గాలిలో ప్రాణాలు! | bus tilted Into the sewer | Sakshi
Sakshi News home page

గాలిలో ప్రాణాలు!

Published Mon, Oct 21 2013 2:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

గాలిలో ప్రాణాలు! - Sakshi

గాలిలో ప్రాణాలు!

 నకరికల్లు, న్యూస్‌లైన్: గుంటూరు జిల్లా నకరికల్లు మండలం అడ్డరోడ్డు సమీపంలో ఆదివారం వేకువజామున మూడుగంటల సమయంలో ఒక ప్రయివేటు బస్సు కాలువలోకి ఒరిగింది. అదృష్టవశాత్తు బస్సు కాలువలోకి పడకపోవడంతో సుమారు 30మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళుతున్న బస్సు డ్రైవర్ గుంటూరు బ్రాంచ్ కెనాల్ వద్ద లారీని ఓవర్ టేక్ చేస్తూ వంతెనను ఢీకొట్టాడు. దీంతో బస్సు కాలువలోకి ఒరిగింది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణభీతితో ఆర్తనాదాలు చేశారు. కాపాడాలంటూ కేకలువేశారు. కొద్దిసేపటికి సమీపంలోని హోటళ్ల వాళ్లు స్పందించి కిటికీల నుంచి ఒక్కొక్కరిని చెక్కబల్లల మీదుగా కిందకు దించారు. బస్సు డ్రైవర్ పరారయ్యారు. బస్సు యజమాని వచ్చి క్రేన్ సహాయంతో బస్సును వెలికితీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement