'ఎవరేమనుకున్నా అక్కడే రాజధాని'
ఎవరు ఏమనుకున్నా.. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ముందుగా నిర్మించాలనుకున్న చోటే నిర్మిస్తామని ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. నెల్లూరులో గురువారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొడితే.. అక్కడి భూముల విలువలు పడిపోతాయని తెలిపారు. ఇలా రెచ్చగొట్టడం వల్ల రైతులకే నష్టం జరుగుతుందని చెప్పారు.
రాజధాని భూముల విషయాన్ని పవన్ కల్యాణ్తో తాము చర్చిస్తామని కూడా నారాయణ అన్నారు. బలవంతంగా భూసేకరణ చేస్తే రైతులకు అనుకూలంగా తాను పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా పర్యటనలో చెప్పిన నేపథ్యంలో వాటికి సమాధానంగా నారాయణ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.