తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఎన్నికలు సమీస్తున్న తరుణంలో మరోమారు తమను మోసగించేందుకు సిద్ధమయ్యారని బడుగు బలహీన వర్గాలను, విద్యార్థులను, నిరుద్యోగులు, మహిళలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికలప్పుడు అబద్ధ్దపు హామీలిచ్చి..ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అన్యాయం చేశారని వాపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాటికి కాళ్లు చాపి బిక్కుబిక్కుమంటూ బతుకులీడ్చే తమలాంటి పండుముసలి వారిని సైతం రూకలతో మభ్యపెట్టి ఓట్లు గుంజుకునేందుకు తెరలేపుతున్నాడని చెబుతున్నారు.
భరోసా ఇస్తున్న వైఎస్ జగన్..
ఆసరా కోసం, ఆదరణ కోసం కాపుకాచే పండుటాకుల కష్టాలు, ఆదుకునే వారు లేక ఇబ్బంది పడే వితంతువులు, దివ్యాంగుల కష్టాలను కళ్లారా చూసి చలించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాము అధికారంలోకి అవ్వాతాతలకు రూ.3 వేలు పింఛన్ ఆదుకుంటానని భరోసా ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ఇంటికి వద్దకు పింఛన్ అందించేలా చేస్తామని చెప్పడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహానేత వైఎస్సార్ తమను ఆదుకున్నారని.. ఇప్పుడు మళ్లీ ఆయన తనయుడు తమ పాలిట కరుణ చూపడం గర్వంగా ఉందని చెబుతున్నారు.
అయిదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడికి తాము ఎన్నికల సమయంలోనే గుర్తుకు వచ్చామా అంటూ పలువురు వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం మరో ఎత్తుగడలో భాగమే ఇది అని చర్చించుకుంటున్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా చంద్రబాబును నమ్మేది లేదని అవ్వాతాతలు తెగేసి చెబుతున్నారు. వైఎస్ జగన్ రెండు వేలు పింఛన్‌ను ప్రకటించిన తరువాతే ఇప్పుడు ఇస్తున్నాడని చెబుతున్నారు.
నరకం చూపిన జన్మభూమి కమిటీలు
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయని వృద్ధులు, వికలాంగులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు తమకు నరకం చూపించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి నచ్చితేనే పింఛన్ మంజూరు చేయిస్తారని, లేదంటే కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదని చెబుతున్నారు. పండుటాకులు, వితంతవులు, దివ్యాంగులను తమ ఆర్థిక వనరులుగా ఎంచుకుని లంచాలు వసూలు చేస్తూ నరక యాతనకు గురి చేశారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు.
జగన్ హామీతో బాబు గుండెల్లో రైళ్లు
జగన్ పండుటాకులకు రూ.3 వేలు ఫించన్ ఇస్తానని చేసిన ప్రకటనపై అవ్వాతాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను, ఆసరాలేని వితంతవుల ఆక్రందనలు, వికలాంగుల దయనీయ స్థితి, కిడ్నీ బాధితుల ఆర్థనాదాలు, పండుటాకుల కన్నీరు దగ్గరగా చూసి వారిని ఆదుకోవాలనే బలమైన సంకల్పం జగన్‌మోహన్‌రెడ్డిలో కలిగింది. ఫలితంగా కిడ్నీ బాధితులకు నెలకు రూ.10వేలు, వికలాంగులకు, వితంతువులు, అవ్వాతాతలకు రూ.3 వేల వరకు పింఛన్ పెంచుతామని నిర్ణయం తీసుకున్నారు. జగన్ సంకల్పానికి రాష్ట్రంలో విశేష స్పందన లభిస్తోంది. దీంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
బాబును నమ్మేపరిస్థితి లేదు
కోటి రూపాయలు ఇచ్చినా చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. 2వేలు పింఛన్ రెండు నెలలుగా ఇవ్వడమనేది ఓట్లకోసమే. ఈ విషయం ప్రత్యేకం చెప్పనవసరం లేదు. గత 5సంవత్సరాలుగా ఇవ్వకుండా ఎన్నికల సమయంలోనే ఇవ్వడం అనేది కుట్రే అని అందరికీ తెలుసు. అధికారంలోకి రావడానికి బాబు వితంతువులను, ముసలివాళ్లను సైతం ఇలా మోసం చేయడం దారుణం. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తానే రూ.3వేలు పింఛన్ ఇస్తానని ప్రకటించడం సంతోషకరం. వచ్చే ఎన్నికలలో జగనన్నకు అండగా ఉండి గెలిపించుకుంటాం.
– తులసమ్మ, తిరుపతి
మూణ్నెళ్లుగా పింఛన్ రావడం లేదు
నేను కిడ్నీ బాధితున్ని. గత మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి రుయాకు బదిలీ చేసుకున్నాను. అవసరమైన అన్ని పత్రాలు సమర్పించాను. కాని ఇంతవరకు పింఛన్ ఇవ్వలేదు. ఇచ్చే పింఛన్ మందులు మాత్రలకే చాలడం లేదు. జగన్ ప్రకటించిన నెలకు రూ.10వేలు పింఛన్ మాలాంటి కిడ్నీ బాధితులకు ఇవ్వడమనేది హర్షణీయం. కిడ్నీ బాధితులకు కొండంత అండగా భావిస్తున్నాం.
– ఎస్ చిన్న, కిడ్నీ బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment