చంద్రబాబుది నయవంచన | don't trust chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది నయవంచన

Published Wed, Apr 16 2014 3:25 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

don't trust chandrababu naidu

 నూజివీడు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎవరినైనా సరే వాడుకుని మోసం చేయడంలో దిట్ట అని నోవా విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావు ధ్వజమెత్తారు. నూజివీడులోని నోవా విద్యాసంస్థల కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

అవనిగడ్డ వెళ్లి డాక్టర్ చంద్రశేఖర్, అంబటి హరిప్రసాద్‌లను ఒప్పించుకుంటే టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పారని, దీంతో ఎంతో కృషిచేసి మార్గాన్ని సుగమం చేసుకుంటే తీరా పార్టీకి సంబంధంలేని, నిన్నటివరకు పార్టీకి వ్యతిరేకి అయిన వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి తనను నిట్టనిలువునా మోసం చేశారని మండిపడ్డారు.
 
 అవనిగడ్డ వెళ్లిన దగ్గర నుంచి పార్టీ అభివృద్ధికి లక్షలాది రూపాయలు ఖర్చుచేశానని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో కృషిచేస్తే చంద్రబాబు వేరొకరికి సీటు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాను ఏవిధంగా కష్టపడిందీ కొనకళ్ల నారాయణకు, సుజనాచౌదరికి తెలుసునని, దీనిపై చంద్రబాబుతోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
 
 పక్క పార్టీ జిల్లాలో ఏవిధంగా తన సామాజిక వర్గానికి చెందినవారికి టిక్కెట్లు ఇస్తోందో చూసి నేర్చుకోవాలన్నారు. జిల్లాలో 29 శాతం తన సామాజిక వర్గం ఉందని, ఈ నేపథ్యంలో జిల్లాస్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి తేల్చుకుంటానని చెప్పారు. మరో కార్యకర్తకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement