చిత్తూరు ఎన్కౌంటర్ పై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ | Lunch motion petition in high court on chittoor encounter | Sakshi
Sakshi News home page

చిత్తూరు ఎన్కౌంటర్ పై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్

Published Wed, Apr 8 2015 11:48 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

చిత్తూరు ఎన్కౌంటర్ పై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ - Sakshi

చిత్తూరు ఎన్కౌంటర్ పై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఎన్కౌంటర్పై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను న్యాయవాది రఘునాథ్ బుధవారం హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. కూలీలు మరణంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతుంది.

మృతులంతా తమిళనాడుకు చెందిన వారే. ఈ నేపథ్యంలో కూలీల మృతిపై ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీల ఎన్కౌంటర్ మానవ హక్కులు ఉల్లంఘన అని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement