అయేషా హత్య కేసు : ముగ్గురిపై కేసు నమోదు | CBI files case on ayesha meera Case | Sakshi
Sakshi News home page

అయేషా హత్య కేసు : ముగ్గురిపై కేసు నమోదు

Published Sat, Dec 29 2018 5:39 PM | Last Updated on Sat, Sep 28 2024 11:40 AM

CBI files case on ayesha meera Case

సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన నర్సింగ్‌ విద్యార్థిని అయేషా మీరా(19) హత్య కేసులో విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఈ కేసులో విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. కేసు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు ధ్వంసం అయిన అంశంపై పి.కుమారి, పి. వెంకటకుమార్‌, వై సుబ్బారెడ్డిలపై కేసు​ నమోదు చేశారు. త్వరలో మరికొందరిపైనా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయేషా మీరా కేసులో అసలు నిందితులను పట్టుకోవటంలో ఏపీ పోలీసులు విఫలమవ్వటంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement