ఉద్యమ బిడ్డలకు... పోలీస్ అడ్డుగోడలు!
Published Wed, Sep 18 2013 3:46 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, బొత్స ప్రతిష్టను కాపాడేందుకు వీలుగా విద్యార్థులను నియంత్రించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. బిడ్డలు ఉద్యమంలో పాల్గొనకుండా అడ్డుగోడలు కడుతున్నారు. వారిహక్కులను హరించేలా, ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించేలా పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. దీనిపై విద్యార్థి లోకం మండిపడుతోంది..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చూసిరండర్రా అంటే కాల్చేసి రావడం పోలీసులకు మొదట్నుంచీ ఉన్న అలవాటు. ఇప్పుడు ఆ అలవాటును సమైక్యాంధ్ర ఉద్యమకారులపై చూపుతున్నారు. ఉద్యమంలో గొడవలు జరగకుండా చూడండయ్యా అంటే... అసలు ఉద్యమమే చేయొద్దని హుకుం జారీ చేస్తున్నారు. సమైక్యాంధ్ర పోరాటంలో ఎవరెవరు పాల్గొనాలో వారే నిర్దేశిస్తున్నారు. భావి భారత నిర్మాతలైన యువకులు, విద్యార్థులకు ఉద్యమంలోకి రావద్దని సూచిస్తున్నారు. ఇదంతా వారిమీద ప్రేమతో చెబుతున్నారనుకునేరు...తప్పు.. తప్పు...ఇదంతా స్వామిభక్తి ప్రదర్శన కోసమే. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఈగ కూడా వాలకుండా చూసుకునే లక్ష్యంతో పోలీసులు ఇలాంటి కొత్త నిబంధనలు విధిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులను ఉద్యమంలోకి పంపొద్దంటూ కాలేజీలకు నోటీసులు పంపుతున్నారు.
బొత్స కోసమే....!
ఉద్యమంలో ఇటీవల జరిగిన పలు సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఈ నెల రెండో తేదీన విజయనగరంలో ఉద్యమం చేస్తున్న విద్యార్థులు బొత్సకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీంతో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై దాడి చేయడం, ఆతరువాత ఈ వివాదం ముదరడం, నిందితులంతా వచ్చి క్షమాపణ చెప్పడం తెలిసిందే. అంతేకాకుండా బొత్స కుటుంబానికి ప్రజల సంక్షేమం, వారి కష్టసుఖాలు అక్కర్లేదని, కేవలం వారి పదవులు ఉంటే చాలన్నట్లుగా ఉంటున్నారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో పాల్గొనే ప్రతి విద్యార్థీ సత్తిబాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నినాదాలిస్తున్నారు. ప్రతి చోటా సత్తిబాబు దిష్టిబొమ్మల దహనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రి బొత్సే లక్ష్యం గా ఆందోళనలు సాగుతున్నాయి. పలుమార్లు పలుసంఘాల నేతల ఆధ్వర్యంలో బొత్స ఇంటి ని ముట్టడించారు.
గరివిడిలో ఉన్న బొత్స గెస్ట్ హౌస్‌పైనా దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. బొత్స కుటుంబీకులను, ఆయన అనుచరులు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీస్తున్నారు. ఈ పో రాటంలో విద్యార్థులే కీలకంగా వ్యవహరిస్తూ ప్రజలు, నాయకులను మందుకు నడిపిస్తున్నా రు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకురుకుతున్నారు. దీంతో సత్తిబాబు ఇప్పుడు జిల్లాకు వచ్చేందుకూ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను ని యంత్రిస్తే పరిస్థితి కొంతమేరకు ప్రశాంతంగా ఉంటుందని భావించిన ఆయన పోలీసులకు ఈసూచనలు చేసినట్లు తెలిసింది. ఈనేపథ్యం లోనే పోలీసులు తమ స్వామిభక్తిని చాటుకునేం దుకు ఉద్యుక్తులయ్యా రు. విద్యార్థులను పోరాటంలోకి పంపొద్దని కాలేజీలకు సూచిస్తున్నారు.
ఇలాంటి అతి తెలివి ఇక చెల్లదు..
ఇదిలా ఉండగా ఈ నోటీసులకు సంబంధించి ఓ ప్రైవేటు కాలేజీ కరస్పాండెంట్ మాట్లాడు తూ ‘పోరాటానికి విద్యార్థులు సిద్ధమవుతుంటే మేమెలా ఆపగలం. వేలాది మంది ఒక్కటై నినదిస్తుంటే మేమేం చేయగలం... వారి అభిప్రాయాలకు విలువనివ్వాలి కదా...కాదంటే వాళ్లూరుకోరు’ అని చెప్పారు.
Advertisement
Advertisement