* ముందుకొచ్చిన 'అమృత'
* రూ.2500 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు
* 2250 పడకల ఆసుపత్రి, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ కేంద్రం ఏర్పాటు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ముంగిట్లోకి మరో భారీ మెడికల్ ప్రాజెక్టు వచ్చి చేరింది. భారతదేశంలో ఉత్తమ పరిశోధనా విశ్వవిద్యాలయంగా పేరొందిన అమృత యూనివర్శిటీ ఏపీ కొత్త రాజధానిలో తన క్యాంపస్ ప్రారంభించడానికి ముందుకొచ్చింది. మూడు దక్షిణాది రాష్ట్రాలలో ఐదు క్యాంపస్లు ఉన్న అమృత విశ్వవిద్యాలయం త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో మెగా వర్శిటీని నెలకొల్పబోతోంది.
మొత్తం రూ.2500 కోట్ల అంచనాలతో త్వరలో నిర్మాణం జరుపుకునే ఈ మెడికల్ యూనివర్శిటీతో పాటు ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటుచేస్తారు. 2250 పడకల మెగా ఆసుపత్రిగా దీన్ని ఏర్పాటుచేయనున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నెలకొల్పే వైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్- హెల్త్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటుచేయనున్నారు. అమృత విశ్వవిద్యాలయం ప్రతినిధులు శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి యూనివర్శిటీ, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై ప్రాజెక్టు రిపోర్టును అందించారు.
అమరావతిలో అమృతా యూనివర్శిటీ క్యాంపస్‌ను ఏర్పాటుచేయాలన్న ముఖ్యమంత్రి అభ్యర్ధన మేరకు మాతా అమృతానందమయిదేవి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వర్శిటీ ప్రతినిధులు వివరించారు. తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న అమృత యూనివర్శిటీ అటు కేరళ, ఇటు కర్నాటకలో కూడా క్యాంపస్‌లను ఏర్పాటుచేసింది. అమెరికాలోని ఐవీ యూనివర్శిటీ, మరికొన్ని ప్రఖ్యాత యురోపియన్ విశ్వవిద్యాలయాలతో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ నడుపుతున్న అమృత వర్శిటీ ఉన్నత విద్యారంగంలో కొన్ని ప్రమాణాలను నెలకొల్పింది.
అమరావతిలో మరో మెగా మెడికల్ వర్శిటీ
Published Fri, Feb 19 2016 8:25 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement