-
బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?
తదుపరి పార్లమెంటు బడ్జెట్ (Budget) సెషన్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (new income tax bill) ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభ తరం, అర్థమయ్యేలా చేస్తుందని, అలాగే పేజీల సంఖ్యను 60% తగ్గిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.‘ఇది కొత్త చట్టం. ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ముసాయి దా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీ లిస్తోంది. దీనిని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం–1961ని ఆరు నెల ల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.బడ్జెట్ సెషన్ జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. మొదటి అర్ధభాగం (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.పార్లమెంటు మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్ష కోసం సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన మేరకు సమీక్షను పర్యవేక్షించడానికి, చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అంతర్గత కమిటీని సీబీడీటీ ఏర్పాటు చేసింది. అలాగే చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్‌కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. -
పెళ్లెప్పుడవుతుంది బాబూ!
కొడుకంటే మమకారం.. వంశోద్ధారకుడు కావాలన్న ఆశయం.. ఫలితం సమాజంలో తగ్గుతున్న అమ్మాయిల జననం.. దీనికితోడు గొంతెమ్మ కోర్కెలు.. సాఫ్ట్వేర్లు.. మన కనుసైగల్లో మసలుకునే వారు కావాలన్న ఆశలు.. కూతురు, అల్లుడు ఒంటరిగా ఉండాలన్న వధువు తల్లిదండ్రుల షరతులు.. వెరసి పలువురు యువకులు పెళ్లికానీ ప్రసాద్‌లుగా మారుతున్నారు.పలమనేరు: అబ్బాయికి ఆస్తి పాస్తులు.. మంచి ఉద్యోగం.. అందం అన్నీ ఉన్నాయి. వివాహం చేయడానికి వందలాది సంబంధాలు చూస్తున్నారు..అయినా అమ్మాయిలు దొరకడం లేదు. దీంతో 30 ఏ ళ్లు దాటిపోతోందని, అబ్బాయి పెళ్లి జరుగుతుందోలేదోనని అతడి తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నారు. గతంలో అమ్మాయి తరఫువారే వరసైన వారికి పెళ్లి చేయించేలా పెద్దలు మాటిచ్చేవారు. ఇక బావా, మరదళ్లు అయితే చెప్పాల్సిన అవసరం ఉండేదికాదు. కట్నకానుకలపై పెద్దగా పట్టింపులుండేవి కాదు. కానీ రెండు దశాబ్ధాలుగా వ్యవస్థ మారిపోయింది. ప్రస్తుతం పెళ్లి సంబంధాలు కుదరడం ఆషామాషీ కాదు. అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏం ఉద్యోగం, ఎంత జీతం, ఆస్తిపాస్తులు, సెల్ఫ్ అకౌంట్లో సేవింగ్స్ ఎంత, సొంతంగా సైట్ లేదా సొంత ఇ ల్లు, కారుందా? అనే మాట వినిపిస్తోంది. వివాహానంతరం వారిద్దరే వేరుగా ఉండాలనే మాట అమ్మాయి, వారి తల్లిదండ్రు ల్లో వినిపిస్తోంది. దీంతోపాటు జాతకాలు, అబ్బాయిల వ్యక్తిగత విషయాలపై వే గుల విచారణ ఎక్కువైంది. వీరు అబ్బాయి ఫేస్బుక్, ఇన్స్ట్రా, ఎక్స్‌తోపాటు జీమెయిల్లో సెర్చింగ్ ఆధారంగా గర్ల్ ఫ్రెండ్స్, వారి అలవాట్లను కనుక్కుని పెళ్లి చేసుకోవాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నా రు. దీంతో అబ్బాయిలకు అన్నీ ఉండీ మూడు పదులు దాటినా అమ్మాయిలు దొరక్క వారు పడుతున్న కష్టం కంటే వారి తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతంగా మారింది. 5 వేల మంది పెళ్లిళ్ల పేరయ్యలు మ్యాట్రిమోనియల్ సైట్లు, ఆయా కులాలకు చెందిన ప్రత్యేక సైట్లుతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5వేల మందికిపైగా పెళ్లిళ్ల పేరయ్య లున్నారు. వీరందరూ తమ వద్ద వేలాది మంది అబ్బాయిలు, అమ్మాయిల ఫ్రొఫైళ్లు పెట్టుకుని ఇరువర్గాలకు చూపుతున్నా పెళ్లిళ్లు మాత్రం సెట్ కావడం లేదు.కర్షకుడా..? అయితే వద్దులే! సేద్యం చేసుకునే వారికి ఆడబిడ్డ దొరకడం చాలా కష్టంగా మారింది. మరికొన్ని వృత్తి పనులు చేసేవారికి సైతం ఈ సమస్య తప్పడం లేదు. కొన్ని ఉన్నత కులాల్లోనూ అమ్మాయిల దొరకడం కష్టంగా మారింది. ఇంకొందరికి జాతకాలు సెట్కాలేదనే కారణం కనిపిస్తోంది. గతంలో అమ్మాయిలు, అబ్బాయిల సగటు సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు లింగవివక్ష కారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిల సగటు తగ్గుతోంది. నిఘా వర్గాలతో కొన్ని సంబంధాలు విఫలం తమ పిల్లను పలానా వాళ్లు అడిగారు, వారి అబ్బాయి మంచోడేనా కనుక్కోవాలని పెళ్లి కుమార్తె తరఫువారు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. దీంతో వారు ఓకే అంటే పర్వాలేదు గానీ.. అబ్బాయికి ఎదో అలవాట్లున్నాయని, లేదా చెప్పిన జీతం అంత లేదని, అసలు సాఫ్ట్వేర్ కాదని, ఏదో విషయంలో తప్పులు చెప్పారని సమాచారం ఇస్తే ఇక పెళ్లి కథ కంచికి చేరుతోంది. మూడు పదులు దాటిన పెళ్లి కాలే!గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మా ట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్‌కు వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో ఆ పెళ్లికి వచ్చిన వారిలో బంధువుల ఉన్నప్పటికీ మాట మంచీ లేకుండా పోతోంది.చదవండి: ‘లైవ్’ కోడి స్పెషల్!పెళ్లిళ్లు సెట్ చేయడం చాలా కష్టం గతంలో ఎన్నో పెళ్లిళ్లు సెట్ చేశాం. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఎన్నో షరతులు పెడుతున్నారు. గతంలో అబ్బాయి, అమ్మాయి ఫొటోలు చూసి పెళ్లికి ఒప్పుకొనేవారు. ఇప్పుడలా కాదు ఇరువర్గాలు మొత్తం విచారించుకుని, నచ్చితేనే ఓకే అంటున్నారు. నేడు పెళ్లి కుమా ర్తె డిమాండ్లను తీర్చడం ఆషామాషీ కాదు. –త్యాగరాజులు, ఎస్ఎల్వీ మ్యారేజి లింక్స్ నిర్వాహకులు, పలమనేరుఅమ్మాయిల సంఖ్య తక్కువ అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. వారికి కావాల్సిన మేరకు అ మ్మాయిలు దొరకడం లేదు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఒ ప్పుకుంటే పెళ్లి ఠక్కున జరిగేవి. ఇప్పుడలాకాదు అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ఎన్నో డిమాండ్లు పెడుతోంది. అంతా సాఫ్ట్వేర్లే కావాలంటున్నారు. సేద్యం చేసుకునే వాడిని పెళ్లి చేసుకొనేవాళ్లెవరో అర్థం కాలేదు. గొంతెమ్మ కొర్కెలతో ముదిరిపోతున్నారు. – లక్ష్మీపతినాయుడు, మ్యారేజి బ్రోకర్,బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం -
రంజీల్లో ఆడనున్న రోహిత్, పంత్.. కోహ్లి, రాహుల్ దూరం
టీమిండియా ఆటగాళ్లంతా దేశవాలీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండీషన్ పెట్టిన నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ బాట పట్టారు. భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (పంజాబ్), స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (ముంబై), రిషబ్ పంత్ (ఢిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యారు. ముంబై రంజీ జట్టు తరఫున తాను తర్వాతి మ్యాచ్ బరిలోకి దిగుతానని రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. ఈ నెల 23నుంచి ముంబైలోనే జమ్ము కశ్మీర్‌తో జరిగే పోరులో అతను ఆడతాడు. గత 6–7 ఏళ్లలో తాము అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉండటం వల్ల దేశవాళీ మ్యాచ్‌లు ఆడలేకపోయామని, రంజీ ట్రోఫీ స్థాయిని తక్కువ చేయలేమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ పదేళ్ల క్రితం తన చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. 2015 సీజన్లో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 113 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేశాడు. గడిచిన 17 ఏళ్లలో రంజీ మ్యాచ్ ఆడనున్న తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు.కోహ్లి, రాహుల్ దూరంమరో వైపు మెడ నొప్పితో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... తాను ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడలేనని స్పష్టం చేయగా... మోచేతి గాయంతో కేఎల్ రాహుల్ (కర్ణాటక) కూడా రంజీ పోరుకు దూరమయ్యాడు.ఢిల్లీ జట్టులో పంత్రంజీ ట్రోఫీ తదుపరి లీగ్ మ్యాచ్‌లు జనవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ లెగ్ మ్యాచ్‌ల కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ 21 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషబ్ పంత్ పేరుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సౌరాష్ట్రను ఢీకొంటుంది. ఢిల్లీ జట్టుకు ఆయుశ్ బదోని కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.ఢిల్లీ రంజీ జట్టు: ఆయుశ్ బదోని (కెప్టెన్), సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), జాంటీ సిద్ధూ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, హర్ష్ త్యాగి, సిద్ధాంత్ శర్మ, శివం శర్మ, ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్‌కీపర్), వైభవ్ కంద్పాల్, మయాంక్ గుస్సేన్ , గగన్ వాట్స్, ఆయుష్ దోసెజా, రౌనక్ వాఘేలా, సుమిత్ మాథుర్, రాహుల్ గహ్లోత్, జితేష్ సింగ్. -
పారా గ్లైడింగ్‌లో ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
పనాజీ: పారాగ్లైడింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అయితే పారాగ్లైడింగ్ విషయంలో అప్పుడప్పడు ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి పర్యాటకులు ప్రమాదాలు బారిన పడుతుంటారు.తాజాగా ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పారాగ్లైడింగ్(Paragliding) చేస్తున్న మహిళా పర్యాటకురాలితో పాటు కోచ్ మృతిచెందాడు. ఈ ప్రమాద వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కేరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.ఈ దుర్ఘటనలో పూణే నివాసి శివానీ డేబుల్ ఆమె శిక్షకుడు సుమన్ నేపాలీ (26) మృతిచెందారని, డేబుల్ పారాగ్లైడింగ్ కోసం బుకింగ్ చేసుకున్న 'అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ' చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. పారాగ్లైడర్ టేకాఫ్ అయిన వెంటనే అది లోయలో పడిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఉదంతంలో కంపెనీ యజమాని శేఖర్ రైజాదాపై మాండ్రేమ్ పోలీస్ స్టేషన్(Mandrem Police Station)లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారుఈ కేసులో కంపెనీతో పాటు దాని యజమానిపై నేరపూరిత హత్య కేసు నమోదు చేసినట్లు గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారి పరేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు శేఖర్ రైజాదా ఉద్దేశపూర్వకంగా పైలట్‌కు లైసెన్స్ లేకుండా పారాగ్లైడింగ్ నిర్వహించడానికి అనుమతించాడు. ఫలితంగా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం -
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలబడింది. దీంతో దిల్ రాజు (Dil Raju) కోసం చరణ్(Ram charan) ఒక కీలకనిర్ణయం తీసుకున్నారట. కొత్త ఏడాదిలో సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ విన్నర్‌గా వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రం నిలిచింది. సినిమా విడుదలైన రెండో రోజే సుమారు 250కి పైగా స్క్రీన్స్‌ను పెంచారు. తర్వాత బాలకృష్ణ (డాకు మహారాజ్) కూడా మంచి కలెక్షన్సే అందుకుంది. ఇప్పుడు ఎటొచ్చి కూడా రామ్ చరణ్- దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్‌కు కష్టాలు తప్పలేదు. ఫైనల్‌గా నిర్మాతకు ఎన్ని కోట్లు నష్టం అనేది తేలాల్సి ఉంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనుకున్నంత రిటర్న్ వచ్చేలా లేదని తేలిపోయింది.సుమారు పదేళ్ల క్రితం దిల్ రాజు బ్యానర్లో ఎవడు సినిమాలో రామ్ చరణ్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అనుకున్నంత సమయంలో పూర్తి కాలేదు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా పూర్తి అయ్యేసరికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. దీంతో బడ్జెట్ భారీగా పెరిగింది. అయినప్పటికీ ఖర్చు పెట్టే విషయంలో దిల్ రాజు ఎక్కడా కూడా తగ్గలేదు. సినిమాపై ఆయన పూర్తి నమ్మకంతోనే కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్ మరోలా అయింది. ఈ మూవీతో దిల్ రాజు ఏ మేరకు నష్టాలు భరించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. (ఇదీ చదవండి: జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి)ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా ఆయన నిర్మించారు కాబట్టి కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. అయితే, రామ్ చరణ్ కూడా దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఆయన బ్యానర్లోనే మరో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మంచి కథతో గేమ్ ఛేంజర్ నష్టాన్ని పూరించాలని చరణ్ ఉన్నారట. కొద్దిరోజుల తర్వాత అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో మొదట డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా ఉంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా లైన్లో ఉంది. ఈ చిత్రాల తర్వాత తప్పకుండా దిల్ రాజుతో మూవీ ఉంటుందని సమాచారం. -
మాములు వెయిట్ లాస్ జర్నీ కాదు..! కనీసం తండ్రి శవాన్ని..!
బరువు తగ్గడం అతి పెద్ద టాస్క్‌లా ఉంది. ఎందుకంటే డెస్క్ జాబ్‌లు కావడంతో నూటికి తొంభైతొమ్మిది మంది అధిక బరువు సమస్యతో అల్లాడిపోతున్నారు. తినేది ఏం లేకపోయిన అధిక బరువు భారంగా మారి ఇబ్బంది పెడుతోంది. అయితే దీన్ని మంచి ఆహారపు అలవాట్లతో సరైన విధంగా చెక్‌పెట్టొచ్చని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఆ విధంగా చేసి కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి ఓ ఫిట్నెస్ ఔత్సాహికుడు చేరిపోయాడు. అతడి వెయిట్ లాస్ జర్నీ చూస్తే నోటమాటరాదు. ఇంత అధిక బరువుని ఎలా తగ్గించుకున్నాడ్రా బాబు అని ఆశ్చర్యపోతారు. మరి అదెలాగో చూద్దామా..ఇన్స్టాగ్రామ్ యూజర్ అజార్ హసన్ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీతో నెట్టింట వైరల్‌గా మారాడు. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ ఎంటీవీ రోడిస్ సీజన్20లో కనిపించిన ఈ ఫిట్నెస్ ఔత్సాహికుడు తన వెయిట్ లాస్ జర్నీ గురించి వీడియో రూపంలో షేర్ చేయండంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడిస్టోరీ సోషల్ మీడియాలో లక్షలాది మందికి స్ఫూర్తిని రగిలించింది. ఏకంగా అన్ని కిలోలు బరువుని తగ్గించుకోవాలంటే ఎంతో నిబద్ధత అవరం అంటూ అతడిపై ప్రశంసలతో మంచెత్తారు నెటిజన్లు. ఆ వీడియోలో హసన్ తాను ఒకప్పుడు 145 కిలోల అధిక బరువుతో ఎలా ఉండేవాడో చూపించారు. తన శరీర కొవ్వు శాతం సుమారు 55% ఉండేదని చెప్పారు. తన వెయిట్‌లాస్ జర్నీతో దాన్ని దాదాపు 9% వరకు తగ్గించుకోగలిగానని అన్నారు. ఇప్పుడు 75 కిలోలు బరువు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తన బరువు తగ్గించే ఈ జర్నీలో తండ్రే తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పుకొచ్చారు. తన తండ్రితో ఎలాగైన బరువు తగ్గుతానని ఛాలెంజ్ చేసినట్లు చెప్పారు. అలా తాను ఏడు నెలల్లో మొత్తం కొవ్వుని కోల్పోయి..దాదాపు 55 కిలోల వరకు బరువు తగ్గినట్లు తెలిపారు. అయితే తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీని చూడకమునుపే తండ్రి మరణించినట్లు వెల్లడించారు. అంతేగాదు తన తండ్రి శవాన్ని ఖననం చేసే నిమిత్తం సమాధిలోకి దించలేకపోయినట్లు వివరించారు. అప్పుడే తనకు ఈ అధిక బరువుతో చాలా ఇబ్బందులు తప్పవని తెలిసిందన్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతలా తాను బరువు తగ్గి స్లిమ్‌గా మారినట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Azhar hassan (@fitflashh) (చదవండి: నాజూకు నడుము కోసం ఏకంగా పక్కటెముకలనే..!) -
‘చాంపియన్స్’ పోరుకు సిద్ధం
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు మరో ఐసీసీ వన్డే సమరానికి సన్నద్ధమైంది. వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన టీమిండియాలోని ప్రధాన ఆటగాళ్లంతా ఇప్పుడు ఈ పోరులోనూ జట్టులో భాగం కానున్నారు. స్వల్ప మార్పులు మినహా ఎలాంటి అనూహ్య, సంచలనాలు లేకుండా చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఎంపిక జరిగింది. ప్రధాన పేసర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కాస్త సందేహాలు ఉన్నా...అతడిని టీమ్‌లోకి తీసుకోగా, వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లతో చెలరేగిన షమీ కూడా మరో ఐసీసీ పోరుకు రెడీ అంటున్నాడు. నలుగురు ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకోవడంతో హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని కోల్పోవాల్సి రాగా... ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న జైస్వాల్ తొలిసారి వన్డే టీమ్‌లోకి వచ్చాడు. ఓవరాల్‌గా ఈ 15 మంది సభ్యుల బృందానికి టైటిల్ సాధించే సత్తా ఉందని సెలక్షన్ కమిటీ నమ్ముతోంది. ముంబై: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దానికి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల్లో కూడా ఇదే జట్టు తలపడుతుంది. ఇటీవల ఆ్రస్టేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ కెపె్టన్సీపై చర్చ జరిగినా...2023 వన్డే వరల్డ్‌కప్‌లో జట్టును ఫైనల్ చేర్చిన అతని నాయకత్వంపై సెలక్టర్లు పూర్తి విశ్వాసం ఉంచారు. భారత జట్టు ‘సంధి దశ’లో ఉందని వినిపించినా...వన్డేల్లో దానికి ఇంకా సమయం ఉందని తాజా ఎంపికతో అర్థమైంది. వరల్డ్‌కప్‌లో రాణించిన ప్రధాన ఆటగాళ్లందరినీ ఎలాంటి సందేహాలు లేకుండా టీమ్‌లోకి తీసుకున్నారు. బహుశా ఈ టోర్నీ తర్వాత 2027 వరల్డ్ కప్ కోసం మార్పులు జరగవచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెపె్టన్‌గా నియమించారు. గత ఏడాది ఆగస్టులో శ్రీలంకతో సిరీస్ తర్వాత భారత్ మళ్లీ ఇప్పుడే వన్డేల్లో బరిలోకి దిగుతోంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో ఫిబ్రవరి 20, 23, మార్చి 2న వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో భారత్ తలపడుతుంది. పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించిన టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది. రెండు వన్డేలకు హర్షిత్... ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నా...ప్ర«దాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేశారు. అయితే ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల సమయానికి అతను పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. ఆసీస్ పర్యటనలో హర్షిత్ 2 టెస్టులు ఆడాడు. స్పోర్ట్స్ హెర్నియా గాయంతో కివీస్‌తో తొలి టెస్టు తర్వాత ఆటకు దూరమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా టీమ్‌లో స్థానం లభించింది. గాయంనుంచి కోలుకున్న తర్వాత అతను ఏ స్థాయిలోనూ మ్యాచ్ ఆడకపోయినా...జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేస్తుండటంతో ఫిట్‌నెస్‌పై స్పష్టత వచి్చంది. ఫిట్‌గా మారి ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు ఎంపికైన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీకి ఊహించిన విధంగానే వన్డే టీమ్‌లోనూ స్థానం దక్కింది. టీమిండియా తరఫున ఇప్పటికే టెస్టుల్లో చెలరేగి...టి20 ఫార్మాట్లోనూ పదునైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు తొలిసారి వన్డే టీమ్‌లో అవకాశం దక్కింది. వరల్డ్ కప్ తరహాలోనే వరుసగా రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్ టాప్–5లో ఉంటారు. నలుగురు ఆల్‌రౌండర్లు... సెలక్టర్లు ఒక ప్రధాన బౌలర్‌ను తగ్గించి మరీ ఆల్రౌండర్లపై దృష్టి పెట్టారు. హార్దిక్ పాండ్యా ఒక్కడే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా...ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్, సుందర్‌లకు స్థానం లభించింది. ఈ ముగ్గురూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే కాగా, పాండ్యాతో కలిపి భారత టాప్–6 రైట్ హ్యాండర్లే ఉన్నారు. జట్టులో ముగ్గురే ప్రధాన పేసర్లు ఉన్నారు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కే ప్రధమ ప్రాధాన్యత ఇచి్చనట్లుగా భావించవచ్చు. వన్డేల్లో ఎప్పుడూ రెగ్యులర్‌గా చోటు దక్కించుకోకపోయినా, పెద్దగా ప్రభావం చూపని రిషభ్ పంత్‌ను రెండో కీపర్‌గా ఎంపిక చేశారు. తాను ఆడిన చివరి వన్డేలో సెంచరీ సాధించినా సరే... సంజు సామ్సన్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. కేరళ అసోసియేషన్‌తో వివాదం కారణంగా విజయ్‌హజారే ట్రోఫీకి సామ్సన్ దూరం కావడం కూడా సెలక్షన్‌పై ప్రభావం చూపించి ఉండవచ్చు. ‘బోర్డు కార్యదర్శితో మాట్లాడాలి’ క్రికెటర్ల కోసం బీసీసీఐ కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల విషయంలో ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులను అనుమతించే విషయంపై మరికొంత సడలింపును వారు కోరుతున్నారు. ఇదే మాట మీడియా సమావేశంలో రోహిత్ నోటినుంచి వచి్చంది. ఇది నేరుగా రోహిత్ మీడియాతో చెప్పకపోయినా... అగార్కర్‌కు చెబుతుండటం అందరికీ వినిపించింది. ‘కొత్త నిబంధనలపై మరింత స్పష్టత కావాలి.ఈ సమావేశం తర్వాత నేను బోర్డు కార్యదర్శితో కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ నన్నే అడుగుతున్నారు’ అని అగార్కర్‌తో రోహిత్ అన్నాడు. మరో వైపు తనకు, హెడ్ కోచ్ గంభీర్‌కు మధ్య పరస్పర నమ్మకం ఉన్నాయని రోహిత్ స్పష్టం చేశాడు. మైదానంలోకి దిగడానికి ముందే తమ మధ్య వ్యూహాలకు సంబంధించిన చర్చ జరుగుతుందని...ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత అన్నీ తానే చూసుకుంటానని కెపె్టన్ వెల్లడించాడు. ఈ విషయంలో తమకు స్పష్టమైన విభజన రేఖ ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు. -
డిప్యూటీ సీఎంగా లోకేష్.. జనసేన స్ట్రాంగ్ కౌంటర్లు
వైఎస్సార్, సాక్షి: టీడీపీ జాతీయ కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రయత్నాలకు జనసేన మోకాలడ్డు వేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కూటమిలో చిచ్చు రగల్చింది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా లోకేష్‌ను డీ.సీఎం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ డిమాండ్‌కు జనసేన పార్టీ అంతే ధీటుగా.. ఘాటుగా కౌంటర్లిస్తోంది.టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి(R Srinivasulu Reddy) వాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై జననేత ఘాటుగా స్పందిస్తోంది. ఒకవేళ.. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తమ అధినేత పవన్‌ను సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుందని కొందరు జనసేన నేతలు శ్రీనివాసులుకు సూచిస్తున్నారు. పైగా ఆ బాధ్యతలను శ్రీనివాసులు రెడ్డినే తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. మరోవైపు.. బాబుకు వయసైపోయింది!నారా లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్(Nara Lokesh Babu)కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. అయితే.. లోకేష్‌ను డిప్యూటీ సీఎం(Deputy CM) చేయడం ద్వారా పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు చెక్ పెట్టొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు. ఈ క్రమంలోనే తమ పార్టీ కీలక నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు. తద్వారా వాళ్ల డిమాండ్‌ను చూపించి.. లోకేష్‌ను డీ.సీఎం. చైర్లో కూర్చోబెట్టడమే ఆయన ఆలోచనగా స్పష్టమవుతోంది. అదే జరిగితే తమ అధినేత పరిస్థితి ఏంటో? అనే ఆందోళనలో జనసేన ఉందిప్పుడు. ఈ క్రమంలోనే ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.ఇదీ చదవండి: ‘విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాకతప్పదు’ -
బౌండరీ దాటితే ఔటే!
కవిత, కుమార్‌లకు మూడేళ్ల కిందట వివాహమైంది. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారి వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. కవిత వస్త్రధారణ నుంచి ఆమె స్నేహితుల వరకు అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు కుమార్. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇది కవితకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు కుమార్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఏం చేయాలో అర్థంకాక కవిత కౌన్సెలింగ్‌కు వెళ్లింది. కాలంతో పాటు మారని మనుషులు..మన దేశంలో భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే సాగాలనే భావజాలంలోనే ఉంటున్నారు. కుమార్దీ అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కవిత తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్‌కు వెళ్లింది. ఆమె చెప్పినదాన్ని బట్టి వారికి ‘హెల్దీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని తెలిసింది. సరిహద్దులు అవసరం..భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలని, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలని అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్‌ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు. అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతి జంటకూ హెల్దీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. ⇒ ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. ⇒ ‘నువ్వలా చేస్తున్నావు’, ‘నువ్విలా అంటున్నావు’ అని కాకుండా.. ‘నేనిలా అనుకుంటున్నాను’, ‘నేనిలా ఫీలవుతున్నాను’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ⇒ ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. ⇒ సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతౌల్యం సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. ⇒సరిహద్దులను సెట్ చేయడం సవాలే. భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. ⇒హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి. వీటిని కవిత, కుమార్‌లకు మూడు సెషన్లలో వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్సైజ్లు చేయించారు. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటున్నారు. రకరకాల హద్దులు..శరీరానికి, గోప్యతకు సంబంధించినవి ఫిజికల్ బౌండరీస్. బహిరంగ స్థలాల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని భాగస్వామి గౌరవించాలి. మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది మీ టైమ్ బౌండరీస్పై ఆధారపడి ఉంటుంది. గడపాల్సిన సమయానికి పరిమితులు పెట్టడం, మీకోసం సమయం కేటాయించుకోవడం అందులో భాగం. భావాలు, భావోద్వేగాలకు సంబంధించినవి ఎమోషనల్ బౌండరీస్. ఇతరుల భావోద్వేగాలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఇందులో భాగం. ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి ఫైనాన్షియల్ బౌండరీస్. మీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ఇందులో భాగం.శృంగారంలోనూ సరిహద్దులుండాలి. అసౌకర్యంగా అనిపించే వాటికి నో చెప్పాలి. మానసిక శక్తి తగ్గించే చర్చలు నిరాకరించే హక్కును, నెగటివిటీ లేదా గ్యాస్‌లైటింగ్ నుంచి మీ మనస్సును కాపాడుకోవడమే మానసిక సరిహద్దు.మీ ఆన్లైన్ వ్యవహారాలు ఎలా ఉండాలో నిర్ణయించేది డిజిటల్ బౌండరీసే! -
ట్రంప్ అధ్యక్ష పట్టాభిషేకం.. ఈ విశేషాలు తెలుసా?
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టనున్నారు. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం(జనవరి 20వ తేదీ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలో జరగబోయే ఈ ఘట్టానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రపంచంలోని పలు దేశాధినేతలకు ఆహ్వానం వెళ్లింది.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రాజకీయ ప్రముఖులుచైనా తరపున అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బృందం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిఅర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా హాజరవుతున్నట్లు తెలిపారు ఇంగ్లండ్ మాజీ అధ్యక్షుడు నిగెల్ పాల్ ఫారేజ్, ఎరిక్ జెమ్మూర్ (ఫ్రాన్స్), మాజీ బ్రెజిలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోలు సైతం ఉన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారంలో వ్యాపార దిగ్గజాలు టెస్లా సీఈవో ఇలాన్ మస్క్అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ టిక్ టాక్ సీఈవో షౌ జి చెవ్ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రముఖుల డుమ్మాట్రంప్ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆహ్వానం అందలేదు. అయితే ప్రమాణ స్వీకారం తరువాత పుతిన్‌తో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గైర్హాజరు కానున్నారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్కు ఆహ్వానం వెళ్లిందా? అనేదానిపై స్పష్టత లేదు. మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా.. ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ముందస్తు సమాచారం ఇచ్చారు. అధ్యక్ష ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ సమయంలో మాజీ అధ్యక్షులు.. వాళ్ల వాళ్ల సతీమణులు హాజరుకావడం ఆనవాయితీ వస్తోంది. గడ్డకట్టే చలిలోనూ గడ్డకట్టే చలిలోనూ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజధాని వాషింగ్టన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అయితే మరికొన్ని గంటల్లో అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ట్రంప్ వాషింగ్టన్ చేరుకున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున మైనస్ 11 డిగ్రీల సెల్సీయస్ మేర ఉంటాయని వాతావరణ అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ట్రంప్ రోటుండా సముదాయం లోపల ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తొలిసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారంఅమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం రాజధాని వాషింగ్టన్ అందంగా ముస్తాబైంది. 8 ఏళ్ల కిందట ట్రంప్ తొలిసారిగా 2017లో అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017 నుంచి 2021 వరకు సేవలందించారు. అయితే 2020 ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ విజయం సాధించారు. దీంతో ట్రంప్ రెండో దఫా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. జనవరి 20, 2025న 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు ఆహ్వానం2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతు దారులు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో ట్రంప్ మద్దతు దారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా, ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేలా ఆహ్వానాలు పంపించినట్లు సమాచారం.కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లుట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్లో కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా తమ పనిని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో పడ్డారు.