చాపాడు: యూనివ ర్సిటీ స్థాయిలో కాకుండా జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలలో విద్యార్థులు పాల్గొనటం ద్వారా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందని అనంతపురం జెఎన్‌టీయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.లాల్‌కిషోర్ అన్నారు. చాపాడు సమీపంలోని శ్రీచైతన్యభారతీ, విజ్ఞాన భారతీ ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణంలో శుక్రవారం నుంచి 6వ జెఎన్‌టీయూ అంతర్ రాష్ట్ర క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్నాయి. పోటీలను ప్రారంభించిన లాల్‌కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల నుంచి చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత కల్పించాలన్నారు. క్రీడల ద్వారా మానసిన ఉల్లాసం పెరుగుతుందని, దీని ద్వారా చదువులో రాణించవచ్చన్నారు. సీబీఐటీ, వీబీఐటీ కరస్పాండెంటు, డెరైక్టర్ వి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు ముఖ్యమన్నారు. మొదటి సారిగా కడప జిల్లాలో జెఎన్‌టీయూ 6వ క్రీడా పోటీలను నిర్వహించటం గర్వకారణమన్నారు.
రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా నుంచి సుమారు 1000 మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెన్‌టీయూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రటరీ జోజిరెడ్డి, సీబీఐటీ, వీబీఐటీ కరస్పాండెంటు వి.జయచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పాండురంగన్వ్రి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, ప్రముఖ వైద్యులు నాగదస్తగిరిరెడ్డి ,అన్నమాచార్య కాలేజీ డెరైక్టర్ గంగిరెడ్డి, సీబీఐటీ, వీబీఐటీ ప్రిన్సిపాళ్లు డా.పాండురంగన్వ్రి, శ్రీనివాసులరెడ్డి, ఫిజికల్ డెరైక్టర్స్ ఈశ్వరయ్య, సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
Published Sat, Feb 28 2015 1:26 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement