యూనివర్సిటీలు ఇక మానవాభివృద్ధి కేంద్రాలు | Higher education courses should be tailored to community needs | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీలు ఇక మానవాభివృద్ధి కేంద్రాలు

Published Fri, Sep 13 2019 6:06 AM | Last Updated on Fri, Sep 13 2019 6:06 AM

Higher education courses should be tailored to community needs - Sakshi

సాక్షి, అమరావతి:
ఉన్నత విద్యారంగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఉన్నత విద్యా కోర్సులను సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రతి సంస్థకు పారిశ్రామిక అనుసంధానం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ద్వారా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో మానవ వనరుల అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకలి్పంచింది.

యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లోని సంప్రదాయక కోర్సులను నేటి అవసరాలకు అనుగుణంగా నవీకరించడం, ఉన్నత విద్యా కోర్సులను సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆయా విద్యాసంస్థల్లోని బోధనా విధానాల్లో సమూల మార్పులు చేయడం, క్షేత్రస్థాయి పరిశీలనలు, పరిశోధనలు, ప్రాజెక్ట్‌ వర్క్‌ల ద్వారా విద్యార్థుల్లో అవగాహన, పరిశీలనాశక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలు పెరిగేలా నైపుణ్యాలను పెంచడం, బోధకులకు నూతన విధానాలపై ఎప్పటికప్పుడు పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి లక్ష్యాలతో మానవాభివృద్ధి కేంద్రాలు పనిచేస్తాయి. వీటిని శాశ్వత ప్రాతిపదికన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమయ్యే వనరులను యూజీసీయే సమకూరుస్తుంది.

గ్రాడ్యుయేట్లు పెరుగుతున్నా.. ఉపాధి కరవు
దేశంలో 950 యూనివర్సిటీలు, వాటి పరిధిలోని 42 వేల కాలేజీల్లో 3.1 కోట్ల మంది విద్యను అభ్యసిస్తున్నారు. గడచిన పదేళ్లలో ఆయా విద్యాసంస్థల్లో చేరికలు రెట్టింపయ్యాయి. ఏటా కాలేజీల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతున్నా నైపుణ్యాల లేమి కారణంగా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యం కావడం లేదు. లక్ష్యాల నిర్దేశం లేకుండా సాగుతున్న విద్యావిధానం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. విద్యాసంస్థల నుంచి బయటకు వచి్చన తరువాత ఉపాధి అవకాశాలు దక్కేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఇకనుంచి అవుట్‌ కమ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ (ఓబీఈ) విధానాన్ని అనుసరించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా దీనిని ప్రారంభించనున్నారు.

లక్ష్యాలివీ..
►ఉన్నత విద్యారంగంలో పరస్పర భాగస్వామ్యం ద్వారా సృజనాత్మకతల పెంపు.

►ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్యాసంస్థల్లోని గరిష్ట చేరికలు 25.2గా ఉంది. దాన్ని 50 శాతంగా చేయడం.

►ఉన్నత విద్యాసంస్థల్లోని గరిష్ట చేరికల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని.. లింగ, సామాజిక వ్యత్యాసాన్ని తగ్గించడం.

►ప్రపంచ స్థాయిలో ప్రతిభ కలిగిన ప్రతి నలుగురిలో ఒకరు భారతీయుడు ఉండేలా ఉన్నత విద్యారంగాన్ని తీర్చిదిద్దడం.

►అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 200 వర్సిటీల్లో 20 వర్సిటీలు దేశానికి సంబంధించినవే ఉండేలా రూపకల్పన చేయడం.

►ఫ్రీ మాసివ్‌ ఆన్‌లైన్‌ ఓపెన్‌ కోర్సు (మూక్స్‌) పెంచడం.. వ్యక్తి కేంద్రీకృతంగా నైపుణ్యాలు పెంచేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించడం.

►స్టార్టప్‌ ప్రోగ్రామ్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ దిశగా విద్యార్థుల ఆసక్తిని మళ్లించడం.. ఇందుకు ‘ఇన్‌–హౌస్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌’ల ఏర్పాటు దిశగా టీచర్లను ప్రోత్సహించడం.

►ప్రతివారం అకడమిక్‌ లీడర్‌ షిప్, సాంకేతికాభివృద్ధి అభ్యసనం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, సామాజిక సంబంధాలు పెంపొందించేలా ‘థీమ్‌ బేస్డ్‌’ కార్యక్రమాల నిర్వహణ.

►వీటిద్వారా అంతర్జాతీయ, జాతీయ దృక్కోణంలో విద్య అంతఃస్సారాన్ని అర్థం చేసుకోవడం.

2020 నాటికి గుణాత్మక మార్పులు కనిపించేలా..
►మానవ వనరుల అభివృద్ధి కేంద్రాల ద్వారా 2020 నాటికి ఉన్నత విద్యారంగంలో గుణాత్మక మార్పులు సాధించడం యూజీసీ లక్ష్యం.

►ఇందుకు ఇస్రో, నాసా సహకారంతో ‘శాటిలైట్‌ ఇంటరాక్టివ్‌ టెలివిజన్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ (సైట్‌)’, యూజీసీ ‘కన్సారి్టయం ఫర్‌ ఎడ్యుకేషనల్‌ కమ్యూనికేషన్‌ (సీఈసీ)’ విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం.

►దేశంలో ‘ప్రీ డిజిటల్‌’ కాలానికి చెందిన లక్షలాది మంది బోధకుల్లో ఇన్సెంటివ్, ఇతర విధానాల ద్వారా మార్పులు తీసుకురావటం.

మానవ వనరుల అభివృద్ధి కేంద్రాల పనితీరు ఇలా
►యూనివర్సిటీ స్థాయిలో ఏర్పాటు చేసే హెచ్‌ఆర్‌డీసీలు.. యూజీసీ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తితో కార్యకలాపాలు నిర్వహించాలి

►వర్సిటీలు, కాలేజీలకు మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చాలి.. వేర్వేరు రాష్ట్రాల్లోని వర్సిటీలను అనుసంధానించాలి

►యూజీసీ నిబంధనల మేరకు నూతన కోర్సులను ఇవి రూపొందించాలి

►ఇప్పటికే పనిచేస్తున్న బోధనా సిబ్బందికి పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించాలి

►వీటి నిర్వహణకు ఏటా రూ.25 లక్షల చొప్పున యూజీసీ అందిస్తుంది

►లైబ్రరీ, పరికరాల నిర్వహణ, ఇతర కార్యక్రమాలకు నిర్దేశిత మొత్తాలను ఇస్తుంది  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement