చెవిరెడ్డి ఇంటికి మాజీ డీజీపీ | andhra pradesh former DGP meets chevireddy bhaskar reddy | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి ఇంటికి మాజీ డీజీపీ

Published Sun, Nov 16 2014 2:57 AM | Last Updated on Fri, Jul 12 2019 6:04 PM

చెవిరెడ్డి ఇంటికి మాజీ డీజీపీ - Sakshi

చెవిరెడ్డి ఇంటికి మాజీ డీజీపీ

తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ చెన్నూరు ఆంజనేయరెడ్డి శనివారం తుమ్మలగుంటలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయనకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులను ఆంజనేయరెడ్డి ఆత్మీయంగా పలకరించారు. చెవిరెడ్డి తాత మునిరెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు.

అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు.చెవిరెడ్డి కుటుంబంతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధంతో ఆంజనేయరెడ్డి తిరుపతికి వచ్చిన ప్రతిసారి వారి ఇంటిలో ఆతిథ్యం స్వీకరించడం ఆనవారుుతీ. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బోర్డు మెంబరుగా ఉన్న కాలంలో ఆంజనేయరెడ్డిని టీటీడీకి సలహాదారుగా కూడా నియమించుకున్నారు. ఈ కార్యక్రమంలో విక్రమసింహపురి మాజీ వీసీ రాజారామిరెడ్డి, చెవిరెడ్డి సుబ్రమహ్మణ్యంరెడ్డి, ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement