టైర్-1 సిటీల్లో డైలీ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్ని అందించడమే తమ లక్ష్యమని’ పేర్కొన్నారు. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, రిలయన్స్ మిల్క్‌బాస్కెట్ బ్రాండింగ్‌ను రీటైల్ విభాగంలో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కొంత కాలం మిల్క్‌బాస్కెట్ బ్రాండ్‌గా కొనసాగనుంది. మిల్క్ బాస్కెట్‌ను విడిచి పెట్టిన ఇటీల మిల్క్ బాస్కెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యతీష్ తల్వాడియా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ ఇమండీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గౌరవ్ శ్రీవాస్తవ కంపెనీని విడిచిపెట్టారు. సంస్థను విడిచిపెట్టిన చివరి కోఫౌండర్ తల్వాడియా కాగా, ఇతర సహ వ్యవస్థాపకులు ఆశిష్ గోయెల్, అనురాగ్ జైన్, అనంత్ గోయెల్‌లు 2021లో ఆ సంస్థను రియలన్స్ కొనుగోలు చేసిన తర్వాత నిష్క్రమించారు. కాగా, మిల్క్ బాస్కెట్లో మొత్తం 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?
ఆసియాలోనే అత్యంత ధనవంతులైన కుటుంబానికి చెందిన బిజినెస్ ఉమెన్ ఇషా అంబానీ వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బిలియనీర్ ముఖేష అంబానీ కుమార్తెగానే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అందేకాదు ఫ్యాషన్ ఐకాన్‌గా తన ఫ్యాన్స్నుఆకట్టుకుంటూనే ఉంటుంది. చూడచక్కని లెహంగా, ముచ్చటైన చీరలు, రాయల్ జ్యువెలరీ, అంతకుమించిన ఫ్యాషన్ అండ్ క్లాసీ స్టైల్‌తో అందర్నీ మెస్మరైజ్ చేయడం ఇషా స్పెషాల్టీ. ఈ నేపథ్యంలో 165 కోట్ల అన్‌కట్ డైమండ్ నెక్లెస్ వార్తల్లో నిలిచింది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్‌లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) ఇషా అంబానీ ఖరీదైన వస్తువులలో డైమండ్ నెక్లెస్ స్పెషల్‌గా నిలుస్తోంది. ఇషా తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో మొదట ధరించిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ కూడా ఒకటి. దీని ధర ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఆభరణాలు, వజ్రాల నిపుణుల ప్రకారం, 20 మిలియన్ల డాలర్లు (సుమారుగా రూ. 165 కోట్లు) ఉంటుందని అంచనా. ఇషా ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి మాట్లాడుకుంటే ఫ్యాషన్‌స్టార్ ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షెల్ఫ్‌ల నుండి రాణి పింక్ లెహంగాతో పాటు కాస్ట్లీ డైమండ్ నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్పోక్ అన్‌కట్ నెక్లెస్‌లో 50 పెద్ద అన్‌కట్ డైమండ్లతో చాలా స్పెషల్‌గా రూపొందించారట. అలాగే బనీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్‌ను గ్రాండ్ ఈవెంట్ సందర్బంగా ఇషా అదే నెక్లెస్‌ను ధరించింది. ఈవెంట్లో డిజైనర్ ద్వయం అబు జానీ అండ్ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎరుపు రంగు టల్లే కేప్‌తో అందమైన రెడ్ కలర్ వాలెంటినో గౌను ధరించింది. కాగా 2008లో ఫోర్బ్స్ 'యంగెస్ట్ బిలియనీర్ వారసురాలు' జాబితాలో ఇషా అంబానీ రెండవ స్థానంలో నిలిచింది. యేల్ యూనివర్శిటీ సైకాలజీ , సౌత్ ఏషియన్ స్టడీస్‌లో పట్టా పొందిన ఇషా రిలయన్స్కుచెందిన టెలికాం, రీటైల్ బిజినెస్‌లో దూసుకు పోతోంది. డిసెంబర్ 12, 2018న బిలియనీర్, అజయ్ పిరమల్, స్వాతి పిరమల్‌ల కుమారుడు, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్‌తో వివాహైంది. ఇషాకు ఇద్దరు పిల్లలు (ట్విన్స్) ఉన్నారు. -
ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకు పోతోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో భాగమైన ముఖేష్ అంబానీ, ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ బ్రాండ్స్, ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఎడ్-ఎ-మమ్మాను కొనుగోలుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత చర్చలు జరుపుతోందని సమాచారం. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అలియా భట్ బ్రాండ్‌ను రూ. 300 నుంచి 350 కోట్ల భారీ డీల్‌లో కొనుగోలు చేయాలని యోచిస్తోంది. పిల్లల దుస్తుల విభాగంలో తమ ఉనికిని బలోపేతానికి యోచిస్తున్న ఇషా అంబానీ, ఇప్పటికే పాపులర్ అయిన అలియా బ్రాండ్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అలియా భట్ అక్టోబర్ 2020లో ఎడ్-ఎ-మమ్మాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2-14 సంవత్సరాల వయస్సున్న కిడ్స్‌కు పూర్తి స్వదేశీ దుస్తులను విక్రయిస్తుంది. డిజిటల్ మార్కెట్‌ప్లేస్ ఆరంభంనుంచే అలియా బ్రాండ్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభంలో అలియా ఎడ్-ఎ-మమ్మా రూ. 150 కోట్లకు పైగా వాల్యుయేషన్‌ను సాధించిందని అంచనా. అటు రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం రూ. 918000 కోట్ల కంటే ఎక్కువ విలువను సాధించింది. అలాగే వాల్యుయేషన్ పరంగా ఇది ఇప్పటికే ఐటీసీ, హెచ్‌యూఎల్ లాంటి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలను అధిగమించింది. వరుస డీల్స్‌తో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు సవాల్ విసురుతోంది ఇషా. అయితే తాజా వార్తలపై అటు రిలయన్స్‌రీటైల్, ఇటు అలియా భట్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) కాగా ఆగస్ట్ 2022లో రిలయన్స్ రిటైల్ హెడ్‌గా ఇషా అంబానీని ముఖేష్ అంబానీ నియమించారు. అప్పటికి సంస్థ టర్నోవర్ రూ. 2 లక్షల కోట్టు. జిమ్మీ చూ, జార్జియో అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ లాంటి ఇతర ప్రపంచ బ్రాండ్లు రిలయన్స్ రిటైల్ భాగస్వామి బ్రాండ్‌గా భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. -
ముఖేష్ అంబానీ బాటలో.. ఈషా అంబానీకి మరో కీలక బాధ్యతలు
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జియో ఫైనాన్షియల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ డైరెక్టర్ ఈషా అంబానీనీ నియమించినట్లు తెలుస్తోంది. రిలయన్స్‌లో ఇండస్ట్రీస్ (RIL)లో జియో ఫైనాన్షియల్ ఓ భాగం. అయితే, ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్‌ను డీ మెర్జర్ (విడదీయడం) చేసింది. ఇందుకోసం ఎన్సీఎల్టీ ఆమోదం కూడా పొందింది. డీ మెర్జర్ తర్వాత జియో ‘ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services- JFSL) పేరిట స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం ఐపీఓకు వెళనున్నట్లు సమాచారం. ఈ తరుణంలో శుక్రవారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ముఖేష్ అంబానీ తన గారాల పట్టి ఈషా అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈషా అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతల్ని అప్పగించారు. మెక్ లారెన్స్ స్ట్రాటర్జిక్ వెంచర్స్ కు చెందిన హితేష్ సెథియాను మూడేండ్ల పాటు జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సీఈవో, ఎండీగా విధులు నిర్వహించనున్నారు. యేలే యూనివర్సిటీ డిగ్రీలో ఎకనామిక్స్, ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే పూర్తి చేసిన ఈషా అంబానీ రిలయన్స్ రీటైల్, జియో ఫ్లాట్‌ఫామ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా, డిజిటల్ లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి సేవల్ని అందించే జియో ఫైనాన్షియల్ సంస్థ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తన తండ్రి ముఖేష్ అంబానీ తరహాలో తన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చదవండి👉 టాటాలనే ఢీకొట్టేలా.. ఈషా అంబానీ మరో వ్యాపార ఎత్తుగడ! -
రిలయన్స్ స్నాక్స్ బిజినెస్.. భారత్‌లోకి అమెరికన్ బ్రాండ్ చిప్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అమెరికాకు చెందిన బ్రాండెడ్ కన్జూమర్ ఫుడ్స్ తయారీ సంస్థ జనరల్ మిల్స్‌తో రిలయన్స్ రిటైల్ చేతులు కలిపింది. తద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న స్నాక్స్ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. దేశీ మార్కెట్లో అలాన్స్ బ్యూగుల్స్ బ్రాండ్ కార్న్ చిప్స్ స్నాక్స్‌ను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ రిటైల్‌లో భాగమైన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్, (ఆర్సీపీఎల్) తెలిపింది. ముందుగా కేరళతో ప్రారంభించి ఇతర రాష్ట్రాల్లో క్రమంగా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. వీటి ధర రూ. 10 నుంచి ప్రారంభమవుతుంది. 110 బిలియన్ డాలర్ల ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) మార్కెట్లో గణనీయ మార్కెట్ వాటాను దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆర్సీపీఎల్ ఇటీవల క్యాంపా, సోస్యో, రస్కిక్, టాఫీమ్యాన్ తదితర బ్రాండ్స్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రిలయన్స్ రిటైల్ చేతికి లోటస్ చాకొలెట్లు -
మరో 9 వేల మందికి పింక్ స్లిప్స్ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా?
సాక్షి, ముంబై: బిలియనీర్ ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా భారీ ఎత్తున ఉద్యోగాలపై వేటు వేస్తున్న సంస్థల జాబితాలో చేరి పోయింది. ఇషా అంబానీ నేతృత్వంలోని జియో మార్ట్ ఇటీవల 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది చాలదన్నట్టు మరో 9 వేలమందిని తొలగించేందుకు యోచిస్తోందట. ఇటీవల చేసుకున్న 28 వేల కోట్ల డీల్ తరువాత ఈనిర్ణయం తీసుకుందని అంచనా. (Meta Layoffs ఇండియాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు షాక్!) తాజా నివేదికల ప్రకారం, రిలయన్స్ రిటైల్ 15వేల మంది సిబ్బందిలో మూడింట రెండు వంతుల మందికి పింక్ స్లిప్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగాఇప్పటికే వెయ్యిమందిని తొలగించింది. వీరిలో 500 మంది కార్పొరేట్ ఉద్యోగులే. ఇక మలిరౌండ్లో మరో 9000 మందిని రిజైన్ చేయాల్సిందిగా కోరనుంది. అంతేకాదు వేలాది మంది ఉద్యోగులను పనితీరు మెరుగుదల పథకం (పిఐపి) కిందికి తీసుకు రానుంది. మొత్తం సేల్స్, మార్కెటింగ్ టీమ్ సాలరీ స్ట్రక్చర్‌ని వేరియబుల్ పే స్ట్రక్చర్‌కు మార్చి వేసిందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. తన ఖర్చులను తగ్గించడం ద్వారా తన లాభాలను ఏకీకృతం చేయాలనుకుంటోంది. (సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే) రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ఇటీవలే మెట్రో క్యాష్ అండ్ క్యారీకి చెందిన 31 స్టోర్లను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు 3500 మంది ఉద్యోగులను కూడా తీసుకుంది. రిలయన్స్ రిటైల్ 2022-2023 నాలుగో త్రైమాసికంలో రూ. 2415 కోట్ల లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12.9 శాతం పుంజుకుంది. ఇలాంటి బిజినెస్ న్యూస్ అప్డేట్స్, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్ -
రిలయన్స్ రిటైల్ చేతికి లోటస్ చాకొలెట్లు
న్యూఢిల్లీ: చాకొలెట్లు, కోకోవా ప్రొడక్టుల కంపెనీ లోటస్ చాకొలెట్స్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా పేర్కొంది. 51 శాతం వాటా కొనుగోలుని తాజాగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ లోటస్ చాకొలెట్స్‌లో నియంత్రిత వాటా కొనుగోలు చేయనున్నట్లు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించింది. ఈ బాటలో అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ నెల 24కల్లా లోటస్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలియజేసింది. షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రకారం లోటస్‌లో మొత్తం 77 శాతం వాటాను రిలయన్స్ కన్జూమర్ కొనుగోలు చేయనుంది. ప్రమోటర్లు ప్రకాష్ పి.పాయ్, అనంత్ పి.పాయ్ నుంచి 51 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇందుకు షేరుకి రూ. 113 చొప్పున రూ. 74 కోట్లు వెచ్చించింది. సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇదీ చదవండి: 5,000 మందికి రిలయన్స్ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు.. -
బొమ్మల తయారీలోకి రిలయన్స్ రిటైల్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ స్థానికంగా బొమ్మల తయారీలోకి ప్రవేశించనుంది. బొమ్మలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా హర్యానా కంపెనీ సర్కిల్ ఈ రిటైల్‌తో భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బొమ్మల బిజినెస్‌లో సమీకృత కార్యకలాపాలను నిర్వహించే ప్రణాళికల్లో ఉన్నట్లు రిలయన్స్ రిటైల్ సీఎఫ్‌వో దినేష్ తలుజా పేర్కొన్నారు. కంపెనీ ఇప్పటికే సుప్రసిద్ధ బ్రిటిష్ బొమ్మల బ్రాండ్ హామ్లేస్తోపాటు, దేశీ బ్రాండు రోవన్ విక్రయాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మల బిజినెస్‌లో డిజైన్ నుంచి షెల్ఫ్వరకూ రిలయన్స్ రిటైల్ వ్యూహాత్మకంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. వెరసి బొమ్మల డిజైనింగ్, తయారీ, రిటైల్ మార్కెటింగ్ తదితరాలను చేపట్టడం ద్వారా టాయ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. -
ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా?
గత ఏడాది రిలయన్స్ రీటైల్ డైరక్టర్‌గా బాధ్యతల్ని చేపట్టిన ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీకి ఆర్ఎస్ సోధి (రూపిందర్ సింగ్ సోధి) రూపంలో సరికొత్త వెపన్ దొరికిందా? రిలయన్స్ రీటైల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈషా అంబానీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. కలిసి పనిచేయాలి. కలిసి సంబరాలు చేసుకోవాలి. రియలన్స్ కంపెనీ ఓ సందర్భంలో ఇచ్చిన స్లోగన్ ఇది. ఈ మాట రిలయన్స్ అధినేత కుటుంబానికి అతికినట్లు సరిపోతుంది. ధీరూబాయ్ సృష్టించిన వ్యాపారానికి వారసుడిగా వచ్చి సామ్రాజ్యంలా విస్తరించారు ముఖేష్. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్ రిలయన్స్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వ్యూహాలు రచిస్తుంది ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా రిలయన్స్ రీటైల్ విభాగానికి రారాణిగా కొనసాగుతున్న ఈషా అంబానీ.. తండ్రికి తగ్గ తనయగా ఏ రంగంలోకి అడుగు పెట్టినా తన దైన మార్క్‌ను చూపిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మేనేజిమెంట్ (జీసీఎంఎంఎఫ్నే అమూల్ (AMUL)గా పిలుస్తుంటారు) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆర్ఎస్ సోధికి ఈషా అంబానీ రిలయన్స్ రీటైల్, ఎఫ్ఎంసీజీ విభాగానికి అడ్వైజర్ బాధ్యతలు అప్పగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే జరిగితే టెలికాం రంగాన్ని జియో శాసించినట్లే.. రీటైల్ విభాగంలో రిలయన్స్ టార్చ్ బేరర్‌గా ఎదుగుతుందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఆర్ఎస్ సోధి ఎవరు? ఆర్ఎస్ సోధి ఢిల్లీలో జన్మించారు. మున్సిపల్ స్కూల్లో విద్యనభ్యసించిన ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ (IIRMA) నుండి ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమూల్‌లో సీనియర్ సేల్స్ ఆఫీసర్‌గా చేరారు. 2010 జూన్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. సోధీ హయాంలో అమూల్ ప్రపంచంలోని అతిపెద్ద పాలను ఉత్పత్తి చేసే కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. 1982లో అమూల్ ఆదాయం రూ.121 కోట్లు ఉన్నప్పుడు కంపెనీలో చేరగా.. 2022-23 నాటికి ఆ సంస్థ ఆదాయం రూ.72,000 కోట్లు దాటింది. ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన అమూల్ సామ్రజ్యంలో సోధీ బాధ్యతలు కీలకమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 'వరల్డ్స్ ఒరిజినల్ ఎనర్జీ డ్రింక్', అమూల్ ధూద్ పీతా హై ఇండియా వంటి ప్రకటనలతో కంపెనీని లాభాల బాట పట్టించడంలో సిద్ధహస్తులయ్యారు. కొరకరాని కొయ్యగా ‘కాంపా కోలా’ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సికోకు చెక్ పెట్టేలా యాభై ఏళ్ల క్రితం అనతి కాలంలోనే మార్కెట్ అగ్రగామి బ్రాండ్‌గా ఎదిగిన ‘కాంపా కోలా’ హక్కులను రిలయన్స్ దక్కించుకుంది. ప్రత్యర్ధులకు కొరకరాని కొయ్యగా తయారైంది. అదే బాటలో ఇండియన్ డైరీ మార్కెట్‌ను శాంసించేలా రిలయన్స్ రీటైల్ విభాగానికి డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈషా అంబానీ ఆర్ఎస్ సోధీని నియమించుకోనున్నారు. కాగా, ప్రస్తుతం ఇండియన్ డైరీ మార్కెట్ వ్యాల్యూ రూ.13లక్షల కోట్లుగా ఉంది. 2027 నాటికి రూ.30 లక్షల కోట్లకు వృద్ది సాధించనుంది. రిలయన్స్ రిటైల్ రిలయన్స్ రిటైల్ (Reliance Retail) బిజినెస్ కింద రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ స్మార్ట్ పాయింట్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, రిలయన్స్ ట్రెండ్స్, ప్రాజెక్ట్ ఈవ్, ట్రెండ్స్ ఫుట్‌వేర్, రిలయన్స్ జువెల్స్, హామ్లేస్, రిలయన్స్ బ్రాండ్స్, రిలయన్స్ కన్జ్యూమర్ బ్రాండ్స్, 7-ఇలెవన్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా,ఇషాకు రీటైల్ బాధ్యతలు! -
సౌందర్య సంరక్షణ విభాగంలోకి రిలయన్స్ రిటైల్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ తాజాగా సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. టిరా పేరిట రిటైల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. యాప్, వెబ్‌సైట్‌తో పాటు ముంబైలో తొలి టిరా రిటైల్ స్టోర్‌ను కూడా ప్రారంభించింది. 100 పైచిలుకు నగరాల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బ్రాండ్‌తో రిలయన్స్ ఇకపై హెచ్‌యూఎల్, నైకా, టాటా, ఎల్వీఎంహెచ్ మొదలైన దిగ్గజాలతో పోటీపడనుందని పేర్కొన్నాయి. అన్ని వర్గాల వినియోగదారులకు మెరుగైన అంతర్జాతీయ, దేశీయ సౌందర్య సంరక్షణ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు టిరా ఉపయోగపడగలదని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఈడీ ఈషా అంబానీ తెలిపారు. ఆన్లైన్ మార్కెట్ డేటా రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా ప్రకారం దేశీయంగా బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ 2023లో 27.23 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఇందులో 12.7 శాతం వాటా ఆన్లైన్ అమ్మకాల ద్వారా రానుంది. -
ఈషా అంబానీకి ఫోర్బ్స్ అవార్డు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ చైర్పర్సన్ ఈషా అంబానీ తాజాగా జెన్నెక్ట్స్ ఎంట్రప్రెన్యూర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు 2023 కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. ఆమెతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు కూడా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ ’సీఈవో ఆఫ్ ది ఇయర్’, మ్యాక్స్ హెల్త్‌కేర్ సీఎండీ అభయ్ సోయి ’ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను దక్కించుకున్నారు. ఈషా అంబానీ 2008లో ఫోర్బ్స్ రూపొందించిన యువ బిలియనీర్ వారసురాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిల్చారు. యేల్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదివారు. -
దేశీ రిటైల్ రంగం @ 2 లక్షల కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో ఒకటైన భారత్ 2032 నాటికల్లా 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఇది 844 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో అసంఘటిత రిటైల్ మార్కెట్ వాటా 87%గా ఉంది. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ సుబ్రమణియం వి. ఈ విషయాలు తెలిపారు. ‘రిటైల్ రంగం ఏటా 10 శాతం వృద్ధితో 2032 నాటికి ఏకంగా 2 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలవనుంది‘ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వ హించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయిలో ఉండటం, ఆర్థిక వనరుల కొరత వంటి సమస్యల కారణంగా అసంఘటిత రిటైల్ రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ వినియోగం ఉండటం లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమ్మిళిత, సుస్థిర వృద్ధికి తోడ్పడేలా వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సుబ్రమణియం చెప్పారు. అసంఘటిత రంగంలోని చిన్న వ్యాపారా ల సమ్మిళిత వృద్ధికి సహకరించేలా ప్రభుత్వ పాలసీ లు, బడా కంపెనీల వ్యాపార విధానాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న స్థాయి తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆధునీకరించుకుని, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు దోహదపడే విధమైన కొనుగోళ్ల వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లైసెన్సింగ్ విధానం మెరుగుపడాలి .. రిటైల్ రంగానికి లైసెన్సింగ్ వంటి అంశాలపరంగా సమస్యలు ఉంటున్నాయని సుబ్రమణియన్ చెప్పారు. ప్రస్తుతం ఒక రిటైల్ స్టోర్ ప్రారంభించాలంటే 10 నుంచి 70 వరకు లైసెన్సులు తీసుకోవాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ఇలా వివిధ లైసెన్సుల అవసరం లేకుండా వ్యాపార సంస్థకు ఒకే లైసెన్సు సరిపోయేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. మరోవైపు దేశీయంగా సరఫరా వ్యవస్థపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరిన్ని పెట్టుబడులు అవసరమని సుబ్రమణియన్ తెలిపారు. ప్రధానమైన సోర్సింగ్ ప్రాంతాలను అవసరానికి తగినట్లు విస్తరించుకోగలిగేలా గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానించాలని ఆయన చెప్పారు. తద్వారా సోర్సింగ్‌కు పట్టే సమయం తగ్గుతుందని, ఉత్పత్తుల రవాణా కూడా వేగవంతం కాగలదని పేర్కొన్నారు. ఇటు స్టోర్స్‌లోనూ, అటు ఈ–కామర్స్లోను కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం రిటైల్ రంగంలో క్రమంగా పెరుగుతోందని సుబ్రమణియన్ వివరించారు. 5జీ రాకతో ఇది మరింతగా పుంజుకోగలదని పేర్కొన్నారు. రిటైల్, ఈ–కామర్స్ పాలసీలపై కేంద్రం కసరత్తు డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ దేశీయంగా రిటైల్ రంగం వృద్ధికి ఊతమిచ్చే దిశగా జాతీయ స్థాయిలో రిటైల్ వాణిజ్యం, ఈ–కామర్స్ విధానాలను రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రుణ లభ్యత మొదలైన వాటి రూపంలో భౌతిక స్టోర్స్‌ను నిర్వహించే వ్యాపార వర్గాలకు ఇది తోడ్పాటునిచ్చే విధంగా ఉంటుందని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు. అటు ఆన్లైన్ రిటైలర్ల కోసం కూడా ఈ–కామర్స్ పాలసీని రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. రిటైల్ ట్రేడర్ల కోసం ప్రమాద బీమా పథకంపైనా కసరత్తు జరుగుతోందని, ప్రధానంగా చిన్న ట్రేడర్లకు ఇది సహాయకరంగా ఉండగలదని ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్‌పై సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ చెప్పారు. భౌతిక, ఆన్లైన్ రిటైల్ వాణిజ్యం రెండింటి మధ్య వైరుధ్యమేమీ లేదని, ఒకటి లేకుండా రెండోది మనలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో ఈ–కామర్స్ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, కొన్ని ఈ–కామర్స్ దిగ్గజాల గుత్తాధిపత్యానికి బ్రేక్ పడుతుందని సంజీవ్ వివరించారు. నాణ్యతలేని ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే లక్ష్యంతో వివిధ ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడంపై కేంద్రం దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు. -
రిలయన్స్ క్యూ3 లాభాలు ఢమాల్, జియో అదుర్స్
సాక్షి,ముంబై: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్యూ3 నికర లాభం 15 శాతం క్షీణించింది. 2022 డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఇందులో కన్సాలిడేటెడ్ నికర లాభం 15శాతం తగ్గి రూ. 15,792 కోట్లకుచేరింది. ఇది అంతకు ముందు సంవత్సరం రూ. 18,549 కోట్లుగా ఉంది. రిలయన్స్ ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ.2,20,592 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇది రూ.1,91,271 కోట్లు. అటు రిలయన్స్ బలమైన రిఫైనింగ్ మార్జిన్లు,ఇంధన డిమాండ్‌తో చమురు-రసాయనాల వ్యాపారం లాభపడింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా తమ టీమ్స్ బలమైన నిర్వహణ పనితీరులో అద్భుతంగా వర్క్ చేశాయని రిలయర్స్ ఛైర్మన్ అండ్ ఎండీ ముఖేశ్ అంబానీ సంతోషం వెలిబుచ్చారు. జియో లాభం జూమ్ కంపెనీకి చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫారమ్‌లు నికర లాభాలలో 28.6 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.4,881 కోట్లను సాధించింది. ఆదాయం 20.9 శాతం వృద్ధిచెంది 24,892 కోట్లుగా ఉంది. EBITDA 25.1 శాతం పెరిగి 12,519 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ రిటైల్ రిటైల్ విభాగం రిలయన్స్ రీటైల్ వ్యాపారం సంవత్సరానికి 6.2 శాతం వృద్ధితో రూ. 2,400 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 18.6 శాతం పెరిగి రూ.60,096 కోట్లకు చేరుకుంది. EBITDA 24.9 శాతం పెరిగి రూ.4,773 కోట్లకు చేరుకుంది. O2C చమురు నుంచి రసాయనాల (O2C) వ్యాపార ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,44,630 కోట్లకు చేరుకుంది. EBITDA 2.9 శాతం పెరిగి రూ.13,926 కోట్లకు చేరుకుంది. -
రిలయన్స్ చేతికి మెట్రో ఇండియా
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా రిలయన్స్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇప్పటికే పలు సంస్థలను కొనుగోలు చేసిన కంపెనీ తాజాగా జర్మనీ దిగ్గజం మెట్రో ఏజీకి భారత్‌లో ఉన్న టోకు వ్యాపార విభాగాన్ని దక్కించుకుంటోంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మెట్రో ఏజీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 2,850 కోట్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ డీల్ పూర్తి కానుంది. ‘చిన్న వ్యాపారస్తులు, సంస్థల క్రియాశీలక భాగస్వామ్యంతో విశిష్టమైన వ్యాపార వ్యూహాన్ని రూపొందించుకోవాలన్న మా లక్ష్యానికి మెట్రో ఇండియా కొనుగోలు తోడ్పడుతుంది‘ అని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ‘వృద్ధి చెందుతున్న, లాభదాయక హోల్‌సేల్ వ్యాపారాన్ని సరైన సమయంలో విక్రయిస్తున్నాం. మెట్రోను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రిలయన్స్ సరైన భాగస్వామి కాగలదని మేము విశ్వసిస్తున్నాం‘ అని మెట్రో ఏజీ సీఈవో స్టీఫెన్ గ్రూబెల్ పేర్కొన్నారు. రిలయన్స్ ఇప్పటిదాకా భారీ కిరాణా స్టోర్స్ వ్యవస్థపై ప్రధానంగా దృష్టి పెట్టిందని, మెట్రో హోల్‌సేల్ బిజినెస్ కొనుగోలు చేయడం దానికి ఉపయోగకరంగా ఉండగలదని కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ వెల్లడించింది. లాట్స్ హోల్‌సేల్ సొల్యూషన్స్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న సియామ్ మాక్రో వంటి సంస్థలు కూడా మెట్రోను కొనుగోలు చేసేందుకు పోటీపడినా చివరికి రిలయన్స్ దక్కించుకుంది. రూ. 7,700 కోట్ల అమ్మకాలు .. భారత్‌లో మెట్రో కార్యకలాపాలు 2003లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 21 నగరాల్లో 31 స్టోర్స్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. వీటిలో సగం స్టోర్స్ దక్షిణాదిలోనే ఉన్నాయి. 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. పండ్లు, కూరగాయలు మొదలుకుని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తుల వరకూ వివిధ ఉత్పత్తులను హోటల్స్, రెస్టారెంట్లు, ఆఫీసులు, కంపెనీలు, చిన్న రిటైలర్లు, కిరాణా స్టోర్స్ మొదలైన వర్గాలకు మెట్రో విక్రయిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 7,700 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. కంపెనీ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఇవే అత్యధిక విక్రయాలు కావడం గమనార్హం. 30 లక్షల మంది వ్యాపార కస్టమర్లు ఉండగా 10 లక్షల కస్టమర్లు క్రమం తప్పకుండా కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. 16 వేల పైగా రిలయన్స్ స్టోర్స్.. ఆర్‌ఆర్‌వీఎల్‌కు 16,600 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. 18 బిలియన్ డాలర్ల ఆదాయాలతో ప్రపంచంలో టాప్ రిటైలర్ల జాబితాలో 56వ స్థానంలో ఉంది. అత్యంత వేగంగా వృద్ధి చెందితున్న రిటైల్ సంస్థల లిస్టులో దక్షిణ కొరియాకు చెందిన కూపాంగ్ తర్వాత రెండో స్థానంలో ఉంది. జస్ట్ డయల్, డన్జోలను కొనుగోలు చేయడంతో పాటు ఇటీవలే ఇండిపెండెన్స్ పేరిట సొంత ఎఫ్ఎంసీజీ బ్రాండ్‌ను కూడా ఆవిష్కరించింది. దేశీ రిటైల్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 60 లక్షల కోట్లుగాను, ఇందులో సంఘటిత రంగం వాటా 12%గా ఉంటుందని అంచనా. సంఘటిత రంగంలోని ఫుడ్, గ్రోసరీ విభాగంలో రిలయన్స్‌కు ఇప్పటికే 20 శాతం వాటా ఉంది. పోటీ సంస్థ ‘మోర్’తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని కూడా రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు 2020లో రిలయన్స్ ప్రకటించింది. కానీ, రుణదాతల నుంచి మద్దతు లభించకపోవడంతో దాన్నుంచి విరమించుకుంటున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. ఎగ్జిన్లో 23.3% వాటాలు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎగ్జిన్ టెక్నాలజీస్‌లో తమ అనుబంధ సంస్థ రిలయన్స్ స్ట్రాటెజిక్ బిజినెస్ వెంచర్స్ 23.3 శాతం వాటాలు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకోసం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 207 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. జీపీఎస్ వంటి నేవిగేషన్ టెక్నాలజీ లేకపోయినా క్లిష్టమైన ప్రాంతాల్లోనూ డ్రోన్లు, రోబోలు తిరిగేందుకు ఉపయోగపడే అటానమీ సాంకేతికతను ఎగ్జిన్ అందిస్తుంది. -
రిలయన్స్ డీల్‌కు మెట్రో ఏజీ సమ్మతి!
న్యూఢిల్లీ: జర్మనీ కంపెనీ మెట్రో ఏజీకి చెందిన దేశీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 మిలియన్ యూరోలకు (రూ.4,060 కోట్లు) సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని వారాల నుంచి డీల్‌పై మెట్రో ఏజీ, రిలయన్స్ రిటైల్ మధ్య చర్చలు నడుస్తున్నాయని, గత వారమే రిలయన్స్ రిటైల్ డీల్‌కు మెట్రో ఏజీ అంగీకారం తెలిపినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. మెట్రో క్యాష్ అండ్ క్యారీకి దేశవ్యాప్తంగా ఉన్న 31 హోల్‌సేల్ పంపిణీ కేంద్రాలు, భూమి, ఇతర ఆస్తులు ఈ ఒప్పందంలో భాగంగా ఉండనున్నట్టు చెప్పాయి. ఈ సమాచారాన్ని ఇరు కంపెనీల ప్రతినిధులు తిరస్కరించడం కానీ, అంగీకరించడం కానీ చేయలేదు. మార్కెట్ ఊహాగానాలపై స్పందించబోమని స్పష్టం ఏశాయి. -
సెలూన్ వ్యాపారంలోకి రిలయన్స్!
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు సెలూన్ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. గ్రూప్ సంస్థ, దేశీయంగా అతి పెద్ద రిటైలింగ్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ తాజాగా చెన్నైకి చెందిన నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి నేచురల్స్ ప్రమోటర్లతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించబోతున్నది మాత్రం వెల్లడి కాలేదు. తమ కంపెనీ చరిత్రలోనే ఇది ‘అతి పెద్ద మలుపు‘ అంటూ నేచురల్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సీకే కుమరవేల్ .. లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ‘ఒక బహుళజాతి దిగ్గజం సెలూన్ పరిశ్రమలోకి ప్రవేశించబోతోంది’ అని పేర్కొన్నారు. ‘నేచురల్స్‌లో రిలయన్స్ రిటైల్ 49 శాతం వాటా కొనబోతోంది. దీనితో సెలూన్ల సంఖ్య మొత్తం 700 నుండి 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. రాబోయే రోజుల్లో నేచురల్స్‌లో గణనీయమైన మార్పులు చూడబోతున్నాం’ అని కుమరవేల్ పోస్ట్ చేశారు. నేచురల్స్ కార్యకలాపాల విస్తరణలో సహాయపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, నేచురల్స్‌లో వాటాల కొనుగోలు వార్తలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి .. తాము ఎప్పటికప్పుడు వివిధ అవకాశాలను పరిశీలిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ డీల్ పూర్తయితే లాక్మే బ్రాండ్ పేరిట సెలూన్ సెగ్మెంట్లో కార్యకలాపాలు సాగిస్తున్న హిందుస్తాన్ యూనిలీవర్ వంటి దిగ్గజాలతో రిలయన్స్ రిటైల్ పోటీపడనుంది. 2000ల తొలినాళ్లలో కార్యకలాపాలు ప్రారంభించిన నేచురల్స్‌కు దేశవ్యాప్తంగా 700 సెలూన్లు ఉన్నాయి. 2025 నాటికి వీటి సంఖ్యను 3,000కు పెంచుకోవాలని యోచిస్తోంది. ఇక రిలయన్స్ గ్రూప్‌లో అన్ని రిటైల్ కంపెనీలకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) హోల్డింగ్ కంపెనీగా ఉంది. దీనికి రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్వీఎల్ రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్ (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదు చేసింది. రిలయన్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కేవీ కామత్ ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్‌ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రకటించింది. 74 సంవత్సరాల కామత్‌ను ఐదేళ్ల కాలానికి నియమించినట్లు సంస్థ స్టాక్ ఎక్సే్ఛంజ్‌కి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. 1971లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్, పద్మభూషణ్ కామత్‌కు బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల పదవీ విరమణ చేసిన రిలయన్స్ బోర్డులోని ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరి స్థానంలో కామత్ నియమితులయ్యారు. -
రిలయన్స్ స్పెషల్ ప్రొడక్ట్స్, బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ ఆల్‌రౌండర్
హైదరాబాద్: రిలయన్స్ రిటైల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అజియో మంగళవారం అథ్లెయిజర్ బ్రాండ్ ‘‘ఎక్సెలరేట్’’ను ఆవిష్కరించింది. భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా బ్రాండ్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. క్రీడలు, ఫిట్నెస్ ఔత్సాహికులకు అవసరమయ్యే స్పోర్ట్ షూస్, అథ్లెటిక్, లైఫ్‌స్టైల్ పాదరక్షలు, ట్రాక్ ప్యాంట్, టీ-షర్టులతో పాటు ఇతర ఉపకరణాలు ఇందులో లభిస్తాయి. ఈ సరికొత్త ఉత్పత్తులు అజియో బిజినెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి. రూ.699 ప్రారంభ ధరతో గొప్ప ఆఫర్లు పొందవచ్చు. ఎక్స్‌లరేట్ ప్రచారకర్తగా నియమితులు కావడంపై హార్ధిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశారు. ‘డోంట్ బ్రేక్, ఎక్సెలరేట్’ అనే ట్యాగ్‌లైన్‌తో పాండ్యా ప్రచారం కల్పిస్తూ బ్రాండ్‌ను ప్రజలకు మరింత చేరువ చేస్తారని రిలయన్స్ రిటైల్ సీఈవో అఖిలేష్ ప్రసాద్ తెలిపారు. -
టాయ్స్‌లో ‘రోవన్’ ద్వారా రిలయన్స్ విస్తరణ
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే ఆట బొమ్మల మార్కెట్లో ‘రోవన్’ బ్రాండ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. చిన్న సైజు షాపుల రూపంలో రోవన్ బ్రాండ్‌ను మరింత మందికి చేరువ చేయాలన్న ప్రణాళికతో ఉంది. టాయ్స్ పంపిణీ వ్యాపారాన్ని ఇప్పటి వరకు రోవన్ ద్వారా నిర్వహిస్తుండగా, దీన్నే ప్రధాన బ్రాండ్‌గా కస్టమర్ల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గురుగ్రామ్‌లో మొదటి ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ తెరవనుంది. తన టాయ్స్ అవుట్‌లెట్‌లో రోవన్ బ్రాండ్ ఆటబొమ్మలే కాకుండా, ఇతర బ్రాండ్ల అందుబాటు ధరల్లోని వాటినీ ఉంచనుంది. రిలయన్స్ రిటైల్ కింద బ్రిటిష్ టాయ్ రిటైల్ బ్రాండ్ హ్యామ్లేస్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని 2019లో కొనుగోలు చేసింది. హ్యామ్లేస్ ప్రీమియం టాయ్స్‌కు సంబంధించిన బ్రాండ్‌గా కొనసాగనుంది. రోవన్ బ్రాండ్‌ను 500–1000 చదరపు అడుగుల విస్తీర్ణం సైజు అవుట్‌లెట్స్‌తో, బడ్జెట్ ఆటబొమ్మలతో నిర్వహించాలన్నది సంస్థ ప్రణాళికగా రియలన్స్ రిటైల్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గౌరవ్జైన్ తెలిపారు. -
రిలయన్స్ రిటైల్ రుణ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్ఐఎల్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ రిటైల్.. రుణ సమీకరణ పరిమితిని రెట్టింపునకు పెంచేందుకు వాటాదారుల అనుమతిని కోరనుంది. వెరసి రూ. లక్ష కోట్ల రుణ పరిమితి ప్రతిపాదనను ఈ నెల 30న నిర్వహించనున్న వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో వాటాదారుల ముందు ఉంచనుంది. ప్రస్తుతం కంపెనీ రుణ సమీకరణ పరిమితి రూ. 50,000 కోట్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో వాటాదారులు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022 మే 5న సమావేశమైన కంపెనీ బోర్డు రుణ సమీకరణ పరిమితిని రూ. లక్ష కోట్లకు పెంచేందుకు ప్రతిపాదించింది. తద్వారా బిజినెస్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ సమయానుగుణ రుణ సమీకరణకు వీలు చిక్కనున్నట్లు ఏజీఎం నోటీసులో పేర్కొంది. 2022 మార్చి 31కల్లా రిలయన్స్ రిటైల్ స్థూల రుణ భారం రూ. 40,756 కోట్లుగా నమోదైంది. గత నెలలో జరిగిన ఆర్ఐఎల్ ఏజీఎంలో రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో తాజా ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రిటైల్ బిజినెస్‌పై ఆర్ఐఎల్ రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. -
పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ
సాక్షి,ముంబై: ఎఫ్ఎంసీజీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న రిలయన్స్ఇండస్ట్రీస్ ఒకప్పటి పాపులర్ కూల్ డ్రింక్ కాంపా కోలాను తీసుకురానుందట. ఈ విస్తృత వ్యూహంలో భాగంగానే ఢిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి దాదాపు రూ. 22 కోట్లకు కాంపా, సోస్యో అనే సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లను రిలయన్స్ కొనుగోలు చేసిందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిటైల్ విభాగం ఎఫ్ఎంసిజి విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ కొనుగోలు వార్త ప్రముఖంగా నిలిచింది. ముఖ్యంగి దిగ్గజాలైన కోకా-కోలా, పెప్సీకో లాంటి కంపెనీలకు షాకిచ్చేలా దీన్ని తిరిగి లాంచ్ చేయనుందిని తెలుస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో ఈ బ్రాండ్లను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి దూసుకొస్తున్న రిలయన్స్ దాదాపు రెండు డజన్ల బ్రాండ్లను ఇప్పటికే గుర్తించిందనీ, వీటిని జాయింట్ వెంచర్‌గా కొనుగోలు చేయనుందని ఈటీ రిపోర్ట్ చేసింది. ఎడిబుల్ ఆయిల్, సోప్ బ్రాండ్ తదితర కంపెనీలతో చర్చలు జరుపుతోందని ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని తెలిపింది. తాజా రిపోర్టు ప్రకారం రిలయన్స్ రిటైల్ స్టోర్లు, జియోమార్ట్, కిరానా స్టోర్లలో కొనుగోలుకు కాంపాకోలా డ్రింక్ అందుబాటులో ఉంచనుంది. నిమ్మ, నారింజ రుచులలో పునఃప్రారంభించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకపుడు కోలా వేరియంట్ కాంపా కోలాతో మార్కెట్ లీడర్‌గా ఉండేది ఐకానిక్ కోలా.1990ల నుంచి క్రమంగా కనుమరుగై పోయింది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..) ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశించనున్నామని ఇటీవల జరిగిన రిలయన్స్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మెటా, జియో మార్ట్ భాగస్వామ్యంతో వాట్సాప్‌లో రిలయన్స్ రిటైల్ సేవలను వివరించారు. కేవలం కొన్ని నిమిషాల్లో వాట్సాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చని ఆమె వివరించారు. (Benda V302C: కీవే కొత్త బైక్ చూశారా? ధర సుమారు రూ. 4 లక్షలు) కాగా 1990లలో, పార్లే అభివృద్ధి చేసిన శీతల పానీయాల బ్రాండ్లతో పాటు, థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా మార్కెట్లో కాంపా ఆధిపత్యం చెలాయించింది. అయితే, కోకా-కోలా తన రీ-ఎంట్రీలో మూడు పార్లే బ్రాండ్లను కొనుగోలు చేసిన తర్వాత, కాంపా పోటీ పడలేక మార్కెట్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత 2019లో మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించేందుకు పదే పదే ప్రయత్నాలు చేసినా ఆర్థిక బలం లేకవిఫలమైంది. -
రిలయన్స్: అంబానీ కుమార్తె ఇషాకు బాస్‌గా ప్రమోషన్?
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ యాజమాన్యంలో తన వారసులకు బాధ్యతలను అప్పగించేందుకు భారీ మార్పులకు పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్ ముకేశ్ అంబానీ రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి టెలికం విభాగం రిలయన్స్ జియో చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా కుమార్తె ఇషాకు కూడా ప్రమోషన్ రానుంది. రిలయన్స్ రిటైల్ యూనిట్‌కు చైర్‌పర్సన్‌గా ఇషా ఎంపికైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన నేడు (బుధవారం) వెలువడనుందని అంచనా . ఆసియాలోని అత్యంత సంపన్న అంబానీ కుటుంబం వారసత్వ బాధ్యతల అప్పగింతలో ఒక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ రీటైల్ బిజినెస్ పగ్గాలను కుమార్తె ఈషా (30) చేతికి ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా ముకేశ్, నీతా అంబానీ దంపతుల ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఇషా ట్విన్స్ కాగా చిన్న కుమారుడు అనంత్. పిరమల్ గ్రూప్‌నకు చెందిన ఆనంద్ పిరమల్‌ను ఇషా వివాహం చేసుకున్న విషయం విదితమే. ఇషా యేల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. -
Future Group: 'ఫ్యూచర్'కు మంచి ఫ్యూచర్ ఉంది!
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ తిరిగి నిలదొక్కుకోవడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రూప్ కంపెనీలు ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్, సప్లై చైన్ సొల్యూషన్స్, కన్జూమర్ అండ్ ఎంటర్ప్రైజెస్ తిరిగి పట్టాలెక్కేందుకు వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూప్‌తో రిలయన్స్ రిటైల్ కుదుర్చుకున్న రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని సెక్యూర్డ్ రుణదాతలు తిరస్కరించిన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్ఆర్ఎల్) దాదాపు రూ. 18,000 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉంది. దివాలా చట్ట చర్యలను ఎదుర్కోబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అయితే ఇతర కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్(ఎఫ్ఈఎల్), ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్(ఎఫ్ఎల్ఈఎల్), ఫ్యూచ ర్ సప్లై చైన్ సొల్యూషన్స్(ఎఫ్ఎస్సీఎస్ఎల్), ఫ్యూచర్ కన్జూమర్ (ఎఫ్‌సీఎల్) తమ సొంత ఆస్తుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పునరుజ్జీవనం పొందే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పునరుత్తేజం ఇలా సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎఫ్ఈఎల్కు రూ. 5,000 కోట్ల రుణభారముంది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ బిజినెస్‌లో వాటాను విక్రయిస్తోంది. రూ. 3,000 కోట్లవరకూ లభించనున్నాయి. దీంతో రుణ భారం భారీగా తగ్గనుంది. ఇక కర్ణాటకలోని తుమ్కూర్లో 110 ఎకరాల ఫుడ్ పార్క్‌ను ఎఫ్ఎంసీజీ కంపెనీ ఎఫ్‌సీఎల్ కలిగి ఉంది. ఇది కంపెనీ పునరి్నర్మాణానికి వినియోగపడనుంది. దేశవ్యాప్తంగా ఎఫ్ఎస్సీఎస్ఎల్కు వేర్‌హౌస్‌లున్నాయి. నాగ్‌పూర్‌లో అత్యంత భారీ, ఆధునిక ఆటోమేటెడ్ పంపిణీ కేంద్రాన్ని కలి గి ఉంది. ఇవన్నీ కంపెనీకి అండగా నిలవనున్నా యి. అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఫ్యూ చర్ గ్రూప్ ప్రతినిధి నిరాకరించడం గమనార్హం! సోమవారం ట్రేడింగ్‌లో ఫ్యూచర్ గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లు 20–5% మధ్య పతనమయ్యాయి. -
ముఖేష్ అంబానీ చేతికి మరో దిగ్గజ సంస్థ, 80శాతం వాటా కొనుగోలు!
న్యూఢిల్లీ: ప్రీమియం లోదుస్తుల రిటైల్ సంస్థ క్లోవియాలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. క్లోవియా మాతృసంస్థ పర్పుల్ పాండ్ ఫ్యాషన్స్‌లో 89 శాతం వాటాలను రూ. 950 కోట్లకు దక్కించుకుంది. మిగతా వాటాలు కంపెనీ వ్యవస్థాపక సభ్యులు, మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది. రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో ఈ విషయాలు తెలిపాయి. ఇప్పటికే జివామె, అమాంటే బ్రాండ్లను దక్కించుకున్న ఆర్‌ఆర్‌వీఎల్‌కు తాజాగా క్లోవియా కొనుగోలుతో .. ఇన్నర్ వేర్ సెగ్మెంట్లో స్థానం మరింత పటిష్టం చేసుకోవడం సాధ్యపడనుంది. పంకజ్ వెర్మాని, నేహా కాంత్, సుమన్ చౌదరి కలిసి 2013లో క్లోవియాను ప్రారంభించారు. వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే క్లోవియా బ్రాండ్‌ను కూడా తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చామని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. రిలయన్స్ భారీతనం, రిటైల్ అనుభవంతో తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించగలమని క్లోవియా వ్యవస్థాపకుడు, సీఈవో పంకజ్ వెర్మాని పేర్కొన్నారు. -
మరో కంపెనీలో భారీగా వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్!
ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) పర్పుల్ పాండా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 89 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది. వాటాల కొనుగోలులో భాగంగా రిలయన్స్ రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టింది. పంకజ్ వర్మానీ, నేహా కాంత్ & సుమన్ చౌదరి 2013లో లాంఛ్ చేసిన క్లోవియా మహిళల ఇన్నర్ వేర్, లాంజ్ వేర్ తయారు చేయడంలో ఒక ప్రీమియం కంపెనీ. రిలయన్స్ ఇప్పటికే జీవామే, అమంటే వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది. బీడీఏ పార్టనర్స్ క్లోవియాకు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా వ్యవహరించగా, శార్దూల్ అమర్ చంద్ మంగళ్ దాస్ లీగల్ కౌన్సెల్'గా వ్యవహరించారు. "పంకజ్ వర్మాని, నేహా కాంత్, సుమన్ చౌదరి 2013లో ప్రారంభించిన క్లోవియా భారతదేశంలో ప్రముఖ బ్రిడ్జ్-టు-ప్రీమియం డీ2సీ బ్రాండ్" అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. క్లోవియా కింద 3,500+ ప్రొడక్ట్ స్టైల్స్ ఉన్నాయి. (చదవండి: మీ ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోండి ఇలా..!) -
రిలయన్స్ నీ ఆటలు సాగవ్! చూస్తూ ఊరుకోమంటున్న అమెజాన్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ స్వాధీనం చేసుకున్న స్టోర్లను తిరిగి పొందడానికి అలాగే ఇందుకు సంబంధించి విలువల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) ప్రకటించింది. రిలయన్స్ గ్రూప్ అనూహ్య చర్య తనకు ఆశ్చర్యానికి గురిచేసిందని కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ వ్యాపార కార్యకలాపాలను .. రూ. 24,713 కోట్ల మొత్తానికి రిలయన్స్‌కు విక్రయించేందుకు 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్ కూపన్స్ సంస్థలో స్వల్ప వాటాల వల్ల, పరోక్షంగా రిటైల్ విభాగాల్లోను వాటాదారుగా మారానంటూ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ డీల్‌ను అడ్డుకుంటోంది. దీనిపై ప్రస్తుతం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య న్యాయ వివాదం నడుస్తోంది. వివాదానికి కారణమైన ‘అమెజాన్ ఫ్యూచర్ కూపన్స్’ ఒప్పందమే చెల్లదని 2021 డిసెంబర్ కాంపిటేషన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూలింగ్‌తో సమస్య కొత్త మలుపు తిరిగింది. ఇక, ఫ్యూచర్ గ్రూప్‌నకు 1,700 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా లీజు అద్దెలను కొన్నాళ్లుగా ఫ్యూచర్ గ్రూప్ చెల్లించలేకపోతోంది. ఇవన్నీ మూతబడే పరిస్థితి నెలకొనడంతో వీటిలో కొన్ని స్టోర్స్ లీజును రిలయన్స్ తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)కు బదలాయించుకుని, వాటిని ఫ్యూచర్‌కు సబ్–లీజుకు ఇచ్చింది. సరఫరాదారులకు సైతం ఫ్యూచర్ చెల్లింపులు జరపలేకపోతుండటంతో ఆయా స్టోర్స్‌కు అవసరమైన ఉత్పత్తులను కూడా రిలయన్స్ జియోమార్ట్ సరఫరా చేస్తోంది. దీంతో సదరు స్టోర్స్‌లో అధిక భాగం ఉత్పత్తులు రిలయన్స్‌వే ఉన్నాయి. సబ్–లీజు బాకీలను ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు కట్టలేకపోవడం వల్ల, సబ్ లీజులను రద్దుచేసి రిలయన్స్ ఆ అవుట్‌లెట్స్‌ను స్వాధీనం చేసుకుని, రీబ్రాండింగ్ చేసే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఫ్చూచర్ తాజా ప్రకటన చేసింది. ఆర్బిట్రేషన్ పునరుద్ధరణపై మార్చి 23న సుప్రీం విచారణ కాగా వివాదంపై ఆర్బిట్రేషన్ ప్రక్రియ పునఃప్రారంభాన్ని కోరుతూ అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హిమా కోహ్లీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం ఫ్యూచర్ రిటైల్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మార్చి 23వ తేదీకి వాయిదా వేసింది. ఆర్బిట్రేషన్ విచారణను పునఃప్రారంభించాలని కోరడంతో పాటు, ఆర్బిట్రేషన్‌లో గెలిస్తే ఫ్యూచర్ ఆస్తులు తమ వద్దే ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అమెజాన్ కోరింది. -
ఏ అండ్ టీలో రిలయన్స్ రిటైల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా లగ్జరీ ఫ్యాషన్ సంస్థ అబ్రహం అండ్ ఠాకూర్‌లో (ఏ అండ్ టీ) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడించలేదు. అబ్రహం అండ్ ఠాకూర్‌లో మెజారిటీ వాటాల కోసం ఇన్వెస్ట్ చేసినట్లు రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. డేవిడ్ అబ్రహం, రాకేష్ ఠాకూర్ 1992లో ఏ అండ్ టీని ప్రారంభించారు. ఇందు లో కెవిన్ నిగ్లి తర్వాత భాగస్వామి గా చేరారు. లిబర్టీ, బ్రౌన్స్, హరోడ్స్, సెల్ఫ్రిజెస్ వంటి అంతర్జాతీయ స్టోర్స్‌లో కూడా భారతీయ చేనేత వస్త్రాల కలెక్షన్లను ఏ అండ్ టీ అందుబాటులోకి తెచ్చింది. ఏ అండ్ టీ వినూత్న డిజైన్లకు దేశీ లగ్జరీ కస్టమర్లలో మంచి ఆదరణ ఉంటోందని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఆర్ఆర్వీఎల్తో భా గస్వామ్యం ద్వారా హోమ్ ఫర్నిషింగ్స్, లాంజ్‌వేర్ సహా పలు ఫ్యాషన్స్, లైఫ్ స్టయిల్ కలెక్షన్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేగలమని డేవిడ్ అబ్రహం తెలిపారు. -
మరో కంపెనీలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ భారీగా పెట్టుబడులు..!
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) అబ్రహం & థాకూర్ ఎక్స్ పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ సహకారంతో ఈ అబ్రహం అండ్ ఠాకూర్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని భావిస్తోంది. 1992లో డేవిడ్ అబ్రహం రాకేష్ థాకోరే చే ప్రారంభించిన కొద్ది కాలంలోనే కెవిన్ నిగ్లీ ఇందులో చేరారు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలో అబ్రహం & థాకూర్(ఎ అండ్ టి) పాపులర్ బ్రాండ్'గా మారింది. ఈ రంగంలో అబ్రహం & థాకూర్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. ఫ్యాషన్ రంగంలో భారతీయ వస్త్ర డిజైన్లకు ఆధునికతను జోడించింది. భారతీయ వస్త్రాలకు సంబంధించి A&T డిజైనింగ్ లాంజ్‌వేర్, హోమ్ కలెక్షన్లతో ప్రారంభమైంది, వీటిని మొదట లండన్‌లోని ది కాన్రాన్ షాప్‌లో విక్రయించారు. ఫ్యాషన్ సాంస్కృతిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో ముందున్న A&T బ్రాండ్ ఈ రంగంలో బలంగా పాతుకుపోయింది. అబ్రహం & ఠాకోర్ ఆసక్తికరమైన మెటీరియల్ ఉపయోగం, సాంప్రదాయ వస్త్ర సాంకేతికతలను తీసుకోవడం కోసం అత్యంత విలక్షణమైన డిజైన్ సంతకాన్ని రూపొందించింది. భారతీయ లగ్జరీ కస్టమర్లు తరతరాలుగా వినియోగ మార్పులకు లోనవుతున్నందున, అబ్రహం & ఠాకూర్ టైమ్‌లెస్ డిజైన్‌పై అధిక ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు భారతీయ హస్తకళ ప్రత్యేక వ్యక్తీకరణను తీసుకురావడానికి బ్రాండ్‌తో భాగస్వామ్యం చేయడానికి తాము సంతోషిస్తున్నట్టు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. (చదవండి: మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎలాన్ మస్క్..!) -
ఆన్లైన్ కిరాణా బిజినెస్‌పై రిలయన్స్ భారీ డీల్..! ఏకంగా...!
దేశవ్యాప్తంగా ఆన్లైన్ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ రిలయన్స్ రిటైల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు రిలయన్స్ రిటైల్ సిద్దమైంది. వాటాల కొనుగోలు....! ఆన్లైన్ కిరాణా డెలివరీ వ్యాపారంలో రిలయన్స్ రిటైల్ ఉనికిని విస్తరించేందుకుగాను ప్రముఖ ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. తాజాగా రిలయన్స్ రిటైల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో డంజో సుమారు 240 మిలియన్ల డాలర్లను సేకరించింది. ఈ ఫండింగ్ రౌండ్లో ఇప్పటికే ఈ సంస్థకు ఇన్వెస్టర్లుగా ఉన్న లైట్‌బాక్స్, లైట్‌త్రాక్, 3ఎల్ క్యాపిటల్ , ఆల్టెరియా క్యాపిటల్ కూడా ఫండింగ్ రౌండ్లో పాల్గొన్నాయి. మరింత వేగవంతం..! డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో డంజో తన సేవలను విస్తరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని కంపెనీ సహా వ్యవస్థాపకుడు కబీర్ బిశ్వాస్ అన్నారు. డంజో ఇప్పటివరకు భారత్‌లో 7 మెట్రో నగరాల్లో వేగవంతమైన డెలివరీ సేవలను అందిస్తోంది. కొద్ది రోజుల క్రితం డంజో డైలీ పేరుతో మరింత వేగవంతమైన డెలివరీ సేవలను ప్రారంభించింది. చదవండి: యూజర్ల ప్రైవసీతో చెలగాటం..! గూగుల్, మెటా సంస్థలకు దిమ్మతిరిగే షాక్..! -
వాట్సాప్ ద్వారా నిత్యావసర సరుకులు డెలివరీ
నిత్యావసరాలు, కూరగాయలు మొదలైన వాటిని వాట్సాప్ ద్వారా ఆర్డరు చేస్తే ఇంటి వద్దకే అందించేలా రిటైల్ దిగ్గజం జియోమార్ట్ కొత్త సర్వీసు ప్రవేశపెడుతోంది. ఫ్యూయల్ ఫర్ ఇండియా పేరిట మెటా నిర్వహించిన కార్యక్రమంలో జియో ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్లు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ దీన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ‘బ్రెడ్, పండ్లు..కూరగాయలు, శీతలపానీయాలు ఇలా ఏ సరుకులైనా, ఆ రోజుకు కావాల్సినా లేక ఆ వారానికి కావాల్సినవైనా జియోమార్ట్‌కు వాట్సాప్ ద్వారా ఆర్డరు చేయొచ్చు. తరచుగా కావాలంటే సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. మీ కొనుగోళ్ల చరిత్రను బట్టి వ్యక్తిగత సిఫార్సులు పొందవచ్చు‘ అని ఈషా అంబానీ పేర్కొన్నారు. ‘వాట్సాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియ అత్యంత సరళంగా, సులభతరంగా ఉంటుంది‘ అని ఆకాశ్ తెలిపారు. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ నెట్వర్క్ ద్వారా ఆర్డర్ల డెలివరీ ఉంటుంది. దేశీయంగా రిటైల్ వ్యయాల్లో ఆహారం, కిరాణా సరుకుల వాటా భారీగా ఉంటుంది. 2025 నాటికి ఇది 1.3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరవచ్చని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా. జియోమార్ట్ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 5 లక్షల పైచిలుకు రిటైలర్లు ఉన్నారని, ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆకాష్ వివరించారు. వాట్సాప్‌తో రీచార్జ్ కూడా.. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లు సైతం త్వరలో వాట్సాప్ ద్వారా రీచార్జి చేయించుకోవచ్చని ఆకాశ్ పేర్కొన్నారు. చెల్లింపులతో పాటు మొబైల్ రీచార్జింగ్లకు కూడా వాట్సాప్ ఉపయోగపడనుండటం ఆసక్తికరమని ఆయన తెలిపారు. 2022లో జియో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. రీచార్జింగ్ ప్రక్రియను ఇది మరింత సులభతరం చేస్తుందని, రీచార్జ్ వంటి అవసరాల కోసం బైటికి వెళ్లలేని సీనియర్ సిటిజన్లులాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈషా అంబానీ తెలిపారు. 2021 సెప్టెంబర్ ఆఖరు నాటికి జియోకు 42.95 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
భారత్‌లో 7–లెవెన్ స్టోర్స్
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తన సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన 7–లెవెన్ కనీ్వనియెన్స్ స్టోర్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇందుకు సంబంధించి 7–లెవెన్ (ఎస్ఈఐ)తో తమ అనుబంధ సంస్థ 7–ఇండియా కన్వీనియన్స్ రిటైల్ సంస్థ మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించలేదు. మొదటి స్టోర్‌ను అక్టోబర్ 9న ముంబైలో ప్రారంభించనున్నట్లు ఆర్ఆర్వీఎల్ వివరించింది. ఆ తర్వాత వేగంగా మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించనున్నట్లు పేర్కొంది. ‘మా కస్టమర్లకు అత్యుత్తమమైనవి అందించాలన్నది మా లక్ష్యం. అందులో భాగంగా 7–లెవెన్‌ను ప్రవేశపెడుతుండటం మాకు గర్వకారణం. అంతర్జాతీయంగా అత్యుత్తమ బ్రాండ్లలో ఇది ఒకటి‘ అని సంస్థ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. ‘భారత్ .. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం. అలాగే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద కనీ్వనియెన్స్ రిటైలర్ సంస్థల్లో ఒకటైన మా కంపెనీ .. భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయం‘ అని 7–లెవెన్ ప్రెసిడెంట్ జో డిపింటో తెలిపారు. స్నాక్స్, శీతల పానీయాలు, నిత్యావసరాలు మొదలైన ఉత్పత్తులు కొనుగోలు చేసే కస్టమర్లకు విశిష్టమైన షాపింగ్ అనుభూతిని అందించడం తమ స్టోర్స్ లక్ష్యమని పేర్కొన్నారు. 18 దేశాల్లో 77,000 స్టోర్స్ .. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కేంద్రంగా పనిచేస్తున్న ఎస్ఈఐకి 18 దేశాలు.. ప్రాంతాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. స్వీయ నిర్వహణను, ఫ్రాంచైజీ/లైసెన్సుల రూపంలోను కలిపి 77,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. ఉత్తర అమెరికాలోనే ఏకంగా 16,000 పైగా స్టోర్స్ నిర్వహిస్తోంది. 7–లెవెన్ స్టోర్స్‌తో పాటు స్పీడ్వే, స్ట్రైప్స్, లారెడో, టాకో కంపెనీ, రైజ్ ది రూస్ట్ వంటి ఫ్రాంచైజీలను కూడా ఎస్ఈఐ నిర్వహిస్తోంది. వాస్తవానికి 7–లెవెన్ స్టోర్స్‌ను దేశీ సూపర్‌మార్కెట్ దిగ్గజం ఫ్యూచర్ రిటైల్ .. భారత్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం 2019 ఫిబ్రవరిలో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కానీ ఫ్యూచర్ రిటైల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇరు సంస్థలు పరస్పర అంగీకారంతో ఒప్పందం రద్దు చేసుకున్నాయి. ఫ్యూచర్ గ్రూప్ తమ రిటైల్ వ్యాపారాన్ని రిలయన్స్‌కే విక్రయించేందుకు ప్రయతి్నస్తోంది. కానీ ఫ్యూచర్లో వాటాలు ఉన్న ఈ–కామర్స్ దిగ్గజం దీన్ని వ్యతిరేకిస్తుండటంతో డీల్ ముందుకు సాగడం లేదు. ఈ తరుణంలో 7–లెవెన్‌తో రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్‌ఆర్‌వీఎల్‌కు దేశవ్యాప్తంగా ఇప్పటికే 13,000 పైగా స్టోర్స్ ఉన్నాయి. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1,57,629 కోట్ల టర్నోవరు (కన్సాలిడేటెడ్) నమోదు చేసింది. -
రిలయన్స్ ట్రెండ్స్ బతుకమ్మ సెల్ఫీ పోటీ
హైదరాబాద్: భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రిలయన్స్ ట్రెండ్స్ తెలంగాణాలో శుభప్రదమైన బతుకమ్మ పండగ సమయంలో వినియోగదారులకు దగ్గర కావడం కోసం చిన్న పట్టణాల్లో ఒక పోటీ నిర్వహిస్తుంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. ఆడపడుచులు వివిధ రకాల పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. ట్రెండ్స్ బతుకమ్మ సెల్ఫీ పోటీ ఈ పండగ తెలంగాణాలోని చిన్న పట్టణాలలో మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. రిలయెన్స్ ట్రెండ్స్ తెలంగాణాలో చిన్న పట్టణాలలో వినియోగదారులు కోసం బతుకమ్మ ఇతివృత్తంతో ఒక ఆసక్తికరమైన పోటీని ఏర్పాటు చేసింది. ఈ పోటీలో భాగంగా గౌరీ దేవిని ఇళ్లల్లో పూజించే సమయంలో బతుకమ్మతో కలిసి మీరు తీసుకున్న సెల్ఫీని ట్రెండ్స్ వారి ప్రత్యేకమైన వాట్సాప్ నంబర్ కు ఎంట్రీ కోసం పంపించాల్సి ఉంది.(చదవండి: భారత ఎకానమీపై ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు..!) 'ఉత్తమంగా అలంకరించబడిన బతుకమ్మ'గా నిర్ణయించిన సెల్ఫీ/ఫోటోకు మొదటి బహుమతిగా రూ.1500 విలువ గల గిఫ్ట్ కార్డ్, 2వ బహుమతి కింద రూ.1000 విలువ గల గిఫ్ట్ కార్డ్ అందించనున్నారు. అంతే కాదు, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ట్రెండ్స్ వారికి డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. ఈ కూపన్ మీ దగ్గరలో ఉన్న చిన్న పట్టణంలో ట్రెండ్స్ స్టోర్ నుంచి తీసుకోవాలి. ఈ పోటీ 2021 అక్టోబర్ 14న ముగుస్తుంది. మరిన్ని వివరాలు కోసం మీ పట్టణంలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ సంప్రదించండి. -
రిలయన్స్ చేతికి జస్ట్ డయల్!
ముంబై: దేశీయ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) అడుగులు వేస్తుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు తెలిపింది. లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. ఇంతకు ముందు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్ట్‌డయల్ వ్యవస్థాపకుడు వీఎస్ఎస్ మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని ఆర్ఆర్వీఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపిన ఒక ప్రకటనలో.. ఆర్ఆర్వీఎల్, జస్ట్‌డయల్, వీఎస్ఎస్ మణి, ఇతరుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఆర్‌ఆర్‌వీఎల్‌కు కేటాయించినట్లు తెలిపింది. అలాగే వీఎస్ఎస్ మణి నుంచి షేరు ఒక్కింటికి రూ.1,020 రేటు చొప్పున ఆర్ఆర్వీఎల్ 1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. జస్ట్ డయల్ అనేది భారతదేశంలోని ప్రముఖ లోకల్ సెర్చి ఇంజిన్ ఫ్లాట్ ఫారం. ఇది టెలిఫోన్ మరియు టెక్ట్స్ ద్వారా వెబ్ సైట్లు, యాప్ లు వంటి బహుళ ఫ్లాట్ ఫారాల ద్వారా దేశవ్యాప్తంగా యూజర్లకు సెర్చ్ సంబంధిత సేవలను అందిస్తుంది.(చదవండి: వాట్సాప్‌కు ఐర్లాండ్ భారీ షాక్...!) -
ఆ పాత బ్రాండ్లకు ‘భలే’ మంచి రోజులు!
Reliance Retail Brings BPL And Kelvinator: తరాలు తరలిపోతున్న కొద్దీ.. ‘జ్ఞాపకాలు’ మేలనే అభిప్రాయం చాలామందికి కలగడం సహజం. టెక్నాలజీ ఎరాలో ఎన్నో అప్డేట్స్ వెర్షన్లు వస్తున్నా.. పాత వాటికి ఉన్నంత గ్యారెంటీ ఉండట్లేదనే రివ్యూలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి బ్రాండ్లను తిరిగి జనాలకు అందించే ప్రయత్నాలు ఈమధ్యకాలంలో ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ రిటైల్.. బీపీఎల్, కెల్వినేటర్ ఉత్పత్తులను తిరిగి జనాల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఎయిటీస్, నైంటీస్ జనరేషన్‌కి బీపీఎల్ టీవీలు, కెల్వినేటర్ స్టెబ్లైజర్, ఫ్రిజ్‌ల లాంటి ప్రొడక్టులతో మంచి అనుభవమే ఉంది. ముఖ్యంగా డబ్బా టైప్ టీవీలు ‘బండ’ బ్రాండ్ అనే అభిప్రాయాన్ని ఏర్పరిచాయి కూడా. ఒకప్పుడు వర్చువల్ ఎంటర్టైన్మెంట్లో బీపీఎల్ టీవీలది అగ్రస్థానం ఉండేది. అయితే మిల్లీనియంలోకి అడుగుపెట్టాక టాప్ టెన్ బ్రాండ్ లిస్ట్ నుంచి కనుమరుగైన బీపీఎల్.. ఇతర కంపెనీల రాక, అటుపై బీపీఎల్‌లో ఆర్థిక క్రమశిక్షణ లోపించిన కారణంగా పతనం దిశగా నడిచింది. ఈ నేపథ్యంలో ‘నమ్మకం’ పేరుతో ప్రచారం చేసుకున్న బీపీఎల్‌ను, కెల్వినేటర్ బ్రాండ్లను రిలయన్స్ రిటైల్ తీసుకురానుంది. క్లిక్: హీరో ఈ-బైక్.. ఇక ఈజీగా! బీపీఎల్.. ది ‘బ్రిటిష్ ఫిజికల్ లాబోరేటరీస్’ 1963 పలక్కాడ్ (కేరళ)లో ప్రారంభించారు. హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. రిలయన్స్ రిటైల్ ఎలక్ట్రికల్ రంగంలోకి అడుగుపెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. టీవీ, ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, టీవీలు, లైట్ బల్బ్స్, ఫ్యాన్స్ లాంటి ప్రొడక్టుల తయారీతో అమ్మకాలను స్వయంగా నిర్వహించనుంది. ఇప్పటికే కెల్వినేటర్తో ఒప్పందం కుదుర్చుకోగా.. బీపీఎల్‌కు సంబంధించిన ఒప్పందం గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ రెండింటిలతో పాటు మరో రెండు ఓల్డ్ బ్రాండులను సైతం తీసుకొచ్చేందుకు రిలయన్స్ సుముఖంగా ఉంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో అందించనున్నట్లు సమాచారం. అయితే ఇవి వింటేజ్ మోడల్స్లోనా? లేదంటే అప్డేటెడ్ మోడల్స్లోనా? అనే విషయంపై అధికారిక ప్రకటనల సమయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: మెగాస్టార్ అద్భుత ప్రయోగం -
ఫ్యూచర్ వివాదంలో అమెజాన్‌కు ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) విలీన వివాదానికి సంబంధించి ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఊరట లభించింది. అమెజాన్‌కు అనుకూలంగా అత్యవసర ఆర్బిట్రేటర్ (ఈఏ) ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని, భారత చట్టాల ప్రకారం వాటిని అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీనితో రూ. 24,731 కోట్ల ఫ్యూచర్, రిలయన్స్ డీల్‌కు బ్రేక్ పడినట్లయింది. వివరాల్లోకి వెడితే.. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయి. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. -
సబ్వే ఇండియా ఫ్రాంచైజీలపై రిలయన్స్ ఆసక్తి
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ రిటైల్ తాజాగా క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(క్యూఎస్ఆర్) విభాగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా సబ్వే ఇండియా ఫ్రాంచైజీలపై కన్నేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రోసరీ, ఈఫార్మసీ, ఫ్యాషన్ తదితర రంగాలలో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రెస్టారెంట్ల నిర్వాహక సంస్థ సబ్వే ఇంక్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సబ్వే దేశీ ఫ్రాంచైజీల కోసం 20–25 కోట్ల డాలర్లు(రూ. 1,500–1,860 కోట్లవరకూ) వెచ్చించనున్నట్లు సమాచారం. -
45 శాతం పెరిగిన రిలయన్స్ జియో నికర లాభం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) జూన్ 30తో ముగిసిన ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.12,273 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది లాభంతో పోలిస్తే మాత్రం 7.25 శాతం పతనాన్ని నమోదు చేసింది. సంస్థలో ప్రధానమైన రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఆరోగ్యకరమైన టాప్ లైన్ వృద్ధిని కనబర్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక పనితీరుపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత లాభం రూ.13,233 కోట్ల(2020 మొదటి త్రైమాసికం) నుంచి రూ.12,273 కోట్లకు(1.65 బిలియన్ డాలర్లు) పడిపోయిందని తెలిపారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ కంపెనీ ఆదాయం ఏడాది క్రితం కాలంలో రూ.91,238 కోట్లతో పోలిస్తే చమురు నుంచి టెలికాం సమ్మేళన సంస్థ కార్యకలాపాల నుంచి ఆదాయం 58.2 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు ఆర్ఐఎల్ టెలికాం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ గత ఏడాది రూ.2,520 కోట్ల(45 శాతం) నుంచి రూ.3,501 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆర్ఐఎల్ చెందిన ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారం ఆదాయంలో 70 శాతానికి పైగా జంప్ చేయడంతో కంపెనీ ఆదాయం తిరిగి పెరగింది. "కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా అత్యంత సవాలుతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ కంపెనీ బలమైన లాభాలను అందుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. మా ఓ2సీ వ్యాపారంలో మేము మా ఇంటిగ్రేటెడ్ పోర్ట్ ఫోలియో, మెరుగైన ఉత్పత్తి ప్లేస్ మెంట్ సామర్థ్యాల ద్వారా బలమైన సంపాదనను సృష్టించాము. మా భాగస్వామి బిపితో పాటు, మేము కృష్ణ గోదావరి దిరుబాయి6(కేజీ డీ6) బేసిన్ లో శాటిలైట్ క్లస్టర్ ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచడం కొనసాగించాము. ఇది భారతదేశంలో గ్యాస్ ఉత్పత్తిలో 20 శాతం దోహదపడింది. ఇది మన దేశ ఇంధన భద్రతకు ప్రధాన దోహదం చేస్తుంది' అని ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అంబానీ తెలిపారు. ఆర్ఐఎల్ షేరు ధర క్యూ1 నేడు 0.79 శాతం పడిపోయి రూ.2,104.00కు చేరుకుంది. అయితే, స్టాక్ మూడు నెలల్లో దాదాపు 12 శాతం, ఆరు నెలల్లో 3.7 శాతం పెరిగింది. -
రిలయన్స్ చేతికి జస్ట్ డయల్
న్యూఢిల్లీ: దేశీ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) .. తాజాగా లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని శుక్రవారం వెల్లడించింది. సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం మరో 26% వాటా (సుమారు 2.17 కోట్ల షేర్లు) కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు ఎక్సే్చంజీలకు తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్ట్‌డయల్ వ్యవస్థాపకుడు వీఎస్ఎస్ మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని ఆర్ఆర్వీఎల్ తెలిపింది. జస్ట్ డయల్‌లో ఇన్వెస్ట్ చేసే నిధులతో కంపెనీ సమగ్రమైన లోకల్ లిస్టింగ్, కామర్స్ ప్లాట్‌ఫాంగా కార్యకలాపాలు విస్తరించగలదని పేర్కొంది. లక్షల కొద్దీ లఘు, చిన్న, మధ్య స్థాయి భాగస్వామ్య వ్యాపార సంస్థలకు డిజిటల్ ఊతమిచ్చేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. తమ లక్ష్యాల సాధనకు, వ్యాపార పురోగతికి రిలయన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడగలదని వీఎస్ఎస్ మణి తెలిపారు. డీల్ స్వరూపం ఇలా..: ఆర్ఆర్వీఎల్, జస్ట్‌డయల్, వీఎస్ఎస్ మణి, ఇతరుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఆర్‌ఆర్‌వీఎల్‌కు కేటాయిస్తారు. అలాగే వీఎస్ఎస్ మణి నుంచి షేరు ఒక్కింటికి రూ. 1,020 రేటు చొప్పున ఆర్ఆర్వీఎల్ 1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేస్తుంది. జస్ట్‌డయల్ కార్యకలాపాలు 1996లో ప్రారంభమయ్యాయి. మొబైల్, యాప్స్, వెబ్సైట్, టెలిఫోన్ హాట్‌లైన్ వంటి మాధ్యమాల ద్వారా జస్ట్‌డయల్ సర్వీసులను పొందే యూజర్ల సంఖ్య మూడు నెలల సగటు సుమారు 13 కోట్ల దాకా ఉంటుంది. -
కరోనా కాలంలో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్
కరోనా మహమ్మరీ కాలంలో కూడా రిలయన్స్ డీజిటల్ కామర్స్, రిలయన్స్ రిటైల్ వ్యాపారం గణనీయమైన వృద్దిని సాధించింది. రిలయన్స్ రిటైల్ 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయంలో 10 శాతం పెరుగుదల కనబరిచి రూ.1,53,818 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా వార్షిక నివేదిక ప్రకారం, డిజిటల్ వాణిజ్యం, మర్చెంట్ బిజినెస్ వ్యాపారం దాదాపు 10 శాతం ఆదాయాన్ని అందించింది. గత ఏడాది సున్నా దగ్గర నుంచి గణనీయంగా పెరిగింది. ఎఫ్వై 21లో ప్రీ-టాక్స్ లాభం 9,842 కోట్ల రూపాయలగా ఉంది. రిలయన్స్ రిటైల్ అన్ని వ్యాపారాలలో తన డిజిటల్ వాణిజ్యం, రిలయన్స్ రిటైల్ సామర్థ్యాలను బలోపేతం చేసింది. మారుతున్న వినియోగదారుల ప్రవర్తనలను తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను పంపిణీ చేయడానికి, మొత్తం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇది కంపెనీకి భాగ సహకరిస్తుంది. గత ఏడాది భారతదేశపు అతిపెద్ద హైపర్‌లోకల్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్‌ను ప్రారంభించిన రిలయన్స్ ఆన్లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్, ఆన్లైన్ ఫర్నిచర్ రిటైలర్ అర్బన్ లాడర్, ఆన్లైన్ లోదుస్తుల రిటైలర్ జివామెలను సొంతం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ విభాగంలో తన ఆటను పెంచుకుంది. చదవండి: రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ -
ఇక ఆర్ఐఎల్ మరింత స్పీడ్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) బ్యాలెన్స్‌షీట్ మరింత పటిష్టపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ఇటీవల కొత్త రికార్డులు నెలకొల్పుతూ భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టడంతో లిక్విడిటీ పెరిగినట్లు తెలియజేశారు. తద్వారా అత్యధిక వృద్ధిని సాధిస్తున్న జియో, రిటైల్, ఆయిల్ టు కెమికల్(ఓటూసీ) విభాగాల వృద్ధి ప్రణాళికలకు మద్దతు లభించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఐఎల్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం టెలికం, డిజిటల్ బిజినెస్‌ల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌తోపాటు.. రిటైల్ విభాగంలోనూ మైనారిటీ వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ. 2 లక్షల కోట్లను సమీకరించింది. అంతేకాకుండా రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ. 53,124 కోట్లు సమకూర్చుకున్నట్లు ముకేశ్ తెలిపారు. వెరసి భారీ లిక్విడిటీతో పటిష్టమైన బ్యాలెన్స్‌షీట్.. వేగవంత వృద్ధిలో ఉన్న జియో, రిటైల్, ఓటూసీల ప్రణాళికలకు అండగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. నిధుల సమీకరణ ఇలా: గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,124 కోట్లు సమీకరించింది. ఇది గత దశాబ్ద కాలంలో నాన్‌ఫైనాన్షియల్ రంగ సంస్థ చేపట్టిన అతిపెద్ద ఇష్యూగా నిలిచింది. ఇదేవిధంగా మైనారిటీ వాటాల విక్రయం ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌కు రూ. 1,52,056 కోట్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ విభాగానికి రూ. 47,265 కోట్లు చొప్పున లభించాయి. ఈ కంపెనీల్లో అంతర్జాతీయ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ వంటివి వ్యూహాత్మక ఇన్వెస్టర్లుగా చేరినట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియోలో 33.7%, రిటైల్‌లో 15% చొప్పున వాటాలు విక్రయించింది. ఇంధన రిటైలింగ్ బిజినెస్‌లో గ్లోబల్ దిగ్గజం బీపీ 49% వాటాకు రూ. 7,629 కోట్లు ఇన్వె స్ట్ చేసినట్లు ప్రస్తావించారు. దీంతో దేశంలోనే గరిష్ట స్థాయిలో రూ. 2,60,074 కోట్లు(36 బిలియన్ డాలర్లు) సమీకరించగలిగినట్లు వివరించారు. ఈ బాటలో ఓటూసీలో 20 శాతం వాటాను సౌదీ అరామ్కోకు విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఈ వాటా ద్వారా 15 బిలియన్ డాలర్లను సమకూరవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో గడువు(2021 మార్చి)కంటే ముందుగానే ఆర్ఐఎల్ నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు చెప్పారు. గతేడాది ఆర్బీఐ నుంచి అనుమతులు పొందడం ద్వారా 7.8 బిలియన్ డాలర్ల విదేశీ మారక దీర్ఘకాలిక రుణాలను ముందస్తుగా చెల్లించినట్లు వెల్లడించారు. ఇది దేశీ కార్పొరేట్ రుణాలకు సంబంధించి అత్యధిక ప్రీపేమెంట్‌గా పేర్కొన్నారు. ఎన్ఎస్ఈలో రిలయన్స్ షేరు దాదాపు 2 శాతం లాభపడి రూ. 2,207 వద్ద ముగిసింది. దేశీ 5జీ ప్లాట్‌ఫాంపై జియో కసరత్తు డిజిటల్ ప్లాట్‌ఫాంలు, దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఆర్ఏఎన్ ప్లాట్‌ఫాంను వేగవంతంగా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తదుపరి 30 కోట్ల మంది మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు, 5 కోట్లకు పైగా ఫైబర్ హోమ్స్, 5 కోట్ల పైచిలుకు లఘు, చిన్న మధ్య తరహా సంస్థలకు సరిపడేంత స్థాయిలో నెట్వర్క్ సామర్థ్యాన్ని సాధించినట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. చిప్సెట్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌తో కలిసి భారత్‌లో 5జీ సొల్యూషన్స్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు, 1జీబీపీఎస్ మైలురాయిని అధిగమించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచ డిజిటల్ విప్లవంలో భారత్ ముందు వరుసలో ఉందని అంబానీ వివరించారు. ప్రతి ఇంటికీ, కార్యాలయానికి వేగవంతమైన ఇంటర్నెట్, డిజిటల్ సర్వీసులు అందించేలా రాబోయే కొన్ని సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా భారీ వైర్‌లైన్ నెట్వర్క్ నిర్మించడంపై జియో ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. -
రిటైల్ మార్కెట్లో దూసుకెళ్తున్న రిలయన్స్ రిటైల్
ముంబై: బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ప్రపంచ రిటైల్ పవర్ హౌస్‌ల 2021 ర్యాంకింగ్‌లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ రిటైలర్‌గా నిలిచింది. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ జాబితాలో గత ఏడాది 56వ స్థానంలో ఉంటే ఈ ఏడాది 53వ స్థానంలో ఉంది. డెలాయిట్ నివేదిక ప్రకారం, ఈ జాబితాలో యుఎస్ దిగ్గజం వాల్ మార్ట్ ఇంక్ అగ్రస్థానంలో ఉంది. మరోసారి ప్రపంచంలోని అగ్రశ్రేణి రిటైలర్ గా తన స్థానాన్ని నిలుపుకుంది. అమెజాన్.కామ్ రెండవ స్థానంలో నిలిచింది. కాస్ట్కో హోల్‌సేల్ కార్పొరేషన్ ఆఫ్ యుఎస్ మూడో స్థానంలో నిలిచింది, స్క్వార్జ్ గ్రూప్ ఆఫ్ జర్మనీ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏడుగురు యుఎస్ రిటైలర్లు, ఒకరు యుకె(టెస్కో పిఎల్సి 10వ స్థానంలో) ఉన్నారు. టాప్ 10లో ఉన్న ఇతర యుఎస్ రిటైలర్లలో ది క్రోగర్ కో(5 వ ర్యాంక్), వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ ఇంక్ (6వ), సీవీఎస్ హెల్త్ కార్పొరేషన్ (9వ ర్యాంక్) ఉన్నాయి. జర్మనీకి చెందిన ఆల్డి ఐంకాఫ్ జిఎమ్‌బిహెచ్ & కో.ఓహెచ్జి మరియు ఆల్డి ఇంటర్నేషనల్ సర్వీసెస్ జిఎమ్‌బిహెచ్ & కో.ఓహెచ్జీ 8వ స్థానంలో ఉన్నాయి. 250 మంది రిటైలర్ల ప్రపంచ జాబితాలో రిలయన్స్ రిటైల్ మాత్రమే భారతీయ సంస్థగా గుర్తింపు పొందడం విశేషం. గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్, ప్రపంచంలోని వేగవంతమైన రిటైలర్ల జాబితాలో ఇది వరుసగా 4వ సారి ప్రవేశం పొందింది. "రిలయన్స్ రిటైల్ కంపెనీ 41.8 శాతం వృద్ధిని నమోదు చేసింది, ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, జీవనశైలి, కిరాణా రిటైల్ గొలుసులలోని దుకాణాల సంఖ్య 13.1 శాతం పెరిగింది. ఆర్థిక సంవత్సరాంతంలో(ఎఫ్వై 20) భారతదేశంలోని 7,000 పట్టణాలు, నగరాల్లో 11,784 దుకాణాలకు చేరుకుంది" అని డెలాయిట్ ప్రతినిధులు తెలిపారు. "వాట్సాప్ ఉపయోగించి జియోమార్ట్ ప్లాట్ఫామ్లో రిలయన్స్ రిటైల్ డిజిటల్ కామర్స్ వ్యాపారాన్ని మరింత వేగవంతం చేయడానికి మరియు వాట్సాప్‌లో చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి కంపెనీ వాట్సాప్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది" అని తెలిపింది. చదవండి: ప్రమాదంలో లక్షల క్వాల్కామ్ స్మార్ట్ఫోన్లు -
100 బిలియన్ డాలర్ల క్లబ్లో రిలయన్స్ రీటైల్
సాక్షి, ముంబై: అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కు చెందిన రిలయన్స్ రిటైల్ 100 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్క్ సాధించిన 4వ భారతీయ కంపెనీగా అవతరించింది. కిరాణా నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ దేశవ్యాప్తంగా రిటైల్ చెయిన్ నిర్వహిస్తున్న కంపెనీ ఈ సరికొత్త మార్కును అందుకుంది. అయితే రిలయన్స్ రిటైల్ లిస్టెడ్ కాకపోయినా కూడా షేర్లు ఒక్కొక్కటి రూ .1,500, రూ .1,550 పరిధిలో ఉన్నాయి. ఒక్కో షేరుకు 1,500 రూపాయల చొప్పున సంస్థ విలువ 7.5 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. కంపెనీ గత ఏడాది వాటాలు విక్రయించడం ప్రారంభించిన నేపథ్యంలో కంపెనీ వాల్యూ ఏకంగా మూడు రెట్లు పెరిగింది. డిసెంబర్ 2019 లో రిలయన్స్ రిటైల్ షేర్లు రూ.900 వద్ద ఉన్నాయి. దీనికితోడు రిలయన్స్ రిటైల్ వాటాదారులకు రిలయన్స్ రిటైల్ నాలుగు షేర్లకు బదులుగా ఆర్ఐఎల్లో ఒక వాటాను ఇచ్చేలా స్కీమ్ ప్రకటించింది. ఈ పథకం తరువాత రిలయన్స్ రిటైల్ షేర్లు ఒక్కో షేరుకు 380 రూపాయలకు పడిపోయాయి. జనవరిలో రిలయన్స్ ఈ పథకాన్ని ఆఫ్షనల్ గా చేసింది. అప్పటి నుండి మంచి పనితీరును కనబరిచిన రిలయన్స్ రిటైల్ 2020 డిసెంబర్ 31 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 88.1 శాతం వృద్ధితో నమోదు చేసింది తద్వారా 1,830 కోట్ల రూపాయలను ఆర్జించింది. మరోవైపు త్వరలోనే ఐపిఓతో రానుందని భావిస్తున్న రిలయన్స్ రిటైల్ కొత్తగా 6500-7000 అవుట్లెట్లను తెరవాలని యోచిస్తోందట. -
‘ఫ్యూచర్’ డీల్‌కు గడువు పెంపు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా ఫ్యూచర్ గ్రూప్‌తో కుదుర్చుకున్న డీల్‌ను పూర్తిచేసేందుకు వీలుగా గడువును పొడిగించింది. గతేడాది ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులు, హోల్‌సేల్ బిజినెస్‌ల కొనుగోలుకి కుదుర్చుకున్న ఒప్పందం గడువు 2021 మార్చి31తో ముగియనుడంటంతో.. సెప్టెంబర్ 30వరకూ పొడిగించింది. ‘లాంగ్ స్టాప్ డేట్’లో భాగంగా ఆరు నెలల పాటు గడువును పొడిగించినట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది. కిశోర్ బియానీ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌ల కొనుగోలుకి 2020 ఆగస్ట్‌లో రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. విలీనాలు, కొనుగోళ్ల విషయంలో కంపెనీలు ఒప్పందాలను పూర్తిచేసుకునేందుకు వీలుగా లాంగ్ స్టాప్‌ను వినియోగిస్తుంటాయని విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. తమతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించిందంటూ ఈ డీల్ విషయంలో ఫ్యూచర్ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించిన విషయం విదితమే. రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ డీలపై ఇప్పటికే సీసీఐ, సెబీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ.. అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ప్రత్యేక యూనిట్‌గా ఓటూసీ.. ఆయిల్ టు కెమికల్స్(ఓటూసీ) బిజినెస్‌ను ప్రత్యేక యూనిట్‌గా విడదీసేందుకు రుణదాతలు, వాటాదారులు అనుమతించినట్లు రిలయన్స్ తాజాగా పేర్కొంది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) మార్గదర్శకాల ప్రకారం ఈ అంశంపై రుణదాతలు, వాటాదారుల సమా వేశాన్ని నిర్వహించింది. ఇందుకు అనుకూలంగా సెక్యూర్డ్ క్రెడిటార్లు, రుణదాతలు, వాటాదారుల నుంచి ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాదాపు 100% ఓటింగ్ నమోదైనట్లు ఎక్సే్ఛంజీలకు ఆర్ఐఎల్ తెలిపింది. ఈ సమావేశాలకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షత వహించినట్లు పేర్కొంది. రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్, పెట్రోకెమ్ బిజినెస్‌లను ఓటూసీగా విడదీసేందుకు ఫిబ్రవరిలో ఆర్ఐఎల్ ప్రణాళికలు వేయడం తెలిసిందే. స్వతంత్రంగా ఏర్పాటయ్యే ఈ యూనిట్‌కు మాతృసంస్థ 25 బిలియన్ డాలర్ల రుణాన్ని సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అలాగే సౌదీ అరామ్కో తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లకు వాటాలు విక్రయించనున్నట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. -
హైకోర్టు షాక్ : ఫ్యూచర్ గ్రూపు షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ తగిలింది. రిలయన్స్ రీటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ కిషోర్ బియానీ డీల్‌కు బ్రేక్ పడిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ గ్రూపు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ముఖ్యంగా ఫ్యూచర్ రిటైల్ రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేసింది. దాదాపు 11 శాతం కుప్పకూలి లోయర్ సర్క్యూట్ అయింది. అంతేకాదు తాజా పరిణామంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,029 కోట్లకు పడిపోయింది. (రిలయన్స్ డీల్‌కు బ్రేక్ : బియానీకి భారీ ఎదురుదెబ్బ) ఫ్యూచర్ రిటైల్ మాత్రమే కాదు, అనేక ఇతర ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి. ఫ్యూచర్ కన్స్యూమర్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో 9.15 శాతం పడిపోగా, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 8.95 శాతం క్షీణించింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ షేర్లు కూడా దాదాపు 10 శాతం, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ షేర్లు 4.99 శాతం తగ్గాయి. గడువులోగా అన్ని రెగ్యులేటరీ ఆమోదాలను పొందడంలో ఫ్యూచర్ రిటైల్ విఫలమైతే, రిలయన్స్ ఈ ఒప్పందానికి దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రభావితమైంది. కాగా ఫ్యూచర్ రిటైల్ రూ .24,713 కోట్ల ఒప్పందానికి వ్యతిరేకంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సియాక్) జారీ చేసిన ఎమర్జెన్సీ అవార్డు (ఇఎ) ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు గురువారం రద్దు చేసింది. కంపెనీ ఉద్దేశపూర్వంగానే ఉత్తర్వులను నిర్లక్క్ష్యం చేసిందని పేర్కొన్న కోర్టు, బియానీతో ఇతర ప్రముఖుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
మరిన్ని సంస్థల కొనుగోళ్లపై కన్నేసిన రిలయన్స్
కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్ఫార్మ్. జియోమార్ట్‌ను మరింత పటిష్టం చేసే ప్రయత్నాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ముమ్మరం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇటీవలనే నెట్‌మెడ్స్ (ఆన్లైన్ ఫార్మసీ సంస్థ)ను కొనుగోలు చేసింది. జియోమార్ట్ కోసమే ఈ కొనుగోలు జరిగింది. జయోమార్ట్ కార్ట్‌లో ఆన్లైన్ ఫార్మసీతో పాటు భవిష్యత్తులో మరిన్ని విభాగాలు జత చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. మరోవైపు 2019 నుంచి కొంటూ వస్తున్న వివిధ సంస్థలను (గ్రాబ్, ఫైండ్ తదితర సంస్థలు) పూర్తిగా రిలయన్స్ రిటైల్‌లో సమ్మిళితం చేసి జియోమార్ట్‌ను మరింత పటిష్టం చేయనున్నది. రిలయన్స్ రిటైల్‌కు ఇప్పటికే ట్రెండ్స్, డిజిటల్, జ్యూయల్ విభాగాలున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ జియోమార్ట్ పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ) విక్రయిస్తోంది. త్వరలోనే మరిన్ని వ్యాపార విభాగాలు–ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్ జత చేయనున్నది. ఫ్యాషన్ స్టార్టప్ జివామెలో రోనీ స్క్రూవాలకు ఉన్న 15 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ బ్రాండ్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో మరింత వాటాను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థ, అర్బన్ ల్యాడర్‌ను, గ్రోసరీ డెలివరీ సంస్థ మిల్క్ బాస్కెట్‌ను కూడా రిలయన్స్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. (వాటా విక్రయం ఉండదని, త్వరలోనే ఐపీఓకు వస్తామని ఇటీవలే మిల్క్ బాస్కెట్ స్పష్టం చేసింది) ఆన్లైన్ సంబంధిత స్టార్టప్‌లను.. కుదిరితే పూర్తిగా కొనేయడమో లేదంటే ఎంతో కొంత వాటానైనా చేజిక్కించుకోవడమో... ఇది రిలయన్స్ జియోమార్ట్ వ్యూహం. నిధులు పుష్కలం... గత రెండు నెలల్లో 8.5 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్ రిటైల్ రూ.37,710 కోట్లు సమీకరించింది. జియోమార్ట్ విస్తరణ కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నది. కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలు–అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల పంట పడింది. మరింత మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం ఈ రెండు సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. భారత్‌లో ఇన్వెస్ట్ చేయడానికి అమెజాన్ సంస్థ వంద కోట్ల డాలర్లు కేటాయించింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ సంస్థ 120 కోట్ల డాలర్ల నిధులు సమీకరించింది. సూపర్ మార్కెట్ల చెయిన్‌లో సంచలనం సృష్టించిన డీమార్ట్, దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్(బిగ్‌బాస్కెట్‌లో టాటాలకు వాటా ఉంది) కూడా అన్లైన్ గ్రోసరీ మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. సగం సరుకులు జియోమార్ట్వే ఇటీవలే మొదలైనా జియోమార్ట్ అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లకు ధీటుగా వేగంగా వృద్ధి చెందే ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్గా అవతరించనున్నది. కార్యకలాపాలు ప్రారంభించి కొద్ది కాలమే అయినప్పటికీ, రిలయన్స్ దన్నుతో ఈ సంస్థ దూసుకుపోతోంది. కొన్నేళ్లలో భారత్‌లో ఆన్లైన్లో అమ్ముడయ్యే మొత్తం సరుకుల్లో(వస్తువులు)సగం రిలయన్స్ జియోమార్ట్వే ఉండనున్నాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో వెల్లడించింది. ఈ కామర్స్ మార్కెట్లో ప్రస్తుతం జియోమార్ట్ వాటా 1 శాతంగానే ఉందని, ఐదేళ్లలో ఇది 31 శాతానికి ఎగబాకుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. వాట్సాప్ ద్వారా చెల్లింపులకు ఆమోదం లభించడం జియోమార్ట్‌కు మరింత కిక్‌ను ఇవ్వనున్నది. (వాట్సాప్ మాతృసంస్థ ఫేస్బుక్ ఇటీవలనే రిలయన్స్ జియోలో భారీగా పెట్టుబడులు పెట్టింది) ఇక జియోమార్ట్ 1,700 మంది మర్చంట్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. 20 నగరాల్లో కిరాణా వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు పోటీ సంస్థలు గ్రోఫర్స్, స్విగ్గీ స్టోర్స్, బిగ్‌బాస్కెట్ తదితర సంస్థల విస్తరణ అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం జియోమార్ట్‌లో రోజుకు నాలుగు లక్షల ఆర్డర్లు వస్తున్నాయని అంచనా. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కూడా ఆన్లైన్ ద్వారా సరుకుల అమ్మకాలు జోరు తగ్గలేదు. ఆర్థిక మందగమన కాలంలో ఆకర్షణీయ డిస్కౌంట్లు ఇస్తుండటమే దీనికి ఒక కారణం. గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల గ్రోసరీ విభాగాల అమ్మకాలు అంతకంతకూ పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. జోరుగా యాప్ డౌన్లోడ్లు... రిలయన్స్‌కు చెందిన జియోమార్ట్ (గ్రోసరీ), అజియో(దుస్తులు) యాప్‌ల డౌన్లోడ్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ యాప్‌ల డౌన్లోడ్ల కంటే రెట్టింపు జియోమార్ట్ యాప్‌ల డౌన్లోడ్లు జరుగుతున్నాయి. డౌన్లోడ్లు జోరుగా ఉంటే లావాదేవీలు జరిగినట్లు కానప్పటికీ, భవిష్యత్తులో లావాదేవీలు పెరగడానికి ఈ డౌన్లోడ్లు ఒక సంకేతమని గోల్డ్‌మన్ శాక్స్ అంటోంది. సరైన బిజినెస్ మోడల్ లేదు...! ప్రస్తుతం ఈ గ్రోసరీ మార్కెట్లో బిగ్బాస్కెట్దే పై చేయి. తర్వాతి స్థానంలో గ్రోఫర్స్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ సూపర్‌మార్ట్, ఫ్లిప్కార్ట్క్విక్ పేరుతో గ్రోసరీలను విక్రయిస్తోంది. అమెజాన్ సంస్థ ప్యాంట్రీ, ఫ్రెష్ సంస్థల ద్వారా సరుకులను అందిస్తోంది. ప్రస్తుతానికి జియోమార్ట్‌తో బిగ్‌బాస్కెట్‌కు, గ్రోఫర్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా, భవిష్యత్తులో మాత్రం ఈ రెండు కంపెనీలకు జియోమార్ట్ గట్టిపోటీనే ఇచ్చే అవకాశాలున్నాయి. భారీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి రావడంతో మార్జిన్లు తక్కువగా ఉండటం, సరఫరా, డెలివరీ తదితర సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఏ సంస్థకూడా ఈ గ్రోసరీ సెగ్మెంట్లో సరైన ‘బిజినెస్ మోడల్’ను ఏర్పాటు చేయలేకపోయాయి. అయితే ఈ సంస్థల వద్ద పుష్కలంగా నిధులు ఉండటంతో ఇవి వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తున్నాయి. -
అమెజాన్‌కు ఊరట: సుప్రీం కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్యూచర్ గ్రూపు వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) డీల్‌కు మరోసారి బ్రేక్ పడింది. ఈ ఒప్పందానికి సంబంధించి "యథాతథ స్థితిని" కొనసాగించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ తీర్పుపై స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్, బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం ఫ్యూచర్ రిటైల్, గ్రూపు అధినేత కిషోర్ బియానీ, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. రానున్న మూడు వారాల్లో దీనిపై సమాధానం చెప్పాలని కోరింది. అలాగే ఈ వివాదంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆర్ఐఎల్తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్ ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న ఉత్తర్వులిచ్చింది. దీనిపై అమెజాన్ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం తాజా ఆదేశాలతో రిలయన్స్ రీటైల్‌తో ఒప్పందానికి సంబంధించి ఫ్యూచర్ గ్రూపునకు తాజాగా మరో ఎదురు దెబ్బ గిలింది. -
అమెజాన్ : కిషోర్ బియానీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు 3.4 బిలియన్ డాలర్ల రిలయన్స్ రీటైల్ డీల్ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ అలుపెరుగని పోరాటం చేస్తోంది. మరోవైపు ఈ ఒప్పందం అమలును అడ్డుకునేందుకు అమెజాన్ ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఫ్యూచర్ గ్రూపు సీఈఓ కిషోర్ బియానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరికలాంటిదే అమెజాన్ ప్రయస కూడా అని అభివర్ణించారు. ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకు వీరుడు ఇండియాలో తోక ముడిచాడనేది చరిత్ర చెబుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. (బియానీని అరెస్ట్ చేయండి!) రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ ఆస్తుల విక్రయం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్న అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బియానీ తాజా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారతీయ కస్టమర్లపై ఆధిపత్యం కోసం అమెజాన్ చేస్తున్న కార్పొరేట్ యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక అంతర్గత లేఖ రాశారు. రిలయన్స్ రీటైల్ ఒప్పందానికి సంబంధించి అన్ని నిబంధనలను పాటించామని, రెగ్యులేటరీ ఇటీవలి ఆమోదమే ఇందుకు నిదర్శనమన్నారు. 1,700 దుకాణాలు, వేలాది మంది ఉద్యోగుల మనుగడకు ఈ ఒప్పందం కీలకమని తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ నిరాకరించింది. (అమెజాన్‌కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ) -
కోల్గేట్కు షాక్.. రూ.65 వేల జరిమానా
సంగారెడ్డి: కోల్గేట్ సంస్థ పేస్టును అధిక ధరకు విక్రయిస్తున్నారని చెప్పి ఓ వినియోగదారుడు పిటిషన్ వేయగా విచారించిన వినియోగదారుల ఫోరం రూ.65 వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తోందని సంగారెడ్డికి చెందిన ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను విచారించి శుక్రవారం ఫోరం తీర్పునిచ్చింది. న్యాయవాదిగా పనిచేస్తున్న సీహెచ్ నాగేందర్ 2019 ఏప్రిల్ 7వ తేదీన సంగారెడ్డిలోని రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ మాల్లో 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ రూ.92కు కొన్నారు. దీంతోపాటు 20 గ్రాముల కోల్గోట్ మాక్స్ టూత్‌పేస్ట్ రూ.10కి కొనుగోలు చేశారు. అయితే రూ.పదికి 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్‌కు రూ.92 తీసుకోవడంపై నాగేందర్ సందేహం వ్యక్తం చేశారు. అంటే రూ.17 అధికంగా తీసుకుంటున్నారని గుర్తించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారంటూ ఆయన కోల్గేట్ సంస్థ వారికి నోటీసులు పంపించారు. అతడి నోటీసులకు కోల్గేట్ సంస్థ స్పందించకపోవడంతో ఆయన సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. అతడి పిటిషన్‌ను విచారించి కోల్గేట్ సంస్థ అదనంగా వసూలు చేసిన రూ.17 తిరిగి ఇవ్వాలని చైర్మన్ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు ఇచ్చారు. దాంతోపాటు ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల కింద రూ. 5వేలు అదనంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్ సంస్థను ఆదేశించారు. అయితే ఇవన్నీ కూడా నెల రోజుల్లోపు వినియోగదారుడు నాగేందర్‌కు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ విధంగా వినియోగదారుల ఫోరం వినియోగదారుల కోసం పని చేస్తుంటుంది. మీరు కూడా ఎక్కడైనా.. ఏం సంస్థ వస్తువు విషయంలో మోసపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. -
డీల్ ఓకే : అమెజాన్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఫ్యూచర్ గ్రూపు, అమెజాన్ మధ్య వివాదంలో అమెజాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కిశోర్ బియానీ యాజమాన్యంలోని ఫ్యూచర్ గ్రూప్, ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ డీల్‌కు అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా ఆమోద ముద్ర వేసింది. అయితే అమెజాన్ అభ్యంతరాలపై వివరణ కోరింది. (అమెజాన్‌కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ) అలాగే కీలక ఒప్పందాల సమయంలో ఎలాంటి వివాదం ఉన్నా ముందుగా తనతో పాటు,షేర్ హోల్డర్స్ కు కూడా సమాచారం అందించాలని సెబీ తెలిపింది. ఎన్సీఎల్టీ దృష్టికి తీసుకురావాలని కూడా స్పష్టం చేసింది. అలాగే ఈ ఒప్పందంలో భాగంగా యాజమాన్యం మార్పునకు సంబంధించి న్యాయపరంగా చిక్కులు లేకుండా రూట్ మ్యాప్ సమాచారాన్ని కూడా అందించాలని సెబీ ఆదేశించింది. ఆగస్టు 29, 2020న రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ వాటాలను రూ.24713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు గత ఏడాది నవంబరులోనే సీసీఐ అంగీకారం లభించగా, తాజాగా సెబీ కూడా ఆమోద్రముద్ర వేసింది. కాగా,ఈ ఒప్పందంపై అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సింగపూర్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. ఫ్యూచర్ లోని కూపన్ విభాగంలో అమెజాన్ సంస్థకు 49 శాతం వాటా ఉన్న నేపథ్యంలో తమకు సమాచారం ఇవ్వకుండానే ఎలా విక్రయిస్తారని ప్రశ్నించింది. దీనికి తమకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే నిబంధనల ప్రకారమే ఈ డీల్ ఉందని, అమెజాన్‌కు పరిహారం చెల్లించే ప్రశ్నేలేదని ఫ్యూచర్ గ్రూపు తెగేసి చెప్పింది. అమెజాన్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రిలయన్స్, ఫ్యూచర్ డీల్‌కు సెబీ గ్రీన్ సిగ్నల్ లభించన నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.46 శాతం లాభంతో రూ. 2105 వద్ద కొనసాగుతోంది. -
ఏనాడూ వ్యవసాయ భూమి కొనలేదు: ఆర్ఐఎల్
ముంబై: కార్పొరేట్ అవసరాల కోసం ఏనాడూ వ్యవసాయ భూములను కొనుగోలు చేయలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదే విధంగా రైతులతో కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని తెలియజేసింది. భవిష్యత్‌లోనూ కాంట్రాక్ట్ లేదా కార్పొరేట్ వ్యవసాయం చేసే ప్రణాళికలు లేవని తేల్చిచెప్పింది. తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటనలో ఆర్ఐఎల్ ఇంకా ఏమన్నదంటే.. ఎంఎస్పీకి అనుగుణంగా అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ ఏనాడూ రైతుల నుంచి ఆహార ధాన్యాలను ప్రత్యక్షంగా కొనుగోలు చేయలేదు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) లేదా ఏ ఇతర మార్గదర్శకాలకు అనుగుణమైన విధానాలలోనే వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయవలసిందిగా సరఫరాదారులందరికీ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల విధానంలో మాత్రమే వ్యవసాయోత్పత్తులను సమకూర్చవలసిందిగా సరఫరాదారులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. రైతులకు నష్టం చేసే రీతిలో లేదా కంపెనీకి అనుచిత లబ్ది చేకూరే విధానంలో ఏనాడూ దీర్ఘకాలిక కాంట్రాక్టులను కుదుర్చుకోవడం వంటివి చేపట్టలేదు. కోర్టులో పిటిషన్ ఇటీవల కొద్ది రోజులుగా పంజాబ్, హర్యానాలలో రిలయన్స్ జియోకు చెందిన సుమారు 1,500 మొబైల్ టవర్లకు కొంతమంది నష్టం చేకూర్చినట్లు అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ద్వారా పంజాబ్, హర్యానా హైకోర్టులో ఆర్ఐఎల్ ఫిర్యాదు చేసింది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవల రైతులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కావాలని కొంతమంది కంపెనీ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నట్లు ఆరోపించింది. తద్వారా వేలకొద్దీ ఉద్యోగులకు రక్షణ కరవుకాగా, కీలక మౌలికసదుపాయాలకు విఘాతం కలుగుతున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఉద్యోగులు, ఆస్తులకు వెంటనే తగిన రక్షణ కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించింది. కంపెనీ ఆస్తుల విధ్వంసాన్ని కొన్ని వ్యాపార వైరివర్గాలు కావాలని చేస్తున్న దుశ్చర్యలుగా ఫిర్యాదులో ఆరోపించింది. -
అంబానీ- ఆసియా కుబేరుల్లో రెండు మెట్లుపైనే!
న్యూఢిల్లీ, సాక్షి: దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తాజాగా కుబేరుల జాబితాలో మరో రికార్డును చేరుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆసియాలోకెల్లా అంబానీల కుటుంబం అత్యంత ధనికులుగా రికార్డులకెక్కింది. అంబానీ కుటుంబ సంపద 76 బిలియన్ డాలర్లుకాగా.. జాబితాలో రెండో ర్యాంకులో నిలిచిన హాంకాంగ్‌కు చెందిన క్వాక్ ఫ్యామిలీ ఆస్తుల విలువ 33 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇక మూడో స్థానాన్ని పొందిన శామ్సంగ్ యజమాని లీ కుటుంబ సంపద సైతం 26.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వెరసి అంబానీ కుంటుంబ సంపద రెండో ర్యాంకుకంటే రెట్టింపు, మూడో ర్యాంకుతో పోలిస్తే మూడు రెట్లు అధికంకావడం గమనార్హం! 10 బిలియన్లు ప్లస్ ఆసియాలో టాప్-20 కుబేర కుటుంబాల జాబితాను బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసింది. ఈ మొత్తం కుటుంబాల సంపద గతేడాదితో పోలిస్తే 10 బిలియన్ డాలర్లు పెరిగి 463 బిలియన్ డాలర్లకు చేరింది. అంబానీ కుటుంబ సభ్యుల్లో అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఆస్తులు క్షీణించినప్పటికీ ముకేశ్ అంబానీ గ్రూప్ ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు చూపడం ద్వారా జాబితాలో అగ్రస్థానాన్ని పటిష్ట పరచుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ పేర్కొంది. కాగా.. వారసులు లేకపోవడంతో చైనీస్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు చెందిన జాక్ మాను జాబితాకు ఎంపిక చేయలేదని తెలియజేసింది. రిటైల్, డిజిటల్ ఎఫెక్ట్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొద్ది రోజులుగా అనుబంధ సంస్థలు రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లో విదేశీ పెట్టుబడులను ఆకట్టుకుంటూ వచ్చింది. డిజిటల్ విభాగం రిలయన్స్ జియోలో వాటాల విక్రయం ద్వారా 20.2 బిలియన్ డాలర్లను సమీకరించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కేకేఆర్, టీపీజీతోపాటు, ఫేస్బుక్, గూగుల్ సైతం వాటాలను కొనుగోలు చేశాయి. ఈ బాటలో రిలయన్స్ రిటైల్లోనూ 10 శాతంపైగా వాటా విక్రయంతో రూ. 47,000 కోట్లు సమకూర్చుకుంది. రెండు నెలల్లోనే రిటైల్ విభాగంలో భారీగా నిధులు సమీకరించడం విశేషంకాగా.. చమురు, గ్యాస్ బిజినెస్‌లు నీరసించినప్పటికీ ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది 50 శాతం ర్యాలీ చేసింది. తద్వారా ముకేశ్ అంబానీ సంపదకు 16 బిలియన్ డాలర్లు జమైనట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది ఆసియా కుబేరుల సంపదలో అంతరాన్ని పెంచినట్లు వివరించారు. -
సీసీఐ ఓకే: ఆర్ఐఎల్, ఫ్యూచర్ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: రిటైల్ బిజినెస్‌ల విక్రయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యూచర్ గ్రూప్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. ఈ బాటలో రిలయన్స్ రిటైల్ ద్వారా ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల కొనుగోలుకి డీల్ కుదుర్చుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ కౌంటర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అప్పర్ సర్క్యూట్స్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ గ్రూప్‌లోని పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు అప్పర్ అనుమతించినమేర అప్పర్ సర్య్యూట్లను తాకాయి. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు 10 శాతం జంప్‌చేసింది. రూ. 79 ఎగువన ఫ్రీజయ్యింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ సైతం 10 శాతం లాభపడి రూ. 90.5 వద్ద నిలిచింది. ఈ బాటలో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 5 శాతం పురోగమించి రూ. 103 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదే విధంగా ఫ్యూచర్ కన్జూమర్ 5 శాతం పెరిగి రూ. 8.25 వద్ద, ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్ 5 శాతం పుంజుకుని రూ. 10.40 వద్ద ఫ్రీజయ్యాయి. ఇక డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్ఐఎల్ షేరు 3.2 శాతం బలపడి రూ. 1,959 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,970 వరకూ ఎగసింది. కాగా.. ఆర్ఐఎల్తో ఫ్యూచర్ గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందానికి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. డీల్‌ను నిలిపివేయమంటూ భాగంగా సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టులో ఫిర్యాదు చేసింది. తద్వారా తాత్కాలిక ఉత్తర్వులను సైతం పొందింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ తదితర బిజినెస్‌ల కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
ఫ్యూచర్ గ్రూప్ ఫ్యూచర్.. కత్తిమీద సాము!
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ బిజినెస్‌ల విక్రయం ప్రస్తుతానికి డోలాయమానంలో పడటంతో ఫ్యూచర్ గ్రూప్ దిక్కుతోచని పరిస్థితికి చేరినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రిటైల్ బిజినెస్‌లను ఆర్ఐఎల్కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ 3.4 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ కుదర్చుకోవడంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ అమెజాన్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో తాత్కాలికంగా డీల్‌ను నిలిపివేయమంటూ సింగపూర్ ఆర్బిట్రేటర్ అక్టోబర్‌లో ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించిన విషయం విదితమే. చదవండి: (చిన్న షేర్ల దన్ను- స్మాల్ క్యాప్ రికార్డ్) ఏం జరిగిందంటే.. గతేడాది ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్‌లోని ప్రధాన లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. అయితే నిబంధనలకు అనుగుణంగానే ఆర్ఐఎల్తో డీల్ కుదుర్చుకున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. రుణభారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ మార్చిలో లాక్‌డవున్‌ల విధింపు నేపథ్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో రిటైల్ ఆస్తుల విక్రయానికి ఆర్ఐఎల్తో డీల్ కుదుర్చుకుంది. చదవండి: (ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్) ఆకర్షణీయ మార్కెట్ దేశీయంగా ట్రిలియన్ డాలర్ల విలువైన కన్జూమర్ రిటైల్ మార్కెట్లో పాగా వేసేందుకు ఇప్పటికే అమెజాన్, ఆర్ఐఎల్, వాల్‌మార్ట్(ఫ్లిప్‌కార్ట్) తదితర దిగ్గజాలు పావులు కదుపుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్ కొనుగోలుకి రిలయన్స్ గ్రూప్ ఆసక్తి చూపింది. తద్వారా రిలయన్స్ రిటైల్ బిజినెస్‌కు బూస్ట్ లభించే వీలుంటుందని భావించింది. అయితే దేశీ రిటైల్ మార్కెట్లో భారీ వాటాపై కన్నేసిన అమెజాన్ గ్రూప్.. ఈ డీల్ నిబంధనలకు విరుద్ధమంటూ ఫ్యూచర్ గ్రూప్‌నకు వ్యతిరేకంగా సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. తద్వారా అక్టోబర్ 25న డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేయమంటూ ఆర్బిట్రేటర్ కోర్టు నుంచి ఎమర్జెన్సీ ఆదేశాలను సాధించింది. ఈ అంశంపై దేశీయంగా కాంపిటీషన్ కమిషన్‌ను సైతం ఆశ్రయించింది. నిజానికి అమెజాన్ మే నెలలో ఫ్యూచర్ గ్రూప్‌లో మరింత వాటా కొనుగోలుకి ఆసక్తి చూపి విఫలమైనట్లు వార్తలు వెలువడ్డాయి. డీల్‌పై ఆశలు అమెజాన్‌తో తలెత్తిన న్యాయవివాదాలను స్థానిక చట్టాల ద్వారా పరిష్కరించుకునే యోచనలో ఉన్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ఇప్పటికే పేర్కొంది. ఆర్ఐఎల్ సైతం వీలైనంత త్వరగా ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తుల కొనుగోలును చేపట్టే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. అమెజాన్‌తో అన్‌లిస్టెడ్ గ్రూప్ సంస్థల కాంట్రాక్టుకు రిటైల్ ఆస్తుల విక్రయానికి సంబంధంలేదంటూ ఫ్యూచర్ గ్రూప్ న్యాయనిపుణులు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు సంస్థలూ ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమేనని, ఒకే యాజమాన్య నిర్వహణలో ఉన్నాయని అమెజాన్ న్యాయనిపుణులు పేర్కొంటున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. కాగా.. ఆర్ఐఎల్తో డీల్ విఫలమైతే ఫ్యూచర్ గ్రూప్‌నకు చెల్లింపుల సమస్యలు ఎదురుకాగలవని, పలువురు ఉపాధి కోల్పోయే ప్రమాదమున్నదని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఫ్యూచర్ గ్రూప్ రుణ చెల్లింపుల సమస్యలు ఎదుర్కొన్నట్లు ప్రస్తావిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావం, ప్రత్యర్ధుల నుంచి తీవ్ర పోటీ తదితర ప్రతికూలతలతో అమ్మకాలు పడిపోగా.. వరుసగా రెండు త్రైమాసికాలలో ఫ్యూచర్ గ్రూప్ భారీ నష్టాలను నమోదు చేసింది. దీంతో గ్రూప్‌లోని షేర్లు 80 శాతం వరకూ పతనమయ్యాయి. కాగా.. నేడు ఫ్యూచర్ రిటైల్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్) ఫలితాలను ప్రకటించనుండటం గమనార్హం! -
రిలయన్స్ డీల్: అమెజాన్‌కు సమన్లు
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. రిలయన్స్‌కు చెందిన రిలయన్స్ రీటైల్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) డీల్‌కు సంబంధించి అమెజాన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ మధ్యంతర ఉత్తర్వులతో ఈ ఒప్పందంలో అమెజాన్ జోక్యంపై ఫ్యూచర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు మంగళవారం విచారించింది. దీనిపై స్పందించాల్సిందిగా అమెజాన్‌ను కోరింది. (అమెజాన్‌కు భారీ ఊరట : రిలయన్స్ డీల్‌కు బ్రేక్) ఒక రోజంతా ఎఫ్ఆర్ఎల్, ఎఫ్‌సిపిఎల్, రిలయన్స్, అమెజాన్ తరఫున రోజువారీ వాదనలు విన్న జస్టిస్ ముక్త గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దీనిపై 30 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఎఫ్ఆర్ఎల్ దావాపై అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌సిపిఎల్), రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఆర్ఆర్ఎల్) లకు సమన్లు జారీ చేసింది స్టేట్మెంట్లను దాఖలు చేయాలని కోరింది. అమెజాన్ లేవనెత్తిన దావా నిర్వహణ సామర్థ్యాన్ని కూడా బహిరంగంగా ఉంచుతామని కోర్టు తెలిపింది. దీనిపై బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. (రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్) కాగా రిలయన్స్ రీటైల్ ఫ్యూచర్ రీటైల్ డీల్‌ను వ్యతిరేకించిన అమెజాన్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు అక్టోబర్ 25 న అమెజాన్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
పెట్టుబడుల హోరు: రిలయన్స్ జోరు
సాక్షి,న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు శుక్రవారం భారీ లాభాలను నమోదు చేస్తోంది. సంస్థకు చెందిన రీటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పీఐఎఫ్) 9,555 కోట్ల రూపాయలు పెట్టుబడుల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు క్యూకట్టారు. దీంతో మార్కెట్ ట్రేడింగ్ ఆరంభంలోనే హై జంప్ చేసిన రిలయన్స్ షేరు ప్రస్తుతం 4 శాతం లాభాలతో కొనసాగుతోంది. మరోఆల్‌టైం గరిష్టం వైపు దూసుకుపోతోంది. (ముకేశ్.. మారథాన్!) బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిటైల్ విభాగం 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ .9,555 కోట్లు. గత రెండు నెలల్లో మొత్తం నిధుల సేకరణ 47,265 కోట్ల రూపాయలకు చేరుకుంది. మరోవైపు సెన్సెక్స్ 346 పాయింట్లు లాభంతో 41688 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లుఎగిసి 12207 వద్దకొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (కరోనా : లక్ష కోట్ల అంబానీ సంపద ఆవిరి) -
ముకేశ్.. మారథాన్!
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ నిధుల వేటలో దూసుకుపోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపార అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లోకి మరో భారీ పెట్టుబడి వచ్చిచేరింది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తమ సంస్థలో 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుందని, దీనిద్వారా రూ.9,555 కోట్ల నిధులను సమీకరించినట్లు ఆర్ఆర్వీఎల్ గురువారం ప్రకటించింది. తాజా పెట్టుబడుల సమీకరణతో రిలయన్స్ రిటైల్ విభాగం విలువ దాదాపు రూ.4.587 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. కాగా, గడిచిన రెండు నెలల్లో (సెప్టెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ) ఆర్‌ఆర్‌వీఎల్‌లోకి మొత్తం రూ.46,265 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. కంపెనీలో 10.52 శాతం వాటాను ఎనిమిది మంది ఇన్వెస్టర్లకు విక్రయించింది. జియోలోనూ పెట్టుబడి... సౌదీ పీఐఎఫ్‌కు రిలయన్స్ గ్రూప్‌పై గురి బాగానే కుదిరింది. ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీనికోసం రూ.11,367 కోట్లను కుమ్మరించింది. తాజాగా రిటైల్లోనూ అడుగుపెట్టడం ద్వారా అంబానీ కంపెనీల్లో పీఐఎఫ్‌కు ఇది రెండో పెట్టుబడి కానుంది. కాగా, జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఫేస్బుక్, ఇంటెల్, గూగుల్ సహా మొత్తం 13 అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు వాటా విక్రయం ద్వారా రూ.1.52 లక్షల కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఐదేళ్లలోపు ఆయా విభాగాలను పబ్లిక్ ఇష్యూతో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలనేది రిలయన్స్ ప్రణాళిక. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లను మించిపోగా, ఇందులో రిటైల్, జియోల విలువ రూ.9 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ధనాధన్ రిటైల్... ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్‌కు వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 12,000 పైగా స్టోర్స్ ఉన్నాయి. కరోనా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.39,199 కోట్ల ఆదాయాన్ని రూ. 2,099 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. సమీకరిస్తున్న ఈ భారీ నిధులతో రిలయన్స్ రిటైల్ అటు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీలతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న పలు ఆన్లైన్ ఫార్మాట్లకు తోడు కిరాణా సరుకుల అమ్మకాలకు ప్రత్యేకంగా జియోమార్ట్‌ను ప్రారంభించడం తెలిసిందే. సౌదీ అరేబియాతో మాకు(రిలయన్స్) దీర్ఘాకాలికంగా మంచి సంబంధాలు ఉన్నాయి. సౌదీ ఆర్థిక పురోభివృద్ధిలో పీఐఎఫ్ చాలా కీలకపాత్ర పోషిస్తోంది. రిలయన్స్ రిటైల్‌లోకి ఒక విలువైన భాగస్వామిగా పీఐఎఫ్‌ను ఆహ్వానిస్తున్నాను. ఈ సంస్థ అందించే మద్దతు, మార్గదర్శకత్వాన్ని కూడా ఉపయోగించుకొని 130 కోట్ల మంది భారతీయులు, అలాగే లక్షలాది మంది చిన్న వర్తకుల జీవితాలను మెరుగుపరచడం కోసం భారత్ రిటైల్ రంగాన్ని సమూలంగా మార్చివేసేందుకు మా ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని కొనసాగిస్తాం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత -
రిలయన్స్ రీటైల్లో మరో భారీ పెట్టుబడి
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) మరో భారీ పెట్టుబడిని సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటైన సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) 2.04 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. దీంతో రిలయన్స్ రీటైల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఎనిమిదవ పెట్టుబడిగా ఇది నిలిచింది. (కరోనా : లక్ష కోట్ల అంబానీ సంపద ఆవిరి) భారతదేశంలో అతిపెద్ద రిటైల్ చెయిన్ రిలయన్స్ రీటైల్‌తో చేసుకున్న ఈ ఒప్పందం విలువ .9,555 కోట్ల రూపాయలని(సుమారు 3 1.3 బిలియన్లు) అని రిలయన్స్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాడీల్తో రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 4.587 లక్షల కోట్లు (సుమారు 62.4 బిలియన్లు)గా ఉండనుంది. సౌదీతో తమకు దీర్ఘకాల సంబంధం ఉందనీ, భారత రిటైల్ రంగంలో విశేష మార్పులకు ఇదొక ప్రతిష్టాత్మక ప్రయాణమంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి భారతదేశ ఆర్థికవ్యవస్థను, పీఐఎఫ్ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఆర్‌ఆర్‌విఎల్ ఇప్పటివరకు 10.09 శాతం వాటాలను 47,265 కోట్ల రూపాయలకు విక్రయించింది. సింగపూర్ సావరిన్ వెల్త్‌ఫండ్ జీఐసీ, టీపీజీ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ముబదాలాఇన్వెస్ట్‌మెంట్ కో, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, సిల్వర్ లేక్ (రెండుసార్లు) సంస్థలనుంచి పెట్టుబడులనుసాధించిన సంగతి తెలిసిందే. కాగా పీఐఎఫ్ ఇంతకుముందు రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్‌లలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. -
3 నెలల కనిష్టానికి ఆర్ఐఎల్ షేరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో తొలుత ఎన్ఎస్ఈలో ఆర్ఐఎల్ షేరు 5.5 శాతం పతనమైంది. రూ. 1,940కు చేరింది. ఇది మూడు నెలల కనిష్టంకాగా.. ప్రస్తుతం 5.3 శాతం నష్టంతో రూ. 1,946 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం జులై 21న షేరు ఇంట్రాడేలో రూ. 1935 స్థాయికి చేరినట్లు నిపుణులు తెలియజేశారు. అనుబంధ విభాగాలు రిలయన్స్ జియోతోపాటు.. రిలయన్స్ రిటైల్‌లో విదేశీ కంపెనీల పెట్టుబడుల వెల్లువతో సెప్టెంబర్ 16న ఆర్ఐఎల్ షేరు రూ. 2,369ను అధిగమించిన విషయం విదితమే. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగిన ఆర్ఐఎల్ కౌంటర్లో ఫలితాల సందర్భంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. షేరు వెనకడుగు వేయడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు రూ. 74,000 కోట్లమేర చిల్లుపడగా.. ఇండెక్స్ హెవీవెయిట్కావడంతో స్టాక్ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు నిపుణులు వివరించారు. క్యూ2 తీరిలా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆర్ఐఎల్ నికర లాభం 15 శాతం క్షీణించి రూ. 9,567 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం నీరసించి రూ. 1.11 ట్రిలియన్లను తాకింది. ప్రధానంగా పెట్రోకెమికల్స్ బిజినెస్ మందగించడం, రిఫైనింగ్ మార్జిన్లు క్షీణించడం వంటి అంశాలు కంపెనీ పనితీరును ప్రభావితం చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అనుబంధ విభాగాలు రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ మెరుగైన లాభదాయకతను సాధిస్తుండటం కంపెనీకి అదనపు బలాన్ని చేకూరుస్తున్నట్లు తెలియజేశారు. రిటైల్ విభాగంలో స్టోర్ల సంఖ్యను పెంచుకోవడం, ఆన్లైన్ ద్వారా విక్రయాలు పుంజుకోనుండటం వంటివి సానుకూల అంశాలుగా పేర్కొన్నారు. -
ఆర్ఐఎల్ జూమ్- బజాజ్ ఫైనాన్స్ బోర్లా
మూడు రోజుల ర్యాలీ తదుపరి అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 287 పాయింట్లు ఎగసి 39,861కు చేరగా.. నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,737 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించనున్న అంచనాలతో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు.. అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతుండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి బజాజ్ ఫైనాన్స్ షేరు నష్టాలతో కళతప్పగా.. ఆర్ఐఎల్ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. బజాజ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కొత్త రుణాలు 6.5 మిలియన్ల నుంచి 3.6 మిలియన్లకు క్షీణించినట్లు బజాజ్ ఫైనాన్స్ తాజాగా వెల్లడించింది. అయితే నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 13 శాతం పుంజుకుని రూ. 1.37 ట్రిలియన్లను తాకినట్లు తెలియజేసింది. కొత్త కస్టమర్లు, రుణాల విడుదల గతేడాది క్యూ2తో పోలిస్తే 50-60 శాతంగా నమోదైనట్లు వివరించింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5.4 శాతం పతనమై రూ. 3,265కు చేరింది. ప్రస్తుతం 4 శాతం నష్టంతో రూ. 3,341 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ రిటైల్‌లో తాజాగా అబు ధబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రూ. 5,513 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. తద్వారా రిలయన్స్ రిటైల్‌లో 1.2 శాతం వాటాను అబు దభి ఇన్వెస్ట్మెంట్ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ రిటైల్‌లో నాలుగు వారాలుగా విదేశీ సంస్థలు వాటాలు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. వెరసి రిలయన్స్ రిటైల్‌లో 7 కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా కంపెనీ రూ. 37,710 కోట్లను సమకూర్చుకుంది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో సిల్వర్ లేక్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబడాలా, జీఐసీ, టీపీజీ ఉన్నాయి. తాజాగా ఏడీఐఏ చేరింది. ఈ నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 1904 వద్ద ట్రేడవుతోంది. -
రిలయన్స్ రిటైల్‌లో ఏడీఐఏకి వాటాలు
సాక్షి,న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)పై ఇన్వెస్టర్ల ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. తాజాగా అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ) అనుబంధ సంస్థ ఆర్ఆర్వీఎల్లో 1.2 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఏడీఐఏ రూ. 5,512.5 కోట్లు వెచ్చిస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. దీనితో కేవలం నాలుగు వారాల కన్నా తక్కువ వ్యవధిలోనే ఆర్ఆర్వీఎల్ అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ. 37,710 కోట్లు సమీకరించినట్లయింది. అబు ధాబికే చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ సంస్థ ముబాదలా ఇటీవలే రూ. 6,247.5 కోట్లు వెచ్చించి 1.4 శాతం వాటా కొనుగోలు చేసింది. సిల్వర్ లేక్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబాదలా, జీఐసీ, టీపీజీ వంటి దిగ్గజ సంస్థలు ఆర్ఆర్వీఎల్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాయి. ఇవన్నీ కూడా రిలయన్స్‌కే చెందిన డిజిటల్ వ్యాపార విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. (రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల వెల్లువ) ఆర్ఆర్వీఎల్ విలువ సుమారు రూ. 4.29 లక్షల కోట్లుగా ఉంటుంది. ‘ఏడీఐఏ తాజాగా పెట్టుబడులు పెట్టడం, తన తోడ్పాటును కొనసాగిస్తుండటం సంతోషకర విషయం. రిలయన్స్ రిటైల్ పనితీరుకు, అది అమలు చేస్తున్న కొత్త వ్యాపార విధానంలో అపార అవకాశాలకు ఏడీఐఏ పెట్టుబడులు నిదర్శనం‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ‘భారత రిటైల్ రంగంలో రిలయన్స్ రిటైల్ అత్యంత వేగంగా అగ్రస్థాయి సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఫిజికల్, డిజిటల్ సరఫరా వ్యవస్థల ఊతంతో మరింత పటిష్టమైన వృద్ధి సాధించగలదు‘ అని ఏడీఐఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రైవేట్ ఈక్విటీల విభాగం) హమద్ షహ్వన్ అల్దహేరి పేర్కొన్నారు. 1976లో ఏర్పాటైన ఏడీఐఏ.. అబు ధాబి ప్రభుత్వం తరఫున అంతర్జాతీయంగా వివిధ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. విస్తృత నెట్వర్క్... ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 12,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. కరోనా వైరస్‌పరమైన పరిణామాల నేపథ్యంలో నిత్యావసరాల వ్యాపారాన్ని మరింతగా విస్తరించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో పోటీపడే దిశగా జియోమార్ట్‌ను కూడా ఆవిష్కరించింది. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్వీఎల్ కన్సాలిడేటెడ్ టర్నోవరు సుమారు రూ. 1,62,936 కోట్లు కాగా, నికర లాభం రూ. 5,448 కోట్లుగా నమోదైంది. -
రిలయన్స్‌లో జీఐసీ, టీపీజీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిటైల్ వ్యాపార దిగ్గజ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా మరో రెండు పెట్టుబడులు వచ్చి చేరనున్నాయి. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీఐసీ రూ.5,512.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం ప్రకటించింది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 1.22 శాతం వాటాను జీఐసీ చేజిక్కించుకోనుంది. డీల్‌లో భాగంగా ఆర్‌ఆర్‌వీఎల్‌ను రూ.4.285 లక్షల కోట్లుగా విలువ కట్టారు. మరో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టీపీజీ తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ఆర్ఆర్వీఎల్లో 0.41 శాతం వాటాను టీపీజీ దక్కించుకోనుంది. ఈ ఏడాది ప్రారంభంలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో టీపీజీ రూ.4,546.8 కోట్లు పెట్టుబడి చేసింది. -
రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల వెల్లువ
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో వరుస పెట్టుబడులు పెడుతున్న సంస్థల జాబితాలో మరో రెండు విదేశీ దిగ్గజాలు చేరాయి. తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీఐసీ, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్ రిలయన్స్ రిటైల్ యూనిట్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. జీఐసీ రూ .5,512.5 కోట్లు, టీపీజీ 1,837.5 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఆర్ఆర్విఎల్లో వరుసగా 1.22 శాతం, 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి. తాజా పెట్టుబడులతో పాటురిలయన్స్ రిటైల్ ఇప్పటివరకూ 7.28 శాతం వాటాల విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల పెట్టుబడులను సాధించింది. జియో తరువాత వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో ఇవి వరుసగా ఆరో, ఏడు పెట్టుబడుల ఒప్పందాలు కావడం విశేషం జీఐసీ ప్రపంచ నెట్వర్క్, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు భారత రిటైల్ వ్యవస్థను మెరుగుపరుస్తూ, మరింతగా మారుస్తాయని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్ తన సప్లై చైన్, స్టోర్ నెట్వర్క్స్, లాజిస్టిక్స్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కొనసాగిస్తూ కస్టమర్లు, వాటాదారులకు మరింత ప్రయోజనం కలగనుందని జీఐసీ సీఈఓ లిమ చౌ కియాత్ తెలిపారు. కాగా సిల్వర్ లేక్ ఆ తర్వాత కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, ముబదాల కూడా పెట్టుబడులు పెట్టాయి. మూడు వారాల్లో ఆరు డీల్స్ సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ 0.84 శాతం వాటాకుగాను 3,675 కోట్ల రూపాయలు, సిల్వర్ లేక్ పార్ట్నర్స్ 1,875 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆర్‌ఆర్‌విఎల్ 3.38 బిలియన్ల డాలర్లతో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంది. రిలయన్స్ రిటైల్ ఇండియాలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయక సంస్థ. 12,000 స్టోర్లతో, 64 కోట్ల వినియోగదారులతో భారతదేశపు అతిపెద్ద రీటైలర్ గా ఉన్న సంగతి తెలిసిందే. -
రిలయన్స్ రిటైల్ జోరు..
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ తర్వాత తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లోకి (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అబుధాబికి చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ ముబాదలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ 1.4 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. ఇందుకుగాను ముబాదలా రూ. 6,247.5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించింది. రిలయన్స్ గ్రూప్‌లో ఈ సంస్థకు ఇది రెండో ఇన్వెస్ట్మెంట్. ముబాదలా ఇప్పటికే రూ. 9,093.6 కోట్లతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.85 శాతం వాటా కొనుగోలు చేసింది. ‘ముబాదలా వంటి దిగ్గజ సంస్థతో భాగస్వామ్యం మాకు గణనీయంగా ఉపయోగపడనుంది. భారత రిటైల్ రంగంలో లక్షల సంఖ్యలో చిన్న రిటైలర్లు, వ్యాపారులకు తోడ్పాటునివ్వాలన్న మా సంకల్పంపై ముబాదలాకు ఉన్న నమ్మకానికి ఈ పెట్టుబడులు నిదర్శనం. మా లక్ష్య సాధనలో ఆ సంస్థ పెట్టుబడులు, మార్గదర్శకత్వం ఎంతగానో తోడ్పడగలవు‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ‘ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడుల ద్వారా రిలయన్స్‌తో భాగస్వామ్యం మరింత పటిష్టమైంది.’ అని ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్ తెలిపారు. మూడు వారాల్లో అయిదో డీల్.. గడిచిన మూడు వారాల్లో ఆర్ఆర్వీఎల్లో పెట్టుబడులకు సంబంధించి ఇది అయిదో డీల్. అమెరికాకు చెందిన కేకేఆర్ అండ్ కంపెనీ రూ. 5,550 కోట్లు (1.28 శాతం వాటా), ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ రూ. 3,675 కోట్లు (0.84 శాతం వాటా) ఇన్వెస్ట్ చేశాయి. ఇవిగాకుండా సిల్వర్ లేక్ రెండు విడతలుగా మొత్తం రూ. 9,375 కోట్లు పెట్టుబడులు (2.13 శాతం వాటా) పెట్టింది. వీటి ప్రకారం రిలయన్స్ రిటైల్ వేల్యుయేషన్ దాదాపు రూ. 4.29 లక్షల కోట్లుగా ఉండనుంది. సెప్టెంబర్ నుంచి చూస్తే రిటైల్ విభాగంలో 5.65 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ ఇప్పటిదాకా రూ. 24,847.5 కోట్లు సమీకరించినట్లయింది. -
4.25% వాటా- రూ. 18,600 కోట్లు- ఆర్ఐఎల్ జోష్
రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి విదేశీ పీఈ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే 1.75 శాతం వాటాను కొనుగోలు చేసిన సిల్వర్ లేక్ తాజాగా మరో 0.38 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 1,875 కోట్లను వెచ్చించనుంది. తద్వారా 2.13 శాతం వాటా కోసం రూ. 9,375 కోట్లను వెచ్చించనుంది. కాగా.. పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ పార్టనర్స్ సైతం రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు బుధవారం డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. ఇందుకు రూ. 3,675 కోట్లను జనరల్ అట్లాంటిక్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక మరోవైపు రిలయన్స్ రిటైల్‌లో పీఈ దిగ్గజం కేకేఆర్ కో సైతం రూ. 5,550 కోట్లతో 1.28 శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. వెరసి రిలయన్స్ రిటైల్‌లో 4.25 శాతం వాటా విక్రయం ద్వారా ముకేశ్ అంబానీ దిగ్గజం ఆర్ఐఎల్ రూ. 18,600 కోట్లు సమకూర్చుకుంది. దీంతో దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.28 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటా విక్రయం ద్వారా ఆర్ఐఎల్ రూ. 60,000-63,000 కోట్ల మధ్య సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబతున్నాయి. షేరు అప్ రిలయన్స్ రిటైల్‌లో విదేశీ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఆర్ఐఎల్ షేరు 0.7 శాతం పుంజుకుని రూ. 2,250 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,264 వరకూ బలపడింది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌లో పీఈ దిగ్గజాలు సిల్వర్ లేక్ 1.75 శాతం, కేకేఆర్ 1.28 శాతం వాటాను కైవసం చేసుకోగా... ఇందుకు 1.8 బిలియన్ డాలర్లను వెచ్చించాయి. ఇక జనరల్ అట్లాంటిక్ సైతం రూ. 3,675 కోట్లకు 0.84 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఆర్ఐఎల్కు డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో సైతం జనరల్ అట్లాంటిక్ రూ. 6,598 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ రిటైల్‌లో జీఏ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ (జీఏ) 0.84 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 3,675 కోట్లు వెచ్చించనుంది. దీని ప్రకారం చూస్తే ఆర్ఆర్వీఎల్ విలువ సుమారు రూ. 4.285 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల్లో జీఏ మూడోది. ఇప్పటిదాకా అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లు (1.75 శాతం వాటా), మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ సుమారు రూ. 5,500 కోట్లు (1.28 శాతం వాటా) ఇన్వెస్ట్ చేశాయి. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థల్లో జనరల్ అట్లాంటిక్ ఇన్వెస్ట్ చేయడం ఇది రెండోసారి. ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఆ సంస్థ రూ. 6,598 కోట్లు ఇన్వెస్ట్ చేసింది‘ అని రిలయన్స్ పేర్కొంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో సుమారు రూ. 1.52 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లందరికీ రిటైల్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని రిలయన్స్ ఆఫర్ చేసింది. దానికి అనుగుణంగానే ఆయా సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ‘టెక్నాలజీ, కన్జూమర్ వ్యాపారానికి సం బంధించి జనరల్ అట్లాంటిక్ సంస్థకు అపార అనుభవం ఉంది. దేశీయంగా విశిష్టమైన రిటైల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటునకు ఇది తోడ్పడగలదు‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ‘దేశీ రిటైల్ రంగ ముఖచిత్రాన్ని సానుకూలంగా మార్చగలిగే సత్తా గల ముకేశ్ కొత్త వెంచర్లో భాగం కావడంపై సంతోషంగా ఉంది‘ అని జనరల్ అట్లాంటిక్ సీఈవో బిల్ ఫోర్డ్ పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల్లో జీఏ పెట్టుబడులు.. వినూత్న విధానాలతో మార్కెట్ రూపురేఖలు మార్చేసే పలు కంపెనీల్లో జనరల్ అట్లాంటిక్ అనేక సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, యాంట్ ఫైనాన్షియల్, బాక్స్, బైట్‌డ్యాన్స్, ఫేస్బుక్, శ్లాక్, స్నాప్‌చాట్, ఉబెర్ వంటి అనేక టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ షేరు అప్.. ఆర్ఆర్వీఎల్లో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడుల వార్తలతో రిలయన్స్ సుమారు 1% పెరిగింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో దాదాపు రూ. 2,267 వద్ద ముగిసింది. 12వేల స్టోర్లు.. ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ చెయిన్ స్టోర్లు, క్యాష్ అండ్ క్యారీ హోల్‌సేల్ వ్యాపారం, ఆన్లైన్ నిత్యావసరాల స్టోర్ జియోమార్ట్ మొదలైనవి నిర్వహిస్తోం ది. 7,000 పైచిలుకు పట్టణాల్లో దాదాపు 12,000 స్టోర్స్ ఉన్నాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ ఆదాయాలు రూ. 1.63 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి. సిల్వర్ లేక్‌కు మరిన్ని వాటాలు ఆర్ఆర్వీఎల్లో సిల్వర్ లేక్ దాని సహ ఇన్వెస్టర్లు మరో రూ. 1,875 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. దీంతో వీరు ఇప్పటిదాకా మొత్తం రూ. 9,375 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లవుతుంది. తద్వారా సుమారు 2.13 శాతం వాటాలు దక్కించుకున్నట్లవుతుంది. రిలయన్స్ రిటైల్ సామర్థ్యాలు, భారత రిటైల్ రం గంలో అవకాశాలపై సిల్వర్ లేక్‌కి ఉన్న నమ్మకానికి తాజా పెట్టుబడులు నిదర్శనమని రిలయ¯Œ ్స ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. -
ఆర్ఐఎల్తో జనరల్ అట్లాంటిక్ డీల్
అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తాజాగా పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ పార్టనర్స్ ముందుకు వచ్చినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను జనరల్ అట్లాంటిక్ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 3,675 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.28 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటా విక్రయం ద్వారా ఆర్ఐఎల్ రూ. 60,000-63,000 కోట్ల మధ్య సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలియజేశాయి. మూడో కంపెనీ ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌లో పీఈ దిగ్గజాలు సిల్వర్ లేక్ పార్టనర్స్, కేకేఆర్ అండ్ కో వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సిల్వర్ లేక్ 1.75 శాతం వాటాను సొంతం చేసుకోగా.. కేకేఆర్ 1.28 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఇందుకు 1.8 బిలియన్ డాలర్లను వెచ్చించాయి. కాగా.. ఆర్ఐఎల్కు డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో సైతం జనరల్ అట్లాంటిక్ రూ. 6,598 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ రిటైల్లోనూ వాటా కొనుగోలు చేయడంతో ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనరల్ అట్లాంటిక్‌తో అనుబంధం కొనసాగడం ద్వారా వ్యాపార సంస్థలతోపాటు.. వినియోగదారులకూ మరింత లబ్దిని చేకూర్చగలమని పేర్కొన్నారు. ఇదేవిధంగా ముకేశ్ ప్రణాళికలతో దేశ రిటైల్ రంగం సానుకూల మార్పులకు లోనుకానున్నట్లు జనరల్ అట్లాంటిక్ సీఈవో బిల్ ఫోర్డ్ పేర్కొన్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ ఇండియాకు ఆర్ఐఎల్ సహకరిస్తున్నట్లు తెలియజేశారు. జనరల్ అట్లాంటిక్ నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన విదేశీ పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్.. టెక్నాలజీ, కన్జూమర్, ఫైనాన్షియల్ సర్వీసులు, హెల్త్‌కేర్ రంగాలలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. 2020 మార్చికల్లా 34 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను(ఏయూఎం) కలిగి ఉంది. దేశీయంగా 3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. నోబ్రోకర్, అన్అకాడమీ, బైజూస్, బిల్‌డెస్క్, ఎన్ఎస్ఈ తదితరాలలో పెట్టుబడులను కలిగి ఉంది. ఇన్వెస్ట్ చేసిన విదేశీ కంపెనీలలో అలీబాబా, బైట్‌డ్యాన్స్, ఫేస్బుక్, స్నాప్‌చాట్, ఉబర్ తదితరాలున్నాయి. -
రిలయన్స్ చేతికి బజాజ్ ఎలక్ట్రానిక్స్
సాక్షి,ముంబై: వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకపక్క భారీ పెట్టుబడులు, మరోపక్క భారీ విస్తరణ వ్యూహాలతో దూసుకుపోతోంది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ప్రత్యర్థులకు ధీటుగా అవతరించింది. ఇప్పుడిక రీటైల్ విభాగంలో భారీ పెట్టుబడులతో రిటైల్ రంగంలో గుత్తాధిపత్యం దిశగా అడుగులు వేస్తున్న రిలయన్స్ తాజాగా మరో కంపెనీని చేజిక్కించు కునేందుకు చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా సౌతిండియాలో పాగా వేసేందుకు బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పంద విలువ రూ.3 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రిలయన్స్ డిజిటల్ పేరుతో దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దక్షణాది రాష్ట్రాల్లో హోం అప్లయన్సస్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వాటా మెరుగ్గా ఉంది. కస్టమర్లు భారీగా ఉన్నాయి. బ్రాండ్ వాల్యూ కూడా ఉంది. ఇప్పటికే బిగ్ బజార్ సహా అనేక రిటైల్ బ్రాండ్లతో వ్యాపారం చేస్తున్న ఫ్యూచర్ గ్రూపును సొంతం చేసుకుంది. కాగా 1980లో పవన్ కుమార్ బజాజ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో షోరూంలను ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థకు దక్షిణాది రాష్ట్రాల్లో 60 స్టోర్లలో 1,200 మంది సిబ్బంది పని చేస్తున్నారు. -
రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ ఎంట్రీ
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌ను ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్)లో 1.28 శాతం వాటాను ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.5,550 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దీని ప్రకారం చూస్తే రిలయన్స్ రిటైల్ మార్కెట్ విలువ రూ.4.21 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసియా ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ ద్వారా కేకేఆర్ రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఆర్ఆర్వీఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థగా ఉంది. రిలయన్స్ రిటైల్ రెండు వారాల వ్యవధిలో రెండో డీల్‌ను కుదుర్చుకోవడం ఆసక్తికరం. అంతక్రితం సిల్వర్ లేక్ రూ.7,500 కోట్లతో 1.75 శాతం వాటా కొనుగోలుకు డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ఇటీవలే రిలయన్స్జియో ప్లాట్‌ఫామ్‌లోనూ ఇన్వెస్ట్ చేశాయి. జియో ప్లాట్ఫామ్లో 2.32 శాతం వాటా కోసం కేకేఆర్ రూ.11,357 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అదే విధంగా సిల్వర్ లేక్ కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.35 శాతం వాటాను సొంతం చేసుకుంది. నియంత్రణ సంస్థల ఆమోదంపై తాజా డీల్ ఆధారపడి ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. ఈ డీల్ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మోర్గాన్ స్టాన్లీ.. కేకేఆర్‌కు డెలాయిట్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా వ్యవహరించాయి. రిలయన్స్ మార్జిన్లు పెరుగుతాయ్.. జియో ప్లాట్‌ఫామ్‌లలో ఫేస్బుక్, గూగుల్ సహా 13 సంస్థలు కలసి రూ.1.52 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. రిలయన్స్ రిటైల్లోనూ ముందుగా వీటికే వాటాను ఇవ్వజూపుతున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి. దీన్ని నిజం చేసే విధంగా సిల్వర్ లేక్, కేకేఆర్ రిలయన్స్ రిటైల్లోనూ వాటాలు దక్కించుకున్నాయి. ఇతర ఇన్వెస్టర్లలో ఎవరు రిలయన్స్ రిటైల్ వాటాకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇటీవలే ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్, లాజిస్టిక్స్ ఆస్తుల కొనుగోలుకు రిలయన్స్ డీల్ కుదుర్చుకుంది. ఇందు కోసం రూ.24వేల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ డీల్ తర్వాతే నిధుల సమీకరణకు రిలయన్స్ రిటైల్ ద్వారాలు తెరిచింది. తద్వారా అమెజాన్, వాల్‌మార్ట్‌లకు గట్టిపోటీనిచ్చే ప్రణాళికలతో ఉంది. రిలయన్స్ రిటైల్ కింద గ్రోసరీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, జియోమార్ట్ తదితర వ్యాపారాలున్నాయి. దేశవ్యాప్తంగా 12వేలకు పైగా స్టోర్లను నిర్వహిస్తూ అతిపెద్ద రిటైల్ సంస్థగా ఉంది. టెలికం, రిటైల్, గ్లోబల్ రిఫైనరీలో స్థిరీకరణ వేగవంతం కావడంతో కరోనా తర్వాత ఆర్ఐఎల్ బలంగా అవతరిస్తుందని, ధరల పరంగా ఉన్న శక్తి కారణంగా మార్జిన్లు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. షేరు.. జోరు... : కేకేఆర్ ఇన్వెస్ట్మెంట్ వార్త రిలయన్స్‌కు జోష్‌నిచ్చింది. మార్కెట్లు నష్టాల్లోనే ముగిసినప్పటికీ.. రిలయన్స్ షేరు మాత్రం 1 శాతం లాభపడి బీఎస్ఈలో రూ.2,230 వద్ద క్లోజయింది. కేకేఆర్‌కు మంచి ట్రాక్ రికార్డు.. పరిశ్రమల్లో ప్రముఖ ఫ్రాంచైజీలకు విలువను తీసుకొచ్చి పెట్టే భాగస్వామిగా కేకేఆర్‌కు చక్కని ట్రాక్ రికార్డు ఉంది. పైగా ఎన్నో సంవత్సరాలుగా భారత్ మార్కెట్ పట్ల అంకిత భావంతో పనిచేస్తోంది. కేకేఆర్ గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌తో కలసి పనిచేయాలనుకుంటున్నాము. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత రిలయన్స్‌తో జట్టు సంతోషకరం ఆర్ఆర్వీఎల్ వర్తకులను సాధికారులుగా మారుస్తోంది. రిలయన్స్ రిటైల్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ (జియోమార్ట్) వినియోగదారులకు, చిన్న వ్యాపారాలకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మరింత మంది భారతీయ వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్‌కు మారుతున్నారు. భారత్‌లో ముఖ్యమైన ఓమ్నిచానల్ రిటైలర్‌గా ఎదగాలన్న రిలయన్స్ రిటైల్ కార్యక్రమానికి మద్దతు తెలపడం ఆనందాన్నిస్తోంది. – హెన్నీ క్రావిస్, కేకేఆర్ సహ వ్యవస్థాపకుడు -
రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్‌కు వాటా
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో తాజాగా పీఈ దిగ్గజం కేకేఆర్ అండ్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ అంశాన్ని పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాతం వాటాను కేకేఆర్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువను రూ. 5,550 కోట్లుగా వెల్లడించింది. దీంతో రిలయన్స్ రిటైల్ ప్రీమనీ ఈక్విటీ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు తెలియజేసింది. వినియోగదారులకు లబ్ది రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడిదారుగా కేకేఆర్‌కు ఆహ్వానం పలుకుతున్నట్లు డీల్ సందర్భంగా ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిటైల్ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం ద్వారా దేశీ వినియోగదారులకు లబ్ది చేకూర్చనున్నట్లు తెలియజేశారు. కాగా.. రిలయన్స్ రిటైల్ వాణిజ్యం ద్వారా అటు వినియోగదారులకూ, ఇటు చిన్నతరహా బిజినెస్‌లకూ ప్రయోజనం కలగనున్నట్లు కేకేఆర్ సహవ్యవస్థాపకులు హెన్రీ క్రావిస్ డీల్ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌లో పీఈ దిగ్గజం సిల్వర్ లేక్ పార్టనర్స్ 1.75 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇందుకు రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతం వాటాను విక్రయించే యోచనలో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే డిజిటల్ విభాగం రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలియజేశాయి. కాగా.. 3.38 బిలియన్ డాలర్లను వెచ్చించడం ద్వారా కిశోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్ విభాగాలను ఇటీవల రిలయన్స్ రిటైల్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కేకేఆర్ వివరాలు 1976లో ఏర్పాటైన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కేకేఆర్.. పలు కంపెనీలలో వాటాలను కొనుగోలు చేస్తూ వస్తోంది. బీఎంసీ సాప్ట్వేర్, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్, గోజెక్ తదితరాలలో ప్రయివేట్ ఈక్విటీ, టెక్నాలజీ గ్రోత్ ఫండ్స్ ద్వారా ఇప్పటికే ఇన్వెస్ట్ చేసింది. కంపెనీ ఆవిర్భవించాక ఇంతవరకూ 20 టెక్నాలజీ కంపెనీలలో ఎంటర్ప్రైజ్ విలువ ప్రకారం 30 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. వీటిలో మీడియా, టెలికం కంపెనీలు సైతం ఉన్నాయి. ఈ బాటలో 2006 నుంచీ దేశీ కంపెనీలలోనూ పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇటీవల కేకేఆర్ రూ. 11,367 కోట్లు వెచ్చించడం ద్వారా రిలయన్స్ జియోలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. -
పెట్టుబడుల వెల్లువ : రిలయన్స్ జోరు
సాక్షి,ముంబై: ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది. టెలికాం విభాగం రిలయన్స్ జియోలో పెట్టుబడుల సునామీ అనంతరం తాజాగా రిలయన్స్ రిటైల్‌లో వరుస పెట్టుబడులను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేర్ సోమవారం దాదాపు 2 శాతం లాభపడి ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. తద్వారా 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ అధిగమించింది. దీంతో అత్యంత విలువైన తొలి భారతీయ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ రిటైల్ లో అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లయిల్ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్న రిపోర్టుల మధ్య ఆర్ఐఎల్ షేరు 2360 రూపాయల వద్ద ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. దీంతో బీఎస్ఇలో సంస్థ మార్కెట్ క్యాప్ రూ.15.80 లక్షల కోట్లకు చేరింది. ఆర్ఐఎల్ షేరు గత ఆరు రోజులలో 12.21 శాతం పుంజుకోవడం విశేషం. రిలయన్స్ రీటైల్ విభాగంలో పెట్టుబడులువెల్లువ కొనసాగుతున్నసంగతి తెలిసిందే. తాజా కార్లయిల్ ఒప్పందం ఖరారైతే, ఒక భారతీయ కంపెనీలో ఇది అతిపెద్ద పెట్టుబడిగాను, దేశ రిటైల్ రంగంలో కంపెనీ మొదటి పెట్టుబడిగాను రికార్డు దక్కించుకోనుంది. ఇప్పటికే టెక్ ఇన్వెస్టర్ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్ ఏకంగా 20 బిలియన్ డాలర్లతో 40శాతం వాటా కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో పాటు త్వరలో కేకేఆర్, ముబదాలా, అబుదాబీలు కూడా ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. -
రిలయన్స్ రిటైల్‌లో కార్లయిల్‌కు వాటా!
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో మరో పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రిలయన్స్ రిటైల్‌లో 150-200 కోట్ల డాలర్ల(సుమారు రూ. 14,700 కోట్లు) వరకూ కార్లయిల్ గ్రూప్ ఇన్వెస్ట్ చేయవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు రెండు కంపెనీల మధ్య చర్చలు నడుస్తున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. అయితే ఈ అంశంపై అటు ఆర్ఐఎల్, ఇటు కార్లయిల్ గ్రూప్ ప్రతినిధులు స్పందించలేదంటూ ఈ వార్తల విశ్లేషణ సందర్భంగా ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా, ఈ డీల్ కుదిరితే.. దేశీ కంపెనీలో కార్లయిల్ చేస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్గా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీ రిటైల్ రంగ కంపెనీలో కార్లయిల్ తొలిసారి వాటా సొంతం చేసుకున్నట్లు అవుతుందని తెలియజేశారు. కాగా.. ఇటీవల రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటా కొనుగోలుకి పీఈ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. తద్వారా రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి కూడా! షేరు జోరు డిజిటల్ విభాగం జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ వాటా విక్రయం ద్వారా భారీగా నిధుల సమీకరణ చేపట్టనున్న వార్తలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పుట్టింది. ఎన్ఎస్ఈలో తొలుత ఆర్ఐఎల్ షేరు 2 శాతం ఎగసి రూ. 2,360ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 0.7 శాతం లాభపడి రూ. 2,335 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క ఆర్ఐఎల్ పీపీ షేరు సైతం 3 శాతం పుంజుకుని రూ. 1462కు చేరింది. దీంతో ఉదయం సెషన్లో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 16.5 లక్షల కోట్లను తాకింది. వారాంతాన ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 15 లక్షల కోట్లు(200 బిలియన్ డాలర్లు)ను అధిగమించడం ద్వారా దేశీ స్టాక్ మార్కెట్ల చరిత్రలో కొత్త రికార్డును లిఖించిన సంగతి తెలిసిందే. -
అమెజాన్‌తో దోస్తీ?
న్యూఢిల్లీ: రిటైల్ వెంచర్లో పెట్టుబడులు సమీకరించడం ప్రారంభించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ–కామర్స్‌లో పోటీ సంస్థ అమెజాన్‌డాట్‌కామ్‌తో కూడా చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)లో 40 శాతం దాకా వాటాలను అమెజాన్‌కు విక్రయించేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ డీల్ విలువ సుమారు 20 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఆర్వీఎల్లో ఇన్వెస్ట్ చేయడంపై అమెజాన్ ఆసక్తిగా ఉందని, దీనిపై చర్చలు కూడా జరిపిందని పేర్కొన్నాయి. కుదిరితే ఇది దేశంలోనే అత్యంత భారీ డీల్ కాగలదని తెలిపాయి. అయితే, అమెజాన్ ఇంకా పెట్టుబడుల పరిమాణంపై తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ఫలవంతం కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, ఈ కథనాలపై వ్యాఖ్యానించేందుకు రిలయన్స్, అమెజాన్ నిరాకరించాయి. మీడియా ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించలేమని స్టాక్ ఎక్సే్చంజీలకు రిలయన్స్ తెలియజేసింది. పరిస్థితులను బట్టి వివిధ వ్యాపార అవకాశాలు పరిశీలిస్తూ ఉంటామని పేర్కొంది. పాఠకులు.. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఊహాగానాల ఆధారంగా నిరాధార/తప్పుడు వార్తలను ప్రచురించవద్దని ఒక ప్రకటనలో మీడియాకు విజ్ఞప్తి చేసింది. రిలయన్స్ రిటైల్‌లో అమెరికాకు సంస్థ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ 1.75% వాటా కోసం రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెజాన్‌కి వాటాల విక్రయం తెరపైకి వచ్చింది. రిలయన్స్ ఇటీవలే ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ రిటైల్ వ్యాపారంలో అమెజాన్ ఇన్వెస్టరుగా ఉంది. రిలయన్స్ రిటైల్‌లో వాటాలు విక్రయించడం ద్వారా 21–29 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు సమీకరించవచ్చని క్రెడిట్ సూసీ పేర్కొంది. ‘రిలయన్స్’ లాభాలు ► బ్లూచిప్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు ►స్వల్పంగా పుంజుకున్న రూపాయి ►రెండు రోజుల నష్టాలకు బ్రేక్ ►646 పాయింట్లు ఎగసి 38,840కు సెన్సెక్స్ ►171 పాయింట్లు ఎగసి 11,449కు నిఫ్టీ ►ఇన్వెస్టర్ల సంపద రూ.2.2 లక్షల కోట్లు అప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల జోరుతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అంతర్జాతీయ సంకేతా లు సానుకూలంగా ఉండటం కలసివచ్చింది. భారత్–చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల సమస్యను ప్రస్తుతానికి పక్కనబెట్టిన ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు. సెన్సెక్స్ 646 పాయింట్లు లాభపడి 38,840 పాయింట్ల వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 11,449 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 1.69%, నిఫ్టీ 1.52% చొప్పున లాభపడ్డాయి. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు పుంజుకొని 73.46 కు చేరడం సానుకూల ప్రభావం చూపించింది. రోజంతా లాభాలు... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు రోజు కావడంతో ఒడిదుడుకులకు లోనైనా రోజం తా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత లాభాలు మరింతగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్684 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ కేంద్ర బ్యాంక్ సమావేశం నేపథ్యంలో యూరప్ మార్కెట్లు పరిమిత శ్రేణి రేంజ్లో ట్రేడయి మిశ్రమంగా ముగిశాయి. ►రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 646 పాయింట్లు లాభపడితే, దీంట్లో రిలయన్స్ షేర్ వాటాయే 558 పాయింట్ల మేర ఉంది. ►స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజులోనే రూ.2.20 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,20,928 కోట్లు ఎగసి రూ.155.21 లక్షల కోట్లకు చేరింది. ఈ పెరుగుదలలో మెజారిటీ వాటా రిలయన్స్‌దే కావడం విశేషం. ►మార్కెట్ జోరు నేపథ్యంలో దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. కార్పొరేట్ ‘బాహుబలి’ ►ఆల్‌టైమ్ హైకి ఎగసిన రిలయన్స్ షేరు.. ►20,000 కోట్ల డాలర్లకు మార్కెట్ క్యాప్ ►ఈ స్థాయికి చేరిన తొలి భారతీయ కంపెనీ ►అమెజాన్ పెట్టుబడి వార్తలతో పరుగులు పెట్టిన షేరు భారతీయ కార్పొరేట్ ‘బాహుబలి’ రిలయన్స్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో 40 శాతం వరకూ వాటాను అంతర్జాతీయ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌కు విక్రయించనున్నదన్న వార్తల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ దూసుకెళ్లింది. దీంతో తొలిసారిగా కంపెనీ మార్కెట్ విలువ 20,000 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించింది. దేశంలో ఈ స్థాయిని చేరిన మొట్టమొదటి కంపెనీగా రికార్డు సృష్టించింది. రిలయన్స్ షేర్ ఇంట్రాడేలో 8.4 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,344ను తాకింది. చివరకు 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. 20,000 కోట్ల డాలర్లకు మార్కెట్ క్యాప్... కాగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.14.91 లక్షల కోట్లకు(20,000 కోట్ల డాలర్లు) ఎగసింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ఇంట్రాడేలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,84,908 కోట్లకు చేరింది. ఒక్క గురువారం రోజే రూ.97,000 కోట్ల మేర మార్కెట్క్యాప్ పెరిగింది. ఆ 13 సంస్థలకు అంబానీ ఆఫర్...! రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను అమెరికా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్నర్స్ రూ.7,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని బుధవారమే రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే రిలయన్స్ జియోలో 13 విదేశీ సంస్థలు భారీగా ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థలన్నింటికీ, రిలయన్స్ రిటైల్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే ఆఫర్ లభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక అమెజాన్ తర్వాత కేకేఆర్ సంస్థ పెట్టుబడి వార్తలు వస్తాయని అంచనా. రిలయన్స్ రిటైల్‌లో వాటా విక్రయం ద్వారా రూ.60,000–రూ.1.5 లక్షల కోట్ల మేర సమీకరించే అవకాశాలున్నాయని సమాచారం. -
రిలయన్స్ రిటైల్, అమెజాన్ డీల్?
సాక్షి, ముంబై: పెట్టుబడుల సమీకరణలో రిలయన్స్ రీటైల్ హవా కొనసాగుతోంది. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ లో సుమారు 20 బిలియన్ల డాలర్ల విలువైన వాటాను అమెజాన్ కు విక్రయించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు అమెజాన్, రిలయన్స్ మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ లావాదేవీపై అమెజాన్ ఆసక్తి చూపుతున్నట్టు తాజా నివేదికల సమాచారం. సిల్వర్ లేక్ ఒప్పందాన్ని రిలయన్స్ నిర్ధారించిన తరువాత అమెజాన్ డీల్ చర్చల్లో నిలిచింది. (రిలయన్స్ రిటైల్‌లో: కేకేఆర్ భారీ పెట్టుబడి) కాగా రిలయన్స్ టెలికాం విభాగం జియోలో పెట్టుబడుల సునామీ తరువాత తాజాగా రీటైల్ విభాగంగాపై దృష్టిపెట్టారు ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను 7,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుంది. అలాగే కంపెనీలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులకు కేకేఆర్ చర్చలు జరుపుతోంది. దీంతోపాటు రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఐ), సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) సహా, పలు కంపెనీలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. (15 శాతం వాటాకు రూ. 63,000 కోట్లు!) -
వారెవ్వా రిలయన్స్.. రూ. 15 లక్షల కోట్లకు!
ఇటీవల కొత్త చరిత్రను సృష్టిస్తూ సాగుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరిన్ని రికార్డులను సాధించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌కు వాటాను ఆఫర్ చేసిందన్న వార్తలతో ఆర్ఐఎల్ షేరుకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8.4 శాతం దూసుకెళ్లింది. రూ. 2,345కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఏకంగా రూ. 15 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తొలిసారి ఈ ఘనతను సాధించిన దిగ్గజ కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది! 11 శాతం అప్ రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను పీఈ సంస్థ సిల్వర్ లేక్‌కు విక్రయించడం ద్వారా ఆర్ఐఎల్ షేరు జోరందుకుంది. వెరసి రెండు రోజుల్లోనే ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసింది. 1.75 శాతం వాటా కోసం సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనుండటంతో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరింది. పీఈ కంపెనీ కేకేఆర్ రిలయన్స్ రిటైల్‌లో 1.5 బిలియన్ డాలర్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సౌదీ ఫండ్స్ సైతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తాజాగా రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్‌కు 20 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,45,000 కోట్లు) విలువైన వాటాను ఆర్ఐఎల్ ఆఫర్ చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ అంశంపై ఇరు కంపెనీలూ స్పందించనప్పటికీ షేరు దూకుడు చూపుతుండటం గమనార్హం! -
15% వాటాకు రూ. 63,000 కోట్లు!
న్యూఢిల్లీ: అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాను విక్రయించే ప్రణాళికల్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. బుధవారం పీఈ సంస్థ సిల్వర్ లేక్‌కు 1.75 శాతం వాటాను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసింది. ఇదే విధంగా జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ సంస్థలు రిలయన్స్ రిటైల్‌లో వాటాపై కన్నేసినట్లు తెలుస్తోంది. 15 శాతం వాటాకు సై రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటాలను విక్రయించాలని పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా రూ. 63,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ఊహిస్తున్నాయి. సిల్వర్ లేక్ డీల్‌తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పీఐఎఫ్), అబుధబీకి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, అబుధబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(ఏడీఐఏ), ఎల్‌కేటర్‌టన్‌సహా.. పీఈ దిగ్గజం కేకేఆర్.. రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. షేరు జూమ్ రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లవరకూ సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలు రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 2,223ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్(వాల్‌మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది. చదవండి: ము‘క్యాష్’ రిటైల్ స్వారీ..! -
ము‘క్యాష్’ రిటైల్ స్వారీ..!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్‌లోని డిజిటల్ వ్యాపార విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు లైను కడుతున్నారు. తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)లో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్‌లేక్ పార్ట్నర్స్ 1.75 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఆర్ఆర్వీఎల్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. ‘ఈ పెట్టుబడుల ప్రకారం ఆర్ఆర్వీఎల్ విలువ సుమారు రూ. 4.21 లక్షల కోట్లుగా ఉంటుంది‘ అని పేర్కొంది. సిల్వర్‌లేక్ ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీల్లో ఇది రెండో ఇన్వెస్ట్మెంట్. ఈ డీల్‌కు నియంత్రణ సంస్థపరమైన అనుమతులు రావాల్సి ఉంది. రిలయన్స్ రిటైల్‌కు మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక సలహాదారుగా ఉండగా .. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, డేవిస్ పోక్ అండ్ వార్డ్‌వెల్ న్యాయ సలహదార్లుగా ఉన్నారు. సిల్వర్ లేక్‌కు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో, లాథామ్ అండ్ వాట్కిన్స్ లీగల్ అడ్వైజర్లుగా ఉన్నారు. 12 వేల పైచిలుకు స్టోర్స్.. ఆర్ఆర్వీఎల్లో భాగమైన రిలయన్స్ రిటైల్ .. దేశవ్యాప్తంగా సూపర్మార్కెట్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ చెయిన్ స్టోర్స్, హోల్‌సేల్ వ్యాపారం, ఫ్యాషన్ అవుట్‌లెట్స్, ఆన్లైన్ నిత్యావసరాల స్టోర్ జియోమార్ట్ మొదలైన వాటిని నిర్వహిస్తోంది. సుమారు 7,000 పట్టణాల్లో 12,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి. రిటైల్ విభాగంపై ఆధిపత్యం సాధించే క్రమంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో తలపడేందుకు రిలయన్స్‌కు ఈ పెట్టుబడులు ఉపకరించనున్నాయి. ‘నికర రుణ రహిత సంస్థగా మారిన రిలయన్స్ గ్రూప్ అధిక వృద్ధి సాధించేందుకు ఈ వాటాల విక్రయం తోడ్పడగలదు. ఇదే సెగ్మెంట్లో మరిన్ని వాటాల విక్రయానికి దోహదపడగలదు‘ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అనలిస్ట్ శ్వేతా పటోడియా అభిప్రాయపడ్డారు. రిటైల్ విభాగంలో వాటాల విక్రయం ఊహించిన దానికన్నా ముందుగానే చోటు చేసుకుంటోందని క్రెడిట్ సూసీ తెలిపింది. పెట్టుబడుల సమీకరణ మొదలైన నేపథ్యంలో ప్రణాళికల అమలుపై.. ముఖ్యంగా జియోమార్ట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఫైనాన్షియల్ సేవల సంస్థ సిటీ ఒక నివేదికలో పేర్కొంది. జియోలో సిల్వర్‌లేక్.. ఫేస్బుక్ తర్వాత జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తొలి అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్‌లేక్. సుమారు రూ. 10,203 కోట్లతో రెండు విడతల్లో 2.08 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ తర్వాత కేకేఆర్, విస్టా, జనరల్ అట్లాంటిక్, గూగుల్ మొదలైనవి జియోలో ఇన్వెస్ట్ చేశాయి. ట్విట్టర్, ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, డెల్ టెక్నాలజీస్ వంటి పలు టెక్ దిగ్గజాల్లో సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టింది. కేకేఆర్‌కు కూడా రిలయన్స్ ఆఫర్... జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి .. తమ రిటైల్ విభాగంలో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు రిలయన్స్ ఆఫర్ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే సిల్వర్‌లేక్ ఇన్వెస్ట్ చేస్తోంది. జియోలో ఇన్వెస్ట్ చేసిన మరో ఈక్విటీ సంస్థ కేకేఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,100 కోట్లు) పెట్టుబడులు పెట్టొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పెట్టుబడులతో రిలయన్స్ మార్కెట్ వేల్యుయేషన్‌లో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వాటా ఏకంగా రూ. 9 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కొద్దీ చిన్న వర్తకులతో భాగస్వామ్యం ఏర్పర్చుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత విలువైన సేవలు అందించే మా ప్రయత్నాల్లో సిల్వ ర్లేక్ కూడా భాగస్వామి కానుండటం సంతోషకర విషయం. ఈ రంగంలో టెక్నాలజీతో పెను మార్పులు తేవచ్చని విశ్వసిస్తున్నాం. భారతీయ రిటైల్ రంగానికి సంబంధించి మా ప్రణాళికలు అమలు చేయడంలో సిల్వర్‌లేక్ విలువైన భాగస్వామి కాగలదు‘. – ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ -
రిలయన్స్ రిటైల్‌లో: కేకేఆర్ భారీ పెట్టుబడి
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలయనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఇప్పటిదాకా డిజిటల్ విభాగంలో పెట్టుబడుల వరద పారించారు. ఇపుడిక రీటైల్ విభాగంలో పెట్టుబడుల పరంపరను కొనసాగించనున్నారు. డిజిటల్ విభాగం జియోలో పెట్టుబడులు పెట్టిన దిగ్గజాలను రీటైల్ విభాగంలో కూడా ఇన్వెస్ట్ చేయాలని ఆహ్వానించిన అంబానీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్లోఅమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. తాజాగా ఈ కోవలో మరో దిగ్గజం సంస్థ కేకేఆర్ చేరింది. సుమారు 1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు కేకేఆర్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నట్టు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ నెలలోనే ఒక ప్రకటన రావచ్చు అని పేర్కొంది. అయితే అంచనాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (జియో : 10 కోట్ల లోకాస్ట్ స్మార్ట్ఫోన్లు) కాగా రిలయన్స్ రీటైల్లో సిల్వర్ లేక్ 7500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని బుధవారం రిలయన్స్ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా 1.75 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది ఆరంభంలో సిల్వర్ లేక్ 1.35 బిలియన్ల డాలర్లు జియోలో పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ రిటైల్‌లో.. సిల్వర్ లేక్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో పీఈ సంస్థ సిల్వర్ లేక్ స్వల్ప వాటాను కొనుగోలు చేయనుంది. 1.75 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సిల్వర్ లేక్ డీల్ కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తాజాగా వెల్లడించింది. ఇందుకు సిల్వర్‌లేక్ రూ. 7,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో సైతం సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసింది. నిధుల సమీకరణ డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ వృద్ధి కోసం ఆర్ఐఎల్ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశాయి. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు. కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్(వాల్‌మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది. -
రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్‌లో వంద కోట్ల డాలర్లు (రూ.7,400 కోట్లు ) పెట్టుబడులు పెట్టాలని అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ యోచిస్తోందని సమాచారం. రిలయన్స్ రిటైల్‌లో వాటా కోసం సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయమై ఇరు సంస్థలు ఇప్పటివరకూ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. రిలయన్స్ రిటైల్ విలువ 5,700 కోట్ల డాలర్ల(రూ.4.2 లక్షల కోట్ల) మేర ఉంటుందని అంచనా. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ వంతు... రిలయన్స్ జియోలో వాటాలను విజయవంతంగా విక్రయించిన తర్వాత ఇప్పుడు ముకేశ్ అంబానీ రిటైల్ విభాగంలో వాటా విక్రయంపై దృష్టిసారించారు. కాగా గత వారమే రిలయన్స్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, లాజిస్టిక్స్ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా రిలయన్స్ జియోలో సిల్వర్ లేక్ సంస్థ రెండు దఫాలుగా 2.08 శాతం వాటా కోసం రూ.10,203 కోట్ల పెట్టుబడులు పెట్టింది. జియోలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు రిలయన్స్ రిటైల్‌లో కూడా ఇన్వెస్ట్ చేయాలన్న ఆఫర్ లభించిందని, దీనిపై ఆ సంస్థలు కసరత్తు చేస్తున్నాయని సమాచారం. -
రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్‌కు వాటా!
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్‌లో పీఈ సంస్థ సిల్వర్ లేక్ వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్తో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రిలయన్స్ రిటైల్‌లో 1.7-1.8 శాతం వాటా కొనుగోలుకి పీఈ సంస్థ సిల్వర్ లేక్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వాటా విలువను రూ. 7,500 కోట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ విలువ సిల్వర్ లేక్‌తో 1.8 శాతం వాటాకుగాను రూ. 7,500 కోట్లకు డీల్ కుదిరితే.. రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.3 లక్షల కోట్ల(57 బిలియన్ డాలర్లు)కు చేరవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా.. కంపెనీ విధానాల ప్రకారం ఊహాజనిత వార్తలపై స్పందించబోమంటూ ఆర్ఐఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే వృద్ధికి వీలుగా కంపెనీ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. డీల్ తదితర అంశాలకు తెరతీస్తే సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. కాగా.. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు వార్తా కథనంలో మీడియా పేర్కొంది. కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు. -
రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బ్లాక్‌బస్టర్ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి. వీటిని వినియోగించుకునేందుకు రిలయన్స్‌కు మార్గం లభించింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారాల విస్తరణ వేగంగా జరిగేందుకు, పోటీ కంపెనీలకు ధీటుగా ఈ–కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఈ లావాదేవీ దోహదం చేయనుంది. ఇక డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు బదిలీ చేస్తారు. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన పేరొందిన ఫార్మాట్స్, బ్రాండ్స్‌కు ఒక వేదిక ఇవ్వడం ఆనందంగా ఉందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్, ఆర్థిక పరిస్థితుల మూలంగా తలెత్తిన సవాళ్లకు.. పునర్వ్యవస్థీకరణ, తాజా లావాదేవీ ఫలితంగా సంస్థకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు -
నకిలీ జియోమార్ట్ : రిలయన్స్ అలర్ట్
సాక్షి, ముంబై: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ఆన్లైన్ కిరాణా షాపింగ్ పోర్టల్ జియోమార్ట్ కు నకిలీ సెగ తగిలింది. దీంతో సంస్థ అధికారికంగా స్పందించింది. జియోమార్ట్ పేరు మీద ఫ్రాంఛైజీలను కోరుతున్న అక్రమార్కుల గురించి తమ దృష్టికి వచ్చిందని రిలయన్స్ రిటైల్ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం తాము ఎవరికీ డీలర్షిప్ లేదా ఫ్రాంఛైజ్‌లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అలాంటి నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. (చదవండి: జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ ) జియోమార్ట్ బ్రాండ్ కింద ఆన్లైన్ కిరాణా సేవలను రిలయన్స్ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే జియోమార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ రూపొందించి, రిలయన్స్ రీటైల్‌తో సంబంధం ఉన్న వ్యక్తులుగా నమ్మిస్తున్నారని, జియోమార్ట్ ఫ్రాంఛైంజీలు ఇస్తామని మోసాలకు పాల్పడుతున్నారని రిలయన్స్ రిటైల్ హెచ్చరించింది. అసలు జియోమార్ట్ పేరుతో డీలర్షిప్, ఫ్రాంఛైజ్ మోడల్ లాంటి సేవల్ని ప్రారంభించలేదని తెలియజేసింది. డీలర్షిప్, ఫ్రాంఛైజీల కోసం ఏ ఏజెంట్‌ను నియమించలేదని స్పష్టం చేసింది. ఫ్రాంఛైజీల పేరుతో డబ్బులు వసూలు చేయబోమని తెలిపింది. అలాగే అలాంటి వ్యక్తులతో జరిపే లావాదేవీలకు తాము బాధ్యత వహించమని ప్రజలు, తయారీదారులు, వ్యాపారులు, డీలర్లను హెచ్చరిస్తున్నామని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, తన బ్రాండ్‌ను దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. రిలయన్స్ రీటైల్ పేర్కొన్న నకిలీ వెబ్‌సైట్స్ 1. jmartfranchise.in 2. jiodealership.com 3. jiomartfranchises.com 4. jiomartshop.info 5. jiomartreliance.com 6. jiomartfranchiseonline.com 7. jiomartsfranchises.online 8. jiomart-franchise.com 9. jiomartindia.in.net 10. jiomartfranchise.co జియోమార్ట్ ఫ్రాంఛైజ్ పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, డబ్బులు అడిగినా అలాంటి వారిపై తమకు ఫిర్యాదు చేయాలని రిలయన్స్ రిటైల్ కోరింది. IP Legal, Reliance Retail Limited Building 30, C wing, CA 05, Reliance Corporate Park, Thane Belapur Road, Ghansoli, Navi Mumbai 400701 Email: IP.legal@ril.com -
అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత కోసం వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 – 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు చేయూత పథకం ద్వారా సహాయం అందించామని, సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. తాజాగా గురువారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో రిలయన్స్ రిటైల్, జియో, అల్లాన కంపెనీల ప్రతినిధులు, సెర్ప్ సీఈఓ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు చేయూతను అందించాం. నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా, స్థిరంగా వారికి ఏటా రూ.18,750 చొప్పున మొత్తం రూ.75 వేలు ఇస్తున్నాం. ఈ ఏడాది 23 లక్షల మంది మహిళలకు సుమారు రూ.4,300 కోట్లు ఇచ్చాం. ► వచ్చే నెల వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఏటా రూ.6,700 కోట్లు సుమారు 9 లక్షల గ్రూపులకు అందిస్తున్నాం. నాలుగేళ్ల పాటు దాదాపు 93 లక్షల మంది మహిళలను ఆదుకుంటాం. ► చేయూత, ఆసరా.. రెండు పథకాలు పొందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. దాదాపు కోటి మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. పలు సంస్థలతో ఎంఓయూలు ► ఇప్పటికే అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్‌తో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పుడు రిలయన్స్, అల్లానా గ్రూపులు కూడా భాగస్వాములయ్యాయి. తద్వారా మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించాలన్నది మా ప్రయత్నం. మేం ఇచ్చే డబ్బు వారి జీవితాలను మార్చేదిగా ఉండాలి. ఈ దిశగా మీ సహకారాన్ని కోరుతున్నాం. ► గ్రామాల్లో సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. అక్కడే కియోస్క్‌లు కూడా పెడుతున్నాం. రైతులు ఆర్డర్ చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల క్వాలిటీ టెస్ట్ చేసి 48 గంటల్లో అందజేస్తున్నాం. ► ఇ–క్రాపింగ్ కూడా చేస్తున్నాం. ఆర్బీకేల ద్వారా కనీస గిట్టుబాటు ధరలను కల్పించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. ప్రతి గ్రామంలో గోడౌన్, మండలాల వారీగా కోల్డు స్టోరేజీలు, నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. అంతిమంగా ఇవన్నీ జనతా బజార్ వంటి వ్యవస్థలకు దారి తీస్తాయి. ► ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనంతో ముందుకు చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాంక్షిస్తూ సమగ్రాభివృద్ధి దిశగా మేము అడుగులు వేస్తున్నాం. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులు కూడా లబ్ధి పొందాలన్నది మా విధానం. ఏపీలో అరటి లాంటి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మార్కెట్ కల్పిస్తున్నాం. దీని వల్ల అటు మహిళలు, ఇటు మాకు పరస్పర ప్రయోజనం కలుగుతుంది. గోడౌన్లు, కోల్డు స్టోరేజీల వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయి. దీనిపై ప్రభుత్వ అధికారులతో కూర్చుని ప్రణాళికలు వేసుకుంటాం. – వి.సుబ్రమణియం, ఎండీ, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ముంబయి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో) ఉపాధి పద్ధతి బావుంది చేయూత ద్వారా మహిళలకు జీవనోపాధి మార్గాలను చూపించే పద్ధతి బాగుంది. ఇది లబ్ధిదారుల కుటుంబాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుంది. పంట చేతికి వచ్చిన తర్వాత సంరక్షించుకునే విధానాలపై దృష్టి పెట్టడం మరింత మేలు చేస్తుంది. ఉత్పత్తులకు విలువను జోడిస్తుంది. వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రంగాల్లో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది. – దామోదర్ మాల్, సీఈఓ, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ముంబయి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో) పూర్తిగా సహకరిస్తాం చేయూత పథకంలో మమ్మల్ని భాగస్వాములను చేస్తున్నందుకు చాలా సంతోషం. మా దగ్గరున్న సాంకేతిక సహకారాన్ని, వ్యాపార అనుభవాన్ని పంచుతాం. రాష్ట్రంలోని పోర్టుల ద్వారా ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తాం. ఉత్పత్తులకు అదనపు విలువను జోడించాలి. ఇందుకు కొత్త తరహా ప్యాకేజింగ్ విధానాలు చాలా అవసరం. అన్ని విషయాల్లో మా సహకారం ఉంటుంది. సీఎం దార్శనికత ప్రశంసనీయం. – ఇర్ఫాన్ అల్లానా, అల్లానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రమోటర్ (లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో) రిలయన్స్ రిటైల్ ► మహిళల కిరాణా వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తుంది. ► దుకాణాల నిర్వహణ, ఆధునికీకరణ, వ్యాపార సమర్థతను పెంచడంలో మహిళలకు శిక్షణ ఇస్తుంది. ► సరసమైన ధరలకే ఉత్పత్తులను అందిస్తుంది. పండ్లు, కూరగాయల సాగుకు సహకరిస్తుంది. జియో ► ఈ కార్యకలాపాల్లో అందరినీ అనుసంధానించే ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తుంది. ► ప్రభుత్వం, లబ్ధిదారులైన మహిళల మధ్య నేరుగా అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. ► జియో చాట్ ద్వారా నేరుగా 20 లక్షల మంది లబ్ధిదారులతో ఆడియో, వీడియో సందేశాలు పంపడం, ఇతరత్రా అదనపు ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తుంది. అల్లాన ► ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి రంగంలో విశేష అనుభవం ఉంది. 1865 నుంచి కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి. ► గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో సాంకేతిక సహకారం అందిస్తుంది. వాటిని తిరిగి కొనుగోలు చేయనుంది. -
రిటైల్‌లో అమెజాన్‌కు వాటా!- ఆర్ఐఎల్ రికార్డ్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఆసక్తి చూపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. రిలయన్స్ రిటైల్(ఆర్ఆర్ఎల్)లో అమెజాన్ దాదాపు 10 వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీల్ కుదిరితే రిలయన్స్ రిటైల్ ఎంటర్ప్రైజ్ విలువ రూ. 3-4 లక్షల కోట్లకు చేరవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజులుగా అనధికార అన్‌లిస్టెడ్ షేర్ల మార్కెట్లో ఆర్ఆర్ఎల్ ఈక్విటీ షేరు విలువ 150 శాతం ప్రీమియంతో రూ. 1150-1200 వద్ద కదులుతున్నట్లు తెలుస్తోంది. అయితే డీల్ ఆధారంగా ఆర్ఆర్ఎల్ విలువ రూ. 650-600 స్థాయికి దిగివచ్చే వీలున్నట్లు అభిషేక్ సెక్యూరిటీస్ నిపుణులు సందీప్ గినోడియా అంచనా వేశారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్.. రిటైల్ విభాగం ఆర్ఆర్ఎల్ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా 4:1 నిష్పత్తిలో అంటే 4 ఆర్ఆర్ఎల్ షేర్లకుగాను 1 ఆర్ఐఎల్ షేరుని జారీ చేసేందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆర్ఐఎల్ విలువ రూ. 1600కాగా.. రిలయన్స్ రిటైల్ విలువను రూ. 400-450గా అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్ఐఎల్ రూ. 2000 మార్క్‌ను అధిగమించడంతో ఆర్ఆర్ఎల్ విలువ రూ. 500కు చేరవచ్చని జెన్నెక్ట్స్ నిపుణులు సునీల్ చందక్ పేర్కొన్నారు. 100 శాతం వాటా రిలయన్స్ రిటైల్‌లో ఆర్ఐఎల్కు 99.95 శాతం వాటా ఉంది. అన్‌లిస్టెడ్ మార్కెట్లో 25 లక్షల ఈక్విటీ షేర్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. వెరసి ఆర్ఆర్ఎల్ మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లు పలకవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ బిజినెస్‌లోనూ వాటా విక్రయ యోచనలో ఉన్నట్లు ముకేశ్ అంబానీ ఏజీఎంలో సంకేతాలిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జియో ప్లాట్‌ఫామ్స్‌కు లభించినంత ప్రీమియంను రిలయన్స్ రిటైల్ పొందలేకపోవచ్చని భావిస్తున్నారు. కాగా.. మరోవైపు కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్‌ను ఆర్ఐఎల్ సొంతం చేసుకునే సన్నాహాల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 2161 వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ విలువ రూ. 14 లక్షల కోట్లను అధిగమించడం ద్వారా కొత్త చరిత్రను లిఖించడం విశేషం! -
ఇక రిలయన్స్ రిటైల్‌పై ముకేశ్ దృష్టి!
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తాజాగా రిలయన్స్ రిటైల్ బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సూపర్ మార్కెట్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ తదితర విభాగాలలో రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 12,000 సోర్లను నిర్వహిస్తోంది. సుమారు 7,000 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇటీవల జియోమార్ట్ ద్వారా ఆన్లైన్ గ్రోసరీ స్టోర్‌ను సైతం ప్రారంభించింది. 2020 మార్చికల్లా రిలయన్స్ రిటైల్ రూ.1.63 ట్రిలియన్ల ఆదాయాన్ని సాధించినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. కొద్ది రోజులుగా రిలయన్స్ రిటైల్ బిజినెస్‌పైనా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు తాజా ఏజీఎంలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై రిలయన్స్ రిటైల్‌లో వాటా విక్రయం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ముకేశ్ అంబానీ తెరతీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్రోకెమికల్స్ సైతం పెట్రోకెమికల్స్ విభాగంలో సైతం వాటా విక్రయం, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందడుగు వేసే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరామ్కోతో డీల్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదని బుధవారం జరిగిన 43వ ఏజీఎంలో ముకేశ్ తెలియజేశారు. దీంతో తిరిగి విదేశీ ఇంధన దిగ్గజాలతో చర్చలు ప్రారంభించే వీలున్నట్లు ఊహిస్తున్నాయి. అయితే సౌదీ అరామ్కోతో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు ముకేశ్ పేర్కొనడం గమనార్హం! రానున్న రోజుల్లో రిలయన్స్ రిటైల్ బోర్డులోకి వ్యూహాత్మక ఇన్వెస్టర్లు అడుగు పెట్టనున్నట్లు ముకేశ్ పేర్కొన్న నేపథ్యంలో తాజా అంచనాలకు బలమొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 20 బిలియన్ డాలర్లు డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మూడు నెలల్లోనే దాదాపు 33 శాతం వాటా విక్రయం ద్వారా సుమారు రూ.1.52 లక్షల కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ సమకూర్చుకుంది. గ్లోబల్ దిగ్గజాలు ఫేస్బుక్, ఇంటెల్, గూగుల్ తదితరాలు ఇన్వెస్ట్ చేయడం విశేషంకాగా.. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఎంటర్ప్రైజ్ విలువ 58 బిలియన్ డాలర్లకు చేరింది. జియోలో 7.7 శాతం వాటా కొనుగోలుకి గూగుల్ 4.5 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. ఈ బాటలో ఆయిల్, కెమికల్స్ విభాగంలో సౌదీ అరామ్కోకు వాటా విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లను సమకూర్చుకోవాలని ఆర్ఐఎల్ ఆశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో రిలయన్స్ రిటైల్ బిజినెస్‌తోపాటు.. ఆయిల్, కెమికల్ విభాగంలో విదేశీ పెట్టుబడులపై ముకేశ్ అంబానీ దృష్టిసారించవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
మళ్లీ రిలయన్స్ రికార్డ్!
ముంబై/న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో రికార్డ్ స్థాయిలో రూ.11,640 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ3లో రూ.10,251 కోట్ల నికర లాభం వచ్చిందని, 14% వృద్ధి సాధించామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. భారత్‌లో ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక త్రైమాసిక కాలంలో ఇదే అత్యధిక నికర లాభం కావడం గమనార్హం. చమురు శుద్ధి వ్యాపారం లాభాల బాట పట్టడం, కన్సూమర్ వ్యాపారాలైన రిలయన్స్ రిటైల్, జియోల జోరు కొనసాగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. ఇక ఆదాయం మాత్రం 1.4% క్షీణించి రూ.1,68,858 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. కాగా, క్యూ2(సెప్టెంబర్ క్వార్టర్) లోనూ రిలయన్స్ రికార్డు స్థాయిలోనే లాభాలను ఆర్జించింది. వినియోగ వ్యాపారాలు... వాహ్వా ! కంపెనీ కన్సూమర్ వ్యాపార విభాగాలైన రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోల జోరు కొనసాగుతోంది. ఈ రెండు వ్యాపారాల స్థూల లాభం రికార్డ్ స్థాయిలో పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం నిర్వహణ లాభంలో ఈ రెండు విభాగాల వాటా 25 శాతంగానే ఉంది. ఈ క్యూ3లో ఈ వాటా దాదాపు 40 శాతానికి పెరిగింది. గత క్యూ3లో రూ.1,680 కోట్లుగా ఉన్న రిలయన్స్ రిటైల్ నిర్వహణ లాభం ఈ క్యూ3లో 62 శాతం వృద్ధితో రూ.2,727 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.35,577 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.45,327 కోట్లకు పెరిగింది.ఈ క్యూ2లో 10,901గా ఉన్న మొత్తం రిలయన్స్ రిటైల్ స్టోర్స్ సంఖ్య ఈ క్యూ3లో 11,316కు పెరిగాయి. రిటైల్ రంగంలో ఇతర కంపెనీల కన్నా కూడా రిలయన్స్ రిటైల్ కంపెనీయే జోరుగా వృద్ధి చెందుతోంది. సగటున 17.6 కోట్ల మంది వినియోగదారులు రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌ను సందర్శిస్తున్నారు. ఇది గత క్యూ3 కంటే 43 శాతం అధికం. మరిన్ని వివరాలు.... - వరుసగా 6 క్వార్టర్ల పాటు తగ్గుతూ వచ్చిన రిఫైనింగ్ మార్జిన్లు ఈ క్యూ3లో పెరిగాయి. ఈ విభాగం స్థూల లాభం 12% వృద్ధితో రూ.5,657 కోట్లకు చేరింది. - గత క్యూ3లో 8.8 డాలర్లుగా ఉన్న స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్–ఒక్కో బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల లభించే లాభం)ఈ క్యూ3లో 9.2 డాలర్లకు పెరిగింది. అయితే ఈ క్యూ2లో వచ్చిన దాంతో(9.4 డాలర్లు) పోల్చితే ఇది తక్కువే. - రికార్డ్ స్థాయిలో (9.9 మిలియన్ టన్నులు) చమురును ఉత్పత్తి చేసినప్పటికీ, ఈ విభాగం స్థూల లాభం 29 శాతం తగ్గి రూ.5,880 కోట్లకు పరిమితమైంది. ఇక చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి విభాగం నష్టాలు రూ.185 కోట్ల నుంచి రూ.366 కోట్లకు పెరిగాయి. - క్యూ2లో రూ.2,91,982 కోట్లుగా ఉన్న రుణ భారం క్యూ3 చివరికి రూ.3,06,851 కోట్లకు పెరిగింది. నగదు నిల్వలు రూ.1,34,746 కోట్ల నుంచి రూ.1,53,719 కోట్లకు చేరాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాలతో బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2.8 శాతం లాభంతో రూ.1,581 వద్ద ముగిసింది. జియో... జిగేల్... ఇక టెలికం విభాగం రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. గత క్యూ3లో రూ.831 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 63 శాతం వృద్ధితో రూ.1,350 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఆదాయం రూ.10,884 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.13,968 కోట్లకు పెరిగింది. మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 37 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడి పరంగా వచ్చే నగటు ఆదాయం (ఏఆర్పీయూ) ఈ క్యూ2లో నెలకు రూ.120గా ఉండగా, ఈ క్యూ3లో రూ.128.4కు పెరిగింది. ఈ విభాగం త్రైమాసిక నిర్వహణ లాభం తొలిసారిగా రూ.5,600 కోట్ల మైలురాయిని దాటింది. డేటా ట్రాఫిక్ 40 శాతం, వాయిస్ కాల్స్ 30 శాతం చొప్పున వృద్ధి చెందాయి. రికార్డ్‌లే రికార్డ్‌లు... ప్రతి త్రైమాసిక కాలంలో కన్సూమర్ వ్యాపారాలు రికార్డ్ల మీద రికార్డ్లను సృష్టిస్తున్నాయి. రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌లో అమ్మకాలు నిలకడగా పెరుగుతున్నాయి. ఇక అత్యంత చౌక ధరలకే సేవలందిస్తుండటంతో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా ఆర్థిక స్థితిగతులు బలహీనంగా ఉండటం, ఇంధన మార్కెట్లలో ఒడిదుడుకులు చోటు చేసుకోవడం... ఇంధన వ్యాపారంపై ప్రభావం చూపించాయి. పటిష్ట వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా రిఫైనింగ్ సెగ్మెంట్ పనితీరు మెరుగుపడింది. –ముకేశ్ అంబానీ, సీఎమ్‌డీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
రిలయన్స్ రిటైల్... @ 2.4 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ రిటైల్ విలువ రూ.2.4 లక్షల కోట్లు(3,400 కోట్ల డాలర్లు) అని అంచనా. రిలయన్స్ రిటైల్ వాటాదారుల కోసం రిలయన్స్ గ్రూప్ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్ ఆధారంగా చూస్తే, రిలయన్స్ రిటైల్ విలువ రూ.2.4 లక్షల కోట్లుగా తేలుతుంది. దేశంలో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్, డిమార్ట్‌ను ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ విలువ(రూ.1.20 లక్షల కోట్లు)కు ఇది దాదాపు రెట్టింపు విలువ. ఇంగ్లాండ్‌లో అతి పెద్ద సూపర్ మార్కెట్ చెయిన్ టెస్కో విలువ (3,200 కోట్ల డాలర్లు)కంటే కూడా అధికం కావడం విశేషం. షేర్ల మార్పిడి స్కీమ్‌లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్ రిటైల్ షేర్లకు గాను ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌ను పొందవచ్చని రిలయన్స్ రిటైల్ వెబ్సైట్ వెల్లడించింది. షేర్ల మార్పిడి స్కీమ్ ఎందుకంటే.., రిలయన్స్ రిటైల్ కంపెనీ తన ఉద్యోగులకు 2006, 2007 సంవత్సరాల్లో స్టాక్ ఆప్షన్స్ ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఈ ఆర్ఎస్యూ(రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు)ను ఈక్విటీ షేర్లుగా మార్చుకున్నారు. ఈక్విటీ షేర్లు పొందిన ఉద్యోగులు వీటిని నగదుగా మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారని రిలయన్స్ రిటైల్ వివరించింది. ఈ కంపెనీని ఇప్పటికిప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే ఆలోచన ఏదీ లేదని, అందుకే ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించింది. రిలయన్స్ రిటైల్‌లో 99.95% వాటా రిలయన్స్ రిటైల్ వెంచర్‌కు ఉందని, మిగిలిన 0.05 శాతం వాటా ఉద్యోగుల వద్ద ఉందని వివరించింది. ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌కు ఆమోదం పొందడం కోసం వచ్చే నెల 23న ఈక్విటీ వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపింది. పదివేలకు పైగా రిటైల్ స్టోర్స్... దేశవ్యాప్తంగా 10,901 స్టోర్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ రిటైల్ కంపెనీ ఆదాయం ఈ ఏడాది మార్చితో ముగిసిన సంవత్సరానికి 89% వృద్ధితో రూ.1.3 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 169 శాతం ఎగసి రూ.5,550 కోట్లకు చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పరోక్ష అనుబంధ సంస్థగా రిలయన్స్ రిటైల్ వ్యవహరిస్తోంది. గురువారం రిలయన్స్ షేర్ రూ.1,516 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9.6 లక్షల కోట్లు. రిలయన్స్ రిటైల్ కంపెనీని ఐదేళ్లలోపు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామని ఈ ఏడాది ఆగస్టులోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. -
ఖమ్మంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ ప్రారంభం
సాక్షి, ఖమ్మం: రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూపర్ మార్కెట్ శ్రేణి రిలయన్స్ స్మార్ట్ ఖమ్మంలో తన కొత్త స్టోర్‌ను వైఎస్ టవర్స్, ఎన్ఎస్టి రోడ్, బాలాజీ నగర్లో బుధవారం ప్రారంభించింది. బహుళ విధమైన ఉత్పత్తులను కలిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్వేర్, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరల వల్ల స్థానిక ప్రజల హృదయాలను గెలుచుకోవడంతో పాటు వారి దైనందిన అవసరాలను తీర్చే కేంద్రంగా రిలయన్స్ స్మార్ట్ నిలవనుంది. ఈ స్టోర్‌లో వినియోగదారులు చెల్లించే మొత్తానికి తగిన నాణ్యమైన ఉత్పత్తులు అందించడంతో పాటుగా ఎంఆర్పీపై కనీసం 6% డిస్కౌంట్‌ను అన్ని ఉత్పత్తులపై సంవత్సరం పొడవునా అందిస్తోంది. దీంతోపాటు రూ.1499 విలువ గల వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కిలో పంచదారను రూ.9 కనీస ధరతో అందించడం వంటి ఇతర ఆకర్షణీయ పథకాల వల్ల దేశవ్యాప్తంగా తమ నెలవారీ కిరాణ సరుకుల కోసం ఎంచుకోదగిన ఉత్తమమైన సూపర్ మార్కెట్‌గా రిలయన్స్ స్మార్ట్ నిలుస్తోంది. వీటన్నింటితో పాటు ప్రధానమైన ఉత్పత్తులను, పండ్లు మరియు కాయగూరలపై ప్రతిరోజూ తక్కువ ధరలకే అందిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఖమ్మం స్టోర్ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 18కు చేరుకుంది. 29,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువు దీరిన ఈ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన డిజైన్ మరియు లేఔట్ కలిగి ఉంది. `పవర్ ఆఫ్ 9` పేరుతో కల్పించిన ప్రారంభోత్సవ ఆఫర్ ద్వారా ఉల్లిగడ్డలు, కొబ్బరికాయలు, ప్లాస్టిక్ కంటెయినర్ల సెట్ వంటి అనేక ఉత్పత్తులు కేవలం రూ.9 కే (వీటి మార్కెట్ ధర కనీసం రూ.999 ఉంటుంది) అందించడం వల్ల అనేకమంది వినియోగదారులు ఆకర్షితులు కానున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ స్మార్ట్ తన వినియోగదారులకు సంబంధించిన దైనందిన మరియు ప్రత్యేక సందర్భాలకు తగిన అవసరాలను అన్ని రకాలైన ధరలతో కూడిన ఉత్పత్తులను అందిస్తోంది. వినియోగదారుడిపై ప్రత్యేక దృష్టి సారించిన రిలయన్స్ స్మార్ట్ అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని తన వినియోగదారులకు అందిస్తోంది. లార్జ్ ఫార్మాట్ సూపర్ మార్కెట్ కేటగిరీలో విస్తృత శ్రేణిలో ఉత్పత్తులు అందిస్తూ వినియోగదారులకు ఉత్పత్తులకు సంబంధించినదే కాకుండా స్థలం పరంగా కూడా సారుప్యంగా అందుబాటులో ఉంది. నేడు రిలయన్స్ స్మార్ట్ స్టోర్ లు దేశవ్యాప్తంగా 100 కు పైగా నగరాలలో ఉన్నాయి. -
రిలయన్స్ రిటైల్: ఆన్లైన్ దిగ్గజాలకు గుబులే
సాక్షి, ముంబై : వ్యాపార రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న ప్రముఖ బిలియనీర్ ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ రీటైల్ ఆన్లైన్ మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేయనుంది. తద్వారా అమెజాన్, వాల్‌మార్ట్- ఫ్లిప్‌కార్ట్‌లకు పెద్ద సవాల్‌గా మారనుంది. జియో తరహాలోనే మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్ పరిశోధనా సంస్థ ఫోర్రెస్టర్ ప్రకారం 2023 నాటికి భారతదేశంలో ఆన్లైన్ రిటైల్ విక్రయాల మార్కెట్ విలువ 85 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 5,90,000 కోట్లు) చేరనుంది. వచ్చే ఐదేళ్లలో ఆన్లైన్ రిటైల్ సేల్స్ 25.8 శాతం వృద్ధిని సాధించనున్నాయి. అలాగే భారత్‌లో 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు, గత డిసెంబర్లో ఈ కామర్స్ పాలసీలో మార్పుల రూపంలో ఒడిదుడుకులు ఎదురైనా వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. 6,600 నగరాలు, పట్టణాల్లో 10,415 స్టోర్లు కలిగిన రిలయన్స్ రిటైల్ ఏటా 500మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చే రిలయన్స్ స్టోర్లకు ఆదరణ పెరుగుతుందని ఫోర్రెస్టర్ అంచనా వేస్తోంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని విశ్లేషించింది. అలాగే భారీ డిస్కౌంట్లతో రిలయన్స్ రిటైల్ మార్కెట్లోఅడుగు పెడితే ఆన్లైన్ రీటైల్ దిగ్గజాలకు నష్టాలు తప్పవని, దాదాపు టెలికాం మార్కెట్లోకి జియో ప్రవేశించిన అనంతరం ఏర్పడిన పరిస్థితులే పునరావృతం అవుతాయని ఫోర్రెస్టర్ సీనియర్ ఫోర్కాస్ట్ అనలిస్ట్ సతీష్ మీనా అభిప్రాయపడ్డారు. 2019 ఏప్రిల్‌లో రిలయన్స్ తన ఎంప్లాయిస్ కోసం ఫుడ్ అండ్ గ్రోసరీ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ ఏడాదిలోనే యాప్‌ను కమర్షియల్‌గా లాంచ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తద్వారా రిలయన్స్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ టూ ఆఫ్ లైన్ కామర్స్ ప్లాట్‌ఫాంను అందుబాటులో తేవడంతోపాటు, వినియోగదారులకు భారీ ప్రయోజనాలను అందించనుంది. కాగా 2019 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రీటైల్ ఆదాయం 81 బిలియన్ డాలర్లుగానూ, లాభాలు 9.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే రూ. 620 కోట్ల భారీ పెట్టుబడితో ఇటీవల సొంతం చేసుకున్న గ్లోబల్ టాయ్స్ కంపెనీ హామ్లీస్తోపాటు 40 బ్రాండ్లు రిలయన్స్ పోర్ట్‌ఫోలియోలో భాగం. -
గ్లోబల్ సంస్థను చేజిక్కించుకున్న రిలయన్స్
ప్రపంచంలోనే అతిపెద్దదైన, పురాతనమైన బ్రిటిష్ టోయ్ రీటైలర్ హామ్లీస్‌ను వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సొంతం చేసుకున్నారు. చిన్న పిల్లల బొమ్మల మార్కెట్‌పై మంచి పట్టు ఉన్న గ్లోబల్ కంపెనీ హామ్లీస్పై ఎప్పటినుంచో కన్నేసిన రిలయన్స్ రీటైల్ ఎట్టకేలకు ఆ కంపెనీని చేజిక్కించుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్, హాంకాంగ్ లిస్టింగు కంపెనీ సి బ్యానర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్నుంచి హామ్లిస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో 100 శాతం షేర్లను కొనుగోలు చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 260 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకోసం 67.96 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.620 కోట్లు) నగదు ఒప్పందం పూర్తి చేసినట్టు ప్రకటించింది. చైనాకు చెందిన సి బ్యానర్ ఇంటర్నేషనల్ నుంచి హమ్లీస్‌ను కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకం చేసినట్టు రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన హమ్లీస్ సంస్థను ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకోవాలన్న తమ చిరకాల స్వప్నం నేడు నెరవేరిందని రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ సీఈఓ దర్శన్ మెహత్ పేర్కొన్నారు. 1760లో లండన్‌లో నోవాస్‌గా మొదలైన సంస్థ ఆ తర్వాత కాలక్రమంలో హామ్లీస్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలలో 167 దుకాణాలున్నాయి. అందులోనూ ఇండియాలో హామ్లీస్ 29 నగరాల్లో 88 స్టోర్లను కలిగి ఉంది. యూకె, చైనా, జర్మనీ, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా సహా మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఈ స్టోర్స్ ఉన్నాయి. వాటిల్లో అధిక శాతం ఫ్రాంచైజీ మోడల్. ఇక ఇప్పటికీ సుమారు 50 వేల బొమ్మలను ఆన్ లైన్లో విక్రయానికి పెట్టింది ఈ సంస్థ. లండన్‌లో ఇప్పటికీ హామ్లీస్ స్టోర్ ఓ సూపర్ టూరిస్ట్ అట్రాక్షన్. ఏటా సుమారు 50 లక్షల మంది ఈ స్టోర్‌ను సందర్శిస్తూ ఉంటారు. మరోవైపు బ్రెగ్జిట్, అంతర్జాతీయ తీవ్రవాదం కారణంగా గత సంవత్సరం హమ్లీస్ సుమారు రూ.84 కోట్ల నష్టాన్ని సంస్థ ప్రకటించడం గమనార్హం. -
వరంగల్‌లో రిలయన్స్ స్మార్ట్ స్టోర్
సాక్షి, వరంగల్ : రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూపర్ మార్కెట్ శ్రేణి అయిన రిలయన్స్ స్మార్ట్ తన కొత్త స్టోర్‌ను వరంగల్‌లోని బాలసముద్రంలో గల సురేష్‌రెడ్డి ప్రాపర్టీస్‌లో ప్రారంభించింది. ఒకే కేంద్రంలో బహుళవిధమైన ఉత్పత్తులను కలిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్పత్తులు, పండ్లు మరియు కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్వేర్, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ప్రారంభమైన వరంగల్ స్టోర్ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 15కు చేరుకుంది. 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరిన వరంగల్ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన డిజైన్ మరియు లేఔట్ కలిగి ఉండి, నాణ్యమైన ఉత్పత్తులు మరియు ఆకర్షణీయమైన ధరల వల్ల స్థానిక ప్రజల హృదయాలను గెలుచుకోవడంతో పాటుగా వారి దైనందిన అవసరాలను తీర్చే కేంద్రంగా రిలయన్స్ స్మార్ట్ నిలవనుంది. `పవర్ ఆఫ్ 9` పేరుతో కల్పించిన ప్రారంభోత్సవ ఆఫర్ ద్వారా ఉల్లిగడ్డలు, కొబ్బరికాయలు, ప్లాస్టిక్ కంటెయినర్ల సెట్ వంటి అనేక ఉత్పత్తులు కేవలం రూ.9 కే (వీటి మార్కెట్ ధర కనీసం రూ.999 ఉంటుంది) అందించడం వల్ల అనేకమంది వినియోగదారులు ఆకర్షితులు కానున్నారు. -
హైదరాబాద్‌లో రిలయన్స్ స్మార్ట్ న్యూ స్టోర్స్
సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ సూపర్ మార్కెట్ చైన్ రిలయన్స్ స్మార్ట్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లోని పీర్జాదిగూడ, చాంద్రాయణగుట్టలో నూతన స్టోర్లను లాంఛ్ చేసింది. కిరాణా, పండ్లు, కూరగాయలు, కిచెన్ వేర్ సహా గృహావసరాలకు అవసరమైన వస్తువులు ఈ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక పీర్జాదిగూడ స్టోర్ 7900 చదరపు అడుగుల్లో, చాంద్రాయణగుట్ట స్టోర్ 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కస్టమర్లకు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తాయని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కిరాణా సహా వివిధ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను కస్టమర్లకు అందించనున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాల్లో 150 రిలయన్స్ స్మార్ట్ స్టోర్లు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని వెల్లడించింది. -
రిలయన్స్ ట్రెండ్స్ భారీ విస్తరణ!
ముంబై: ‘రిలయన్స్ ట్రెండ్స్’ భారీ విస్తరణకు రిలయన్స్ రిటైల్ సిద్ధమైంది. ప్రస్తుతం 557గా ఉన్న ఔట్లెట్లను వచ్చే ఐదేళ్లలో 2,500కు పెంచాలని, ఈ కామర్స్‌తోనూ అనుసంధానించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త ఈ కామర్స్ విధానం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు ప్రతికూలంగా ఉండటంతో... ఈ కామర్స్ విభాగంలో ఫ్యాషన్ పరంగా విస్తరించేందుకు ఇది అనుకూల సమయమని రిలయన్స్ భావిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ–కామర్స్ సంస్థలు తమకు వాటాలున్న కంపెనీల నుంచి విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. తమ ద్వారానే విక్రయించేలా వెండర్లతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవడాన్ని నిషేధించింది. దీంతో రిలయన్స్ రిటైల్ ఈ కామర్స్ విభాగంలో భారీగా చొచ్చుకుపోయేందుకు ఇదే అనుకూల తరుణమని భావిస్తోంది. 300 పట్టణాలే లక్ష్యం... ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 300 పట్టణాల్లో రిలయన్స్ ట్రెండ్స్ దుకాణాలను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ప్రణాళికగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 160 పట్టణాల్లో రిలయన్స్ ట్రెండ్స్ సేవలున్నాయి. రిటైల్‌పై ముకేశ్ అంబానీ అంచనాలు పెరిగాయని, కంపెనీ తన ప్రణాణళికలను రిటైల్ అడ్వైజర్లతో పంచుకుందని వెల్లడించాయి. అయితే, దీనిపై రిలయన్స్ రిటైల్ స్పందించలేదు. రిలయన్స్ ట్రెండ్స్ విస్తరణ ద్వారా తన ప్రైవేటు లేబుల్ (సొంత బ్రాండ్) ఉత్పత్తుల అమ్మకాలను వేగంగా పెంచుకోవాలన్నది ప్రణాళిక. ఈ కామర్స్ వెంచర్లో తన ప్రైవేటు లేబుల్ ఉత్పత్తుల లభ్యతను పెంచడం, చిన్న పట్టణాలకు కూడా విస్తరించడం రిలయన్స్ ట్రెండ్స్ తదుపరి వృద్ధి చోదకంగా రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. గత ఏడాది 100 రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్లను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. మన దేశంలో 18–35 ఏళ్ల వయసు గ్రూపు వారు 44 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో యువ జనాభా మన దగ్గరే ఎక్కువ. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతుండటంతో ఈ కామర్స్ సంస్థలు తగ్గింపు ఆఫర్లతో కస్టమర్లను ఆన్లైన్ షాపింగ్ దిశగా ఆకర్షిస్తున్నాయి. యువతరాన్ని ఆకర్షించడానికే ప్రతి రిటైలర్ చూస్తారని, రిలయన్స్ కూడా ఇందుకు భిన్నమేమీ కాదని రిటైల్ రంగ ప్రముఖుడొకరు పేర్కొన్నారు. రిటైలర్లకు థర్డ్‌పార్టీ ఉత్పత్తులతో పోలిస్తే తమ సొంత బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలపై ఎక్కువ మార్జిన్ మిగులుతుంది. రిలయన్స్ రిటైల్ వేగవంతమైన విస్తరణ ప్రణాళిక అనేది ప్రైవేటు లేబుల్ ఉత్పత్తులు మల్టీబ్రాండ్ ఔట్లెట్లు, చిన్న ఫార్మాట్ దుకాణాల్లోనూ లభించేలా ఉంటుందని రిటైల్ కన్సల్టెంట్ గోవింద్ శ్రీఖండే తెలిపారు. రిలయన్స్ ట్రెండ్స్ ఆదాయంలో 80 శాతం ప్రైవేటు లేబుల్ ద్వారానే వస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాలు, లండన్‌లోని మరో కేంద్రంలో ఉన్న డిజైనర్ల బృందాలు జీన్స్, ట్రోజర్స్, షర్ట్లు, టీ షర్ట్‌లను డిజైన్ చేస్తుంటారని కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. -
రిలయన్స్ రిటైల్‌కు 94వ ర్యాంక్
న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ సంస్థ మరో ఘనత సాధించింది. డెలాయిట్ ప్రకటించిన గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2019 ఇండెక్స్‌లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 94వ స్థానంలో నిలిచింది. గతేడాది మార్చితో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఆదాయం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 250 సంస్థలకు డెలాయిట్ ర్యాంకులు కేటాయించిందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నిత్యవసరాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పతుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో తమ సంస్థకు మంచి ర్యాంకు దక్కించుకుందని వెల్లడించింది. (ఈ–కిరాణాలో హోరాహోరీ) డెలాయిట్ ప్రకటించిన టాప్ 250 రిటైల్ కంపెనీల జాబితాలో అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటా కొనుగోలు చేసి వాల్‌మార్ట్ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంది. అమెరికన్ కంపెనీలు కాస్ట్కో, క్రోజర్ వరుసగా రెండో, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. టాప్‌టెన్‌లో ఏడు అమెరికా కంపెనీలు ఉండటం విశేషం. మొత్తం జాబితాలో అత్యధికంగా 87 యూరోప్ కంపెనీలు ఉన్నాయి. -
అలీబాబా-రిలయన్స్ రిటైల్ వార్తలపై క్లారిటీ
ముంబై : భారత రిటైల్ రంగంలో భారీ జాయింట్ వెంచర్‌కు రంగం సిద్ధమవుతుందని... రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్‌తో చైనా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా చేతులు కలుపబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, వీటిలో ఎలాంటి ఆధారాలు లేవని, ఊహాగాహనాల వార్తలు మాత్రమేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి తేల్చిచెప్పారు. రిలయన్స్ రిటైల్‌లో 50 శాతం వాటాను 5 బిలియన్ డాలర్లకు అలీబాబా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, దీనిపై చర్చలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ తమ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు అలీబాబా కానీ, మరే ఇతరులు కూడా చర్చలు జరుపలేదని రిలయన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ప్రకటన పూర్తిగా ఊహాగానాలేనని, అత్యంత బాధ్యతారహితమైనవని చెప్పారు. అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్‌మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీతో ఈ ప్రతిపాదనపై జూలై చివరిలో చర్చలు జరిపినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ జాక్‌మా, తమ చైర్మన్‌ను అసలు ముంబైలో కలువనే లేదని పేర్కొన్నారు. పేటీఎం మాదిరి రిలయన్స్ రిటైల్ తీసుకురావాలని చూస్తున్నారని రిపోర్టులు చక్కర్లు కొట్టాయి. అయితే ‘రిలయన్స్ రిటైల్ ఇప్పటికే అతిపెద్ద రిటైల్ కంపెనీ. అంతేకాక వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న, ఎక్కువగా లాభాలార్జిస్తున్న కంపెనీ. తమ వృద్ధి ప్రణాళికలను ఇటీవల జరిగిన ఏజీఎంల్లో షేర్హోల్డర్స్తో చైర్మన్ పంచుకున్నారు. అప్పటి నుంచి ఇక ఎలాంటి కొత్త అప్డేట్ లేదు’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి తేల్చి చెప్పారు. రిలయన్స్ రిటైల్‌తో అలీబాబా జతకట్టబోతుందని వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తమేమంటూ క్లారిటీ ఇచ్చారు. చదవండి : (రిలయన్స్ రిటైల్‌తో అలీబాబా జట్టు!) -
రిలయన్స్ రిటైల్‌తో అలీబాబా జట్టు!
ముంబై: భారత రిటైల్ రంగంలో భారీ జాయింట్ వెంచర్‌కు రంగం సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్‌తో చైనా ఈ కామర్స్ దిగ్గజ సంస్థ, అలీబాబా చేతులు కలపనున్నది. ఈ రెండు సంస్థలు కలసి భారత్‌లో భారీ రిటైల్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ప్రపంచంలో వేగంగా వృద్ది చెందుతున్న మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల జోరుకు చెక్ పెట్టడానికి ఈ జాయింట్వెంచర్ను ఏర్పాటు చేయాలని ఇరు సంస్థలు యోచిస్తున్నాయని సమాచారం. అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా గత నెల చివర్లో ముంబైలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో కలిసి చర్చలు జరిపారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటిలో ఇరువురూ పలు అంశాలపై చర్చలు జరిపారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ చర్చల్లో భాగంగా రిలయన్స్ రిటైల్‌లో 50 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయాలని అలీబాబా సంస్థ యోచిస్తోందని, దీని కోసం ఆ సంస్థ 500–600 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలీబాబాకు స్వల్పమైన వాటాతో ఇరు సంస్థలు కలిసి వ్యూహాత్మక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. భారీ డిజిటల్‌మార్కెట్ ప్లేస్‌ను ఏర్పాటు చేసే విషయం కూడా చర్చలు జరిగాయని సంబంధిత వర్గాలు తెలపాయి. ఒక వేళ ఈ డీల్ సాకారమైతే, భారత్‌లో అలీబాబాకు ఇదే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ విషయంలో అలీబాబాకు గోల్డ్‌మన్ శాక్స్ సలహాదారుగా వ్యవహరిస్తోంది. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి గోల్డ్‌మన్ శాక్స్ ప్రతినిధి నిరాకరించారు. మొత్తం మీద భారత ఈ కామర్స్ రంగంలో భారీ పోరుకు తెర లేవనున్నది. నిధులు పుష్కలంగా ఉన్న రెండు దిగ్గజ సంస్థలు(ఆమెజాన్ వర్సెస్ ఆలీబాబా) భారత ఈ కామర్స్ మార్కెట్లో అగ్రస్థానం కోసం పోటీ పడనున్నాయి. ఈ పోటీ కారణంగా వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణుల అంచనా. మరోవైపు ఈ డీల్ అలీబాబాకు అత్యంత కీలకం కానున్నది. ఈ సంస్థకు 49 శాతం వాటా ఉన్న పేటీఎమ్‌కు ఇటీవలనే ఆర్బీఐ వినియోదార్ల డేటా విషయమై హెచ్చరిక జారీ చేసింది. పేటీఎమ్ కస్టమర్ల డేటాను ఈ చైనా కంపెనీ యాక్సెస్ చేస్తోందని ఆర్బీఐ ఆనుమానిస్తోంది. కాగా రిలయన్స్ రిటైల్ 5,200 పట్టణాల్లో మొత్తం 8,533 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఏడాది కాలానికి రిలయన్స్ రిటైల్ రూ.2,529 కోట్ల స్థూల లాభం సాధించింది. ఈ కంపెనీ టర్నోవర్ 1,000 కోట్ల డాలర్లను దాటేసింది. ‘ప్రపంచాన్ని మార్చే’ కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోకు అగ్రస్థానం ఫార్చ్యూన్ సంస్థ రూపొందించిన ప్రపంచాన్ని మార్చే కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోకు అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఫార్మా దిగ్గజం మెర్క్, మూడో స్థానంలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలు నిలిచాయి. ఐదో స్థానాన్ని చైనాకు చెందిన అలీబాబా సాధించింది. -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు అంబానీ పోటీ
కోల్‌కతా : వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్లు.. ముఖేష్ అంబానీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కోబోతున్నాయి. ఈ రెండింటిపై పోటీకి దిగుతూ.. రిలయన్స్ రిటైల్, స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లను ఆన్లైన్లో అమ్మకాలు చేపట్టేందుకు ఓ వెంచర్ ఏర్పాటు చేసినట్టు ఇద్దరు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. రిలయన్స్ రిటైల్, దేశీయ అతిపెద్ద బ్రిక్ అండ్ మోర్టర్ రిటైలర్ చైన్. ఇది తాజాగా ఆన్‌లైన్‌గా అరంగేట్రం చేసింది. స్మార్ట్ఫోన్లను, ఎలక్ట్రానిక్స్‌ను ఆన్‌లైన్‌గా విక్రయించడానికి రిలయన్స్ రిటైల్ ఓ ఆన్లైన్ షాపును లాంచ్ చేసిందని తెలిసింది. స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలు దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సుమారు 55 శాతం నుంచి 60 శాతం వ్యాపారాన్ని కలిగిస్తున్నాయి. దీంతో వచ్చే పండుగ కాలంలో టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ను ఆన్లైన్లో విక్రయాలు చేపట్టడానికి రిలయన్స్ రిటైల్ సిద్ధమైంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సరితూగే ఆఫర్లను కూడా ఇది ఆఫర్ చేయబోతుంది. ఇతర ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ల మాదిరిగా పాత మోడల్స్‌పై, ఎక్స్‌క్లూజివ్ మోడల్స్‌పై ఎప్పడికప్పుడూ భారీ డిస్కౌంట్లను రిలయన్స్ రిటైల్ ఆఫర్ చేయనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఇతర ప్రొడక్ట్‌లు కూడా రిలయన్స్ డిజిటల్ ఆఫ్‌లైన్ స్టోర్ ధరలకు సమానంగా ఉండనున్నాయని తెలిపారు. రిలయన్స్ డిజిటల్ ఇప్పటికే తన ఆఫ్‌లైన్ స్టోర్లలో ఎల్జీ, శాంసంగ్, సోనీ, షావోమి, పానాసోనిక్ వంటి టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను తక్కువ రేటుకే అందిస్తోంది. ‘దేశవ్యాప్తంగా ఇప్పుడే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. రిలయన్స్ డిజిటల్‌ను విస్తరించడానికి ఇదొక ఓమ్ని-ఛానల్. ఇది ఆన్లైన్ కార్యకలాపాలను విజయవంతం చేయడానికి ఎక్కువగా దృష్టి సారిస్తోంది’ అని మరో ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు. ఆన్లైన్లో దేశీయ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 38 శాతం, టెలివిజన్లు 12 శాతం, అప్లియెన్స్ 6-7 శాతం ఆక్రమించుకుంటున్నాయి. పర్సనల్ కేర్ గాడ్జెట్లు 15 నుంచి 20 శాతం ఆన్లైన్ షేరును కలిగి ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, షావోమి ఎంఐ ఆన్లైన్ స్లోర్‌లే స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ విక్రయాల్లో దేశీయ అతిపెద్ద ఆన్లైన్ స్టోర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ తన ఫ్యాషన్ ఫార్మట్ల కోసం ఈ-కామర్స్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆన్లైన్ గ్రోసరీ, ఎఫ్ఎంసీజీ, పండ్లు, కూరగాయల కోసం రిలయన్స్ స్మార్ట్ను కూడా నడుపుతోంది. అయితే ఇది కేవలం ముంబై, పుణే, బెంగళూరులకే విస్తరించి ఉంది. రిలయన్స్ స్మార్ట్ను మరింత విస్తరించడానికి కంపెనీ ప్లాన్ చేసింది. -
టాప్–250 గ్లోబల్ రిటైలర్ల జాబితాలో రిలయన్స్ రిటైల్
ముంబై: ఈ ఏడాది టాప్–250 గ్లోబల్ రిటైలర్ల జాబితాలో రిలయన్స్ రిటైల్ స్థానం పొందింది. 189వ స్థానంలో నిలిచింది. ‘రిలయన్స్ తన ఎఫ్ఎంసీజీ విభాగం నుంచి బలమైన అమ్మకాలు రాబట్టింది. 2015–16లో కంపెనీ రిటైల్ ఆదాయంలో 59.2 శాతం మేర వృద్ధి కనిపించింది’ అని డెలాయిట్ గ్లోబల్ తన ‘గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్’ నివేదికలో పేర్కొంది. టాప్–250 గ్లోబల్ రిటైలర్లు సంయుక్తంగా 2016 ఆర్థిక సంవత్సరంలో 4.4 ట్రిలియన్ డాలర్ల ఆదాయం పొందాయని తెలిపింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అనుబంధ సంస్థనే రిలయన్స్ రిటైల్. ఆదాయం పరంగా చూస్తే భారత్‌లో ఇదే అతిపెద్ద రిటైలర్. -
అమెజాన్‌కు రిలయన్స్ రిటైల్ పోటీ
హైదరాబాద్: ఆన్లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు రిలయన్స్ రిటైల్ గట్టి పోటీ ఇవ్వగలదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. రిలయన్స్ టెలికం వ్యాపార విభాగం జియో మార్కెట్లోకి దూసుకెడుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆన్లైన్ షాపింగ్ సంస్థలకు రిలయన్స్ రిటైల్ సవాలు విసరగలదని ఆయన చెప్పారు. ‘ఈ–కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు రిలయన్స్ రిటైల్ రూపంలో పెద్ద ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే రిలయన్స్ జియో.. దేశవ్యాప్తంగా విస్తరించింది. చిన్న, చిన్న రిటైల్ స్టోర్స్‌తో కూడా రిలయన్స్ రిటైల్ అనుసంధానం కాగలదు. సరఫరా చేయడం ద్వారా వ్యాపారాన్ని వేగంగా మెరుగుపర్చుకోగలదు‘ అని పాయ్ వివరించారు. దీంతో రిటైల్‌లో ఈ మూడు సంస్థలే ఉండొచ్చని ఆయన చెప్పారు. వీటిలో మిగతా రెండింటితో పోలిస్తే ఆఫ్‌లైన్ స్టోర్స్‌తో పాటు మరింతగా పెట్టుబడులు పెట్టే సత్తా కూడా ఉండటం రిలయన్స్ రిటైల్‌కి ప్రయోజనం చేకూర్చగలదన్నారు. మరోవైపు దేశ ఆర్థిక వృద్ధి మెరుగుపడే కొద్దీ స్టార్టప్ సంస్థలకు కూడా వచ్చే ఏడాది మంచి రోజులు రాగలవని పాయ్ చెప్పారు. ఆరిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అగ్రి–టెక్, మెడికల్ టెక్నాలజీ మొదలైన విభాగాలకు మంచి డిమాండ్ ఉండగలదన్నారు. అటు గతంలో ఎలాంటి స్టార్టప్లోకైనా నిధులు వచ్చేసినప్పటికీ.. ప్రస్తుతం సరైన బిజినెస్ ఐడియా ఉంటే తప్ప స్టార్టప్‌లలోకి నిధులు రావడం కష్టంగా మారిందని ఇన్ఫోసిస్ మరో మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్ చెప్పారు. ప్రస్తుతం బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) కంపెనీల్లో ఎక్కువగా నిధులు వస్తున్నాయన్నారు. ఈ–కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం లాంటి పెద్ద సంస్థలకు పెట్టుబడులు రాగలవని, చిన్న కంపెనీలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనాల్సి రావొచ్చని బపాలకృష్ణన్ చెప్పారు. -
ఆ మార్కెట్లోనూ జియోదే హవా..
సాక్షి, న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఓ వైపు టెల్కోలకు చుక్కులు చూపిస్తుండగా... ఇటు అదే సంస్థకు చెందిన వైఫై రూటర్ జియోఫై కూడా మార్కెట్లో దూసుకుపోతుంది. డేటా కార్డు మార్కెట్లో జియోఫై 91 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో జియోఫై 91 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నట్టు సైబర్ మీడియా రీసెర్చ్( సీఎంఆర్) వెల్లడించింది. రెండో స్థానంలో ఉన్న హువాయ్ కేవలం 3 శాతం మార్కెట్ షేరు మాత్రమే కలిగిఉందని సీఎంఆర్ చెప్పింది. జనవరి-మార్చి క్వార్టర్లో డేటా కార్డుల షిప్మెంట్లు 3.4 మిలియన్ల నుంచి 4 మిలియన్లు ఎగిసి 16 శాతం వృద్ధిని నమోదుచేశాయని సైబర్ మీడియా రీసెర్చ్ తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది డేటా కార్డు మార్కెట్ ఏడింతలు విస్తరించినట్టు కూడా పేర్కొంది. ఈ క్రమంలో జియో అందిస్తున్న ఉచిత డేటా సర్వీసులు, మి-ఫై డేటా కార్డులు లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న మొబైల్ హాట్స్పాట్లు దీని పాపులారిటీని పెంచుతున్నాయని సీఎంఆర్ తెలిపింది. జియో ఫై రూటర్ కొనుగోలు చేసిన కొత్త కస్టమర్లకు ఇటీవలే రూ.1,999 విలువైన డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌ను రిలయన్స్ జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి-మార్చి క్వార్టర్లో కూడా దీని షేరు 90 శాతముంది. జియో ఫై డివైజ్‌లు ఇటు హోమ్ రూటర్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లో జియో డేటా సర్వీసులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిసింది. -
ప్రత్యర్థుల గట్టిపోటీ: రిలయన్స్ ఢమాల్
న్యూఢిల్లీ : రిలయన్స్ ... ఇటు జియోతో టెలికాం మార్కెట్ లో సంచలనాలు సృష్టించడమే కాకుండా.. ఎల్వైఎఫ్ డివైజ్ లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోనూ టాప్-5లో ఒకటిగా తన చక్రం తిప్పింది. సూపర్ హిట్ తో లాంచ్ అయిన రిలయన్స్ రిటైల్ ఎల్వైఎఫ్ డివైజ్ ల ప్రస్తుత పరిస్థితి దారుణంగా మారుతోంది. గతేడాది ఎంత వేగంగా అయితే దూసుకెళ్లాయో అంతే వేగంతో ఈ ఏడాది తమ మార్కెట్ షేరును కోల్పోయాయి. 4జీ ఫోన్ల ప్రత్యర్థులు చైనీస్ కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక ప్రస్తుతం రిలయన్స్ మార్కెట్ షేరును కోల్పోతున్నట్టు తెలుస్తోంది. గతేడాది ఇదేకాలంలో 7 శాతం ఎక్కువ నమోదైన రిలయన్స్ ఎల్వైఎఫ్ మార్కెట్ షేరు, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్ లో 3 శాతం కిందకి పడిపోయినట్టు అనాలిస్టులు అంచనావేస్తున్నారు. ఈ ఫోన్ల సరుకు రవాణా కూడా తగ్గిపోయినట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్, సైబర్ మీడియా రీసెర్చ్ చెబుతోంది. రిలయన్స్ జియో తిరుగులేకుండా దూసుకెళ్తున్న క్రమంలో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ-ఎనాబుల్ స్మార్ట్ ఫోన్లను ఎల్వైఎఫ్ బ్రాండులో ఈ కంపెనీ ప్రవేశపెట్టింది. జియో ప్రీవ్యూ ఆఫర్ కూడా తొలుత వీటికే ఆఫర్ చేయడంతో, భారీగా డిమాండ్ ఏర్పడి, భారీ ఎత్తున్న సరుకు రవాణా జరిగినట్టు తెలిసింది. 2016లో రిలయన్స్ జియో ప్రీవ్యూ ఆఫర్ కేవలం ఎల్వైఎఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఇచ్చారని, కానీ ప్రస్తుతం జియో అన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండులకు భాగస్వామిగా వ్యవహరిస్తుందని కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ అనాలిస్టు శోభిత్ శ్రీవాత్సవ చెప్పారు. అంతేకాక ప్రస్తుతం అందరూ ప్లేయర్స్ 4జీ ఫోన్లను ఆఫర్ చేయనప్పటికీ, వారి పోర్టుఫోలియోలో ఇది ఒకభాగమైందని ఐడీసీ ఇండియా సీనియర్ అనాలిస్టు నవ్కేందర్ సింగ్ పేర్కొన్నారు. అయితే పడిపోతున్న తమ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేరుపై స్పందించడానికి రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలు నిరాకరించాయి. రూ.2,999 నుంచి రూ.30,000 ధరల మధ్యలో రిలయన్స్ 4జీ డివైజ్ లను గతేడాది తీసుకొచ్చింది. 2016లో 7.6 మిలియన్ స్మార్ట్ ఫోన్ల సరుకు రవాణా జరిగింది. ప్రస్తుతం రూ.999 నుంచి రూ.1,500 మధ్యలో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసేందుకు జియో సన్నాహాలు చేస్తోంది. -
రిలయన్స్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్
రిలయన్స్ రిటైల్ ఎల్వైఎఫ్ బ్రాండులో మరో కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎల్వైఎఫ్ విండ్ 7ఎస్ పేరుతో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.5,699గా కంపెనీ నిర్ణయించింది. విండ్ 7 విజయంతో విండ్ 7ఎస్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు... 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1.3గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2250 ఎంఏహెచ్ బ్యాటరీ 9 గంటల 4జీ టాక్‌టైమ్, 5 గంటల వీడియో ప్లే బ్యాక్, 32 గంటల నాన్-స్టాప్ మ్యూజిక్‌ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది. -
రిలయన్స్ రిటైల్ నుంచి ఎర్త్2 స్మార్ట్‌ఫోన్
ముంబై: రిలయన్స్ రిటైల్ తాజాగా లైఫ్ బ్రాండ్ కింద రెండో స్మార్ట్‌ఫోన్.. ఎర్త్2ను సోమవారం ఆవిష్కరించింది. దీని ధర రూ.19,999. 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ముందు.. వెనుక 13 ఎంపీ కెమెరాలు ఇందులోని ప్రత్యేకతలు. వాయిస్ కమాండ్స్‌పై పనిచేసే కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సర్, రెటీనా ఆధారిత అన్లాకింగ్ టెక్నాలజీ మొదలైనవి ఈ ఫోన్లోని అదనపు ఆకర్షణలని రిలయన్స్ రిటైల్ ప్రెసిడెంట్ (డివెజైస్ వభాగం) సునీల్ దత్ తెలిపారు. ఈ సందర్భంగా ఎర్త్2 టీవీ ప్రకటనను కూడా ఆవిష్కరించారు. -
ఆఫ్‌లైన్‌లోకి యూ టెలీవెంచర్స్!
రిలయన్స్ రిటైల్‌తో జట్టు న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యూ టెలీవెంచర్స్ కూడా షావోమి, మోటరోలా దారిలోనే నడుస్తోంది. యూ టెలీవెంచర్స్ తన యూ బ్రాండ్ మొబైల్ హ్యాండ్సెట్లను ఆఫ్‌లైన్ మార్కెట్లో విక్రయించడానికి సన్నద్ధమయ్యింది. ఆఫ్‌లైన్ విక్రయాల కోసం రిలయన్స్ రిటైల్‌తో జతకడుతున్నట్లు యూ టెలీవెంచర్స్ ప్రకటించింది. ఈ భాగస్వామ్యం వల్ల యూఫోరియా, యురేకా ప్లస్, యూనిక్యూ వంటి హ్యాండ్సెట్లు దేశవ్యాప్తంగా 30,000 రిటైల్ ఔట్లెట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులకు యూ బ్రాండ్ హ్యాండ్సెట్లను మరింత చేరువచేసే లక్ష్యంతోనే తాము ఈ చర్య తీసుకున్నామని యూ టెలీవెంచర్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. రిలయన్స్ రిటైల్ ఇటీవలే 1.5 లక్షల రిటైల్ ఔట్లెట్స్, 1,200 డిస్ట్రిబ్యూటర్ల ఏర్పాటు ద్వారా తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంది.