-
కారుతో ఢీ కొట్టి.. మృతదేహంతో 18 కిలోమీటర్లు..
ఆత్మకూరు: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన యువకుడిని అలాగే 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అటుగా వెళుతున్న వాహనదారులు కారు పైభాగంలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డుపక్కన ఆపి ఉడాయించాడు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామి (35)కి ఆత్మకూరు మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న ఎర్రిస్వామి ఆదివారం ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి వద్దకు చేరుకోగా.. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి కారు పైభాగంపై పడి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహన చోదకులు కారు పైభాగంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించి.. కారు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, టాప్‌పై పడి ఉన్న మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఉడాయించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదుతో సింగ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఘటనాస్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్ ప్రకారం సీఎం జగన్‌పై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. క్లూస్ టీమ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏసీపీ స్థాయి అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. చదవండి: రక్తమోడినా సడలని సంకల్పం -
సీఎం జగన్‌పై హత్యాయత్నం!
‘సిద్ధం’ అంటూ నగారా మోగించి.. జన క్షేత్రంలో అడుగడుగునా నీరాజనాలు అందుకుంటూ బస్సు యాత్రను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోయారు. విజయవాడ నగరంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచీ కనీవినీ ఎరుగని అశేష జన స్పందనతో సాగిన యాత్రలో... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏ దారిలో వెళతారు? ఎక్కడెక్కడ ఆగుతారు? యాత్ర వెళ్లేటపుడు కరెంటు వైర్లు తగలకుండా కరెంటు తీసేస్తారు కనుక చీకటిగా ఉన్నపుడు ఎక్కడైతే బాగుంటుంది? అనే అంశాలన్నిటినీ అధ్యయనం చేసి... విజయవాడ సింగ్‌నగర్‌లో ఓ పాఠశాల కేంద్రంగా పక్కా ప్లాన్‌తో ఆయన్ను అంతమొందించడానికి ప్రయత్నం చేశారు. స్కూల్లో నక్కి ఉండి.. ఆయన బస్సుపై నుంచి అభివాదం చేస్తున్నపుడు... కరెంటు లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని... బస్సుపై ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో ఉన్న జగన్‌ను గురిచూసి పదునైన వస్తువుతో కొట్టారు. జగన్ కణతకు గురిపెట్టి సంధించిన ఆ వస్తువు గనుక ఆయనకు అదే ప్రాంతంలో తగిలి ఉంటే ఏమయ్యేదో అనేది ఊహించడానికే భయంవేసే పరిణామం. అదృష్టవశాత్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన పక్కకు తిరగటంతో... ఆ వస్తువు ఆయన కణతకు బదులు ఆయన ఎడమ కనుబొమపై తగిలింది. లోపలికంటా చర్మం చీలిపోయి బలమైన గాయం అయ్యింది. అంతేకాక... ఆయనకు గాయం చేశాక... అదే వస్తువు ఆయన పక్కనే నిల్చున్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా తగిలింది. ఆయన కన్ను వాచింది. వైఎస్ జగన్‌కు వస్తువు బలంగా తగలటంతో... ఆయన ఒక్కసారిగా విలవిలలాడుతూ పక్కకు ఒరిగారు. తరవాత తమాయించుకుని నిలబడి గాయాన్ని గట్టిగా చేత్తో అదిమి పట్టుకున్నారు. అలాగే చుట్టూ ఉన్న జనానికి అభివాదం చేస్తూ... సెక్యూరిటీ సిబ్బంది తోడురాగా బస్సులోపలికి వెళ్లారు. కనుబొమ వాచిపోవటంతో... గాయాన్ని శుభ్రం చేసి, రక్తాన్ని తుడిచి బస్సులో ఆయనకు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. కాసేపు ఆగిన తరవాత వైఎస్ జగన్ యథా ప్రకారం యాత్ర కొనసాగించారు. దాదాపుగా రాత్రి 8.10 సమయంలో ఈ దుర్ఘటన జరగ్గా... కాసేపు ఆగాక యాత్రను రాత్రి 10.39 వరకూ షెడ్యూలు ప్రకారం కొనసాగించాక... నైట్ హాల్టు ప్రాంతమైన కేసరపల్లికి చేరుకున్నారు సీఎం వైఎస్ జగన్. సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. బలమైన గాయం కావడంతో రక్తం కారింది. అయినప్పటికీ బాధను పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసి.. బస్సుపై నుంచి దిగి లోపలకి వెళ్లారు. డాక్టర్ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్ యధావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ముందస్తు కుట్ర, పక్కా ప్రణాళికతోనే.. సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. సీఎం జగన్‌ను హత్య చేయాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే సింగ్‌నగర్ డాబా కొట్ల సెంటర్లోని వివేకానంద స్కూల్ రెండో అంతస్తులో ఓ గదిలో నక్కాడు. తాము ఉన్న గది కిటీకి తలుపులను తెరిచే ఉంచాడు. రోడ్ షో అక్కడికి చేరుకోగానే సీఎం జగన్ లక్ష్యంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అత్యంత వేగంగా దూసుకొచ్చిన పదునైన వస్తువు సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ పైభాగాన తగలడంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఎడమ కన్ను వాచిపోయింది. ఎడమ కంటి కనుబొమ పైభాగాన బలమైన గాయం నుంచి రక్తం కారిపోతున్నా చలించక సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేసి బస్సుపై నుంచి కిందకు దిగి లోపలకి వెళ్లారు. ఎయిర్ గన్ వినియోగించారా.. సీఎం జగన్‌పై ఎయిర్ గన్ తో హత్యాయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సౌండ్ విన్నానని చెబుతుండటంతో సీఎంపై హత్యాయత్నానికి ఎయిర్ గన్నే వినియోగించి ఉండవచ్చని బలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యాప్రయత్నమేనన్నారు. చంద్రబాబు నాయుడే ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కొందరు క్యాటర్ బాల్‌ను వినియోగించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగాయి. ఈ సభలకు లక్షల సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. దీనికి సైతం రాష్ట్ర ప్రజలు హారతులు పడుతున్నారు. చిన్నా పెద్ద, యువత, మహిళలు అనే తేడా లేకుండా వెల్లువలా సీఎం జగన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీంతో ఈ ఆదరణను తట్టుకోలేక.. ముందస్తు కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిపైన హత్యాయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలంతోనే.. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రోద్బలంతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్సీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వీరిద్దరూ తమ మాటల ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నారని గుర్తు చేస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ నవరత్న పథకాలతోపాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. కులమతాలు, పార్టీలు, ప్రాంతాలకతీతంగా అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అందించారు. దీంతో మరోమారు సీఎం వైఎస్ జగన్‌కు అధికారం కట్టబెట్టాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. దీంతో ఒంటరిగా సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని టీడీపీ.. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుందని వైఎస్సార్సీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ టీడీపీకి ఆశాజనకమైన పరిస్థితులు కనిపించకపోవడం, కూటమి నేతలతో కలిసి నిర్వహించిన సభలు విఫలం కావడం, మరోవైపు ముఖ్యమంత్రి జగన్ సభలకు ప్రజలు లక్షల సంఖ్యలో పోటెత్తడం తట్టుకోలేకే ఇలా హత్యాయత్నాలకు చంద్రబాబు, లోకేశ్ పురమాయిస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భయోత్పాతంతో బస్సు యాత్ర ఆపాలనే.. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజలు హారతులు పడుతున్నారు. లక్షల్లో ప్రజలు ఆయన సభలకు హాజరవుతున్నారు. ఇదే చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జైత్రయాత్రలా సాగుతున్న బస్సు యాత్రను ఆపడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవడానికే చంద్రబాబు, లోకే‹Ùలు ఆపార్టీ శ్రేణులను సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసేందుకు పురిగొలిపారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భయోత్పాతం సృష్టించడం ద్వారా సీఎం జగన్ బస్సు యాత్రను ఆపేయడానికే ఈ దారుణం చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చలించని సీఎం... యథాతథంగా యాత్ర కొనసాగింపు తనపై హత్యాయత్నానికి తెగబడినప్పటికీ సీఎం జగన్ ఏమాత్రం వెరవలేదు. వాహనంలోకి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్న వెంటనే ఆయన మళ్లీ వాహనం పైభాగానికి చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రను కొనసాగించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు విజయవాడ సింగ్‌నగర్ డాబా కొట్ల జంక్షన్ నుంచి కృష్ణా హోటల్ సెంటర్, పైపుల రోడ్, ప్రకాశ్ నగర్, పాయకాపురం, కండ్రిగ, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి మీదుగా కేసరపల్లి వరకు అంటే 20 కి.మీ. వరకు యాత్రను కొనసాగించారు. శనివారం రాత్రి కేసరపల్లిలో ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే రాత్రి బస చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స.. సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్‌కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్రై్కబ్ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఇక సీఎం జగన్‌తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్‌కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు. నేడు యాత్రకు విరామం యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్ జగన్‌కు లోకల్ అనస్తీషియా ఇచ్చి... కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది. అది హత్యాయత్నమే: వెలంపల్లి వైఎస్ జగన్‌కు తగిలిన వస్తువు తనకూ తగలటంతో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కంటికి గాయమైంది. సంఘటన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇది ఖచ్చితంగా హత్యాయత్నమేనని, ఆ వస్తువు తాలూకు పదును, వేగం చూస్తే ఇదే అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్‌కు తగిలాక... పక్కనున్న తనకు అదే వస్తువు తగిలిందని, తనకూ గాయమైందంటేనే దాని వేగాన్ని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ముఖ్యమంత్రి జగన్‌కు అపూర్వమైన ఆదరణ లభిస్తోందని, దాన్ని తట్టుకోలేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే ఈ దారుణానికి పురమాయించి ఉంటాడని వ్యాఖ్యానించారు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదంటూ వంగవీటి రంగా హత్యను ఉదహరించారు. ఎన్ని కూటములు కట్టినా, ఎందరితో కలిసి వచ్చినా జగన్ ముందు తాను నిలవలేకపోతున్నానన్న అక్కసుతోనే బాబు ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారాయన. కాగా వైఎస్ జగన్‌కు తగిలిన వస్తువు చాలా పదునైనదని, అదేమిటనేది తేలాల్సి ఉందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. ఈ దిశగా తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నట్లు చెప్పారు. అది పదునైన రాయి, చెక్కిన గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్.. ఏదైనా కావచ్చునని వ్యాఖ్యానించారు. అయితే ఆ వస్తువు వైఎస్ జగన్‌కు తగిలే సమయంలో ‘టప్’ మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానని, అది రాయి కాకపోవచ్చునని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆయన ఆ సమయంలో వైఎస్ జగన్‌కు వెనకనే అడుగు దూరంలో ఉన్నారు. స్కూలు భవనానికి చేరుకున్న పోలీసు బృందాలు పూర్తిస్థాయి దర్యాప్తు మొదలుపెట్టాయి. ఆదివారం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించాం. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నాం. ప్రత్యేక బృందాలను నియమించాం. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తాం. –కాంతి రాణా టాటా, విజయవాడ పోలీస్ కమిషనర్ -
బెజవాడ సెంట్రల్లో కాల్కేయుడు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడలో బొండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. భూకబ్జాలు, దౌర్జన్యాలు, కాల్‌మనీ, సెక్స్ రాకెట్.. ఆయన చేయని దందా లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ► 2014–19 మధ్య బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా ఏకంగా ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించారు. నియోజకవర్గం మొత్తాన్ని కనుసైగతో శాసించారు. భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయారు. అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతి దందాకు వంతపాడింది. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని బొండా కబ్జా చేశారు. సెటిల్మెంట్లతోపాటు ప్రభుత్వంలో జరగాల్సిన పనులకు కూడా కప్పం వసూలు చేశారు. ప్రజల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ► కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో బొండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాల్‌మనీ కింగ్‌గా ఉమా పేరొందారు. ఎందరో బాధితులు బొండా కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ► సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠానికి చెందిన సీతారామ కల్యాణ మండప కబ్జాకు బొండా వర్గీయులు యతి్నంచారు. ► న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి బొండా భంగపడ్డారు. ► రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరు లోపలకు ఇళ్లు నిర్మించి విక్రయించారు. ► ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడి వ్యాయామశాలకు ధారాదత్తం చేశారు. ► అప్పటి 44వ డివిజన్ కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలనూ విక్రయించారు. ► విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన రూ.30 కోట్లు భూదందాలో కూడా మాగంటి బాబు కీలక పాత్రధారి. ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. ► కండ్రిక కాలనీలో జర్నలిస్టుల ఇళ్ల పేరిట ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1,720 గజాల స్థలాన్ని ఆక్రమించి, నిర్మాణాలు చేసేందుకు ప్రయతి్నంచారు. స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. ► పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతంలో మూడు ఎకరాల వరకూ ఉన్న కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటి కి ఇంటి పట్టాలను సృష్టించేందుకు తెగబడ్డారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. గీతాంజలి కేసులో బొండా అనుచరుడి అరెస్ట్ ఇటీవల తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఆత్మహత్య కేసులో బొండా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్టయ్యాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. అతడితో పాటు టీడీపీ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకులదీ అదే తీరు బొండా కుమారులు ఇద్దరూ దౌర్జన్యాలు చేయడంలో ఘనులే. బొండా కుమారుడు నిర్వహించిన కారు రేస్‌లో మనోరమ హోటల్లో పనిచేసే మేనేజర్ కుమారుడు మరణించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుక్క అడ్డురావడంతో కారు ప్రమాదం జరిగిందని కేసును తప్పుదారి పట్టించారు. తెనాలికి చెందిన రౌడీషిటర్ సుబ్బుతో బొండాకు సత్సంబంధాలున్నాయి. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ పట్టుబడి బొండా, మరికొందరి టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాడు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో పట్టపగలే సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసును తారుమారు చేశారు. దుర్గాపురంలోని ఓ అపార్ట్మెంటులో క్యాన్సర్ బాధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన ఫ్లాట్‌ను బొండా అనుచరులు కబ్జాకు యత్నించారు. ఆమె తన వైద్యం కోసం ఆ ఫ్లాట్ విక్రయానికి యత్నించగా జాలి లేకుండా బొండా అడ్డుకున్నారు. చివరకు వైద్యం అందక సాయిశ్రీ మరణించారు. బొండా ఉమాకు మాగంటి బాబు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని తప్పుడు పత్రాలతో రిజి ్రస్టేషన్ చేసుకున్న వారిలో బొండా ఉమా భార్య సుజాతతోపాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. బొండా ఉమా అక్రమ దందాలన్నింటిలో మాగంటి బాబు కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. అకృత్యాలెన్నున్నా కేసులు మూడే.. బొండా ఉమా మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2011 మార్చి1న సెక్షన్ 9, 9ఏఏ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బొండాపై కేసు నమోదైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నంబర్ 462/2006పై సెక్షన్ 143 కేసు ఉంది. విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 143 కింద కేసు ఉన్నట్టు బొండా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
దొరికాడు దొంగ
సాక్షి, అమరావతి: ‘స్కిల్’ స్కామ్... చంద్రబాబుకు ఎప్పటికీ వెంటాడే పీడకల...40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబును ఖైదీ నంబర్ 7691గా 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఊచలు లెక్కించేలా చేసింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం. యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ కేసులో సీఐడీ చంద్రబాబుతో పాటు 8 మందిని అరెస్ట్ చేసింది. చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షెల్ కంపెనీల ప్రతినిధులు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. చంద్రబాబు 17ఏ చట్టం కింద ఈ కేసు నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే తరహాలో షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు పొందిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి అదే తరహాలో స్కిల్‌స్కామ్‌కు పాల్పడి షెల్‌కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి నిధులు మళ్లించిన చంద్రబాబుపై ఈడీ కత్తి వేలాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని నిర్ధారిస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ కమామిషు ఇలా ఉంది... చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ♦ టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ♦ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ♦ పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై,అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. 370 కోట్ల నుంచి 3,300 కోట్ల రూపాయలకు పెంచేసి.. 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం తన బినామీ సంస్థ డిజైన్ టెక్‌ను రంగంలోకి దింపి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీకి డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలు తమ వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వనే లేదు. ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు... డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగాతరలించారు. ప్రతిదశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. ఫైళ్లు మాయం చేసిన కుంభకోణం గుట్టు రట్టు 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో నిర్వహించిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో సిట్ నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. చంద్రబాబుకు 17ఏ కింద రక్షణ లభించదన్న సుప్రీం కోర్టు స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. సెక్షన్ 17ఏను తనకు వర్తింపజేస్తూ తనపై స్కిల్ స్కామ్‌లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం 2017లోనే నమోదు చేసింది కాబట్టి 2018 నవంబరు నుంచి అమలులోకి సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. స్కిల్ స్కామ్ ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86కోట్లు.. చంద్రబాబుపైఈడీ కన్ను మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా అక్రమ నిధులు పొందితే అందుకు ఆ పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్‌కు కూడా ఇది వర్తిస్తుందని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు మళ్లించినట్టు సీఐడీ ఆధారాలతోసహా నిర్ధారించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీ హిల్స్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలు ఉన్నాయి. ఆ మూడు ఖాతాల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 జమ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయినోట్ల కట్ల రూపంలో తీసుకువచ్చి మరీ జమ చేశారు. ఆ నిధులు తమకు ఎలా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును 2016, నవంబరులో ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. భారీ డిపాజిట్లకు ఆదాయ మార్గాలు వెల్లడించాలని పేర్కొంది. కానీ ఆదాయ మార్గాలను వెల్లడించకుండానే టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86కోట్లు జమ చేయడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్కిల్‌స్కామ్‌లో చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీఎండీ–సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్కర్ తదితర కంపెనీల అధికారులు -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం చావు డ్రామా
పాములపాడు: నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారుక్‌బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్‌గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్‌బాషా తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన ఫారుక్‌బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. అతడు రైతులకు దాదాపు రూ.కోటి వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతోపాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారుక్‌బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారుక్‌బాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబ çసభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి.. కాగా.. చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైనట్టు అతడి భార్య స్వరూప ఈ నెల 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపించగా.. చొక్కా, ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తగానే గుర్తించింది. ఫారుక్‌బాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్‌దేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారుక్‌బాషా పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఎస్ఐ అశోక్‌ను వివరణ కోరగా.. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి : మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల బాగోతం బయటపెట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఆర్థిక ఉగ్రవాది రామోజీ అక్రమాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అని కనీసం బోర్డు కూడా పెట్టకుండా వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించారు. రామోజీ ఇంతటి ఆర్థిక అక్రమానికి కేంద్ర బిందువుగా మార్చుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అనే సంస్థ ఏర్పాటుకు, తన ఉన్నతికి సాయం చేసిన చేతినే ఆయన కాటేశారన్న వాస్తవం కూడా విస్మయపరుస్తోంది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. దీనిపై జీజే రెడ్డి వారసుల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆ సోదరులు ఇద్దరూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. సాయం చేసిన మిత్రుడిని ముంచేసిన రామోజీ కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావు 1960లలో నిరుద్యోగి. చిన్న ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను కలిసి ఏదైనా ఉద్యోగానికి సిఫార్సు చేయమని ప్రాథేయపడేవారు. ఇదే జిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లో్లవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీకి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1962లో ఇద్దరూ కలిసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. జీజే రెడ్డి తన స్వగ్రామం జొన్నలపాడులోని భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత జీజే రెడ్డి చెకొస్లో వేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని ఎన్నిసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. తుపాకితో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించారు. చిట్టచివరకు 2016 సెప్టెంబరు 29న రామోజీరావు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007 – 08 వార్షిక సంవత్సరం షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని కోరగా, అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోపెట్టారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు వారిపై ఆగ్రహంతో చిందులు తొక్కారు. తుపాకీ తీసి మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తారని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బతుకు జీవుడా అని బయటపడ్డారు. రామోజీ, శైలజపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీరావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. మరోవైపు ఇదే అంశంపై యూరి రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న రామోజీరావు, శైలజ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ షేర్లను తమ పేరిట బదిలీ చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను ఆదేశించాలని కోరుతున్నారు. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం కొనసాగుతోంది. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ, తమ షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. తమ తండ్రి వాటా షేర్లను అట్టిపెట్టుకోవాలనే నిర్ణయించుకున్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మారిస్తే చట్ట ప్రకారం షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. వాటన్నింటిపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన రామోజీ తాను అనుకున్నంతా చేశారు. జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తన పేరుతో ఒక్క షేరు కూడా లేకపోవడంతో విస్తుపోయారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. కంపెనీల చట్టం మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అక్రమంగా షేర్లు బదిలీ చేసేసుకున్నట్లు వెల్లడైంది. -
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
ఘోర రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి
అనంతపురం : వారు పేరుకు అన్నదమ్ములైనా స్నేహితుల్లా ఉండేవారు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అందులో ఒకరికి ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. పిల్లలు కలసిమెలసి ఉండడం చూసి తల్లిదండ్రులు నిత్యం ఎంతో ఆనందపడేవారు. అయితే, రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు పిల్లలిద్దరినీ మింగి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలి్చంది. మండలంలోని ఎంగిలి బండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్రవాహనాన్ని ఎదురుగా కారు ఢీకొనడంతో అన్నదమ్ములు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాచమల్లు రామసుబ్బారెడ్డి, ఉమామహేశ్వరమ్మ దంపతులకు రాచమల్లు ద్రశేఖర్‌రెడ్డి(26),శివానందరెడ్డి(24) సంతానం. చంద్రశేఖర్‌రెడ్డి తల్లిదండ్రులతో కలసి వ్యవసాయం చేస్తుండగా శివానందరెడ్డి గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఇటీవల సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగా, త్వరలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే బుధవారం గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో బాట సుంకులమ్మ జాతరకు శివానందరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వచ్చారు. జాతరలో భోజనం చేసుకొని ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎంగిలిబండ శివారులో లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఓ కారు అదుపుతప్పి నేరుగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న రంగనాథ, చంద్రశేఖర్, రేణుక, శాంతి స్వల్పగాయాలతో బయటపడ్డారు. బొలెరో వాహనంలో చంద్రశేఖర్‌రెడ్డి, శివానందరెడ్డిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలిని సీఐ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఎంత పనిచేశావు దేవుడా.. ప్రమాద విషయం తెలుసుకున్న రామసుబ్బారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరు పిల్లలు కలసిమెలసి తిరుగుతుంటే ఎంతో సంతోషం చేవాడిని, అంతలోనే ఇంత పెద్ద శిక్ష వేశావు కదా దేవుడా అంటూ రోదించారు. తల్లి ఉమామహేశ్వరమ్మకు కుమారులు మృతి చెందిన విషయం చెప్పలేదని వారి బంధువులు తెలిపారు. -
ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్‌ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. చిట్‌ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు 2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. అంతా నల్లధనం దందానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. ♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్‌దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్‌వేనని తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలను చావబాదిన పోలీసులు
కోనేరు సెంటర్: టీడీపీ నేత సమక్షంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదిన కృష్ణా జిల్లా బందరు రూరల్ పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. బందరు మండలం ఉల్లిపాలెంలో ఇటీవల జరిగిన ఓ గ్రామ దేవత సంబరంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చేరారు. దీనిపై పరస్పర ఫిర్యాదులు అందుకున్న బందరు రూరల్ ఎస్ఐ చాణక్య ఆస్పత్రి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు డిశ్చార్జ్ అయ్యాక వారిని మంగళవారం స్టేషన్‌కు పిలిపించారు. మరో ఏఎస్సై, కానిస్టేబుల్‌తో కలిసి సుల్తానగరంకు చెందిన ఓ టీడీపీ నేత సమక్షంలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో ఎస్ఐ కుళ్లబొడిచారు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్ది, కార్యకర్తల ముఖాలను గోడకు బలంగా నొక్కి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ఒకరికి చేయి విరిగిపోగా, మరొకరికి తలపై గాయమైంది. ఇంకో కార్యకర్త వీపంతా రక్తపుమరకలతో నిండిపోయింది. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు, తదితర నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసుల తీరును ఖండించారు. కేసు నమోదు చేశాక తమ కార్యకర్తలను కొట్టే అధికారం మీకెవరిచ్చారంటూ పేర్ని నాని నిలదీశారు. టీడీపీ నేత సమక్షంలో తమ కార్యకర్తలను ఏకపక్షంగా కొట్టిన ఎస్ఐతోపాటు బాధ్యులందరినీ విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ సుభానీ, సబ్ డివిజన్‌కు చెందిన సీఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా వచ్చారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్ని నానికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘటనపై డీఎస్పీ విచారణకు ఆదేశించారు. -
అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం..'డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే'
కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేం ఆదేశించలేం.. – సుప్రీం కోర్టు సాక్షి, అమరావతి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను అక్రమంగా డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావుకు సుప్రీంకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్ప డినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియ ర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా వసూలు చేసిన సొమ్ములను వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని, తాజాగా విచారణ చేపట్టి ఆర్నెళ్లలో ముగించాలని హైకోర్టుకు సూచించింది. స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని పేర్కొంది. డిపాజిట్లు వెనక్కి తీసుకోని వారి సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాధన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి, రామోజీరావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు తాజాగా మరోసారి విచారణకు వచ్చాయి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏపీ హైకోర్టు ఏర్పాటు కావడానికి ఒక రోజు ముందు అంటే 31.12.2018న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే మూడేళ్ల క్రితం హైకోర్టు తోసిపుచ్చిన క్వాష్ పిటిషన్‌కు, ఈ తాజా క్వాష్ పిటిషన్‌కు ఎలాంటి తేడా లేదన్నారు. కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ లేకున్నప్పటికీ మరోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. గతంలో హైకోర్టు తోసిపుచ్చిన అంశాన్ని దాచిపెట్టి ఈ పిటిషన్ వేశారని నివేదించారు. ఈ సమయంలో మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ జోక్యం చేసుకొంటూ.. సేకరించిన రూ.2,600 కోట్లను 1,247 మంది డిపాజిటర్లకు 30.6.2023 నాటికి తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సొమ్ము తీసుకున్న వారు కానీ, ప్రాసిక్యూషన్ స్టేట్ తెలంగాణ గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రూ.5.31 కోట్లు అన్ క్లెయిమ్డ్ మొత్తం మాత్రమే మిగిలి ఉందన్నారు. రూ.5 వేలు డిపాజిట్‌దారులు కోర్టుకొచ్చి పోరాడగలరా..? ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ... సొమ్మంతా ఇచ్చేశారా? లేదా? ఫిర్యాదు చేశారా లేదా? అనే విషయాలు సమస్య కాదు. తీర్పులో హైకోర్టు ఏం చెప్పిందన్నదే ఇక్కడ ముఖ్యం. మొత్తం డిపాజిటర్లు ఇంత మంది ఉన్నారు.. ఇంత మొత్తం సొమ్ము ఉంది.. ఇస్తానన్న వడ్డీ, డివిడెంట్‌తో కలిపి ఇంత మొత్తం అయింది. ఆ తర్వాత సొమ్ములు ఇచ్చేశారు అనే విషయాలు తీర్పులో ఎక్కడున్నాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో బయటకు రాలేని వ్యక్తుల సమస్యలు కూడా ఆలోచించాలన్నారు. రూ.5 వేలు డిపాజిట్ చేసిన వారు వేల రూపాయిలు ఖర్చు చేసి కోర్టుకు వచ్చి పోరాడగలరా? అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న డిపాజిటర్ల గురించి హైకోర్టు పబ్లిక్ నోటీసు ఎందుకు ఇవ్వలేదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ వాదన కూడా వినాలి కదా...! అనంతరం సింఘ్వీ తన వాదనలు కొనసాగిస్తూ.. ఫిర్యాదుదారు ఏపీ ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కృష్ణరాజు అని, ప్రాసిక్యూట్ స్టేట్ తెలంగాణ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. సుప్రీంకోర్టుకు రావడానికి ఏపీ ప్రభుత్వం 1,236 రోజులు ఆలస్యం చేసిందనడంతో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ డిపాజిటర్లు ఏపీలో కూడా ఉంటారు కదా? వారి వాదన ఆ రాష్ట్రం ద్వారానే కదా వినాలి? అని ప్రశ్నించారు. అయితే ఏపీ ప్రభుత్వం తొలుత రాలేదని సింఘ్వి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునిచ్చే సమయంలో నిర్దిష్ట విధానాన్ని అనుసరించలేదనే విషయాన్ని తాము ప్రశ్నిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లడం లేదని, అందరికీ అవకాశాలు తెరిచే ఉంచుతామన్నారు. హైకోర్టులో ప్రతివాదులందరూ వాదనలు వినిపించలేదని గుర్తు చేశారు. ఈ కేసును తిరిగి హైకోర్టుకు పంపుతామని తేల్చి చెప్పారు. మార్గదర్శిపై ఫిర్యాదులు లేవు... మార్గదర్శిపై ఇప్పటి వరకూ ఫిర్యాదులు లేవని, ఇప్పుడు వస్తాయని సింఘ్వి పేర్కొనగా.. సొమ్ములు మీవద్దే ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకొస్తారని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హైకోర్టుకు పంపడానికి ఏమీ లేదని, ఇక్కడే ఆదేశాలు ఇవ్వాలని సింఘ్వీ గట్టిగా కోరారు. ఈ సమయంలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ కొత్త పరిణామాలు ఏమీ లేకుండా ఒకసారి హైకోర్టు తోసిపుచ్చిన అంశాలతోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు ముందు వాదనలు జరిగిన సమయంలో తెలంగాణ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కరే హాజరయ్యారన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడగా ఆ సమయంలో కోర్టు మాత్రం ఒక్కటే ఉందన్నారు. ఉల్లంఘనలు బయటకు రాగానే ఆ సమయంలో కొన్నాళ్లు డిపాజిట్లు నిలుపుదల చేసి మళ్లీ రూ.2,600 కోట్లు వసూలు చేశారని నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని ఇదంతా ప్రస్తుతం అనవసరమన్నారు. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మీ తరఫున ముగ్గురు దిగ్గజాలు (సింఘ్వీ, రోహత్గీ, లూథ్రా) ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదని అభిప్రాయపడింది. గతంలో జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సింఘ్వీ ప్రస్తావిస్తుండగా.. అదంతా తమకు తెలుసునని, ఆ ఉత్తర్వులను పరిశీలించామని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఇదేమీ సహారా, ఆమ్రపాలి తరహా కేసు కాదని, రూ.5.31 కోట్లు మినహా మిగతా సొమ్ము అంతా వెనక్కి ఇచ్చేశామని, మొత్తం 70 వేల పేజీల రికార్డు సుప్రీంకోర్టుకు అందజేశామని సింఘ్వీ పేర్కొన్నారు. మొత్తం డిపాజిటర్లు ఎంత మంది? అని ధర్మాసనం ప్రశ్నించడంతో 2.7 లక్షల మంది అని సింఘ్వీ సమాధానమిచ్చారు. చెల్లించారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి... తొలుత ముందుకు రాని ఏపీ ప్రభుత్వం సడన్‌గా ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకోగలమని, అయితే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపుతామని, అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుందని, విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రూ.2,600 కోట్లు తిరిగి చెల్లించేశామని సింఘ్వీ మరోసారి ప్రస్తావించడంతో... ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టుకు నివేదించాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ వాదనే విన్నారని, అయితే హైకోర్టు ఏ ప్రక్రియ అనుసరించిందనేది పరిశీలించాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. పబ్లిక్ నోటీసు కన్నా మిన్నగానే తిరిగి చెల్లింపులు చేశామని, భవిష్యత్ మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆర్బీఐ స్టేటస్ రిపోర్టు ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తుచేయగా.. దాన్నేం మార్చలేం కదా? ఇప్పుడు అది అప్రస్తుతం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏమున్నా తెలంగాణ హైకోర్టులోనే.. సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. అదృష్టమో, దురదృష్టమో రామోజీరావు ఈనాడు పబ్లిషర్ కావడంతో చాలా విషయాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనాడు చాలా పాత పేపరని, ఈటీవీ కూడా ఉందన్నారు. నాలుగేళ్లుగా ఈనాడు తమపై వార్తలు రాస్తోందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వచ్చిందని ఆరోపించారు. ఇదంతా హైకోర్టులో చెప్పుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.5 కోట్లు మాత్రమే ఉన్నందున ఉండవల్లి పిటిషన్‌ను కొట్టివేసి, భవిష్యత్తు మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ మరోసారి కోరగా హైకోర్టు ఎదుటే చెప్పుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్కడొద్దు.. మీరే పరిష్కారం చూపండి ఈ సమయంలో మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసును తెలంగాణ హైకోర్టు పంపొద్దని అభ్యర్థించారు. ఈ కేసు చాలా పాతదని, సుప్రీంకోర్టులోనే పరిష్కార మార్గం చూపాలని కోరారు. తగిన మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే తాము కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని, నిర్దిష్ట కాలపరిమితితో కేసును పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తామని ధర్మాసనం పేర్కొంది. అనంతరం మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు ప్రారంభిస్తుండగా... ఆ పిటిషన్ ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆర్డర్లో హెచ్‌యూఎఫ్ విషయంలో వచ్చిన తప్పును సవాల్ చేశామని లూథ్రా తెలిపారు. ఇది ప్రస్తుతం అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టు అందరి వాదనలు వినాలి... ‘‘పిటిషన్ దాఖలులో ఏపీ ప్రభుత్వ జాప్యాన్ని మన్నిస్తున్నాం. ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎస్సెల్పీ విచారణ అర్హతతోపాటు పార్టీ ఇన్ పర్సన్‌గా అనుమతిస్తున్నాం. 31.12.18న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు తిరిగి విచారించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆర్బీఐ, ఉండవల్లి అరుణ్‌కుమార్, రామోజీరావు, అన్‌క్లయిమ్ డిపాజిటర్ల వాదనలు విని ఆరు నెలల్లోగా ఈ కేసును తేల్చాలి. అన్ క్లెయిమ్డ్ డిపాజిటర్ల సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు ఒక న్యాయాధికారిని నియమించాలి’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేం... కోర్టు తీర్పులపై ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని రామోజీరావు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా నివేదించారు.ఏపీ ప్రభుత్వానికి సాక్షి పత్రిక ఉందని, దాంట్లో రామోజీరావుపై కథనాలు రాయకుండా నియంత్రించాలని కోరారు. ఈ దశలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ రామోజీరావుకే ఈనాడు, ఈటీవీ ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్షి పత్రికతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తాను చట్టబద్ధంగా దీన్ని నిరూపించగలనని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఇక్కడ ఇవ్వలేమని, కోర్టులో ఏం జరిగిందో చెప్పుకోవచ్చని, అదే సమయంలో జరగనిది చెప్పడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్‌కుమార్ దాన్ని తప్పు పట్టారని లూథ్రా పేర్కొనడంతో దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఉండవల్లి మాజీ ఎంపీ, ప్రజా క్షేత్రంలో ఉంటారని వ్యాఖ్యానించింది. ప్రజల కోసమే ఉండవల్లి సుప్రీంకోర్టు వరకూ వచ్చారని, అదే సమయంలో కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటారని పేర్కొంది. ‘కోర్టు తీర్పులను కొందరు స్వాగతిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. కోర్టు తీర్పులను ఒక్కొక్కరూ ఒక్కోలా చూడరాదంటూ మేం లక్ష్మణ రేఖ గీయలేం. ఈనాడు పత్రికకు ఏపీ ప్రభుత్వం వ్యతిరేకమన్న భావనతో అలా వ్యవహరించొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం కదా! ప్రజాక్షేత్రంలో ఉండేవారు మీడియా ముందు అనేక విషయాలు ప్రస్తావిస్తారు. మీడియా వాటిని రాస్తుంది. ఎవరినీ నియంత్రించలేం. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఇరు పక్షాలు కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాని స్పష్టం చేసింది. కత్తితో తిరగబడాలని లూథ్రానే చెప్పారు.. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆయన తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్‌లు స్పందిస్తూ తాను ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి పరుష పదాలు వినియోగించలేదన్నారు. రామోజీరావుకు ఏదో అయిపోవాలని ఇక్కడకు రాలేదన్నారు. ఈ సమయంలో గతంలో సిద్దార్ధ లూత్రా చేసిన ఓ ట్వీట్ (స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రాని సందర్భంలో)ను ఉండవల్లి గుర్తు చేశారు. ఎక్కడా విజయం సాధించకపోతే ప్రజలు కత్తితో తిరగబడే అవకాశం ఉందంటూ ఒకరు సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తానెప్పుడూ అలా చేయలేదని లూథ్రా పేర్కొనగా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి తెలిపారు. తాను 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, వ్యక్తిగతంగా విమర్శించినట్లు ఎవరూ అనలేదన్నారు. ఈ కేసు పూర్తయ్యే వరకూ ఎక్కడా, ఎవరూ, ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా ఎలా ఆదేశాలు ఇవ్వగలమని ప్రశ్నించింది. ఇరు పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఆరు నెలలు వారికి పరీక్ష లాంటిదని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజా క్షేత్రంలో ఉన్నవారిని నియంత్రించడం సాధ్యం కాదన్నారు. -
మార్గదర్శి అక్రమాల కేసులో నేడు కీలక విచారణ
సాక్షి, ఢిల్లీ: రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేడు(మంగళవారం) కీలక విచారణ జరగనుంది. చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో గత విచారణలో కేసు ఊహించని మలుపు తిరిగిన దృష్ట్యా.. ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. ఈ వాదనల తదనంతరం సమగ్ర విచారణ కోసం నేటికి విచారణను వాయిదా వేసింది కోర్టు. ఇవాళ జరగబోయే విచారణ మార్గదర్శి కేసును మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నేడు ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. -
ఆ డబ్బులు మావే ఇచ్చేయండి
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో పచ్చ పత్రికాధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ డ్రామాలకు తెరలేపింది. ఆ నగదుతోపాటు చెక్కులు కూడా తమవేనని చెబుతున్న మార్గదర్శి ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపమంటే చూపడం లేదు. దీంతో ఈ సొమ్ము మార్గదర్శిది కాదని.. టీడీపీ నేతలు ఓట్ల కొనుగోలుకు తరలిస్తున్న నగదని అంతా చెబుతున్నారు. ఇప్పటికే ఈ నగదుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. అంతేకాకుండా ఈ వ్యవహారం ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్లిపోయింది. ఆధారాలు చూపించి నగదును తీసుకునే అవకాశం ఉన్నా ఆ పనిచేయకుండా జిల్లా ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారులకు ఆధారాలు చూపాల్సిందే.. ఎఫ్ఐఆర్ నమోదుతో మార్గదర్శి పేరుతో జరిగిన మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశం ఐటీ శాఖ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పట్టుబడిన ప్రతి పైసాకు లెక్కలతో సహా ఆధారాల్ని పోలీసులతో పాటు ఐటీ అధికారులకు మార్గదర్శి సమర్పించాల్సి ఉంటుంది. కానీ.. ఆ సొమ్ము మార్గదర్శిది కాదని.. అందుకే ఐదు రోజులు గడుస్తున్నా లెక్కా పత్రాలు చూపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఖర్చులకు తమకు అనుకూలమైన పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు అందించేందుకు మార్గదర్శి పేరుతో పక్కా ప్లాన్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరికి ఇస్తున్నారో అధికారులు దర్యాప్తు చేసి రామోజీరావు నడిపిస్తున్న మనీలాండరింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆధారాల్లేకుండా అధికారుల చుట్టూ.. ఈ నెల 2న విశాఖ ద్వారకానగర్ ప్రాంతంలో రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. వీటిని ఇద్దరు మార్గదర్శి సిబ్బంది స్కూటీపై సూట్‌కేసులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, చెక్కులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. నగదు తరలింపుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం తమ పరిధిలో లేదని రెండు రోజుల క్రితం మార్గదర్శి సిబ్బందికి ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. కలెక్టరేట్లోని ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది ప్రదక్షిణలు చేస్తూ.. నగదు, చెక్కులు ఇప్పించాలంటూ హడావుడి చేస్తున్నారు. తమ పరిధిలో లేదని చెబుతున్నా వదలకపోవడంతో ‘ఆధారాలు చూపించండి.. పోలీసులు, ఐటీ సిబ్బందికి ఇస్తాం’ అని ఎన్నికల యంత్రాంగం చెప్పడంతో.. తామేమీ ఆధారాలు తీసుకురాలేదని అక్కడి నుంచి మార్గదర్శి సిబ్బంది పలాయనం చిత్తగించారు. అయితే శనివారం సాయంత్రం మళ్లీ ఎన్నికల అధికారుల వద్దకు వచ్చి నగదు కోసం ఒత్తిడి తెచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తుండటంతో మార్గదర్శి సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
టీడీపీ ‘కిక్కు’రొకో.. ఎన్నికల వేళ రాష్ట్రానికి భారీగా గోవా మద్యం సరఫరా
మునగపాక : ఎన్నికల కోడ్ కూతతో రాష్ట్రంలో మద్యం పారించేందుకు టీడీపీ కుయుక్తులు పన్నింది. గోవా నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం సరఫరా చేసి విక్రయాలకు పాల్పడుతోంది. ఈ గుట్టును రట్టు చేసిన పోలీసులు ఇప్పటికే అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం సోమలింగపాలేనికి చెందిన ముగ్గురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్తనూ అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు పంపారు. ఈ వ్యవహారంలో సూత్రధారులెవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలేం జరిగిందంటే.. యలమంచిలి మండలం సోమలింగపాలేనికి చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్ కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు రప్పించి తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టారు. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాకనుంచి అక్రమ మద్యం రవాణా అవుతోందని వచ్చిన సమాచారంతో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించింది. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి తనిఖీ చేశారు. వారి వద్ద 5 కేసుల్లో 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్టు వారు చెప్పడంతో గడ్డివాము వద్ద తనిఖీలు చేపట్టి స్వాదీనం చేసుకున్నారు. మొత్తం రూ.50 లక్షల విలువైన 39,168 క్వార్టర్ బాటిళ్లు (7వేల లీటర్ల మద్యం) స్వాధీనం చేసుకుని ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో మునగపాకకు చెందిన టీడీపీ కార్యకర్త బి.ప్రసాద్‌నూ అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. కాగా.. వెంకటస్వామి, ధర్మతేజ దినేష్‌కుమార్ యలమంచిలి నియోజకవర్గం కట్టుబోలుకు ఇదే తరహాలో మద్యం బాటిళ్లను తీసుకువచ్చి అక్రమ వ్యాపారం చేసేందుకు యత్నించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మునగపాక ఎస్ఐ పి.ప్రసాదరావు వారి యత్నానికి గండికొట్టారు. కేసు విచారణ సమయంలో పోలీసులకు మరింత సమాచారం అందినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మద్యాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో సహకరించిన అందరి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఇంతపెద్దమొత్తంలో మద్యం స్వా«దీనం చేసుకోవడం ఇదే ప్రథమమని పోలీసులు చెబుతున్నారు. -
మార్గదర్శి సిబ్బందిపై కేసు
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మార్గదర్శి చిట్‌ఫండ్స్ కంపెనీ సిబ్బందిపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల రెండో తేదీన నగరంలోని సీతంపేట మార్గదర్శి చిట్‌ఫండ్స్ శాఖ అకౌంట్ అసిస్టెంట్ వి.లక్ష్మణరావు, ఆఫీస్ బాయ్ శ్రీను స్కూటీలో రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,677 విలువైన 51 చెక్కులు తీసుకువెళ్తుండగా.. ద్వారకానగర్ మొదటి లైన్లో పోలీసులు తనిఖీలు చేస్తూ పట్టుకున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అప్పగించారు. దీనిపై ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 188 ప్రకారం మార్గదర్శి సిబ్బంది వి.లక్ష్మణరావు, శ్రీనులపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్లడానికి వీలులేదని ద్వారకా సీఐ ఎస్.రమేష్ తెలిపారు. -
నవరంగ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి జనసేన బెదిరింపు
తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయడానికి వీలు లేదంటూ జనసేన పార్టీ నేతలు తనను బెదిరించి బీఫామ్ పత్రాలు లాక్కున్నారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఖాన్ ఆరోపించారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి తన తలపై గన్ పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో షేక్ జలీల్‌ఖాన్ మాట్లాడారు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గ్లాసు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ రెండూ ఒకే పోలికతో ఉండటంతో తనను 15 రోజులుగా జనసేన నేతలు బాలÔౌరి, నాదెండ్ల మనోహర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. రూ.5 కోట్లు ఇస్తామని, బీఫామ్‌లు తమకిచ్చేయాలని బాలÔౌరి ఒత్తిడి చేశారన్నారు. రెండుసార్లు ఇదే విషయమై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఫోన్లో మాట్లాడించారని చెప్పారు. తాను ఒప్పుకోకపోవడంతో జనసేన కార్యకర్తలతో చంపిస్తామని మనోహర్ బెదిరించారన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి విజయవాడ ఐలాపురం హోటల్ వద్ద ఉన్న తనను వల్లభనేని బాలÔౌరి గన్ పెట్టి బెదిరించారన్నారు. తన వద్ద ఉన్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లు లాక్కున్నారని వాపోయారు. పవన్ నీచ రాజకీయాలు బీజేపీతో కలసి మైనార్టీలను అణగదొక్కేందుకు పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని జలీల్ ఖాన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై పిఠాపురంలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో బాలÔౌరిపైన, ఆయనకు సహకరించిన పవన్, మనోహర్‌పైనా ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనార్టీలను సర్వనాశనం చేసిన చంద్రబాబుతో జతకట్టిన పవన్‌కు రాష్ట్ర ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
మత్స్యకారుల బోటులో అగ్ని ప్రమాదం
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/కాకినాడ రూరల్: విశాఖ సముద్ర తీరంలో శుక్రవారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజన్ పేలిన ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా నలుగురు స్వల్ప గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన వీరంతా గత నెల 26వ తేదీన శ్రీదుర్గాభవాని ఐఎన్డీ ఏపీ 47 బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ నెల 14వ తేదీన తిరిగి రావాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. 20 నాటికన్ మైళ్ల దూరంలో.. విశాఖకు 20 నాటికన్ మైళ్ల దూరంలో మత్స్యకారుల బోటులో షార్ట్ సర్క్యూట్ కారణంగా జనరేటర్ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో మరో పడవలో ఉన్నవారు వారికి సాయం అందించి కోస్ట్‌గార్డ్ అధికారులకు సమాచారం చేరవేశారు. సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐసీజీఎస్ వీరా నౌక సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం నేవల్ డాక్‌యార్డ్‌కు తీసుకొచ్చి క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా కేజీహెచ్‌కు తరలించారు. మత్స్యకారులు ఆర్.సత్తిబాబు, ఎన్.వజ్రం, ఎస్.సత్తిబాబు, కె.ధర్మారావు, వై.సత్తిబాబులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కాకినాడ మత్స్యశాఖ అధికారి కరుణాకర్, ఫిషింగ్ హార్బర్ పీవో అనురాధ మత్స్యకారుల వివరాలు సేకరించారు. కాకినాడ మత్స్యకారులకు ప్రమాదం తప్పిందని, కోస్టుగార్డు సిబ్బంది వారిని సురక్షితంగా విశాఖకు తరలించారని, చికిత్స అనంతరం తిరిగి కాకినాడ చేరుకుంటారని అధికారులు తెలిపారు. -
మహిళపై టీడీపీ నేత అకృత్యం
రాయదుర్గం : టీడీపీ నేత అకృత్యంతో అనంతపురం జిల్లా హోసగుడ్డంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కురుబ కావేరి (26) అనే వివాహితపై లోకేశ్ అనే టీడీపీ నేత కన్నేశాడు. మార్చి 31 రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నంలో భర్త గోనప్ప కాలు తొక్కాడు. దీంతో మేల్కొన్న గోనప్ప లైటువేసి టీడీపీ నేతను పట్టుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో లోకేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఏప్రిల్ 1న కావేరి దంపతులు డి.హీరేహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. టీడీపీ నేత లోకేశ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇన్నాళ్లు నాటకం ఆడాడు. కాగా.. గురువారం గ్రామంలోకి వచ్చి తిరుగుతూ కనిపించాడు. దీనిని అవమానంగా భావించిన కావేరి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తన భార్య చావుకు లోకేశ్ కారణమని ఆమె భర్త గోనప్ప, తల్లి శకుంతలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబే ప్రధాన నిందితుడు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా పన్నాగంతోనే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడు (ఏ1)గా, రెండో నిందితుడి (ఏ2)గా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది. సీఐడీ చార్్జషీట్లోని ప్రధాన అంశాలు ఇవీ... 2017లోనే బయటపడినా.. 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో జరిపిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి, ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్టు ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం మొత్తం బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్‌టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో పక్కా పథకం ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం చంద్రబాబు తన బినామీ సంస్థ డిజైన్‌టెక్‌ను రంగంలోకి దింపారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు బినావీులు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్– డిజైన్‌టెక్ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్‌టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లతో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణస్కిల్ స్కామ్‌లో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న చంద్రబాబు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు రెడ్‌బుక్ పేరుతో ఈ కేసులో కీలక సాక్షులు, అధికారులను బెదిరింపులకు గురిచేసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కూడా సీఐడీ ఆ పిటిషన్లో పూర్తి ఆధారాలతో పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ ద్వారా నిధులు మళ్లించిన స్కిల్ స్కామ్ గురించి సీఐడీ అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించారు. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగర్వాల్, షెల్ కంపెనీల సృష్టికర్త సురేశ్ గోయల్‌ను అరెస్ట్ చేసింది. డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను జప్తు చేసింది కూడా. సీఐడీ చార్్జషీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ – సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర కంపెనీల అధికారులు -
సుప్రీంకోర్టు: ఓటుకు నోటు కేసుపై విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్‌పై, ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న మరో పిటిషన్‌పై కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, ఈ పిటిషన్లపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇక, పిటిషన్‌పై విచారణ సందర్బంగా ఈ కేసు నిన్న రాత్రే లిస్ట్ అయినందున విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాద సిద్దార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో, కోర్టు పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం, విచారణను వాయిదా వేసింది. ఇక, 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు చంద్రబాబు డబ్బులను ఎరగా చూపించారు. ఈ సందర్బంగా ‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’ అనే వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. అయితే, చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. -
అల్లూరి జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాడేరు ఘాట్‌రోడ్డులో ఓ బొలేరో వాహనం లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ సమీప మలుపులో బుధవారం రాత్రి సమయంలో ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, వీరంతా ఒడిశాకి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో ఒక బాలిక కూడా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరో వాహనంలో 30 మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
విషాదం: అమెరికాలో తెలుగు విద్యార్థి రేవంత్ మృతి
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్(22) మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లిన తమ బిడ్డ ఇలా అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ (22) బీటెక్ పూర్తి చేసుకుని ఎంఎస్ అభ్యసించేందుకు గత ఏడాది డిసెంబరు చివరిలో అమెరికా వెళ్లాడు. మాడిసన్ ప్రాంతంలోని డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వాతావరణంలో పెనుమార్పులతో ఒక్కసారిగా పొగ మంచు కమ్ముకుని, కారు అదుపుతప్పినట్లు తెలిసిందన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులతో పాటు రేవంత్‌కు తీవ్ర గాయాలవ్వగా, రేవంత్ దుర్మరణం చెందినట్లు సమాచారం అందిందన్నారు. దీంతో బోడవాడలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
‘గురివింద’ బండారం బట్టబయలు
విశాఖ సిటీ/సాక్షి, అమరావతి: రాజ గురివింద రామోజీ బరితెగించారు. ఎన్నికల వేళ పచ్చ పార్టీకి భారీ మొత్తంలో డబ్బు అక్రమ తరలింపునకు తెగబడ్డారు. రాజకీయంగా చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ లెక్కా పత్రం లేకుండా విశాఖ నగరంలో భారీగా నగదును తరలిస్తూ అడ్డంగా దొరికిపోయింది. రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో రామోజీ ఆరి్థక అక్రమాల బండారం మరోసారి బట్టబయలైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ పోలీసు బృందాలు, కేంద్ర బలగాలు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరం ద్వారకానగర్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీ31సీజీ 7825 నంబరు స్కూటీపై ఇద్దరు వ్యక్తులు సూట్‌కేస్‌తో వెళుతుండగా పోలీసులు వారిని ఆపారు. వారి వద్ద ఉన్న సూట్‌కేసును తనిఖీ చేయగా అందులో రూ.500 నోట్ల కట్టలు, చెక్కులు కనిపించాయి. వాటిని లెక్కించగా రూ.51,99,800 నగదు ఉన్నట్లు తేలింది. రూ.36,88,675 విలువైన 51 చెక్కులను గుర్తించారు. ఆ డబ్బు ఎవరిదని, ఎక్కడకు తీసుకువెళుతున్నారని పోలీసులు ప్రశి్నంచారు. ఇందుకు వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆ డబ్బు మార్గదర్శి చిట్స్‌కు సంబంధించినదని, ఎవరికీ ఇవ్వడానికి కాదని, బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళుతున్నట్లు బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆధారాలు చూపించాలని అడిగినప్పటికీ వారు చూపించలేదు. దీంతో పోలీసులు నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారు. అందులో ఒకరు లక్ష్మణరావు మార్గదర్శి చిట్స్‌లో అకౌంట్స్ అసిస్టెంట్‌గా, మరొకరు శ్రీనివాస్ ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. వారు ఆ డబ్బుకు ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అందజేశారు. వారు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేశారు. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా తరలింపు! ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు తరలిస్తే అందుకు ఆధారాలు ఉండాలి. ఈ విషయం పత్రికాధిపతి రామోజీకి చెందిన సంస్థకు తెలియనిది కాదు. అయినా మార్గదర్శి ద్వారా లక్షలాది రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు డబ్బు చేరవేసేందుకే ఈ నగదును తీసుకువెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేస్తుండటంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో టీడీపీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా విశాఖలో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచిల నుంచి భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే భీమిలిలో ఉన్న ప్రైవేటు పరిశ్రమ నుంచి టీడీపీ నేతలకు రూ.కోట్లు ముట్టినట్లు వార్తలు వినిపించాయి. వాస్తవానికి మార్గదర్శి, ఆ పరిశ్రమ సిబ్బంది చేతుల మీదుగానే రూ.కోట్ల డబ్బు పంపిణీ జరిగిందన్నది బహిరంగ రహస్యమే. ఈ ఎన్నికల్లోనూ అదే పంథాలో డబ్బు పంపిణీకి పూనుకున్నట్లు ఈ వ్యవహారంతో తేటతెల్లమైంది. డిజిటల్ చెల్లింపులేవి రామోజీ! 2022 డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడంలేదు. పాత చిట్టీలే కొనసాగుతున్నాయి. కాలపరిమితి ముగియడంతో చిట్టీలు మూసివేస్తున్నారు. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచిల్లో చిట్టీ గ్రూపుల సంఖ్య సగానికంటే తగ్గిపోయింది. అయినప్పటికీ విశాఖపట్నం బ్రాంచిలో ఖాతాదారుల నుంచి 3 రోజుల్లోనే రూ.51 లక్షలు నగదు రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్టు. ఇక రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది. ప్రస్తుతం కిళ్లీ దుకాణాలు, బజ్జీ దుకాణాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు కాబట్టి నగదు లావాదేవీలు జరపకూడదని రామోజీ ఈనాడులో పదేపదే వార్తలు రాయిస్తున్నారు. కానీ ఆయన మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ద్వారా భారీగా నగదు లావాదేవీలే నిర్వహిస్తుండటం గమనార్హం. చందాదారుల నుంచి డిజిటల్/ఆన్ౖలెన్ చెల్లింపులు ఎందుకు స్వీకరించడం లేదు? నగదు రూపంలోనే ఎందుకు తీసుకుంటున్నారన్నప్రశ్న తలెత్తుతోంది. మార్గదర్శి పేరుతో ఎన్నికల్లో టీడీపీకి డబ్బు తరలింపు, భారీగా నల్లధనం చలామణిలోకి తేవడమే లక్ష్యంగా ఈ దందా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. పక్కా మనీ లాండరింగే.. విశాఖలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడటంతో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో భారీగా నల్లధనం దందా మరోసారి ఆధారాలతోసహా వెలుగులోకి వచ్చింది. ఈ డబ్బు ఎక్కడిదని మార్గదర్శి సిబ్బందిని పోలీసులు ప్రశి్నంచగా పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యతి్నంచారు. చివరగా గత మూడు రోజుల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో చందాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కానీ ఆ నగదు, చెక్కులకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలీసులు వాటిని జప్తు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ మనీ లాండరింగ్‌కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో వెల్లడైన విషయం వాస్తవమేనని ఈ ఘటన మరోసారి రుజువుచేసింది. చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం ఒక బ్రాంచిలో వసూలు చేసే మొత్తాన్ని అదే బ్రాంచి పరిధిలో బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఇతర బ్యాంకుల్లోని ఖాతాల్లోకి మళ్లించకూడదు. రామోజీరావు ఈ నిబంధనలను ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చందాదారుల సొమ్మును హైదరాబాద్‌లోని తమ ప్రధాన కార్యాలయం ఖాతాకు మళ్లిస్తూ వచ్చారు. అదే రీతిలో చందాదారుల సొమ్మును సోమవారం విశాఖలో ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తూ పోలీసులకు చిక్కినట్లు స్పష్టమైంది. -
‘అయ్యో గీతాంజలి’.. అమెరికాలో రెండ్రోజుల వ్యవధిలో తల్లీకూతుళ్ల మృతి
కొణకంచి(పెనుగంచిప్రోలు): అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతాంజలి పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలో భర్త నరేష్, కుమారుడు బ్రమణ్‌కు గాయాలవ్వగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.