విజయవాడ: విజయవాడను సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పులి సాంబశివరావు అన్నారు. విజయవాడలోని దాసరి నాగభూషణరావు భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళారంగ అభివృద్ధి కోసం సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయించాలని కోరారు.
నూతన రాష్ట్రంలో సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలన్నారు. కళాకారుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. వృద్ధ కళాకారులకు ఇస్తున్న పింఛను రూ. 2వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలుచేయకపోతే కళారూపాల ద్వారా ప్రభుత్వ చర్యలను ఎండగడతామని హెచ్చరించారు.
సాంస్కృతిక రాజధానిగా విజయవాడ
Published Mon, Jun 23 2014 7:48 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement