విజయవాడ, న్యూస్‌లైన్ : రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఇంటర్నెట్‌లో పొందవచ్చని రైల్వే టెలికమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ విభాగం సీనియర్ ఇంజినీరు బి.శ్రీనివాసులు తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారు గూగుల్ సెర్చ్‌వేర్‌లోకి వెళ్లి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీడీఏ.బీజెడ్‌ఏ అని టైప్ చేస్తే విజయవాడ రైల్వే డివిజన్‌కు సంబంధించిన వివరాలు వస్తాయి. దానిలో 112.133.221.2.8084 బీజెడ్‌ఏ/టీడీఏ అన్నదాన్ని క్లిక్ చేస్తే రైల్వే టైంటేబుల్ వివరాలు, రైళ్ల రాకపోకల సమయాలు, ఎంత ఆలస్యం, ఏ ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చేది తదితర వివరాలు లభిస్తాయి.
ఈ వివరాలన్నీ ప్రతి ఐదు సెకన్లకు ఒక్కసారి అప్‌డేట్ అవుతాయని ఆయన చెప్పారు. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న సెల్‌ఫోన్లలో కూడా వీటి వివరాలను చూడవచ్చునని చెప్పారు.
ఫేస్‌బుక్‌లో రైళ్ల సమాచారం
Published Thu, Dec 12 2013 1:26 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM
Advertisement
Advertisement