చిత్తూరు: తీవ్రవాది బిలాల్ మాలిక్ ను పోలీసులు పుత్తూరుకు తీసుకువచ్చారు. తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భారీ విధ్వంసం సృష్టించడానికి పథక రచన చేసిన బిలాల్ ను అత్యంత భద్రత మద్య పుత్తూరుకు తరలించారు. అతని సామాగ్రిని స్వాధీనం చేసుకునే క్రమంలో బిలాల్ ను పుత్తూరుకు అతని నివాసానానికి తీసుకువచ్చారు. మేదర వీధిలో ఉన్న బిలాల్ నివాస గృహం నుంచి భారీ మోతాదులో సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని తమిళనాడుకు తరలించారు.
బిలాల్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం పలు దాడులకు జరిగిన వ్యూహరచనలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని లక్ష్యంగా చేసుకుని ఫక్రుద్దీన్ తిరుచ్చిలో రెక్కీ నిర్వహించినట్లు, చివరి క్షణంలో ప్రయత్నాన్ని వీడినట్లు విచారణలో తేలింది. ఈ నెల 18న చెన్నైకి మోడీ వస్తుండడాన్ని, చెన్నై నుంచి తిరుపతికి బయలుదేరుతున్న గొడుగుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు వ్యూహరచన చేయడానికే నగర శివారులో మకాం వేసినట్లు ఫక్రుద్దీన్ అంగీకరించినట్లు తెలిసింది.
బిలాల్ మాలిక్ ఇంటి నుంచి భారీ సామాగ్రి స్వాధీనం
Published Tue, Oct 15 2013 5:58 PM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM
Advertisement
Advertisement