కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :పది నెలల నుంచి జీతాలు రాకపోవడంతో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు(ఎంపీహెచ్‌ఏ) ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుంచి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వద్ద బైఠాయించిన వీరు రాత్రి డీఎంహెచ్‌ఓ కార్యాలయ భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారితో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
330 మంది నియామకం
వైద్య, ఆరోగ్య శాఖలో విధులు నిర్వహించేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 2012లో జిల్లాలో 330 మంది ఎంపీహెచ్‌ఏలను నియమించింది. విధులు నిర్వహించే ప్రాంతాలను బట్టి వీరికి నెలకు రూ.16,000 నుంచి రూ. 18,000 వరకు జీతం చెల్లించే విధంగా విధుల్లోకి తీసుకున్నా రు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఏడాది జూలై నుంచి జీతాలు నిలిచిపోయా యి. దీనిపై పలుమార్లు కలెక్టర్, డీఎంహెచ్‌ఓలకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో ఎంపీహెచ్‌ఏలు బుధవారం ఆందోళనకు దిగారు.
ఆర్థిక ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.చటర్జీ మాట్లాడుతూ మే 15 నాటికి జీతాలు చెల్లిస్తామని కలెక్టర్ నీతూ ప్రసాద్ గత నెల 17న తమకు హామీ ఇచ్చారన్నారు. అయితే జీతాల కు సంబంధించిన బడ్జెట్ ఇంకా విడుదల కాలేదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. సక్రమంగా జీతాలు రాకపోవడంతో గండేపల్లి పీహెచ్‌సీలో ఎంపీహెచ్‌ఏగా విధులు నిర్వహిస్తున్న జగన్ మురళి సుమారు 15 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. తమకు జీతాలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డీపీఎం డాక్టర్ మల్లిక్, ఇన్‌చార్జ్ ఏఓ డాక్టర్ వెంకటరావు ఆందోళనకారులతో చర్చించేందుకు ప్రయత్నించారు. అయితే వారు ఒప్పుకోకపోవడం తో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. కాగా ఆందోళన కారులతో జేసీ ముత్యాలరాజు ఫోన్ లో చర్చించారు. గురువారం ఉదయం ఉన్న తాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో రాత్రి పది గంటలకు ఎంపీహెచ్‌ఏలు ఆందోళన విరమించారు.
ఎంపీహెచ్‌ఏల ఆందోళన
Published Thu, May 22 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement