విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ‘ఎక్స్‌లెన్స్‌’ అవార్డు | 'Excellence' award to Visakhapatnam Steel Plant | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ‘ఎక్స్‌లెన్స్‌’ అవార్డు

Published Sat, Mar 4 2017 2:34 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ‘ఎక్స్‌లెన్స్‌’ అవార్డు - Sakshi

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ‘ఎక్స్‌లెన్స్‌’ అవార్డు

ఉక్కునగరం (గాజువాక)/ తిరుపతి రూరల్‌: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కార్పొరేట్‌ విజిలెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ) ఆధ్వర్యంలో అవినీతి నిరోధక నిఘా చర్యల్లో ప్రతిభ చూపే సంస్థలకు ప్రతి ఏటా ఈ అవార్డులను ఇస్తున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కాంక్లేవ్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్స్‌ సదస్సులో కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి చేతుల మీదుగా స్టీల్‌ ప్లాంట్‌ చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి బి.సిద్ధార్థకుమార్‌ ఈ అవార్డును అందుకున్నారు.

డిస్కంకు విజిలెన్స్‌ అవార్డు: విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టడంలో ప్రతిభ చూపిన దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌)కు విజిలెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు దక్కింది. ఈ అవార్డును కేవీ చౌదరి చేతుల మీదుగా డిస్కం డీపీఈ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రవి, ప్లానింగ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సంగీతరావులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement