సైనికుల్లా కదంతొక్కండి | fight like soldier for united andhra | Sakshi
Sakshi News home page

సైనికుల్లా కదంతొక్కండి

Published Sat, Feb 8 2014 2:25 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

fight like soldier for united andhra

బొబ్బిలి, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడ మే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో ప్రచార విభాగం సమర్థంగా పనిచేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయనలు సూచించారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంకోసం ప్రవేశపెట్టనున్న పథకాల గురించి  ఇటీవల జరిగిన ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి వివరించారని, వాటి వల్ల  సామాన్య ప్రజలకు మేలు జరగుతుందన్నారు.  పార్టీ పట్టణ ప్రచార కమిటీ అధ్యక్షునిగా నియమించినందుకు లంక వాసుదేవరావు శుక్రవారం సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయనలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలిపిన అనంతరం సుజయ్, బేబీనాయనలు మాట్లాడుతూ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలుచేశారో, ఆ స్థాయిలో జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని చెప్పారు.
 
 పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు. అందుకు ప్రచార కమిటీలు సమర్థంగా పనిచేయాలన్నారు. అలాగే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రాన్ని విభజించేందుకు నిత్యం కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి మధ్య ఉండే తేడాను   ప్రజలు గమనించే విధంగా ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్ల ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడి పనిచేయాలన్నారు. ప్రజల్లో నిత్యం ఉంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నవారికి అధిష్టానం తప్పక గుర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ అభిమాన సంఘ నాయకులు బొంగు సంతోష్‌కుమార్, బర్లి ప్రకాశరావు, ఖాన్, అల్లూరి జానకిరామరాజు, గంగుల సుధాకర్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement